గద్వాల, న్యూస్‌లైన్: ఎన్నో ఏళ్ల కల ఎట్టకేలకు సాకారమైంది. దశాబ్దాలుగా ప్రతిపాదనలో ఉండి, పుష్కరకాలంగా పనులు కొనసాగిన గద్వాల - రాయిచూర్ నూతన బ్రాడ్‌గేజ్‌లైన్ ప్రారంభమవడం ఈ ప్రాంత అభివృద్ధికి మరింత దోహదపడుతుందని మంత్రి డీకే అరుణ అన్నారు. గద్వాల ఆర్‌ఓబీకి త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. గద్వాల -రాయిచూర్ లైన్ ప్రారంభంతో గద్వాల రైల్వేస్టేషన్ జంక్షన్‌గా మారిందని, ఇక్కడ దూరప్రాంత రైళ్లు ఆగడంతో పాటు మరిన్ని రైళ్ల సౌకర్యం పెరుగుతుందన్నారు. దీంతో ఈ ప్రాంత అభివృద్ధి మరింత వేగవంతం కానుందని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు.
శనివారం గద్వాల -రాయిచూర్ లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అరుణ, నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం రాయిచూర్‌లో ప్రారంభమైన కొత్త డెము రైలును జెండాఊపి గద్వాల స్టేషన్‌లోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. గద్వాల -రాయిచూర్ బ్రాడ్‌గేజ్ లైన్ కోసం దశాబ్దాలుగా ఈ ప్రాంతప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. మల్లికార్జున్ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఈ లైన్‌కు మంజూరు వచ్చేలా చేశారని తెలిపారు. 12 ఏళ్ల క్రితం పనులు ప్రారంభమైనప్పటికీ, అనేక అడ్డుంకులతో ఇన్నాళ్లు పూర్తికావడానికి కాలం పట్టిందన్నారు. అన్ని ఆటంకాలు తొలగి ఇప్పటికైనా ప్రారంభం కావడం, ఈ సమయంలో మంత్రిగా ఉండటం పట్ల అరుణ సంతోషం వ్యక్తంచేశారు. గద్వాల రైల్వేస్టేషన్‌లో మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉందన్నారు. ఖాళీస్థలంలో శిక్షణ సంస్థలు, రైల్వే సంస్థలను ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు.
దశలవారీగా రాయిచూర్- గుంటూరు
లైన్ పనులు: ఎంపీ మందా
నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నా థం మాట్లాడుతూ.. దశాబ్దాల కల గ ద్వాల -రాయిచూర్ లైన్ ప్రారంభంతో నెరవేరిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాయిచూర్ నుంచి గుంటూరు జిల్లా మాచర్ల వరకు రైల్వేలైన్ కలుపాలన్నది ప్రతిపాదనగా ఉందన్నారు. ఇం త పొడవునా ఒకేసారి రైల్వేట్రాక్ నిర్మా ణం చేయడం సాధ్యం కాదన్న ఉద్దేశం తో దశలవారీగా పనులు చేపట్టేందుకు నిర్ణయించారని పేర్కొన్నారు.
ఇందులో గద్వాల- రాయిచూర్ పట్టణాల మధ్య 59 కి.మీల మార్గాన్ని ముందుగా పూర్తిచేసేందుకు మంజూరు ఇచ్చారని, ఈ పనులు కూడా ఆలస్యంగా పూర్తయ్యాయని తెలిపారు. గద్వాల జంక్షన్‌తో ఈ ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారుతుందని హర్షం వ్యక్తంచేశారు. జిల్లాలో గద్వాల ప్రాంతానికి చారిత్రాత్మక ప్రాధాన్యం ఉందని, కావునా ఇక్కడ దూరప్రాంత రైళ్లను ఆపేందుకు కోరినట్లు ఎంపీ మందా తెలిపారు. కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం రాకేష్‌యారన్, డివిజన్ రైల్వే అధికారులు, ఏజేసీ రాజారాం, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ఫలించిన కల
Published Sun, Oct 13 2013 5:30 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement