దాదర్ నుంచి చెన్నై వెళ్తున్న సూపర్ ఫాస్ట్ రైలు ఇంజన్ ఫెయిల్ కావడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. తుంగభద్ర రైల్వేస్టేషన్‌లో ఉదయం 9.25 గంటలకు బయలుదేరిన రైలులో ఇంజన్ నుంచి డీజిల్ లీకేజ్ ప్రారంభమైంది.
కోసిగి రూరల్, న్యూస్‌లైన్: దాదర్ నుంచి చెన్నై వెళ్తున్న సూపర్ ఫాస్ట్ రైలు ఇంజన్ ఫెయిల్ కావడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. తుంగభద్ర రైల్వేస్టేషన్‌లో ఉదయం 9.25 గంటలకు బయలుదేరిన రైలులో ఇంజన్ నుంచి డీజిల్ లీకేజ్ ప్రారంభమైంది. గమనించిన గార్డు, డ్రైవర్ అప్రమత్తమై సమీపంలోని ఐరన్‌గల్ స్టేషన్‌లో 9.50 గంటల సమయంలో రైలును నిలిపివేశారు.
ఇంజన్‌లో మూడు సిస్టంల నుంచి డీజి ల్ లీకేజ్ తీవ్రంగా ఉండటంతో మరమ్మతు చేసేందుకు కూడా వీలు కాలే దు. పెద్ద మొత్తంలో డీజిల్ నేలపాలైం ది. తుంగభద్ర స్టేషన్ నుం చి అదనపు ఇంజన్‌ను తీసుకొచ్చి అమర్చడంతో 11.10 గంటల సమయంలో గుంతకల్ వైపు బయలుదేరింది. ఎలాంటి వసతులు లేని అడవి ప్రాంతంలో ఉన్న రైల్వేస్టేషన్‌లో దాదాపు 1.20 గంటల పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు.