
దానం ఆగడాలను అడ్డుకోండి
చట్టాలు, నిబంధనలన్నీ పాతరేస్తూ దౌర్జన్యంతో ప్రజాస్వామ్య వ్యవస్థను పాతరేయాలని చూస్తున్న మాజీ మంత్రి దానం నాగేందర్, కార్పొరేటర్ భారతిల ఆగడాలను అడ్డుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్‌కు విజ్ఞప్తి చేసింది.
సోమవారం పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ సమన్వయకర్త పి.విజయారెడ్డితో పాటు నందీనగర్, దేవరకొండ బస్తీవాసులు లక్ష్మీ, విజయా నాయక్, నవీన్ నాయక్, ఇషాక్‌లతో కూడిన ప్రతినిధి బృందం ఎన్నికల కమిషనర్‌ను కలిసింది. ఈ సందర్భంగా శాంతియుతంగా ‘గడపగడపకూ వైఎస్సార్ సీపీ’ కార్యక్రమం చేపట్టిన తమపై దానం నాగేందర్, భారతిల ప్రోద్బలంతో దాడి చేసిన తీరును వారు వివరించారు. తక్షణం వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని, ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వారు కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.