
అనంతపురం: వాలంటీర్‌పై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల్లో వాలంటీర్ హరికుమార్ తనకు సహకరించలేదనే కారణంతో జేసీ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. ఇంటిని కూల్చేస్తానంటూ వాలంటీర్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించారు. జేసీ ఆదేశాలతో వాలంటీర్ ఇంట్లోని మోటార్‌ను ఆయన అనుచరులు లాక్కెళ్లారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, విచారణ చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు నోటు తీసుకున్నవారు తనను ప్రశ్నించొద్దంటూ జేసీ హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ హరికుమార్ ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదైంది. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై 384, 506,34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
చదవండి:
కుప్పం టీడీపీలో ముసలం..
‘పాచిపోయిన లడ్డూను తింటున్నారా..’
Comments
Please login to add a commentAdd a comment