తాడిపత్రి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నైతిక విలువలున్న వ్యక్తి అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. గురువారం ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం కార్యాలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ సహకారం లేకుంటే..తాను ఈరోజు మునిసిపల్ చైర్మన్ అయ్యుండే వాడిని కాదన్నారు. ఆయన తల్చుకుంటే ఏమైనా చేసి ఉండొచ్చని.. కానీ ఆయనలోని నైతిక విలువలను ఈరోజు స్పష్టంగా గమనించానని తెలిపారు.
హ్యాట్సాఫ్ టు సీఎం అని ప్రశంసించారు. తాడిపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్యతో కలిసి పనిచేస్తానన్నారు. పట్టణాభివృద్ధికి నిధులను కోరేందుకు త్వరలోనే ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తానని, ఆయన తప్పకుండా న్యాయం చేస్తారన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు పోలీసులు తీసుకున్న చర్యలు భేష్ అని జేసీ కితాబిచ్చారు.
చదవండి:
బడుగు వర్గాలకే పెద్దపీట: 86 స్థానాల్లో ఎవరెవరు?
నాడు కట్టెలు కొట్టిన మహిళ.. నేడు చిత్తూరు మేయర్
Comments
Please login to add a commentAdd a comment