
తాడిపత్రి (అనంతపురం): ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే కాకుండా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం పట్ల 188, 171–ఇ–హెచ్, సెక్షన్ల కింద టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై శుక్రవారం రాత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గత గురువారం రాత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని బృందావనం అపార్ట్‌మెంట్‌లో జేసీ సమీప బంధువు, టౌన్‌బ్యాంకు ఉద్యోగి గౌరీనాథ్‌రెడ్డి పెంట్‌హౌలో పెద్ద ఎత్తున క్రికెట్ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే కాకుండా క్రికెట్ కిట్లను పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుండటంపై పలు సెక్షన్ల కింద మాజీ ఎమ్మెల్యే జేసీ, అతని సమీప బంధువు గౌరీనాథ్‌రెడ్డిపై పట్టణ పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు.
చదవండి:
టీడీపీ ఆగడాలు: పంచాయతీ భవనాలకు ‘పచ్చ’ రంగు
తాడిపత్రిలో బయటపడ్డ ‘జేసీ’ ప్రలోభాలు
Comments
Please login to add a commentAdd a comment