సాక్షి, అనంతపురం: మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎదురీతున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న జేసీ.. ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు. ఓటమి భయంతో ఆయన కంటతడి పెట్టారు. తాడిపత్రిలో ఏదో జరిగిపోతుందంటూ అసహనం వ్యక్తం చేశారు. అనుమతి లేని వాహనాల్లో వెళ్తూ పోలీసులతో జేసీ ప్రభాకర్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. సర్ది చెప్పేందుకు యత్నించిన టీడీపీ నేత రఘుపై దాడికి పాల్పడ్డారు. బూతులతో మరోసారి రెచ్చిపోయారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాడిపత్రిలో జేసీ దౌర్జన్యంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
జేసీ పవన్‌పై కేసు
తాడిపత్రి: ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్‌రెడ్డిపై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ వీఎన్‌కే చైతన్య తెలిపారు. గత ఆదివారం అర్ధరాతి టీడీపీ నేత జేసీ పవన్‌రెడ్డి ఆ పార్టీ తరఫున తాడిపత్రిలోని హరిజనవాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా భారీ కాన్వాయ్‌తో హరిజనవాడకు చేరుకున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించడం పట్ల షాడో టీం ఫిర్యాదు మేరకు జేసీ పవన్‌పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
చదవండి:
అయోమయంలో టీడీపీ.. చంద్రబాబు మాటలతో చేటే!
మహిళను మెడవంచి కొట్టిన అశోక్‌గజపతిరాజు
Comments
Please login to add a commentAdd a comment