![Municipal Election Fever To JC Brothers - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/6/jc-brothers.jpg.webp?itok=Xdm_5OoE)
సాక్షి, అనంతపురం: జేసీ బ్రదర్స్‌కు మున్సిపల్ ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. తాడిపత్రి మున్సిపాలిటీలో జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నారు. తాడిపత్రిలో 24వ వార్డు నుంచి ఆయన బరిలో దిగారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటించిన సంగతి విదితమే. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై వైఎస్సార్ సీపీ నేత జగదీశ్వర్‌రెడ్డి పోటీ చేస్తుండగా, ప్రభాకర్‌రెడ్డి గెలుపుపై జేసీ దివాకర్‌రెడ్డి టెన్షన్ పడుతున్నారు. గత ఎన్నికల్లో 24వ వార్డు నుంచి జగదీశ్వర్ సోదరుడు జయచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని కౌన్సిలర్‌గా గెలిపించేందుకు జేసీ ఫ్యామిలీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి.. తాను పనిచేసిన పదవి కంటే తక్కువ పోస్టుకు నామినేషన్ వేసి పోటీ చేయడం గమనార్హం.
తాడిపత్రిలో ఓటర్లకు జేసీ బ్రదర్స్ ప్రలోభాలు
తాడిపత్రిలో ఓటర్లను జేసీ బ్రదర్స్ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న 10 మంది జేసీ బ్రదర్స్ అనుచరులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రూ.82 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు పంచుతూ పట్టుబడ 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.
చదవండి:
కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు
టీడీపీ అడ్డదారులు: పైకి కత్తులు.. లోన పొత్తులు
Comments
Please login to add a commentAdd a comment