సాక్షి, అనంతపురం: జేసీ దివాకర్‌రెడ్డి తయుడు జేసీ పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆయనపై కేసునమోదు చేసినట్లు తెలిపారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి విడుదల సందర్భంగా కోవిడ్ ఆంక్షలును ఉల్లంఘించి ర్యాలీ చేయొద్దని జేసీ పవన్‌కు తాడిపత్రి పోలీసులు ముందుగానే సూచించారు. అయిన్పటికీ పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేస్తూ ర్యాలీ నిర్వహించి, బాణాసంచా కాల్చారు.అంతే కాకుండా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి సామాజిక దూరం పాటించకుండా వ్యవహరించడంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. (మళ్లీ జైలుకు జేసీ..)
దళిత సీఐ దేవేంద్రను దూషించినందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అనంతరం జేసీ ప్రకర్‌రెడ్డిని కడప సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇక లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన జేసీపై మరో నాలుగు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment