సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు పురోగతి సాధించారు. శనివారం ముగ్గురు జేసీ వర్గీయులను అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలు సమర్పించి బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా మార్చి రిజిస్ట్రేషన్ చేయించిన కేసులో నాగేశ్వర్‌రెడ్డి, సోమశేఖర్,రమేష్‌లను తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సహకారంతో ప్రైవేట్ ఆపరేటర్లకు లారీలు విక్రయించారు. నకిలీ క్లియరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేసి పోలీసుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు విచారణలో వెల్లడయ్యింది. (ఫోర్జరీ జేసీ.. వాహనాల కొనుగోల్‌మాల్)
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి లను కోర్టు పోలీసు కస్టడీ కి అప్పగించింది. వారిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. (జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌లకు షాకిచ్చిన కోర్టు!)
Comments
Please login to add a commentAdd a comment