జేసీని విచారించేందుకు కోర్టు అనుమతి | High Gave Permission To Police To Investigate JC Prabhakar Reddy In Forgery Case | Sakshi
Sakshi News home page

మరో 5 కేసుల్లో పీటీ వారెంటు జారీ చేసిన కోర్టు

Published Fri, Jun 19 2020 5:33 PM | Last Updated on Fri, Jun 19 2020 5:46 PM

High Gave Permission To Police To Investigate JC Prabhakar Reddy In Forgery Case - Sakshi

సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ డాక్యూమెంట్స్‌ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని రెండు రోజుల పాటు విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతిని ఇచ్చింది. కోర్టు ఆదేశం మేరకు జేసీ ప్రభాకర్‌రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిలను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి బెయిల్‌ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. (జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై పీటీ వారెంట్)

అంతేగాక మరో ఐదు కేసుల్లో పీటీ వారెంట్లను కూడా కోర్టు జారీ చేసింది. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడైన చవ్వా గోపాల్‌రెడ్డిని 154 బస్సులు, లారీల అక్రమ రిజిస్ట్రేషన్‌పై విచారించేందుకు కూడా కోర్టు పోలీసులకు అనుమతించింది. దీంతో అనంతపురం వన్‌టౌన్‌ పోలీసులు చవ్వా గోపాల్‌రెడ్డి ఒకరోజు కస్టడీలోకి తీసుకుని విచారించారు. (జేసీ ట్రావెల్స్‌ అక్రమాలపై లోతుగా విచారణ)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement