
అనంతపురం: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయనపై 153ఏ, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
శుక్రవారం అనంతపురం నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్-2తో పాటు జిల్లాలోని పది మునిసిపాలిటీల్లో రెండో వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. తాడిపత్రి మినహా అన్ని చోట్ల అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడిపత్రిలో స్వతంత్ర అభ్యర్థి (టీడీపీ బలపరిచిన) ఎన్నిక కాగా.. ఇక్కడ ఎన్నిక ప్రక్రియను వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. పట్టణంలో అక్రమ భవనాల కూల్చివేతను అడ్డుకోవడంతో పాటు భూ కబ్జాదారులకు మద్దతిస్తున్న మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment