tadipathri
-
కేసులకు భయపడేది లేదు.. వైఎస్ జగన్ ను సీఎం చేసేదాకా తగ్గేదేలే
-
దసరా తర్వాత తాడిపత్రిలో అడుగు పెడతా: కేతిరెడ్డి పెద్దారెడ్డి
సాక్షి, అనంతపురం: అనంతపురం ఎస్పీని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోమవారం కలిశారు. తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి కావాలని ఆయన కోరారు. అనంతరం పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తన ఇంటికి వెళ్లేందుకు టీడీపీ నేతల అనుమతి అవసరమా? అంటూ ప్రశ్నించారు. అవసరమని ఎస్పీ చెబితే.. జేసీ ప్రభాకర్ రెడ్డి పర్మిషన్ కోరేందుకు సిద్ధమని.. దసరా తర్వాత తాడిపత్రిలో అడుగు పెడతానన్నారు.ఓ మాజీ ఎమ్మెల్యేని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వకపోవడం దుర్మార్గం. జేసీ ప్రభాకర్‌రెడ్డి మీడియా ప్రతినిధులను బెదిరించినా పోలీసులు మౌనంగా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తాడిపత్రిలో హింస చోటుచేసుకుంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తున్నా ఎస్పీ జగదీష్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులు ఇదే విధానాన్ని కొనసాగిస్తే ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తా’’ అని పెద్దారెడ్డి హెచ్చరించారు.ఇదీ చదవండి: పేదల ప్రాణాలంటే ‘లెక్క’లేదా? -
తాడిపత్రి ఘటనలో నా తప్పు లేదు: సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి
-
తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అత్యుత్సాహం
-
తాడిపత్రిలో టీడీపీ గూండాలు దాడులు.. అనంత వెంకట రామిరెడ్డి ఫైర్
-
సిట్ వద్ద కీలక ఆధారాలు.. విచారణ అడ్డుకునే కుట్ర
-
తాడిపత్రిలో పోలీసులు టీడీపీ తొత్తులుగా పనిచేశారు..
-
కేతిరెడ్డి పెద్ద రెడ్డి ఇంట్లో పోలీసుల వీరంగం
-
వదల బొమ్మాలి.. వదల..
-
తాడిపత్రిలో జేసీ కుటుంబానికి బిగ్ షాక్..వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
-
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరి
-
టీడీపీ నేత జేసీ దౌర్జన్యాలకు నిరసనగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీ
-
అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య
-
జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజం.. మహిళ కలెక్టర్‌తో దురుసు ప్రవర్తన!
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి రౌడీయిజం ప్రదర్శించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి.. కలెక్టర్ హాల్లో ఏకంగా కలెక్టర్‌పైనే విరుచుకుపడ్డారు. కలెక్టర్ నాగలక్ష్మి ఎదుట పేపర్లు విసిరేసి దురుసుగా ప్రవర్తించారు. నువ్వు కలెక్టర్‌గా పనికిరావంటూ మహిళా అధికారినిని అవమానించారు. బీకేర్‌ఫుల్ అంటూ కలెక్టర్‌కే వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే, తాడిపత్రిలో ఓ భూవివాదం గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి.. సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రెవెన్యూ భవన్లో కలెక్టర్‌ను జేసీ కలిశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయారు. కలెక్టర్‌ను బెదిరిస్తున్న క్రమంలో గన్‌మెన్.. ప్రభాకర్ రెడ్డిని వారించే ప్రయత్నం చేసినా ఆయన.. గన్‌మెన్‌ను వెనక్కి నెట్టివేశారు. ఈ క్రమంలోనే మహిళా కలెక్టర్ అని కూడా చూడకుండా బీకేర్‌ఫుల్ అంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా బయటకు వచ్చి.. మీడియాతో కూడా ఆయన దురుసుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. -
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు
అనంతపురం: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయనపై 153ఏ, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం అనంతపురం నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్-2తో పాటు జిల్లాలోని పది మునిసిపాలిటీల్లో రెండో వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. తాడిపత్రి మినహా అన్ని చోట్ల అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడిపత్రిలో స్వతంత్ర అభ్యర్థి (టీడీపీ బలపరిచిన) ఎన్నిక కాగా.. ఇక్కడ ఎన్నిక ప్రక్రియను వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. పట్టణంలో అక్రమ భవనాల కూల్చివేతను అడ్డుకోవడంతో పాటు భూ కబ్జాదారులకు మద్దతిస్తున్న మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. -
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసు: మరో ఇద్దరు అరెస్ట్
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మరో ఇద్దరు నిందితులను తాడిపత్రి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రామ్మూర్తి, ఇమామ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు నలుగురు జేసీ ట్రావెల్స్ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. సీఐలు, ఎస్సైలు, ఆర్టీఏ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ క్లియరెన్స్ సర్టిఫికెట్లు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. జేసీ ట్రావెల్స్ యాజమాన్యం ఆదేశాలతోనే నకిలీ క్లియరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. తాడిపత్రి ఎస్ఐ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన నకిలీ స్టాంపులు వినియోగించినట్లు విచారణలో బయటపడింది. నకిలీ పత్రాలతో 6 లారీలను జేసీ ట్రావెల్స్ బెంగుళూరులో విక్రయించింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమారెడ్డి జేసీ ట్రావెల్స్ ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఫోర్జరీ సర్టిఫికెట్ల తయారీ వెనుక జేసీ దివాకర్ రెడ్డి హస్తం జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ బాగోతంపై సమగ్ర విచారణ జరిపించాలని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అవినీతికి చిరునామా అని ధ్వజమెత్తారు. జేసీ వ్యాపారాలన్నీ అక్రమాలేనని, బోగస్ సర్టిఫికెట్లు తయారీలో జేసీ దివాకర్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. జేసీ బద్రర్స్ డబ్బు పిచ్చి వల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే జేసీ ట్రావెల్స్ బస్సులు నడిపారని.. అక్రమ మైనింగ్‌తో వందల కోట్ల రూపాయలు జేసీ దోచుకున్నారని పెద్దారెడ్డి మండిపడ్డారు. జేసీ దివాకర్‌రెడ్డి పాపం పండిందని.. ఆయన చేసిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. జేసీ బ్రదర్స్‌ను అరెస్ట్ చేసి విచారించాలని పోలీసులకు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి విజ్ఞప్తి చేశారు. (చదవండి: జేసీ ట్రావెల్స్‌లో బయటపడ్డ ఫోర్జరీ బాగోతం) -
పరిష్కారమైన తాడిపత్రి తగాదా
-
జేసీ రాక.. తాడిపత్రిలో ఉద్రిక్తత
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చిన్నపొలమడలోని ప్రబోధానందాశ్రమంపై శనివారం జేసీ వర్గీలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆశ్రమ నిర్వాహకులకు, జేసీ వర్గీయులకు మధ్య జరిగిన దాడిలో భారీగా ఆస్తులు ధ్వసమయ్యాయి. విషయం తెలుసుకున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం తన వర్గీయులను పరామర్శించేందుకు తాడిపత్రి వెళ్లారు. జేసీ అక్కడికి చేరుకోవడంతో ఆయన వర్గీయుల మరింత రెచ్చిపోయారు. ఆశ్రమంపైకి రాళ్ళు దాడికి పాల్పడ్డారు. ఇంత జరుగుతున్న స్థానిక పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. జేసీ హింసను ప్రోత్సహిస్తున్నారని ఆశ్రమ నిర్వాహక ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. -
తాడిపత్రి వద్ద ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి
-
జేసీ బ్రదర్స్ నుంచి తమకు ప్రాణ హాని ఉంది
-
‘జేసీ బ్రదర్స్ మమ్మల్ని చంపేస్తారేమో!’
సాక్షి, అనంతపురం: టీడీపీకి గుడ్‌బై చెప్పిన తాడిపత్రి నేతలు జగ్గీ బ్రదర్స్(బొమ్మిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, జయచంద్రారెడ్డిలు) మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ నుంచి తమకు ప్రాణ హాని ఉందని వారంటున్నారు. ‘తాడిపత్రిలో అరాచకం రాజ్యమేలుతోంది. జేసీ బ్రదర్స్ రూ. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. నిరూపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. దౌర్జన్యాలు, అక్రమాలకు తెగబడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. వాళ్ల నుంచి మాకు ప్రాణహాని ఉంది. జేసీ ఫ్యామిలీ నుంచి మా ఇద్దరికీ రక్షణ కల్పించాలంటూ చంద్రబాబు గతంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్‌కు లేఖ కూడా రాశారు. మాకు ఏ హాని జరిగినా జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, వారి కొడుకులే కారణం. ఇకపై జేసీ బ్రదర్స్ ఓటమే లక్ష్యంగా కృషిచేస్తాం’ అని జగ్గీ బ్రదర్స్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జిల్లా అధిష్టానం నెల రోజుల క్రితం జగ్గీ బ్రదర్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జగ్గీ బ్రదర్స్ జూన్ 20న వివరణ కూడా ఇచ్చారు. అయితే సంజాయిషీ సంతృప్తికరంగా లేదంటూ జగ్గీ బ్రదర్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అధ్యక్షుని పేరుతో ఉన్న ఉత్తర్వులు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. దీంతో మనస్తాపానికి గురైన వారిద్దరూ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. తాజా పరిణామాలతో తాడిపత్రి టీడీపీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మరికొందరు సీనియర్ నేతలు పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. (పూర్తి కథనం.. తాడిపత్రిలో టీడీపీకి షాక్) -
భారీ అగ్నిప్రమాదం : కాలిబూడిదైన 60 బైక్స్
సాక్షి, తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని హీరో టూ-వీలర్ షోరూంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకునట్టు తెలిసింది.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షోరూంలోని సర్వీస్ విభాగంలో మంటలు ఎగసిపడ్డాయి. షోరూం పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉండటంతో అధికారులంతా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని చుట్టపక్కల వారిని అప్రమత్తం చేశారు. ఈ అగ్నిప్రమాదంలో సర్వీస్ విభాగంలోని 60 ద్విచక్రవాహనాలు పూర్తిగా కాలిపోయాయి. దగ్ధమైన వాటిలో 50 పాతవి, 10 కొత్త ద్విచక్రవాహనాలు ఉన్నాయి. సుమారు రూ.20 లక్షల విలువైన విడిభాగాలు ఈ అగ్నిప్రమాదంలో కాలిపోయినట్టు తెలిసింది. -
తాడిపత్రిలో విజయమ్మ వైఎస్ఆర్ జనభేరి
-
జేసీ బ్రదర్స్‌కు బాబు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డిని టీడీపీలో చేర్చుకోవడానికి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అంగీకరించారు. అయితే జేసీ ప్రభాకర్‌రెడ్డికి అనంతపురం లోక్‌సభ టికెట్ ఇవ్వలేమని, తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటూ మెలిక పెట్టారు. జేసీ బ్రదర్స్‌ను టీడీపీలో చేర్చుకుంటే పార్టీని వీడటానికి కూడా వెనుకాడమని హెచ్చరించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు వెనక్కి తగ్గారు. ఆ ఇద్దరూ జేసీ బ్రదర్స్‌తో రాజీపడ్డారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు.. సీమాంధ్ర టీడీపీ విస్తృతస్థాయి సమావేశం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో సోమవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. సమావేశం పూర్తయిన తర్వాత అనంతపురం జిల్లా నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమై.. పార్టీ స్థితిగతులను సమీక్షించారు. ఈ సమావేశంలో జేసీ బ్రదర్స్‌కు టీడీపీ తీర్థం ఇచ్చే అంశంపైనే చంద్రబాబు ఎక్కువగా చర్చించినట్లు తెలిసింది. అనంతపురం జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా జేసీ దివాకర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చారు. 2009 ఎన్నికల తర్వాత జిల్లాలో రఘువీరా ఆధిపత్యం మొదలైంది. దీంతో మనస్థాపం చెందిన జేసీ దివాకర్‌రెడ్డి మూడేళ్ల నుంచి టీడీపీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలోనే రెండున్నరేళ్ల క్రితం అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఓ ఒప్పందం చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డికి మద్దతు పలికి గెలిపిస్తే, అనంతపురం లోక్‌సభ స్థానంతోపాటూ రెండు అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తామని చంద్రబాబు ప్రతిపాదించారు. ఇందుకు అంగీకరించిన జేసీ దివాకర్‌రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి విజయానికి బాహాటంగా కృషి చేశారు. దీంతో ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రెండేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో రాయదుర్గం టీడీపీ టికెట్‌ను జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డికి చంద్రబాబు కట్టబెట్టిన విషయం విదితమే. ఆ ఒప్పందంలో భాగంగానే ఇపుడు జేసీ బ్రదర్స్‌ను చంద్రబాబు పార్టీలో చేర్చుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజీపడిన పరిటాల, కాలవ... జేసీ బద్రర్స్‌ను టీడీపీలో చేర్చుకునే ప్రయత్నాలను ఆదిలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. తన భర్త పరిటాల రవి హత్య కేసులో జేసీ దివాకర్‌రెడ్డి నిందితుడని పరిటాల సునీత అప్పట్లో ఆరోపించారు. ఈ క్రమంలోనే పరిటాల సునీత 2009 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రొటెం స్పీకర్‌గా జేసీ దివాకర్‌రెడ్డి ఉండటంతో ప్రమాణస్వీకారం చేసేందుకు కూడా నిరాకరించారు. ఇదే అంశాన్ని పరిటాల సునీత ఎత్తిచూపుతూ జేసీ బద్రర్స్‌ను పార్టీలోకి చేర్చుకోవద్దంటూ చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. పరిటాల సునీతకు మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు మద్దతు పలికారు. తాడిపత్రిలో ఇటీవల ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో పరిటాల సునీత మాట్లాడుతూ జేసీ బ్రదర్స్‌ను టీడీపీలో చేర్చుకుంటే అవసరమైతే పార్టీని వీడటానికి కూడా వెనుకాడబోనని స్పష్టీకరించారు. కాలవ శ్రీనివాసులు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ.. సోమవారం చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో వారిద్దరూ నోరుమెదపలేదని టీడీపీ నేతలు వెల్లడించారు. పదేళ్లుగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పార్టీని గట్టెక్కించేందుకే జేసీ బ్రదర్స్‌ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించానని, మార్చి మొదటి వారంలో వారు పార్టీలో చేరుతారని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. అలాగైతే తాడిపత్రి ప్రాంత టీడీపీ నేతలకు సర్దిచెప్పి.. జేసీ బ్రదర్స్‌ను పార్టీలోకి చేర్చుకోవాలని పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు చంద్రబాబుకు సలహా ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు నివ్వెరపోయారని సమాచారం. సునీత, కాలవ జేసీ సోదరులతో రాజీ పడటంపై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. చంద్రబాబు మెలిక.. తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి జేసీ ప్రభాకర్‌రెడ్డి, అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి దివాకర్ రెడ్డిని బరిలోకి దించాలనుకున్నామని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలో నిర్వహించిన సర్వేలో జేసీ ప్రభాకర్‌రెడ్డికి ప్రతికూల పరిస్థితి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా, ఈ ప్రతిపాదనకు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏ మేరకు అంగీకరిస్తారన్నది వెల్లడి కావాల్సి ఉంది. తాడిపత్రిలో తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని పోటీ చేయించి.. తాను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన జేసీ దివాకర్‌రెడ్డి.. అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు అంగీకరిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. -
మీడియా.. అతిపెద్ద మాఫియా: జేసీ ప్రభాకర్‌రెడ్డి
పుట్లూరు, న్యూస్‌లైన్: మీడియా.. అతి పెద్ద మాఫియా అని, పాలెం బస్సు దుర్ఘటనలో ఓ చానల్ రూ.7కోట్లు డిమాండ్ చేసిందని అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాక ర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన పుట్లూరులో విలేకరులతో మాట్లాడారు. డబ్బు డిమాండ్ చేసిన చానల్ పేరేంటని అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు. ‘ఆటో ప్రమాదాలు జరిగితే డ్రైవర్‌కు డ్రైవింగ్ లెసైన్స్ ఉండదు.. ట్యాక్స్, ఇన్సూరెన్స్ అసలు కట్టి ఉండరు.. ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే.. వారి గురించి ఎవరూ పట్టించుకోరు.. మరి పాలెం దుర్ఘటననే ఎందుకు పట్టించుకుంటున్నారు’ అని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు జబ్బార్ జబ్బార్ అంటున్నారు.. తప్పు చేస్తే నిబంధనల ప్రకారం 304ఎ సెక్షన్ కింద అరెస్టయిన వెంటనే బెయిల్ వస్తుందని, ఇప్పుడలాగే వచ్చారని అన్నారు. 45 మంది బాధితులకు న్యాయం జరిగేట్టయితే తాను జైలుకు వెళ్లడానికి సిద్ధమని పేర్కొన్నారు. -
లారీ దూసుకెళ్లి.. ఇద్దరు చిన్నారుల దుర్మరణం
అనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో శుక్రవారం ఓ విషాదం చోటుచేసుకుంది. అతివేగంతో వస్తున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డుప్రక్కనే వున్నఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండు పసిప్రాణాలు గాలిలో కలిసిపోయ్యాయి. అతడు నిర్లక్ష్యంగా లారీ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కాగా, స్థానికులు డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
‘రేషన్’కు ఎసరు!
తాడిపత్రి, న్యూస్‌లైన్ : తాడిపత్రి పట్టణంలో బోగస్ కార్డుల భాగోతం అధికారులను నివ్వెరపరుస్తోంది. రచ్చబండ-2 కార్యక్రమంలో దరఖాస్తు చేసిన వారిలో 3,960 మందికి తెల్లకార్డులు మంజూరయ్యాయి. వీటిని ‘రచ్చబండ-3’లో భాగంగా గత నెల 14 నుంచి పంపిణీ చేస్తున్నారు. 20 రోజులవుతున్నా 300 మంది కూడా కార్డులను తీసుకెళ్లలేదు. కార్డులు మంజూరైనా చాలా మంది లబ్ధిదారులు రాకపోవడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో రేషన్‌షాపుల వారీగా సర్వే ప్రారంభించారు. వీఆర్ఓలు సంబంధిత చిరునామాలకు వెళ్లి విచారణ చేస్తున్నారు. చాలా చోట్ల అలాంటి పేరు గల వ్యక్తులు లేకపోవడం, ఒకవేళ ఉన్నా అప్పటికే కార్డు ఉందని చెబుతుండడంతో విస్తుపోవడం వీఆర్ఓల వంతవుతోంది. ఇవన్నీ బోగస్ చిరునామాలు, పేర్లతో డీలర్లు సృష్టించారని గుర్తించిన అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. పట్టణంలో అధికార పార్టీ నేతల అనుచరులే డీలర్లుగా చలామణి అవుతున్నారు. వీరు గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారుల సహకారంతో మూడు వేలకు పైగా బోగస్ తెల్ల రేషన్‌కార్డులు సృష్టించారు. వీటికి ఇప్పటికే డిసెంబరు కోటా బియ్యం కూపన్లు మంజురయ్యాయి. పట్టణంలోని పదో నంబర్ షాపులో అత్యధికంగా 255 తెల్లకార్డులు మంజూరయ్యాయి. 7, 14, 19, 21, 24, 28, 32, 35, 41, 46, 48, 55 నంబర్ల షాపుల పరిధిలోనూ అత్యధికంగా బోగస్ తెల్లకార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఒక్కో షాపు పరిధిలో 20 కార్డులు కూడా పంపిణీ చేయలేదంటే బోగస్ కార్డులు ఏమేరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ డీలర్లకు కార్డులను ఎందుకు ఇవ్వడం లేదని అధికార పార్టీ నేతలు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వారు తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి ఎక్కడ వెళుతుందోనని హైరానా పడుతున్నారు. కాగా.. రచ్చబండ-3లోనూ రేషన్‌కార్డుల కోసం ఐదు వేలకు పైగా దరఖాస్తులు అందాయి. వీటిలోనూ చాలా వరకు బోగస్ పేర్లతో దరఖాస్తు చేసి వుంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. బోగస్ కార్డులను సృష్టించే క్రమంలో డీలర్లు వారి పరిధిలోని కాలనీల్లో పర్యటించి చిరునామాలు సేకరించి (అతి)తెలివిగా వ్యవహరించినా ఎట్టకేలకు బండారం బట్టబయలవడంతో బెంబేలెత్తుతున్నారు. లబ్ధిదారులు రాకపోతే వెనక్కు పంపుతాం కార్డులపై ఉన్న చిరునామాల్లో చాలా మంది లేరని సిబ్బంది చెబుతున్నారు. మేం కార్డులను డీలర్లకు ఇవ్వకుండా మా సిబ్బంది ద్వారానే పంపిణీ చేస్తున్నాం. సరైన చిరునామా, తగిన ఆధారాలతో వచ్చిన వారికి మాత్రమే కార్డులు ఇస్తున్నాం. పంపిణీ కాగా మిగిలిన వాటిని డీఎస్ఓకు అందజేస్తాం. నాపై ఎలాంటి ఒత్తిళ్లూ లేవు. - రామకృష్ణారెడ్డి, తహశీల్దార్, తాడిపత్రి. -
రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు
తాడిపత్రి, న్యూస్‌లైన్ : రాష్ట్ర ప్రాథమిక విద్యా శాఖ మంత్రి సాకే శైలజానాథ్, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డి మధ్య ఈ ఏడాదీ ‘వాటర్ వార్’ మొదలైంది. సుబ్బరాయసాగర్ నీటి విడుదల విషయంలో ఇద్దరూ జగడానికి దిగారు. ముందుగా తాడిపత్రి ప్రాంతంలోని ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని జేసీ... కాదు తన నియోజకవర్గంలో తాగునీటి అవసరాలు తీర్చాలని శైలజానాథ్ పంతానికి పోవడంతో వివాదం మొదలైంది. ఈ వివాదం రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు రాజేసే ప్రమాదం కన్పిస్తోంది. సుబ్బరాయసాగర్ జలాశయం తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) వ్యవస్థలో ఉంది. హెచ్చెల్సీ ద్వారా ఇందులోకి నీటిని నింపి... తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ (టీబీసీ) ఆయకట్టుకు, పుట్లూరు మండలంలో తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తుంటారు. గత నెల 15వ తేదీనే సుబ్బరాయసాగర్‌కు నీటిని విడుదల చేయాల్సి వుండగా... హెచ్చెల్సీ ప్రధాన కాలువకు నీటి లభ్యత లేని కారణంగా ఈ నెల ఒకటి నుంచి వదులుతున్నారు. హెచ్చెల్సీ వ్యవస్థలోనే ఉన్న మిడ్‌పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్) నుంచి తుంపెర డీప్‌కట్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే సుబ్బరాయసాగర్‌లోకి 8.5 మీటర్ల మేర నీరు వచ్చి చేరింది. ఇక టీబీసీకి విడుదల చేయడమే తరువాయి. ఇంతలోనే జేసీ, శైలజానాథ్ మధ్య రగడ మొదలైంది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో పత్తి, కరివేపాకు పంటలు ఎండుతున్నాయని, కావున ముందుగా ఆయకట్టుకు నీరు వదలాలని జేసీ పట్టుబడుతున్నారు. ఇందుకు శైలజానాథ్ ఒప్పుకోవడం లేదు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న శింగనమల నియోజకవర్గ పరిధిలోని పుట్లూరు మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దాన్ని తీర్చడానికి ముందుగా పుట్లూరు, కోమటికుంట్ల చెరువులకు నీరు వదలాలంటూ ఏకంగా సీఎం పేషీ నుంచే హెచ్చెల్సీ అధికారులపై ఒత్తిడి తెప్పిస్తున్నారు. దీంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో అధికారులు తల పట్టుకుంటున్నారు. ‘కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం’ అన్నట్లుగా వారి పరిస్థితి తయారైంది. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున తమ ప్రాంత ప్రజల మెప్పు పొందేందుకే ఇరువురు ప్రజాప్రతినిధులు జల జగడానికి దిగినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎ.కొండాపురంలో రైతులతో అధికారుల సమావేశం సుబ్బరాయసాగర్ నుంచి నీటి విడుదల విషయంపై చర్చిం చేందుకు బుధవారం హెచ్చెల్సీ ఈఈ ధనుంజయరావు పుట్లూ రు మండలం ఎ.కొండాపురం వద్ద ఉన్న ఇరిగేషన్ కార్యాలయం లో పుట్లూరు, తాడిపత్రి మండలాలకు చెందిన కొద్దిమంది రైతులతో రహస్యంగా సమావేశమయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మంత్రి శైలజానాథ్ ఆదేశాల మేరకు ముందుగా పుట్లూరు, కోమటికుంట్ల చెరువులకు ఆరు రోజులు నీటిని విడుదల చేస్తామని, ఆ తర్వాత తాడిపత్రి మండలంలోని అయకట్టుకు నీరు ఇస్తామని అధికారులు సూచించడంతో రైతులువ్యతిరేకించినట్లు తెలుస్తోంది. -
తాడిపత్రిలో సమైక్య ఉద్యమం ఉద్రిక్తత
అనంతపురం జిల్లా తాడిపత్రిలో సమైక్యాంధ్ర ఉద్యమం ఆదివారం ఉద్రికత్తకు దారితీసింది. ఉద్యమానికి మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్ పాటిస్తుండగా, కాంగ్రెస్ నాయకుడు జె.సి.ప్రభాకరరెడ్డి వారిని అడ్డుకున్నారు. షాపులు తీసి ఉంచాల్సిందేనని ఆయన పట్టుబట్టడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. రోడ్లను నిర్భందించి బంద్ పాటిస్తున్నారు. -
ఊరూ వాడా సమైక్య నినాదం
అనంతపురం సిటీ/ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డికి అనంతపురంలో సమైక్య సెగ తాకింది. నగరంలో సమైక్యవాదులు పెద్ద ఎత్తున ఉద్యమించిన క్రమంలో శనివారం జేసీ దివాకర్‌రెడ్డి సుమారు 50 వాహనాలలో తన అనుచరగణంతో అనంతపురం వచ్చారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్న జాక్టో నాయకుల సాక్షి, అనంతపురం : లక్షల గళాలు ఒక్కటౌతున్నాయి. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని గర్జిస్తున్నాయి. శనివారం 25వ రోజు సమైక్య ఉద్యమ సెగ జిల్లాలో ఉప్పెనలా ఎగిసి పడింది. వైఎస్సార్సీపీ చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధంతో ‘అనంత’ అట్టుడికింది. జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు డీఆర్వో హేమసాగర్ ఆధ్వర్యంలో అధికారులు నల్లదుస్తులు ధరించి ఆర్ట్స్ కళాశాల నుంచి తెలుగుతల్లి విగ్రహ ం వరకు సమైక్య నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలుగుతల్లి కూడలిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రకటన వచ్చే వరకు ఉద్యమం ఆపేది లేదని ప్రతినబూనారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు అరగుండు చేయించుకుని నిరసన తెలిపారు. మునిసిపల్ ఉద్యోగులు మాక్ కోర్టు నిర్వహించి.. రాష్ట్ర విభజనకు కారకులైన సోనియా, ద్విగ్విజయ్సింగ్, కేసీఆర్‌లకు ఉరిశిక్ష పడేలా తీర్పు వెలువరించారు. ఆర్టీఓ కార్యాలయం ఎదుట జాక్టో దీక్షకు మద్దతు తెలపడానికి మాజీ మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి వెళ్లారు. జేసీని చూసిన జాక్టో నాయకులు అడ్డుకున్నారు. జేసీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. పాతూరు విద్యుత్ కార్యాలయం ఎదుట రిలేదీక్షలు చేపట్టిన విద్యుత్ ఉద్యోగులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ ఎంపీ కాలువ శ్రీనివాసులకూ ఉద్యమ సెగ తగిలింది. కాలువ దీక్షా శిబిరం వద్దకు చేరుకోగానే.. గమనించిన ఉద్యోగులు ఒక్కసారిగా కాలువ శ్రీనివాసులు గో..బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. మునిరత్నం శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిన్నారులకు విచిత్ర వేషధారణలు ధరింపజేసి ఒంటెలపై నగరంలో ప్రదర్శన చేశారు. పశుసంవర్ధక శాఖ, గోపాల మిత్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఎడ్ల బండ్లతో ప్రదర్శన నిర్వహించారు. న్యాయవాదులు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో బస్సులతో ర్యాలీ చేశారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో సుభాష్‌రోడ్డులోని వైఎస్ విగ్రహం వద్ద వంటా-వార్పు నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు, జాక్టో, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు, జాతీయ రహదారులు, డ్వామా, ఐకేపీ, ఆస్పత్రి ఉద్యోగులు, సీఐటీయూ, వాణిజ్య పన్నుల శాఖ, పంచాయతీరాజ్ ఉద్యోగులు, విద్యుత్, మునిసిపల్ ఉద్యోగులు, నీటి పారుదల ఉద్యోగులు, ఆల్ మేవా ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. కాగా నగరంలోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి సమైక్యాంధ్ర ప్లకార్డులు చేతపట్టుకుని ర్యాలీలు నిర్వహించారు. ఊరూ వాడా సమైక్య నినాదం ధర్మవరంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పలు పార్టీలు, ప్రజా సంఘాలు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. స్వర్ణకారుల సంఘం, విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. ముదిగుబ్బలో చిరు వ్యాపారులు బంద్ పాటించారు. గుంతకల్లు, గుత్తి, పామిడి పట్టణాల్లో జాక్టో, వైఎస్సార్సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. గుత్తిలో విద్యుత్ ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. హిందూపురంలో పౌరాణిక వేషధారణలతో యాదవ కులస్తులు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. తపాలా, టెలిఫోన్ కార్యాలయాలను సమైక్య వాదులు బంద్ చేయించారు. అంబేద్కర్ సర్కిల్లో విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సమైక్యాంధ్రపై అవగాహన కల్పించారు. చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో విద్యుత్ శాఖ ఉద్యోగులు బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. కదిరి పరిసర మండలాల ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాద్యాయులు రిలే నిరాహార దీక్ష చేశారు. కదిరి డివిజన్ లోని ఉపాధ్యాయులు విజిల్ వేసుకుంటూ వినూత్నంగా పట్టణంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. డివిజన్ పరిధిలోని 10 మండలాల రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించి అనంతరం రిలేదీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. తనకల్లులో ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కళ్యాణదుర్గంలో న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. విచిత్ర వేషధారణలతో సమైక్య వాదులు ర్యాలీ చేశారు. మడకశిరలో ఉపాధ్యాయులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పుట్టపర్తిలో జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాహుల్ పెళ్లి కోసం భిక్షాటన చేసి.. సోనియాకు మనియార్డర్ చేశారు. మహమ్మదాబాద్ నుంచి అమడగూరు వరకు సమైక్యవాదులు పాదయాత్ర చేశారు. ఓడీ చెరువు మండలంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పెనుకొండ, సోమందేపల్లె, రొద్దం దళిత సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పరిగిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు రిలేదీక్షలు చేపట్టారు. రాయదుర్గంలో ఫుట్‌వేర్ వ్యాపారులు, విశ్వభారతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పశుసంవర్ధశాఖ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యుత్ ఉద్యోగులు, జిరాక్స్ బుక్‌స్టాల్స్ నిర్వాహకుల ఆధ్వర్యంలో చిరిగిన దుస్థులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కణేకల్లులో ఎన్జీవోలు రోడ్డుపై క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. రాప్తాడులో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. సీకేపల్లెలో టింబక్టు ఆధ్వర్యంలో సమైక్యాంధ్రపై చర్చా వేదిక నిర్వహించారు. పుట్లూరు, నార్పల, బీకేఎస్ మండలాల్లో జేఏసీ, నాన్పొలికల్ జేఏసీ చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలో జేఏసీ, మునిసిపల్, ట్రాన్స్‌కో ఉద్యోగులు భారీ ర్యాలీలు నిర్వహించారు. యాడికి, పెద్దపప్పూరులలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఉరవకొండలో సమైక్యవాదులు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షలకు ప్రజల నుంచి సంఘీభావం వెల్లువెత్తింది. మైనార్టీలు భారీ ప్రదర్శన నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకొని ఉపాధ్యాయినులు ర్యాలీ నిర్వహించారు. వజ్రకరూరులో దూదేకుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బెళుగుప్పలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు.