సాక్షి, తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని హీరో టూ-వీలర్ షోరూంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకునట్టు తెలిసింది.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షోరూంలోని సర్వీస్ విభాగంలో మంటలు ఎగసిపడ్డాయి.
షోరూం పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉండటంతో అధికారులంతా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని చుట్టపక్కల వారిని అప్రమత్తం చేశారు. ఈ అగ్నిప్రమాదంలో సర్వీస్ విభాగంలోని 60 ద్విచక్రవాహనాలు పూర్తిగా కాలిపోయాయి. దగ్ధమైన వాటిలో 50 పాతవి, 10 కొత్త ద్విచక్రవాహనాలు ఉన్నాయి. సుమారు రూ.20 లక్షల విలువైన విడిభాగాలు ఈ అగ్నిప్రమాదంలో కాలిపోయినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment