
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి రౌడీయిజం ప్రదర్శించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి.. కలెక్టర్ హాల్‌లో ఏకంగా కలెక్టర్‌పైనే విరుచుకుపడ్డారు. కలెక్టర్ నాగలక్ష్మి ఎదుట పేపర్లు విసిరేసి దురుసుగా ప్రవర్తించారు. నువ్వు కలెక్టర్‌గా పనికిరావంటూ మహిళా అధికారినిని అవమానించారు. బీకేర్‌ఫుల్ అంటూ కలెక్టర్‌కే వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
అయితే, తాడిపత్రిలో ఓ భూవివాదం గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి.. సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రెవెన్యూ భవన్‌లో కలెక్టర్‌ను జేసీ కలిశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయారు. కలెక్టర్‌ను బెదిరిస్తున్న క్రమంలో గన్‌మెన్.. ప్రభాకర్ రెడ్డిని వారించే ప్రయత్నం చేసినా ఆయన.. గన్‌మెన్‌ను వెనక్కి నెట్టివేశారు. ఈ క్రమంలోనే మహిళా కలెక్టర్ అని కూడా చూడకుండా బీకేర్‌ఫుల్ అంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా బయటకు వచ్చి.. మీడియాతో కూడా ఆయన దురుసుగా మాట్లాడినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment