
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చిన్నపొలమడలోని ప్రబోధానందాశ్రమంపై శనివారం జేసీ వర్గీలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆశ్రమ నిర్వాహకులకు, జేసీ వర్గీయులకు మధ్య జరిగిన దాడిలో భారీగా ఆస్తులు ధ్వసమయ్యాయి. విషయం తెలుసుకున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం తన వర్గీయులను పరామర్శించేందుకు తాడిపత్రి వెళ్లారు. జేసీ అక్కడికి చేరుకోవడంతో ఆయన వర్గీయుల మరింత రెచ్చిపోయారు. ఆశ్రమంపైకి రాళ్ళు దాడికి పాల్పడ్డారు. ఇంత జరుగుతున్న స్థానిక పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. జేసీ హింసను ప్రోత్సహిస్తున్నారని ఆశ్రమ నిర్వాహక ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment