సాక్షి, అనంతపురం: అనంతపురం ఎస్పీని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోమవారం కలిశారు. తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి కావాలని ఆయన కోరారు. అనంతరం పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తన ఇంటికి వెళ్లేందుకు టీడీపీ నేతల అనుమతి అవసరమా? అంటూ ప్రశ్నించారు. అవసరమని ఎస్పీ చెబితే.. జేసీ ప్రభాకర్ రెడ్డి పర్మిషన్ కోరేందుకు సిద్ధమని.. దసరా తర్వాత తాడిపత్రిలో అడుగు పెడతానన్నారు.
ఓ మాజీ ఎమ్మెల్యేని నియోజకవర్గంలోకి అడుగు పెట్టనివ్వకపోవడం దుర్మార్గం. జేసీ ప్రభాకర్‌రెడ్డి మీడియా ప్రతినిధులను బెదిరించినా పోలీసులు మౌనంగా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే తాడిపత్రిలో హింస చోటుచేసుకుంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తున్నా ఎస్పీ జగదీష్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులు ఇదే విధానాన్ని కొనసాగిస్తే ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తా’’ అని పెద్దారెడ్డి హెచ్చరించారు.
ఇదీ చదవండి: పేదల ప్రాణాలంటే ‘లెక్క’లేదా?
Comments
Please login to add a commentAdd a comment