లారీ దూసుకెళ్లి.. ఇద్దరు చిన్నారుల దుర్మరణం | two children died after lorry crash into house | Sakshi
Sakshi News home page

లారీ దూసుకెళ్లి.. ఇద్దరు చిన్నారుల దుర్మరణం

Published Fri, Dec 20 2013 5:49 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

two children died after lorry crash into house

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో శుక్రవారం ఓ విషాదం చోటుచేసుకుంది. అతివేగంతో వస్తున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డుప్రక్కనే వున్నఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండు పసిప్రాణాలు గాలిలో కలిసిపోయ్యాయి. అతడు నిర్లక్ష్యంగా లారీ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

కాగా, స్థానికులు డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement