రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
పలాస: జాతీయ రహదారిపై మొగిలిపాడు వద్ద ప్రమోద్ దాబా సమీపంలో ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో లారీ డ్రైవర్ మన్‌సూర్‌ఖాన్ రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో మన్‌సూర్‌ఖాన్‌కు తీవ్ర గాయాలపాలై మృతి చెందాడని సీఐ కె.అశోక్‌కుమార్ చెప్పారు. దాబా యజమాని 108కు సమాచారం అందించగా 108 సిబ్బంది పలాస ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతుండగా ఆయన మరణించాడని తెలిపారు. మన్‌సూర్‌ఖాన్ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందినవాడని చెప్పారు. రోడ్డు పక్కన లారీ ఆపి దాబాకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.