కొణిజర్లలో లారీలు ఢీ..ఆరుగురికి గాయాలు | Six people were injured in road accident | Sakshi
Sakshi News home page

కొణిజర్లలో లారీలు ఢీ..ఆరుగురికి గాయాలు

Published Thu, Oct 6 2016 10:20 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

Six people were injured in road accident

కొణిజర్ల మండలకేంద్రంలోని ఎండీఓ ఆఫీసు వద్ద గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అదే సమయంలో అటుగా వచ్చిన మరో లారీ వచ్చి ఈ రెండు లారీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురికి గాయాలయ్యాయి. ఇదేవిధంగా కొణిజర్ల పోలీస్‌స్టేషన్ సమీపంలో లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఖమ్మం తరలించారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement