రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి | lorry driver dies accident in khammam district | Sakshi
Sakshi News home page

రెండు లారీలు ఢీ.. డ్రైవర్ మృతి

Published Mon, Jul 18 2016 9:40 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

lorry driver dies accident in khammam district

బోనకల్(ఖమ్మం): ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఒకదానితో ఒకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా బోనకల్‌మండలం జానకీపురం వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

స్థానిక పాఠశాల సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో.. ఓ లారీ డ్రైవర్ శ్రీనివాసరావు మృతిచెందగా.. మరో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement