సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలు సీఎం కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎంపీ బండి సంజయ్ హెచ్చరించారు. తెలంగాణ పోలీసులు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయ డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అరెస్టులతో బీజేపీ వెనకడుగు వేయబోదన్నారు. కేసీఆర్ మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారని, ఇకనైనా ఆ బుద్ధులు మానుకోవాలని హితవు పలికారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించడంలో తప్పేముందన్నారు. డబుల్ బెడ్‌రూమ్‌ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని ఇచ్చారు? ఎన్ని కట్టిచ్చారు? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమా ధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇళ్లు పూర్తి చేశాం అని కేంద్రానికి నివేదిక ఇచ్చిన కేసీఆర్... లబ్ధిదారుల లిస్ట్ ఎందుకు ఇవ్వ డం లేదని కేంద్రం ప్రశ్నిస్తే స్పందించకపోవడానికి గల కారణాలను ప్రజలకు వివరించాలన్నారు.
కేసీఆర్ చూపిన గ్రాఫి క్స్‌కు, కట్టిన డబుల్ ఇళ్లకు పొంతనే లేదని, నా పాదయాత్రలో రాష్ట్ర ప్రభుత్వం కట్టించిన ఆ ఇళ్లను పరిశీలిస్తే ముట్టుకుంటే కూలిపోయేలా ఉన్నాయని తెలిపారు. అరెస్టులు, గృహ నిర్బంధాలు కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనమని, ఎంపీల అరెస్టులపై పార్లమెంట్‌లో ప్రివిలేజ్ నోటీసులు కూడా ఇచ్చామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment