హుబ్లీ: పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని ఓ వ్యక్తి సదరు గ్రామానికి చెందిన వారిని గ్రామం విడిచి వెళ్లాలని హుకుం జారీ చేశాడు. హుబ్లీ తాలూకా తిమ్మసాగర అంచటకేరి గ్రామ పంచాయతీ సభ్యుడు సహదేవప్ప తమను ఊరు విడిచి వెళ్లాలని రోజూ వేధిస్తున్నాడని ఆ గ్రామ ప్రముఖులు మంజునాథ్ తదితరులు మీడియా ఎదుట వాపోయారు. ప్రభుత్వం స్థలంలో వీరు ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. దివంగత శివళ్లి మంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ రోడ్లు, తాగునీటి సదుపాయం కల్పించారు. ఈ క్రమంలోనే వీరికి ఇళ్ల పట్టాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన మరణాంతరం పరిస్థితి మారిపోయింది. గ్రామ పంచాయతీ సభ్యుడు సహదేవప్ప, మల్లవ్వ జంబాళ మాకు ఓటు వేయలేదంటూ నిత్యం వేధిస్తున్నారని మేము ఎక్కడి వెళ్లాలని బాధితులు వాపోయారు.
చదవండి: ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం
పంచాయతీ ఎన్నికల్లో ఓటేయలేదని గ్రామస్తులపై ఆగ్రహం
Published Thu, Jun 3 2021 11:31 AM | Last Updated on Thu, Jun 3 2021 11:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment