మహిళల సింక్రనైజ్డ్‌ ఈవెంట్‌, చైనాకు స్వర్ణం : ‘సింక్‌’ అంటే ఇది! వైరల్‌ వీడియో | Perfect Chinese Divers Chen Yuxi And Quan Hongchan Appear As One In This Viral Video, Watch Inside | Sakshi
Sakshi News home page

మహిళల సింక్రనైజ్డ్‌ ఈవెంట్‌, చైనాకు స్వర్ణం : ‘సింక్‌’ అంటే ఇది! వైరల్‌ వీడియో

Published Fri, Aug 2 2024 5:51 PM | Last Updated on Fri, Aug 2 2024 7:19 PM

Perfect Chinese Divers Chen Yuxi and Quan Hongchan Appear As One in This Viral Video

మహిళల సింక్రనైజ్డ్ ఈవెంట్‌లో చైనాకు చెందిన క్వాన్ హాంగ్‌చాన్, చెన్ యుక్సీ అద్భుత విజయం సాధించారు. బుధవారం జరిగిన మహిళల సింక్రనైజ్డ్ 10 మీటర్ల ప్లాట్‌ఫాం ఈవెంట్‌లో చైనాకు చెందిన క్వాన్ హాంగ్‌చాన్, చెన్ యుక్సీ జోడీ స్వర్ణం గెలుచుకుంది. డైవింగ్‌ విజయాల పరంపరను  కొనసాగించారు.  చైనా 50వ ఒలింపిక్ డైవింగ్ స్వర్ణ పతకాన్ని గెల్చుకోవడం ఆల్ టైమ్‌  రికార్డు.

తొలి రౌండ్‌లో ఈ జోడీ తమ ఆధిక్యాన్ని 359.10 పాయింట్లతో ముగించింది. ఉత్తర కొరియాకు చెందిన జో జిన్ మి , కిమ్ మి రే 315.90 పాయింట్లతో దేశానికి తొలి ఒలింపిక్ డైవింగ్ పతకంరజతం సాధించారు. బ్రిటన్‌కు చెందిన ఆండ్రియా స్పెండోలినీ-సిరీక్స్ , లోయిస్ టౌల్సన్ 304.38తో కాంస్యం సాధించారు.

మరోవైపు శుక్రవారం జరిగిన చైనాకు చెందిన వాంగ్ జోంగ్‌యువాన్ , లాంగ్ దావోయ్ చైనా పురుషుల సింక్రనైజ్డ్ 3-మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్ టైటిల్‌ను నిలబెట్టుకున్నారు.  డైవింగ్‌లో నాలుగో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నారు. మెక్సికోకు చెందిన జువాన్ సెలయా, ఒస్మర్ ఒల్వెరా రజతం సాధించగా, బ్రిటన్‌కు చెందిన ఆంథోనీ హార్డింగ్, జాక్ లాఫర్ కాంస్యం సాధించారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement