diving
-
ఒకే ఒక్క శ్వాసతో రికార్డ్: భారతీయ మత్స్య కన్య సక్సెస్ స్టోరీ!
ఐటీ రంగంలో చాలా ఏళ్లు పనిచేసిన 31 ఏళ్ల స్మృతి మిరానీ "భారతీయ మత్స్యకన్య"గా మారతానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ అనూహ్యంగా రికార్డు సాధించింది. 40 మీటర్ల నీటి అడుగున డైవ్ చేసిన తొలి భారతీయ మహిళగా నిలిచింది స్మృతి మిరానీ. IIT బాంబే ఇంజనీర్ నుంచి భారతదేశపు తొలి మహిళా ఫ్రీ-డైవింగ్ రికార్డ్ హోల్డర్ వరకు ఆమె పయనం చాలా స్ఫూర్తి దాయకం. ఇది కేవలం రికార్డులను బద్దలు కొట్టడం గురించి మాత్రమే కాదు. తనకెదునైన పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం, అభిరుచి, పట్టుదల ఎవరూ ఊహించని లోతులకు (సముద్రపు) తీసుకెళ్లగలవని నిరూపించిన వైనం గురించి కూడా.ఒక్క శ్వాస ఆమె జీవితాన్ని మార్చగలదు అంటే నమ్ముతారు. అవును స్మృతి మిరానీ విషయంలో అదే జరిగింది. ఒకే ఒక్క శ్వాసతో 40 మీటర్లకు పైగా నీటి అడుగున డైవ్ చేసిన తొలి భారతీయ మహిళగా స్మృతి మిరానీ థాయిలాండ్‌లో చరిత్ర సృష్టించింది. ఎయిర్ ట్యాంక్ లేకుండా ఊపిరిబిగబట్టి సముద్రం లోతులకు చేరి చరిత్ర సృష్టించింది. నిజంగా ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిచ్చింది. ప్రతీ మహిళలకు గర్వకారణమైన క్షణం! View this post on Instagram A post shared by Deepak G Ponoth (@themillenialcomrade) అప్నియా కో ఫంగాన్లో ప్రపంచ ప్రఖ్యాత కోచ్ లుకాస్ గ్రాబోవ్స్కీ ఆధ్వర్యంలో చాలా కఠోరమైన శిక్షణ తీసుకుని తనను తాను తీర్చుకుంది. రికార్డులను బద్దలు కొట్టడానికి తన శారీరక,మానసిక బలాన్ని సాధించింది. ఫ్రీ-డైవింగ్‌లో ఎయిర్ ట్యాంక్ లేదా శ్వాస ఉపకరణాలు లేకుండా సాధించాలంటే శ్వాసతీసుకోవడం అనే కళను అలవర్చుకోవాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని శ్రద్ధగా సాధన చేసే మెంటల్ గేమ్ లాంటిది అంటారామె.తాను నీటి అడుగున ఉన్నప్పుడు తనకు తాను అత్యంత సన్నిహితంగా అనిపిస్తుంది” అని గర్వంగా చెబుతుందామె. ’’ ఇపుడు చాలా స్వేచ్ఛగా ఉన్నాను, నాకు నేనే సవాళ్లు విసురుకుంటా.. భయాన్ని అధిగమించాను. ఫ్రీ-డైవింగ్ ఆనందాన్ని గుర్తించాను’’ అంటుంది. చదవండి: మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్అండమాన్ దీవులలో ఊహించని విధంగా ఆమె ప్రయాణం ప్రారంభమైంది. తొలిసారి ఫ్యామిలీతో వెళ్లినపుడు స్కూబా-డైవింగ్ నేర్చుకోవాలని ప్రయ్నత్నించింది. రెండోసారి విజయం సాధించింది. ఆ తరువాత 2019లో రిమోట్‌గా పనిచేస్తున్నపుడు స్కూబా-డైవింగ్‌ను కొనసాగించడానికి వెళ్లినపుడు తాబేలుతో పాటు ఫ్రీ-డైవర్ ఈత కొట్టడం చూడటం జీవితం దృక్పథాన్ని మార్చివేసింది. అప్పటినుంచి సముద్రమే నివాసంగా మారి పోయింది. స్మృతి అప్పటి నుండి మాల్టా, బాలి, ఆస్ట్రేలియాతో సహా ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన జలాల్లో కొన్నింటిలో డైవ్ చేసింది. సర్టిఫైడ్ ఫ్రీ-డైవింగ్ బోధకురాలిగా ఎదిగింది. అనేక మందికి శిక్షణనిస్తోంది. వారిలో తమ సామర్థ్యాన్ని అన్వేషించి, వారి భయాలను అధిగమించవడానికి శక్తినిచ్చే లక్ష్యంతో ఉంది. -
మహిళల సింక్రనైజ్డ్ ఈవెంట్, చైనాకు స్వర్ణం : ‘సింక్’ అంటే ఇది! వైరల్ వీడియో
మహిళల సింక్రనైజ్డ్ ఈవెంట్లో చైనాకు చెందిన క్వాన్ హాంగ్‌చాన్, చెన్ యుక్సీ అద్భుత విజయం సాధించారు. బుధవారం జరిగిన మహిళల సింక్రనైజ్డ్ 10 మీటర్ల ప్లాట్‌ఫాం ఈవెంట్లో చైనాకు చెందిన క్వాన్ హాంగ్‌చాన్, చెన్ యుక్సీ జోడీ స్వర్ణం గెలుచుకుంది. డైవింగ్ విజయాల పరంపరను కొనసాగించారు. చైనా 50వ ఒలింపిక్ డైవింగ్ స్వర్ణ పతకాన్ని గెల్చుకోవడం ఆల్ టైమ్ రికార్డు.తొలి రౌండ్లో ఈ జోడీ తమ ఆధిక్యాన్ని 359.10 పాయింట్లతో ముగించింది. ఉత్తర కొరియాకు చెందిన జో జిన్ మి , కిమ్ మి రే 315.90 పాయింట్లతో దేశానికి తొలి ఒలింపిక్ డైవింగ్ పతకంరజతం సాధించారు. బ్రిటన్‌కు చెందిన ఆండ్రియా స్పెండోలినీ-సిరీక్స్ , లోయిస్ టౌల్సన్ 304.38తో కాంస్యం సాధించారు.China's Chen Yuxi and Quan Hongchan won gold in the women's synchronized 10m platform diving event with a performance that was so synchronized and flawless, they appeared as one diver while jumping from a side view. pic.twitter.com/13GiXAYrar— Game of X (@froggyups) August 1, 2024మరోవైపు శుక్రవారం జరిగిన చైనాకు చెందిన వాంగ్ జోంగ్యువాన్ , లాంగ్ దావోయ్ చైనా పురుషుల సింక్రనైజ్డ్ 3-మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్ టైటిల్‌ను నిలబెట్టుకున్నారు. డైవింగ్‌లో నాలుగో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నారు. మెక్సికోకు చెందిన జువాన్ సెలయా, ఒస్మర్ ఒల్వెరా రజతం సాధించగా, బ్రిటన్‌కు చెందిన ఆంథోనీ హార్డింగ్, జాక్ లాఫర్ కాంస్యం సాధించారు. -
చీరదరహాసం
స్పోర్ట్స్, ఎడ్వెంచర్ యాక్టివిటీలకు చీర ‘అన్‌ఫిట్’ అనే భావన ఉంది. అయితే క్రమంగా ఈ భావనలో మార్పు వస్తోంది. ‘శారీతో కూడా ఓకే’ అనిపిస్తున్నారు కొందరు మహిళలు. తాజాగా స్కూబా డైవింగ్ ఇన్స్ట్రక్టర్ కాత్య సైనీ చీర ధరించి కైట్ సర్ఫింగ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో గంటల వ్యవధిలోనే లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘నౌ దిస్ ఈజ్ క్రాస్ కల్చర్. ఐ లవ్ దిస్’ అనే ప్రశంసల మాట ఎలా ఉన్నా... ‘చీర ధరించి అడ్వెంచరస్ స్పోర్ట్స్‌లో పాల్గొనడం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే’ అని కొందరు హెచ్చరించారు. గత ఫిబ్రవరిలో షైను అనే యూజర్ పోస్ట్ చేసిన ఇలాంటి వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో ఒక నడి వయసు స్త్రీ చీర ధరించి రోప్ సైకిలింగ్ చేస్తున్న దృశ్యం నెటిజనులను ఆకట్టుకుంది. వైరల్ -
చీరకట్టులో డైవింగ్ చేసిన సీనియర్ సిటిజన్ మహిళలు: వీడియో వైరల్
స్విమ్మింగ్ కాంపిటీషన్లో చూస్తుంటాం తలకిందులుగా నీటిలో దూకడం. ఆ పోటీలో పాల్గొన్న వాళ్లంతా స్విమ్‌సూట్ వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని మరీ చేస్తుంటారు. కానీ ఇక్కడ సీనియర్ సీటిజన్ మహిళలు అలాంటివి ఏమి లేకుండా చీర కట్టులోనే డైవింగ్ చేసి చూపించారు. ఇది అందర్నీ ఆశ్చర్యపరిచడమే గాక చాలా ఆదర్శంగా కూడా ఉంది. ఈ ఘటన తమిళనాడులో కల్లిడైకురిచి వద్ద తామిరబర్నీ నది వద్ద చోటు చేసుకుంది. అక్కడ మహిళలందరికి ఇది నిత్యకృత్యం. ఒక పెద్దావిడ కల్లిడైకురిచిలో పేరుగాంచిన తామిరబరిణి నదిలో చీరకట్టులో డైవింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియోని ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహు పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సీనియర్ సిటజన్ మహిళంతా చాలా అలవోకగా బ్రిడ్జిపై నుంచి నదిలో దూకి స్విమ్మింగ్ చేస్తూ..కనిపించారు. అదికూడా చీరకట్టులోనే చేశారు. వారంతా పెద్దవాళ్లే కానీ, ఏమాత్రం బెరుకు లేకుండా చాలా ఉత్సాహంగా డైవింగ్ చేశారు. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి ఆ నది అంతా లోతు లేదు కాబట్టే చేయగలుగుతున్నారని ఒకరు, కొన్నిగ్రామాల్లోని పురుషులు, మహిళలు, పిల్లలకు ఇలాంటి వాటిల్లో చాలా నైపుణ్యత ఉంటుందని మరోకరు ట్వీట్ చేశారు. Awestruck to watch these sari clad senior women effortlessly diving in river Tamirabarni at Kallidaikurichi in Tamil Nadu.I am told they are adept at it as it is a regular affair.😱Absolutely inspiring 👏 video- credits unknown, forwarded by a friend #women #MondayMotivation pic.twitter.com/QfAqEFUf1G — Supriya Sahu IAS (@supriyasahuias) February 6, 2023 (చదవండి: అరవింద్ కేజ్రీవాల్‌ని పోలిన వ్యక్తి చాట్ అమ్ముతూ..) -
స్టార్ ఒలింపియన్ కన్నుమూత
Olympic Diver Ian Matos Dies Aged 32: బ్రెజిల్‌కు చెందిన ఒలింపిక్ డైవర్ ఇయాన్ మాటోస్ 32 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతూ గత రెండు నెలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాటోస్.. బుధావరం పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో మూడు మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్‌లో పోటీ పడ్డ మాటోస్.. పతకం గెలవలేనప్పటికీ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మాటోస్.. 2010 సౌత్ అమెరికన్ గేమ్స్‌లో మూడు కాంస్య పతకాలు సాధించి వెలుగులోకి వచ్చాడు. మాటోస్ అకాల మరణం పట్ల బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ సంతాపం తెలిపింది. కాగా, మాటోస్.. 2014లో తాను గే నంటూ సంచలన ప్రకటన చేసిన వార్తల్లో నిలిచాడు. చదవండి: అంతర్జాతీయ టోర్నీలో భారత స్కీయర్‌కు కాంస్యం -
డైవింగ్ లైఫ్!
కాస్త టైమ్ దొరికితే చాలు హాలిడేకి చెక్కేస్తున్నారు హీరోయిన్ పరిణీతి చోప్రా. డైవింగ్ లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆమె స్కూబా డైవింగ్‌లో సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. లాస్ట్ టైమ్ మాల్దీవుల్లో మస్తీ చేసిన పరిణీతి ఇప్పుడు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ సమీపంలోని గ్రేట్ బారియర్ రిఫ్లో డైవింగ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.‘‘ఆస్ట్రేలియాలో డైవింగ్ లైఫ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు పరిణీతి చోప్రా. పొఫెషనల్ లైఫ్‌లో కూడా ఫుల్ బిజీగా ఉన్నారామె. అర్జున్ కపూర్ హీరోగా రూపొందుతున్న ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్, నమస్తే ఇంగ్లాండ్’ సినిమాల్లో పరిణీతిచోప్రా కథానాయికగా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి. అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తున్న ‘కేసరి’ సినిమాలో కూడా పరిణీతినే కథానాయిక. -
ఆమె పతకం గెలువగానే ప్రపోజ్ చేశాడు!
-
ఆమె పతకం గెలువగానే ప్రపోజ్ చేశాడు!
రియో ఒలింపిక్స్ వేదికపై క్రీడాస్ఫూర్తితోపాటు.. ప్రేమలూ చిగురిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ చైనీస్ క్రీడాకారిణికి ఆమె ప్రియుడు జీవితకాలం గుర్తుండిపోయే కానుకను ఇచ్చాడు. ఒలింపిక్స్‌లో రజత పతకం అందుకొని మురిసిపోతున్న ఆమెకు నిశ్చితార్థ ఉంగరం కానుకగా ఇచ్చాడు. నన్ను పెళ్లిచేసుకుంటావా? అని కోరాడు. కళ్లనిండా నిండిన ఆనందబాష్పాలతో, సంభ్రమాశ్చార్యాలతో ఆ చిన్నది ప్రియుడి కోరికను మన్నించింది. చైనీస్ డైవింగ్ క్రీడాకారిణి హె జీ (25)కి ఈ అరుదైన అనుభవం ఎదురైంది. మూడు మీటర్ల స్ప్రింగ్‌బోర్డు డైవింగ్ ఈవెంట్లో అద్భుతమైన విన్యాసాలు కనబర్చిన హె జీ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. మెడల్ అందుకొని ఆమె పొడియం దిగగానే.. ఆమె ప్రియుడు, సహచర డైవింగ్ ఆటగాడు కిన్ కై (30) ఆమెను సమీపించాడు. అతడు మోకాళ్లపై కూచొని తాను తెచ్చిన ఓ చిన్ని కానుకను ఆమెకు అందించాడు. చిన్ని పెట్టేలో ఉన్న ఆ కానుకను చూసి ఆమె సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. అది నిశ్చితార్థ ఉంగరం. అతడి ప్రేమ ప్రతిపాదనను ఆమె అంగీకరించింది. ఆమె వేలికి అతడు ప్రేమగా ఉంగరం తొడిగి.. తన దానిని చేసుకున్నాడు. ఈ హృద్యమైన ప్రేమఘట్టం చూస్తున్న ప్రేక్షకులను కదిలించింది. వారు ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. ఈ క్రీడాప్రేమికులను నిండుమనస్సుతో దీవించారు. -
అందుబాటులోకి 'ఆగ్మెంటెడ్ రియాలిటీ' హెల్మెట్..
అమెరికాః కళ్ళజోడు పెట్టుకుంటే చాలు ప్రపంచాన్ని మన ముందుంచే టెక్నాలజీల్లో ఇప్పటివరకూ వర్చువల్ రియాలిటీదే మొదటి స్థానం. దూరంగా ఉన్న అద్భుతాలను కళ్ళముందే ఉన్నట్లుగా తిలకించే అత్యద్భుత పరిజ్ఞానం అది. ఇప్పుడు అనేక సంస్థలు ఈ వర్చువల్ రియాలిటీ పరికరాలను మార్కెట్లోకి తెచ్చేందుకు పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే మరో అడుగు ముందుకేసి మరి కాస్త పరిజ్ఞానాన్ని జోడించి మనిషి జీవితంలో భాగమయ్యే ఆగ్మెంటెడ్ రియాలిటీని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు నిపుణులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం అమెరికా నేవీ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెల్మెట్ ను అభివృద్ధి పరుస్తోంది. ఇది ఓ ఐరన్ మ్యాన్ సామర్థ్యాన్ని అందిస్తుందని యూఎస్ నేవీ చెప్తోంది. నిజ జీవితంతో ఏమాత్రం సంబంధం లేకుండా కనిపించే దృశ్యాలను చూసి ఆనందించే అవకాశం వర్చువల్ రియాలిటీలో ఉంటే, ఆగ్మెంటెడ్ రియాలిటీ మాత్రం కనిపించే దృశ్యాల సారాంశాన్ని, చరిత్రను సైతం తెలియజేస్తుంది. ప్రస్తుతం అమెరికా నేవీ ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెల్మెట్ ను అభివృద్ధి పరుస్తోంది. నీటి అడుగు భాగంలో సంచరించేందుకు డైవర్స్ దీన్ని వాడినప్పుడు.. వారికి ఐరన్ మాన్ చిత్రంలా వాస్తవిక సామర్థ్యాన్ని కలిగించేట్లు చేస్తుందని యూఎస్ నేవీ ఇంజనీర్ డెన్నిస్ గ్లఘెర్ చెప్తున్నారు. పనామా సిటీ డివిజన్ లోని నేవల్ సర్ఫేస్ వార్ఫేర్ సెంటర్ లో గల్లఘెర్ సహా 20 మంది బృందం ఈ అభివృద్ధిలోని డైవర్స్ ఆగ్మెంటెడ్ విజన్ డిస్ప్లే కు సంబంధించిన మొదటి దశను పూర్తి చేశారు. ఇందులో పొందుపరిచిన హై రిజల్యూషన్ సిస్టమ్ ద్వారా డైవర్స్ కు సెక్టార్ సోనార్, టెక్ట్స్ మెసేజ్, ఫొటోలు, డయాగ్రమ్ లు, వీడియోలను వాస్తవ కాలంలో సందర్శించే అవకాశం ఇస్తుంది. తాము అభివృద్ధి పరిచిన ఈ సాధనం ద్వారా నీటిలో మునిగిపోయిన ఓడలు, కూలిపోయిన విమానాలు వంటి వాటిని సులభంగా కనిపెట్టే అవకాశం ఉంటుందని, వాటిని వెతికేందుకు వెళ్ళే బృందాలకు ఈ హెల్మెట్ ఖచ్చితత్వాన్ని అందిస్తుందని, అత్యంత సహాయ పడుతుందని నేవీ చెప్తోంది. ఈ అక్టోబర్ నాటికి హెల్మెట్ రూప కల్పన పూర్తిచేయడంతోపాటు.. నీటిలో పరీక్షలు ప్రారంభించే లక్ష్యంతో ఉన్నట్లు నేవీ తెలిపింది. ఆగ్మెంటెడ్ రియాలిటీ హెల్మెట్ లోని అధిక రిజల్యూషన్ సోనార్ ద్వారా సముద్రంలోని, నీటి అడుగు భాగంలో వీడియోలు తీసుకోవడంతోపాటు, అనేక సూక్ష్మ విషయాలను కూడ పరిశీలించ వచ్చునని, ఇది అనేక విధాలుగా డైవర్లకు సహాయ పడుతుందని నేవీ వివరిస్తోంది.