చీరకట్టులో డైవింగ్‌ చేసిన సీనియర్‌ సిటిజన్‌ మహిళలు: వీడియో వైరల్‌ | Women Wearing Sarees Diving Into Tamil Nadu Goes Viral | Sakshi
Sakshi News home page

Viral Video: చీరకట్టులో డైవింగ్‌ చేసిన సీనియర్‌ సిటిజన్‌ మహిళలు

Feb 7 2023 10:52 AM | Updated on Feb 7 2023 10:52 AM

Women Wearing Sarees Diving Into Tamil Nadu Goes Viral  - Sakshi

స్విమ్మింగ్‌ కాంపిటీషన్‌లో చూస్తుంటాం తలకిందులుగా నీటిలో దూకడం. ఆ పోటీలో పాల్గొన్న వాళ్లంతా స్విమ్‌సూట్‌ వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని మరీ చేస్తుంటారు. కానీ ఇక్కడ సీనియర్‌ సీటిజన్‌ మహిళలు అలాంటివి ఏమి లేకుండా చీర కట్టులోనే డైవింగ్‌ చేసి చూపించారు. ఇది అందర్నీ ఆశ్చర్యపరిచడమే గాక చాలా ఆదర్శంగా కూడా ఉంది. ఈ ఘటన తమిళనాడులో కల్లిడైకురిచి వద్ద తామిరబర్నీ నది వద్ద చోటు చేసుకుంది. అక్కడ మహిళలందరికి ఇది నిత్యకృత్యం.

ఒక పెద్దావిడ కల్లిడైకురిచిలో పేరుగాంచిన తామిరబరిణి నదిలో చీరకట్టులో డైవింగ్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియోని ఐఏఎస్‌ ఆఫీసర్‌ సుప్రియా సాహు పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో సీనియర్‌ సిటజన్‌ మహిళంతా చాలా అలవోకగా బ్రిడ్జిపై నుంచి నదిలో దూకి స్విమ్మింగ్‌ చేస్తూ..కనిపించారు. అదికూడా చీరకట్టులోనే చేశారు. వారంతా పెద్దవాళ్లే కానీ, ఏమాత్రం బెరుకు లేకుండా చాలా ఉత్సాహంగా డైవింగ్‌ చేశారు. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి ఆ నది అంతా లోతు లేదు కాబట్టే చేయగలుగుతున్నారని ఒకరు, కొన్నిగ్రామాల్లోని పురుషులు, మహిళలు, పిల్లలకు ఇలాంటి వాటిల్లో చాలా నైపుణ్యత ఉంటుందని మరోకరు ట్వీట్‌ చేశారు.

(చదవండి: అరవింద్‌ కేజ్రీవాల్‌ని పోలిన వ్యక్తి చాట్‌ అమ్ముతూ..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement