
స్పోర్ట్స్, ఎడ్వెంచర్ యాక్టివిటీలకు చీర ‘అన్‌ఫిట్’ అనే భావన ఉంది. అయితే క్రమంగా ఈ భావనలో మార్పు వస్తోంది. ‘శారీతో కూడా ఓకే’ అనిపిస్తున్నారు కొందరు మహిళలు. తాజాగా స్కూబా డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ కాత్య సైనీ చీర ధరించి కైట్ సర్ఫింగ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో గంటల వ్యవధిలోనే లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
‘నౌ దిస్ ఈజ్ క్రాస్ కల్చర్. ఐ లవ్ దిస్’ అనే ప్రశంసల మాట ఎలా ఉన్నా... ‘చీర ధరించి అడ్వెంచరస్ స్పోర్ట్స్‌లో పాల్గొనడం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే’ అని కొందరు హెచ్చరించారు. గత ఫిబ్రవరిలో షైను అనే యూజర్ పోస్ట్ చేసిన ఇలాంటి వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో ఒక నడి వయసు స్త్రీ చీర ధరించి రోప్ సైకిలింగ్ చేస్తున్న దృశ్యం నెటిజనులను ఆకట్టుకుంది.
వైరల్
Comments
Please login to add a commentAdd a comment