అందుబాటులోకి 'ఆగ్మెంటెడ్ రియాలిటీ' హెల్మెట్.. | U.S. Navy developing augmented reality diving helmet | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి 'ఆగ్మెంటెడ్ రియాలిటీ' హెల్మెట్..

Published Sat, Jun 4 2016 12:29 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

అందుబాటులోకి 'ఆగ్మెంటెడ్ రియాలిటీ' హెల్మెట్.. - Sakshi

అందుబాటులోకి 'ఆగ్మెంటెడ్ రియాలిటీ' హెల్మెట్..

అమెరికాః కళ్ళజోడు పెట్టుకుంటే చాలు ప్రపంచాన్ని మన ముందుంచే టెక్నాలజీల్లో ఇప్పటివరకూ వర్చువల్ రియాలిటీదే మొదటి స్థానం. దూరంగా ఉన్న అద్భుతాలను కళ్ళముందే ఉన్నట్లుగా తిలకించే అత్యద్భుత పరిజ్ఞానం అది. ఇప్పుడు అనేక సంస్థలు ఈ వర్చువల్ రియాలిటీ పరికరాలను మార్కెట్లోకి తెచ్చేందుకు పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే మరో అడుగు ముందుకేసి మరి కాస్త పరిజ్ఞానాన్ని జోడించి మనిషి జీవితంలో భాగమయ్యే ఆగ్మెంటెడ్ రియాలిటీని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు నిపుణులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం అమెరికా నేవీ  ఆగ్మెంటెడ్ రియాలిటీ హెల్మెట్ ను అభివృద్ధి పరుస్తోంది. ఇది ఓ ఐరన్ మ్యాన్ సామర్థ్యాన్ని అందిస్తుందని యూఎస్ నేవీ చెప్తోంది.  

నిజ జీవితంతో ఏమాత్రం సంబంధం లేకుండా కనిపించే దృశ్యాలను చూసి ఆనందించే అవకాశం వర్చువల్ రియాలిటీలో ఉంటే, ఆగ్మెంటెడ్ రియాలిటీ మాత్రం కనిపించే దృశ్యాల సారాంశాన్ని, చరిత్రను సైతం తెలియజేస్తుంది. ప్రస్తుతం అమెరికా నేవీ ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెల్మెట్ ను అభివృద్ధి పరుస్తోంది. నీటి అడుగు భాగంలో సంచరించేందుకు డైవర్స్  దీన్ని వాడినప్పుడు.. వారికి ఐరన్ మాన్ చిత్రంలా వాస్తవిక సామర్థ్యాన్ని కలిగించేట్లు చేస్తుందని యూఎస్ నేవీ ఇంజనీర్ డెన్నిస్ గ్లఘెర్ చెప్తున్నారు. పనామా సిటీ డివిజన్ లోని నేవల్ సర్ఫేస్ వార్ఫేర్ సెంటర్ లో గల్లఘెర్  సహా 20 మంది బృందం  ఈ అభివృద్ధిలోని డైవర్స్ ఆగ్మెంటెడ్ విజన్ డిస్ప్లే కు సంబంధించిన  మొదటి దశను పూర్తి చేశారు. ఇందులో పొందుపరిచిన  హై రిజల్యూషన్ సిస్టమ్ ద్వారా డైవర్స్ కు  సెక్టార్ సోనార్, టెక్ట్స్ మెసేజ్, ఫొటోలు, డయాగ్రమ్ లు, వీడియోలను వాస్తవ కాలంలో సందర్శించే అవకాశం ఇస్తుంది.

తాము అభివృద్ధి పరిచిన ఈ సాధనం ద్వారా నీటిలో మునిగిపోయిన ఓడలు, కూలిపోయిన విమానాలు వంటి వాటిని సులభంగా కనిపెట్టే అవకాశం ఉంటుందని, వాటిని  వెతికేందుకు వెళ్ళే బృందాలకు ఈ హెల్మెట్ ఖచ్చితత్వాన్ని అందిస్తుందని, అత్యంత సహాయ పడుతుందని నేవీ చెప్తోంది. ఈ అక్టోబర్ నాటికి హెల్మెట్ రూప కల్పన పూర్తిచేయడంతోపాటు.. నీటిలో పరీక్షలు ప్రారంభించే లక్ష్యంతో ఉన్నట్లు నేవీ తెలిపింది. ఆగ్మెంటెడ్ రియాలిటీ  హెల్మెట్ లోని అధిక రిజల్యూషన్ సోనార్  ద్వారా సముద్రంలోని, నీటి అడుగు భాగంలో వీడియోలు తీసుకోవడంతోపాటు, అనేక సూక్ష్మ విషయాలను కూడ పరిశీలించ వచ్చునని, ఇది అనేక విధాలుగా డైవర్లకు సహాయ పడుతుందని నేవీ వివరిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement