
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో (మార్చి 19 ఉదయం) అంతరిక్షం నుండి తిరిగి రావడం ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషాన్ని నింపింది. నిజంగా దివి నుంచి భువికి వచ్చిన దేవతలా స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి, చిరునవ్వులు చిందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈనేపథ్యంలోనే ఆమె పూర్వీకులు, ఎవరు? ఏ రాష్ట్రానికి చెందినది అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.
సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా, గుజరాత్‌లోని ఝులసన్ గ్రామానికి చెందినవారు. ఇక్కడే ఆమె పూర్వీకుల ఇల్లు (Ancestral Home) ఉంది. తొమ్మిది నెలల ఉత్కంఠ తరువాత ఆమె సురక్షితంగా భూమికి తిరిగి రావడంతో ఆ గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. ఆమె రాకను ప్రత్యక్షంగా చూడటానికి గ్రామం మొత్తం ఒక ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన టీవీల ముందు గుమిగూడి సునీతను చూడగానే ఆనందంతో కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో విశేషంగా నిలిచింది.
ఇది సునీత తండ్రి దీపక్ పాండ్య పూర్వీకులకు సంబంధించిన ఇల్లుగా భావిస్తున్నారు. ఇండియా టుడే షేర్ చేసిన వీడియో ప్రకారం, సునీత పూర్వీకుల ఇల్లు ఇప్పటికీ ఉంది. అయితే, ఎత్తైన ఈ ఇంటికి చాలా కాలంగా ఇల్లు లాక్ చేయబడి ఉండటం వల్ల కొంచెం పాతబడినట్టుగా కనిపిస్తోంది. అక్కడక్కడా పగుళ్లు కూడా ఉన్నాయి. అయితే సునీతకు భారతదేశంతో ఉన్న అనుబంధానికి నిదర్శనం. 1958లో ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడంతో ఇంటికి సరైన నిర్వహణలేకుండా ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ అది దృఢంగానే కనిపిస్తోంది.
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సునీత విలియమ్స్‌ను భారత్ రావాల్సిందిగా ఆహ్వానించిన నేపథ్యంలో ఆమె, సొంత గ్రామానికి వస్తారా? పూర్వీకుల ఇంటిని సందర్శిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.
సమోసా పార్టీ
సునీతా విలియమ్స్ వదిన, ఫల్గుణి పాండ్యా ఈ క్షణాన్ని 'అద్భుతం'గా అభివర్ణించారు. త్వరలో ఆమె కుటుంబం త్వరలో భారతదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా తమ పూర్వీకుల గ్రామం ఝులసన్‌తో బలమైన సంబంధాన్ని ఆమె గుర్తు చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సమోసా తిన్న మొదటి వ్యక్తి సునీత కాబట్టి, ఆమె సురక్షితంగా తిరిగి రావడాన్ని పండుగలా జరుపుకునేందుకు కుటుంబం సమోసా పార్టీ ఇస్తుందని కూడా ఆమె చమత్కరించారు.
చదవండి: సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!
తొమ్మిది నెలలు అంతరిక్షంలోనే
ఒక వారం రోజుల మిషన్‌మీద రోదసిలోకి వెళ్లిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడే చిక్కుకు పోయారు. తొమ్మిది నెలల తర్వాత, వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి భూమికి తిరిగి వచ్చారు. అచంచలమైన ధైర్య సాహసాలు, అకుంఠిత దీక్ష, అంకితభావంతో సునీతా విలియమ్స్ ఒక రోల్‌మోడల్‌గా నిలిచారు.
చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?
Comments
Please login to add a commentAdd a comment