సిటీ ఆఫ్ లవ్.. ప్యారిస్. తన ఇష్టసఖి మనసు గెల్చుకునేందుకు విశ్వక్రీడావేదికను ఎంచుకున్నాడు. ఈ రొమాంటిక్ స్టోరీ ఇంటర్నెట్‌లో సందడి చేస్తోంది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఈ చైనీస్ జంట వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో చైనీస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ హువాంగ్ యాకియోంగ్, జెంగ్ సివీ స్వర్ణం గెలిచి తమ కలను సాకారం చేసుకున్నారు. కానీ బోయ్ ఫ్రెండ్ డైమండ్ రింగ్‌ను సొంతం చేసుకుంటానని ఊహించలేదు..హువాంగ్. స్టోరీ ఏంటంటే..:
తన లవ్ ప్రపోజల్‌కు ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది అనుకున్నాడో ఏమో గానీ చైనీస్ షట్లర్ లియు యుచెన్, తన ప్రేయసి విజయ సంబరాల్లో మునిగి తేలుతున్న వేళ మోకాళ్లపై వంగి ‘జీవితాంతం నిన్ను ప్రేమిస్తా.. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ హువాంగ్ యాకియోంగ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేశాడు. దీంతో సిగ్గుల మొగ్గ అవ్వడం ఆమె వంతైంది.
సోషల్ మీడియాలో ఈ ప్రేమికులకు అభినందనలు వెల్లువెత్తాయి. లియు యుచెన్ ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలవలేదు కానీ ఒలింపిక్ బంగారు పతక విజేతను గెల్చుకున్నాడు అంటూ అభినందించారు. పురుషుల డబుల్స్‌లో టోక్యో-2020 రజత పతకాన్ని గెల్చుకున్నాడు లియు.
"I’ll love you forever! Will you marry me?"
"Yes! I do!"
OMG!!! Romance at the Olympics!!!❤️❤️❤️
Huang Yaqiong just had her "dream come true", winning a badminton mixed doubles gold medal🥇with her teammate Zheng Siwei
Then her boyfriend Liu Yuchen proposed! 🎉🎉🎉 pic.twitter.com/JxMIipF7ij— Li Zexin (@XH_Lee23) August 2, 2024
శుక్రవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ బ్యాడ్మింటన్‌లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ వోన్ హో- జియోంగ్ నా-యూన్ (21-8, 21-11)పై చైనాకు చెందిన జెంగ్ సివీ మరియు హువాంగ్ యా కియోంగ్ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నారు.
కాగా అర్జెంటీనాకు చెందిన హ్యాండ్‌బాల్ స్టార్ పాబ్లో సిమోనెట్, మహిళల ఫీల్డ్ హాకీ క్రీడాకారిణి మరియా పిలార్ కామ్‌పోయ్ లవ్ స్టోరీ కూడా ప్యారిస్ ఒలింపిక్స్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమెకు పెళ్లి ప్రతిపాదన తెచ్చేందుకు తొమ్మిదేళ్లు వెయిట్ చేసిన మరీ ఆమె మనసు దోచుకున్నాడు
Comments
Please login to add a commentAdd a comment