ఒకప్పుడు మైదానంలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన స్టార్ ఆటగాడు, భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు మంచి ఫిటెనెస్‌తో చలాకీగా ఉండే కాంబ్లీ పలు అనారోగ్య సమస్యలతో నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. దిగ్గజ క్రికెట్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్‌తో కలిసి కాంబ్లీ కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమం కారణంగానే కాంబ్లీ పరిస్థితి గురించి ప్రపంచానికి తెలిసింది. అతడి స్థితిని చూసి అభిమానులంతా కాంబ్లీకి ఏమైందంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా కాంబ్లీ తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడటానికి దారితీసిన కారణాలు, అలాగే ఒకప్పుడు ఫిట్‌గా ఉండే వ్యక్తిని డిప్రెషన్ ఇంతలా కుంగదీసి అనారోగ్యం పాలు చేస్తుందా అంటే..
వినోద్ కాంబ్లీ ఇలా తీవ్రమైన అనారోగ్య స్థితిలో కనిపించటం తొలిసారి కాదు. గతంలో కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అనేక సందర్భాలు ఉన్నాయి. 2013లో ముంబైలో డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటుకి గురయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు కోలుకున్నాడు. ఆయన 2012లో రెండు ధమనులలో అడ్డంకులను తొలగించుకునేందుకు యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ఆ తర్వాత నుంచి పూర్తిగా కోలుకోలేదని కాంబ్లీ అంతరంగికులు చెబుతున్నారు.
ఎందుకంటే..
ఒక్కసారి గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స లేదా కొద్దిపాటి వేరే చికిత్సలు తీసుకున్నప్పుడు సమతుల్యమైన జీవనశైలిని పాటించక తప్పదు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. పలు అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
డిప్రెషన్..
దీనికి తోడు కాంబ్లీ తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పలు ఇంటర్వూల్లో వెల్లడించారు. సచిన్ సచిన్ స్థాయికి చేరుకోగల సత్తా ఉన్నా చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్నట్లు కాంబ్లీ సన్నిహిత వర్గాలు చెబుతుంటారు. కెరీర్ ఫెయిల్యూర్ తదితర కారణాలతో తీవ్ర డిప్రెషన్‌కు వెళ్లాడు. దీంతో వినోద్ కాంబ్లీ మద్యానికి బానిసైనట్లు తెలుస్తుంది. తాగుడు మానేయాలని చాలాసార్లు ప్రయత్నించాడని, అందుకోసం డీ అడిక్షన్ సెంటర్ నుంచి ట్రీట్‌మెంట్ కూడా తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత కూడా ఆయన మద్యం తాగడం మానలేదని తెలుస్తుంది. ఇక్కడ డిప్రెషన్ ఎంతటి ఫిట్‌నెస్‌తో ఉన్న వ్యక్తిని అయినా అమాంతం కుంగదీసీ చేతకాని వాడిలా కూర్చొబెట్టేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
అలాగే మద్యం అడిక్షన్..
ఇది కూడా మనిషిని పదిమంది ముందు సగౌరవంగా బతకనివ్వకుండా చేసే అతి భయనాక మహమ్మారి. దీని ముందు ఎంతటి మహమహులైనా.. నిలవలేరు. దీనికి బానిసై జీవితాలని నాశనం చేసుకున్న వారెందరో ఉన్నారు. ఇక్కడ కాంబ్లీ పరిస్థితి కూడా ఇదే. ఇక్కడ కాంబ్లీ పూర్తిగా కోలుకుని ఆరోగ్యంతో ఉండాలని దాదాపు 14సార్లు పునరావాస కేంద్రానికి తీసుకువెళ్లినట్లు అతడి స్నేహితుడు అంపైర్ కుటో తెలిపారు. అంటే కాంబ్లీ ఎంతటి పరిస్థితిలో ఉన్నాడో స్పష్టమవుతోంది.
ఇక్కడ ఏ మనిషి అయినా తనకు తాను బాగుండాలని గట్టిగా అనుకుంటేనే.. ఎవ్వరూ సాయం అందించినా సఫలం అవుతుంది. సగం ఆరోగ్యం నయమవ్వడానికి ఆయా వ్యక్తుల సంకల్ప బలమే ఆధారం. కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదురయ్యే ఉద్దాన పతనాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దు. దేన్నైనా సమంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవరుచుకోండి.
"దేన్ని కోల్పోయినా, మనిషి గమ్యం ఆగకూడదనేది గుర్తించుకుండి. కడ వరకు పూర్తి ఆరోగ్యంతో ఒకరి ఆసరా లేకుండా జీవనం సాగించడమే అత్యంత అదృష్టమని భావించండి. ఇలాంటి దృకప్పథం అలవాటు చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యల బారినపడరు". అని చెబుతున్నారు మానసిక నిపుణులు.
दोस्ती किसे कहते हैं, और इसके मायने क्या होते हैं…
इस सचिन-कांबली के 20 सेकंड के वीडियो को देख कर समझ सकते हैं..#SachinTendulkar #VinodKambli pic.twitter.com/WqsYoHzQ3x— Dr Ajeet Hindu (@AjitSin0001) December 3, 2024
Comments
Please login to add a commentAdd a comment