పారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో ముందు వరుసలో దూసుకెళుతున్న చైనా మరో రికార్డు సొంతం చేసుకుంది. రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి యూరోపేతర జట్టుగా చైనా నిలిచింది. ఒలింపిక్స్ రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో ఇప్పటి వరకు యూరప్ దేశాల ఆధిపత్యం కొనసాగుతుండగా... శనివారం చైనా మహిళల జట్టు దానికి గండి కొడుతూ పసిడి పతకం కైవసం చేసుకుంది.
ఐదుగురు సభ్యులతో కూడిన చైనా టీమ్ ఫైనల్లో 69.800 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. హూప్స్, రిబ్బన్స్, బాల్స్ విభాగాల్లో చైనా జిమ్నాస్ట్‌లు చక్కటి ప్రదర్శన కనబర్చారు. ఇజ్రాయిల్ (68.850 పాయింట్లు), ఇటలీ (68.100 పాయింట్లు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నాయి. డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ బల్గేరియా నాలుగో స్థానంతో
సరిపెట్టుకుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ రిథమిక్స్ జిమ్నాస్టిక్స్‌లో రజతం గెలిచిన చైనా ఈసారి పసిడి పతకం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment