Gymnastics
-
#DipaKarmakar : సూపర్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ (ఫొటోలు)
-
విశాఖపట్నం : ఒళ్లా.. విల్లా (ఫొటోలు)
-
Simone Biles: శరీరాన్ని విల్లులా వంచుతూ.. బ్యాలెన్సింగ్ బైల్స్
శరీరాన్ని విల్లులా వంచుతూ వాల్ట్పై ఆమె చేసే విన్యాసాలకు ప్రపంచం అచ్చెరువొందింది.. ఫ్లోర్ ఎక్సర్సైజ్లో తిరుగులేని ప్రదర్శన కనబర్చినప్పుడు అభిమానగణం జేజేలు కొట్టింది.. బ్యాలెన్స్ బీమ్‌పై ఆ అమ్మాయి ఆట క్షణాల పాటు అందరి గుండెలు ఆగిపోయేలా చేసిన ఘట్టాలు ఎన్నో! ఆమె బరిలోకి దిగితే చాలు పతకాల పంట పండుతుంది... ఎవరికీ సాధ్యం కాని రికార్డులు కొత్తగా వచ్చి చేరతాయి. ఇదీ అదీ అని లేకుండా తన ఆటతో 27 ఏళ్ల వయసులోనే జిమ్నాస్టిక్స్ ప్రపంచంలో అన్ని ఘనతలను అందుకున్న ఆ స్టార్ పేరే సిమోన్ బైల్స్! దశాబ్దకాలానికి పైగా జిమ్నాస్టిక్స్ అంటే ఆమె మాత్రమే అనేలా గుర్తింపు తెచ్చుకోవడం బైల్స్‌కు మాత్రమే చెల్లింది. కేవలం 4 అడుగుల 8 అంగుళాల ఎత్తుతోనే బైల్స్ సంచలనాలు సృష్టించగలిగింది.పారిస్ ఒలింపిక్స్ తర్వాత ‘సిమోన్.. నేను మీ అమ్మను. నన్ను క్షమించవా! గతం మరిచి నన్ను ఒక్కసారైనా కలుస్తావని ఆశిస్తున్నా..’ ఒక 52 ఏళ్ల మహిళ ఆవేదనతో బహిరంగంగా వెల్లడించిన కోరిక ఇది. ఆమె ఎవరో కాదు. దిగ్గజ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్‌కు కన్నతల్లి షెనాన్. 27 ఏళ్ల తర్వాత ఆమెకు ఇప్పుడు కూతురు గుర్తుకొచ్చింది. ఇన్నేళ్లలో ఆమె బైల్స్‌ను ఏ ఒక్క రోజూ గుర్తుచేసుకున్న పాపాన పోలేదు. పసిగుడ్డుగా ఉన్నప్పుడే వదిలేసి వెళ్లిపోయింది.తాత పెంపకంలో..షెనాన్ నలుగురు పిల్లల్లో బైల్స్ మూడో సంతానం. అయితే మరో పాప పుట్టాక షెనాన్ ఆల్కహాల్‌కు, డ్రగ్స్‌కు బానిసైంది. నలుగురు పిల్లలను అనాథాశ్రమంలో వదిలేసి వెళ్లిపోయింది. కొంతకాలం వరకు ఈ నలుగురు పిల్లల ఆచూకీ ఎవరికీ తెలియలేదు. ఎట్టకేలకు బైల్స్ తాత రాన్ (తల్లి షెనాన్ తండ్రి)కి వారి గురించి సమాచారం అందింది. దాంతో రాన్, ఆయన రెండో భార్య నెలీ కలసి బైల్స్, ఆమె చెల్లెలు ఏడ్రియాను, ఇద్దరు పెద్ద పిల్లలను రాన్ సోదరి దత్తత తీసుకొని పెంచుకున్నారు. ఇప్పటికీ వారినే బైల్స్ తన అమ్మానాన్నలుగా పిలుస్తుంది.సాధనమున పనులు..జిమ్నాస్టిక్స్‌లో బైల్స్ దిగ్గజంగా ఎదగడం వరకు రాన్, నెలీ ఎంతో ప్రోత్సహించారు. ఆరేళ్ల వయసులో టెక్సస్‌లో తమ ఇంటి సమీపంలో వారు సరదాగా సెలవుల్లో సిమోన్‌ను జిమ్నాస్టిక్స్‌లో చేర్పించారు. కానీ ఆమె ఆ వయసులోనే ఆటపై అమితాసక్తి కనబరుస్తూ ఒక్క క్లాస్‌కు కూడా గైర్హాజరు కాలేదు. అనారోగ్యంతో ఇంట్లో కూర్చోమని చెప్పినా సరే వెళ్లాల్సిందేనని పట్టుబట్టేది. తర్వాత ఆమెను పూర్తి స్థాయిలో జిమ్నాస్టిక్స్ శిక్షణ వైపు మళ్లించారు. ఎనిమిదేళ్ల వయసులో అమెరికాలో ప్రముఖ కోచ్‌లలో ఒకరైన ఐమీ బూర్మన్ వద్ద ట్రైనింగ్ మొదలు పెట్టిన బైల్స్ మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆటపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు బైల్స్ స్కూల్ చదువుకు గుడ్‌బై చెప్పి హోమ్ స్కూలింగ్ వైపు మళ్లింది.జూనియర్‌గా రాణించి..బూర్మన్ శిక్షణలో రాటుదేలిన బైల్స్ జూనియర్ స్థాయిల్లో పోటీల్లో పాల్గొంటూ తన సత్తాను ప్రదర్శించేందుకు సిద్ధమైంది. ‘అమెరికన్ క్లాసిక్స్’ టోర్నీల్లో చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. వాల్ట్, బ్యాలెన్స్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్సైజ్, అనీవెన్ బార్స్.. ఇలా జిమ్నాస్టిక్స్‌లో ఉండే వేర్వేరు ఈవెంట్లన్నింటిలోనూ బైల్స్ విన్యాసాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఈ క్రమంలో అమెరికా జాతీయ జూనియర్ టీమ్‌లోనూ ఎంపికైంది. నిలకడైన ప్రదర్శనతో 16 ఏళ్ల వయసులో తొలిసారి యూఎస్ తరఫున సీనియర్ స్థాయి పోటీల్లో ఆడే అవకాశం బైల్స్‌కు దక్కింది. ఇటలీలో జరిగిన టోర్నీలో అమెరికా టీమ్ విజేతగా నిలవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. అయితే కొద్ది రోజులకే జరిగిన మరో టోర్నీలో బైల్స్ కాలి మడమకు గాయం కావడంతో పోటీల్లో విఫలమైంది. కానీ కోలుకొని మళ్లీ జాతీయ పోటీల్లో సత్తా చాటిన బైల్స్‌కు మరో మహదావకాశం దక్కింది. అమెరికా తరఫున తొలిసారి వరల్డ్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఎంపికైన బైల్స్ కెరీర్ అప్పటి నుంచి శిఖరానికి చేరింది. విశ్వ వేదికలపై..బెల్జియంలోని ఆంట్వెర్ప్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్.. బెల్స్ ఖాతాలో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం చేరాయి. ప్రతి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇదే తరహా ప్రదర్శన. నానింగ్, గ్లాస్గో, దోహా, స్టట్గార్ట్, ఆంట్వెర్ప్.. 2013–23 మధ్య వరల్డ్ చాంపియన్‌షిప్ వేదిక మారినా, బైల్స్ ప్రదర్శనలో అదే జోరు కొనసాగింది. ఆరు చాంపియన్‌షిప్స్‌లో కలిపి ఏకంగా 23 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు. ఇక మిగిలింది మరో విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్‌ను జయించడమే! ఇక్కడా బైల్స్ తన అద్భుత ఆటను ప్రదర్శించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో 4 స్వర్ణాలు, 1 కాంస్యంతో ఆల్ రౌండర్‌గా నిలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్ సమయానికి స్టార్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన బైల్స్ 24 ఏళ్ల వయసులో తనపై ఉన్న అంచనాల ఒత్తిడిని తట్టుకోలేక టీమ్ ఫైనల్ పోటీ నుంచి తప్పుకుంది. అయితే ఈ క్రీడల్లోనూ ఆమె ఒక రజతం, ఒక కాంస్యం గెలవగలిగింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌కు వచ్చే సరికి మళ్లీ అన్ని రకాలుగా సన్నద్ధమై, 3 స్వర్ణాలు, ఒక రజతం సాధించింది.అనితరసాధ్యం..జిమ్నాస్టిక్స్లోని అత్యంత కఠినమైన ఈవెంట్లలోనూ అలవోకగా మార్కులు కొట్టేయడం బైల్స్‌కు మాత్రమే సాధ్యమైంది. మూడు విభాగాలు వాల్ట్, బ్యాలెన్స్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లలో ‘బైల్స్’ పేరు మీదే ప్రత్యేక అంశాలు ఉండటం ఆమె గొప్పతనానికి నిదర్శనం. అతి ఎక్కువ కాఠిన్య స్థాయి, ప్రమాద తీవ్రత ఉన్న ఈ ఎక్సర్‌సైజ్‌లను ప్రపంచంలో బైల్స్ తప్ప మరే జిమ్నాస్ట్ ప్రదర్శించలేదు. తన కెరీర్ మంచిస్థితిలో ఉన్న దశలో అమెరికా జిమ్నాస్టిక్స్ టీమ్ ఫిజీషియన్ ల్యారీ నాసెర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే విషయంలో వెల్లడించి బైల్స్ వార్తల్లోకెక్కింది. మూడేళ్ల పాటు సహచర జిమ్నాస్ట్ స్టేసీ ఎర్విన్‌తో డేటింగ్ చేసిన బైల్స్.. గత ఏడాది అమెరికన్ ఫుట్‌బాల్ ప్లేయర్ జొనాథన్ ఓవెన్స్‌ను పెళ్లి చేసుకుంది. ఇప్పటికే మూడు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న బైల్స్.. 2028లో సొంతగడ్డపై జరిగే ఒలింపిక్స్‌లో మరిన్ని విజయాలు అందుకునే అవకాశం ఉంది. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
చైనా అద్భుతం... రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో తొలిసారి స్వర్ణం
పారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో ముందు వరుసలో దూసుకెళుతున్న చైనా మరో రికార్డు సొంతం చేసుకుంది. రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి యూరోపేతర జట్టుగా చైనా నిలిచింది. ఒలింపిక్స్ రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో ఇప్పటి వరకు యూరప్ దేశాల ఆధిపత్యం కొనసాగుతుండగా... శనివారం చైనా మహిళల జట్టు దానికి గండి కొడుతూ పసిడి పతకం కైవసం చేసుకుంది. ఐదుగురు సభ్యులతో కూడిన చైనా టీమ్ ఫైనల్లో 69.800 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. హూప్స్, రిబ్బన్స్, బాల్స్ విభాగాల్లో చైనా జిమ్నాస్ట్‌లు చక్కటి ప్రదర్శన కనబర్చారు. ఇజ్రాయిల్ (68.850 పాయింట్లు), ఇటలీ (68.100 పాయింట్లు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నాయి. డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్ బల్గేరియా నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ రిథమిక్స్ జిమ్నాస్టిక్స్‌లో రజతం గెలిచిన చైనా ఈసారి పసిడి పతకం సాధించింది. -
జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ మేక లాకెట్టు వైరల్! ఏకంగా 546 వజ్రాలతో..!
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో పతకాలు ఎలా ఉన్నా..ఎన్నో స్ఫూర్తిదాయకమైన కథలు, కదిలించే కన్నీటి గాథలు, అద్భుతాలు ఉన్నాయి. వాటి తోపాటు ఓ క్రీడాకారిణి ధరించిన లాకెట్టు నెట్టింట్ హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి బరిలోకి దిగే క్రీడాకారులు ఫ్యాషన్ లాకెట్టులు అంతగా ధరించరు. మహా అయితే నెక్కు ఉండే తేలికపాటి గొలుసులు ధరస్తారంతే..కానీ ఈ అమెరికన్ జిమ్నాస్ట్ మాత్రం వెరీ స్పెషల్. ఎందుకుంటే తనను ఏ జంతువుతో హేళన చేశారో దాన్నే లాకెట్‌గా డిజైన్ చేయించుకుని మరీ ఫ్యాషన్‌కు సరికొత్త పాఠాలు నేర్పింది. 2013 నుంచి ఓటమి ఎరుగని ఆల్‌రౌండ్ ఛాంపియన్. జిమ్నాస్టిక్స్ సరిహద్దులను చెరిపేసిన క్రీడాకారిణి జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్. ఈ 27 ఏళ్ల జిమ్నాస్ట్ గురువారం స్వర్ణం గెలుచుకుని, తన కెరీర్లో 39వ పతకాన్ని సాధించింది. దీంతో ఆమె రెండోవ ఒలింపిక్స్ ఆల్ రౌండర్ టైటిల్‌ని, వరుసగా తొమ్మిదొవ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న జిమ్నాస్ట్‌గా రికార్డు సృష్టించింది. ఈ పారిస్ 2024 ఒలింపిక్‌లో రెండో బంగారు పతాకాన్ని గెలుచుకున్న వెంటనే తాను ధరించిన మేక లాకెట్టుతో కెమెరాకు ఫోజులిచ్చింది. అంతేగాదు ఆమె ఈ గెలుపుతో మొత్తం ఆరు ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకున్న జిమ్నాస్ట్‌గా 120 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. ఆ సందర్భంగా తన లాకెట్టుని ప్రదర్శించింది. "ఇది చిన్న మేక లాకెట్టు కావొచ్చు. కానీ ఈ మేకును అందరూ ఇష్టపడుతారు. అందరూ నన్ను మేక అంటూ పిలిచి హేళన చేశారు. అసలు దాన్నే లాకెట్టుగా చేసుకుని ధరించి ప్రత్యేకంగా ఉండాలనిపించి. అంతేగాదు ద్వేషించేవారు ద్వేషిస్తూనే ఉంటారు. వాళ్లు నన్ను అలా ఆ జంతువు పేరుతో పిలవడాన్ని ప్రత్యేకంగా భావించానే గానీ నెగిటివ్‌గా తీసుకోలేదు. అదీగాక తన వద్ద స్టఫ్డ్ మేక కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. బహుశా వారు దాన్నే గుర్తు చేస్తున్నారని అనుకున్నా". అంటూ సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇదిలా ఉండగా, కాలిఫోర్నియా జ్యువెలరీ కంపెనీ బైల్స్ అభ్యర్థన మేరకు ఈ మేక లాకెట్టుని తయారు చేసినట్లు తెలిపింది. దీన్ని దాదాపు 546 వజ్రాలతో అలంకరించినట్లు వెల్లడించింది. ఇది త్రిమితీయ కళాఖండం అని, జిమ్నాస్టిక్స్‌లో ఆమె అసామాన ప్రతిభ, ఖచ్చితత్వం, అంకితభావం, పట్టుదల తదితరాలను ఇది ప్రతిబింబిస్తుందని సోషల్ మీడియా పోస్ట్‌లో జ్యువెలరీ కంపెనీ పేర్కొంది. (చదవండి: రాజుల కాలం నాటి చీరలకు జీవం పోస్తున్న నందిని సింగ్!) -
వీళ్ల ఆటను చూడాల్సిందే!
జీవితంలో ఒక్కసారి ఒలింపిక్స్‌లో పోటీపడితేనే తమ జీవితాశయం నెరవేరినట్లు చాలా మంది క్రీడాకారులు భావిస్తారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని కొందరు జాతీయ హీరోలుగా ఎదుగుతారు. ఒలింపిక్స్ పేరును ఎప్పుడు ప్రస్తావించినా తమ పేరును కూడా స్మరించుకునే విధంగా చరిత్రకెక్కుతారు. తమ అది్వతీయమైన ప్రదర్శనతో తమకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖిస్తారు. ఒలింపిక్స్‌లో పోటీపడటాన్ని... పతకాలను సాధించడాన్ని... ప్రపంచ రికార్డులు సృష్టించడాన్ని అలవాటుగా మార్చుకొని ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తారు. మరో రెండు రోజుల్లో మొదలయ్యే పారిస్ ఒలింపిక్స్‌లోనూ పలు క్రీడాంశాల్లో దిగ్గజాలు మరోసారి తమ విన్యాసాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. అందులో కొందరి గురించి క్లుప్తంగా... –సాక్షి క్రీడా విభాగంసిమోన్ బైల్స్ (జిమ్నాస్టిక్స్) మెరుపు తీగలా కదులుతూ... అలవోకగా పతకాలు గెలుస్తూ... ప్రపంచ జిమ్నాస్టిక్స్‌లో తనదైన ముద్ర వేసింది అమెరికాకు చెందిన సిమోన్ బైల్స్. 27 ఏళ్ల బైల్స్ వరుసగా మూడో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనుంది. 4 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న బైల్స్ ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో 4 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు గెలిచింది. ప్రపంచ చాంపియన్íÙప్లో 23 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు కైవసం చేసుకుంది. ‘పారిస్’లో బైల్స్ మరో పతకం నెగ్గితే ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాలు నెగ్గిన అమెరికన్ జిమ్నాస్ట్‌గా రికార్డు నెలకొల్పుతుంది. బైల్స్ ఐదు పతకాలు గెలిస్తే... ఒలింపిక్స్ చరిత్రలోనే 12 పతకాలతో అత్యధిక పతకాలు నెగ్గిన జిమ్నాస్ట్‌లలో లారిసా లాతినినా (రష్యా; 18 పతకాలు) తర్వాత రెండో స్థానానికి చేరుకుంటుంది. మిజైన్ లోపెజ్ నునెజ్ (రెజ్లింగ్) గ్రీకో రోమన్ స్టయిల్లో ఎదురులేని దిగ్గజ రెజ్లర్. క్యూబాకు చెందిన 41 ఏళ్ల నునెజ్ వరుసగా ఆరో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో స్వర్ణ పతకాలను సాధించాడు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న నునెజ్ పురుషుల గ్రీకో రోమన్ 130 కేజీల విభాగంలో మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా ఉన్నాడు. 2004 ఏథెన్స్లో 120 కేజీల విభాగంలో ఐదో స్థానంలో నిలిచిన నునెజ్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లలో 120 కేజీల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించాడు. 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లలో 130 కేజీల విభాగంలో స్వర్ణ పతకాలను గెల్చుకున్నాడు. పారిస్ గేమ్స్‌లోనూ నునెజ్ పతకం సాధిస్తే... ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో ఐదు స్వర్ణాలు లేదా ఐదు పతకాలు నెగ్గిన ఏకైక రెజ్లర్‌గా ఘనత వహిస్తాడు. ఎలూడ్ కిప్‌చోగి (అథ్లెటిక్స్) లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్‌లో ఆఫ్రికా అథ్లెట్లకు తిరుగులేదు. పారిస్ ఒలింపిక్స్‌లో కెన్యాకు చెందిన 39 ఏళ్ల ఎలూడ్ కిప్‌చోగి గతంలో మారథాన్‌లో ఎవరికీ సాధ్యంకాని రికార్డును సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు. ఐదోసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్న కిప్‌చోగి 2004 ఏథెన్స్ గేమ్స్‌లో 5000 మీటర్లలో కాంస్యం, 2008 బీజింగ్ గేమ్స్‌లో 5000 మీటర్లలో రజతం సాధించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయిన కిప్‌చోగి ఆ తర్వాత మారథాన్ (42.195 కిలోమీటర్లు) వైపు మళ్లాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కిప్‌చోగి విజేతగా నిలిచి రెండు స్వర్ణాలు సాధించాడు. ఈ క్రమంలో అబెబె బికిలా (ఇథియోపియా), వాల్దెమర్ (జర్మనీ) తర్వాత ఒలింపిక్స్ మారథాన్ చరిత్రలో రెండు స్వర్ణాలు నెగ్గిన మూడో అథ్లెట్‌గా నిలిచాడు. పారిస్‌లోనూ కిప్‌చోగి పతకం లేదా స్వర్ణం నెగ్గితే ఒలింపిక్స్ మారథాన్ చరిత్రలో అత్యధికంగా మూడు పతకాలు నెగ్గిన ఏకైక అథ్లెట్‌గా చరిత్ర సృష్టిస్తాడు. లెబ్రాన్ జేమ్స్ (బాస్కెట్‌బాల్) ఒలింపిక్స్‌లో బాస్కెట్‌బాల్‌ను 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ క్రీడాంశంలో అమెరికాయే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 1980 మాస్కో ఒలింపిక్స్‌ను బహిష్కరించిన అమెరికా జట్టు ఇప్పటి వరకు బాస్కెట్‌బాల్‌లో 16 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు గెలిచింది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన అమెరికా ఆ తర్వాత వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు సాధించింది. మరో స్వర్ణమే లక్ష్యంగా అమెరికా పారిస్ గేమ్స్‌లో అడుగు పెడుతుంది. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్ చరిత్రలో టాప్ స్కోరర్‌గా ఉన్న లెబ్రాన్ జేమ్స్ నాలుగోసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత మళ్లీ విశ్వ క్రీడల్లో ఆడుతున్న లెబ్రాన్ జేమ్స్ తన సహజశైలిలో ఆడితే ఈసారీ అమెరికాకు ఎదురుండదు. టెడ్డీ రైనర్ (జూడో) పురుషుల జూడో క్రీడాంశంలో 12 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఫ్రాన్స్ దిగ్గజం టెడ్డీ రైనర్ సొంతగడ్డపై రికార్డుపై గురి పెట్టాడు. వరుసగా ఐదోసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న 35 ఏళ్ల టెడ్డీ రైనర్ ఒలింపిక్స్‌లో 3 స్వర్ణాలు, 2 కాంస్యాలు సాధించాడు. 6 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న టెడ్డీ పారిస్ ఒలింపిక్స్‌లో మిక్స్డ్ టీమ్‌తోపాటు హెవీ వెయిట్ విభాగంలో బరిలోకి దిగుతాడు. ఈ రెండు విభాగాల్లోనూ టెడ్డీ స్వర్ణాలు సాధిస్తే ఫ్రాన్స్ తరఫున ఒలింపిక్స్ క్రీడల్లో అత్యధికంగా ఐదు స్వర్ణాలు గెలిచిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఫ్రాన్స్ ఫెన్సర్లు లూసియన్ గాడిన్, క్రిస్టియన్ డోరియోలా గతంలో ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాల చొప్పున సాధించారు. బైల్స్, లెబ్రాన్ జేమ్స్, కెప్చోగి, టెడ్డీ రైనర్, నునెజ్లే కాకుండా పోల్‌వాల్టర్ డుప్లాంటిస్ (స్వీడన్), టేబుల్ టెన్నిస్‌లో మా లాంగ్ (చైనా), స్విమ్మింగ్‌లో సెలెబ్ డ్రెసెల్ (అమెరికా), కేటీ లెడెకీ (అమెరికా) కూడా పారిస్ ఒలింపిక్స్‌లో కొత్త చరిత్రను లిఖించే దారిలో ఉన్నారు. వారందరికీ ఆల్ ద బెస్ట్! -
ఇతగాడి విన్యాసాలు చూస్తే ఔరా అనాల్సిందే..!
ఓ వ్యక్తి అసాధారణ విన్యాసాలు చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడయోలోని వ్యక్తి మెడను ఆధారంగా చేసుకుని అబ్బురపరిచే విన్యాసాలు చేస్తున్నాడు. మెడతో తన శరీర బరువునంతా మోస్తున్నాడు. Bro a superhuman😭 pic.twitter.com/7HRtlSVvJw— vids that go hard (@vidsthatgohard) June 26, 2024ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇతగాడిని సూపర్ హీరో అని పిలుస్తున్నారు. ఈ వ్యక్తి సదరు ఫీట్లు ఎందుకు చేస్తున్నాడో తెలియదు కానీ.. ఈ వీడియో మాత్రం జనాలను బాగా ఆకట్టుకుంటుంది. దయచేసి ఇలాంటి విన్యాసాలను చేయడానికి ఎవరు ప్రయత్నించకండి. ఇలాంటివి కేవలం ప్రొఫెషనల్స్ పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. ఈ వీడియోపై మీ కామెంట్ చెప్పిండి. -
డ్యాన్సమ్నాస్టిక్
నృత్య ప్రదర్శనలో ఆకట్టుకునే అందమైన డ్రెస్ అనేది కామన్. ఆర్షియా మాత్రం భయపెట్టే డ్రెస్‌తో, హారర్ లుక్‌తో స్టేజీ మీదికి వచ్చింది. ‘ఇదేం లుక్కు బాబోయ్’ అనుకునేలోపే తన అద్భుత నృత్యప్రతిభతో ప్రేక్షకులను అబ్బురపరిచింది. ‘అమెరికాస్ గాట్ టాలెంట్’ టీవీ షో న్యాయనిర్ణేతలు ‘వావ్’ అనుకునేలా చేసింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన 13 ఏళ్ల ఆర్షియా శర్మ స్వదేశం దాటి వేరే దేశానికి రావడం ఇదే తొలిసారి. ఈ ఇంటర్నేషనల్ షోలో ΄ాల్గొనడానికి ముందు ఆర్షియా శర్మ లిటిల్ మాస్టర్స్, సూపర్ డ్యాన్సర్ 4 లాంటి షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.అంతర్జాతీయ వేదికపై చప్పట్లతో ‘ఆహా’ అనిపించుకున్న ఆర్షియా ప్రత్యేకత ఏమిటి... అనే విషయానికి వస్తే....డాన్స్‌కు జిమ్నాస్టిక్స్ జోడించి ‘వారెవ్వా’ అనేలా చేసింది. ఆర్షియ ‘డ్యాన్సమ్నాస్టిక్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
#Dipa Karmakar: ఎనిమిదేళ్ల తర్వాత జాతీయ జిమ్నాస్టిక్స్ పోటీల్లో...
భారత మహిళా స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఎనిమిదేళ్ల తర్వాత జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో పోటీపడనుంది. జనవరి 2 నుంచి భువనేశ్వర్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. 30 ఏళ్ల దీపా 2016 రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంతో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మోకాలి గాయంతో ఆటకు దూరమైంది. పునరాగమనం తర్వాత డోపింగ్ పరీక్షలో పట్టుబడి 21 నెలలపాటు నిషేధానికి గురైంది. నిషేధం గడువు పూర్తి కావడంతో ఆమె మళ్లీ బరిలోకి దిగుతోంది. -
అత్యంత అరుదైన పిల్లి.. అక్కడ మాత్రమే నివసిస్తాయట
ఇవి మీకు తెలుసా? ► ఐస్‌ల్యాండ్‌లో క్రిస్మస్ పండగ కానుకలుగా పుస్తకాలను ఒకరికి ఒకరు పంచుకునే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయాన్ని ‘ది క్రిస్మస్ బుక్ ఫ్లడ్’ అంటారు. ఇతర దేశాలతో పోల్చితే సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ప్రచురణ కర్తలు అత్యధిక సంఖ్యలో పుస్తకాలు అమ్ముతారు కాబట్టి దీనికి ‘ది క్రిస్మస్ బుక్ ఫ్లడ్’ అని పేరు వచ్చింది. ►‘జిమ్నాస్టిక్స్’ అనేది పురాతన గ్రీకు పదం ‘జిమ్నాజీన్’ నుంచి పుట్టింది. దీని అర్థం నగ్నంగా వ్యాయామం చేయడం. యువకులకు యుద్ధవిద్యలలో శిక్షణ ఇచ్చే విధానం ‘జిమ్నాజీన్’ కాలక్రమంలో ఎన్నో మార్పులకు లోనైంది. ► ‘బే క్యాట్’ అనేది అత్యంత అరుదైన పిల్లి జాతి. ఇవి ఆగ్నేయ ఆసియాలోని బోర్నియో ద్వీపంలో మాత్రమే నివసిస్తాయి. అటవీ నిర్మూలన వల్ల వీటి సంఖ్య విపరీతంగా తగ్గి ప్రమాదపు అంచున ఉన్నాయి. అంతరించి పోతున్న జాతుల జాబితాలో వీటిని చేర్చారు. -
సుకుమారి సూపర్ స్టంట్స్
పాపులర్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ మిష్ శర్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో 7.8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. స్టన్నింగ్ వీడియోలతో సోషల్ మీడియాలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటుంది శర్మ. తాజా విషయానికి వస్తే... చీర ధరించి అద్భుతమైన రీతిలో చేసిన జిమ్నాస్టిక్స్ నెటిజనుల చేత ‘వావ్’ అనిపించాయి. మరో అథ్లెట్ పారుల్ శర్మ చీర ధరించి చేసిన జిమ్నాస్టిక్స్ అబ్బురపరిచాయి. ‘మన టాలెంట్ ముఖ్యం కానీ ఎలాంటి దుస్తులు ధరించామనేది ముఖ్యం కాదు’ అని ఒకరు కామెంట్ రాశారు. అయితే పారుల్ మాత్రం తన వీడియో చూసి ప్రయోగాలు చేయవద్దని సలహా ఇచ్చింది. ‘స్టంట్స్ చేయడానికి ఉత్సాహం మాత్రమే సరిపోదు. ఒకస్థాయి వరకు శిక్షణ తీసుకోవడం అవసరం. నైపుణ్యం సాధించిన తరువాతే ప్రయత్నించాలి. లేని కష్టాలు కొని తెచ్చుకోవద్దు’ అని చెప్పింది పారుల్. -
నిష్కా అగర్వాల్‌కు స్వర్ణం
ఫారోస్ కప్ అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్ స్వర్ణ పతకం నెగ్గింది. కైరోలో జరిగిన ఈ టోర్నీలో నగరంలోని గాడియం స్కూల్ విద్యార్థి అయిన నిష్కా టేబుల్ వాల్ట్ ఈవెంట్లో విజేతగా నిలిచింది. కోచ్ మనోజ్ రాణా వద్ద శిక్షణ తీసుకుంటున్న నిష్కా గత ఏడాది కేరళ ఆతిథ్యమిచ్చిన జాతీయ జూనియర్ పోటీల్లోనూ పసిడి పతకం గెలిచింది. సిఫ్ట్ కౌర్‌కు ఐదో స్థానం బకూ: ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా ఐదో స్థానంలో నిలిచి ంది. దాంతో భారత్‌కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ లభించింది. ఫైనల్లో సిఫ్ట్ కౌర్ 429.1 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. -
14 ఏళ్ల వయసులోనే సంచలనాలు.. ఆల్‌టైమ్ గ్రేట్‌గా..!
1976 మాంట్రియల్ ఒలింపిక్స్.. జిమ్నాస్టిక్స్ పోటీలు జరుగుతున్నాయి. అన్ ఈవెన్ బార్స్ విభాగంలో జిమ్నాస్ట్‌లు పోటీ పడుతున్నారు. తీవ్రమైన పోటీ మధ్య ఆటగాళ్లంతా సత్తా చాటారు. పోరు ముగిసింది. అయితే నిర్వాహకుల్లో ఒక రకమైన ఆందోళన.. ఉత్కంఠత.. ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితి. అది ఎవరూ ఊహించలేనిది.. అందుకే తగిన ఏర్పాట్లు కూడా చేసుకోలేదు. అసలేం జరిగిందంటే స్కోరు చూపించే ఎలక్ట్రానిక్ బోర్డుపై గరిష్ఠంగా మూడు అంకెలు మాత్రమే ప్రదర్శించే వీలుంది. కానీ ఆ అమ్మాయి సాధించిన స్కోరు 10 పాయింట్లు! అంటే 10.00గా రావాలి. కానీ అది సాధ్యం కాలేదు. చివరకు ‘1.00’గా మాత్రమే కనిపించింది. ఒలింపిక్స్ చరిత్రలో తొలి సారి ‘పర్ఫెక్ట్ 10’ స్కోర్ చేసి సంచలనం సృష్టించిన ఆ అమ్మాయి పేరే నాదియా కొమనెచ్. కేవలం 14 ఏళ్ల వయసులో సాధించిన ఈ ఘనతతో మొదలు పెట్టి ఆల్‌టైమ్ జిమ్నాస్టిక్ గ్రేట్‌లలో ఒకరిగా నిలిచింది. రొమేనియాకు చెందిన నాదియా ప్రస్థానం ఆసక్తికరం. టీనేజర్‌గా ఒలింపిక్స్‌లో సంచలనాలు నమోదు చేయడం మొదలు సొంత దేశంలోనే పరాయిదానిలా ఆంక్షల మధ్య బతకడం, ఆపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రహస్యంగా మరో దేశానికి వెళ్లిపోయి కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం, అనంతరం అక్కడే వర్ధమాన జిమ్నాస్ట్‌లను తీర్చిదిద్దడం వరకు ఎన్నో మలుపులు ఉన్నాయి. మాంట్రియల్ ఒలింపిక్స్‌లో అన్ ఈవెన్ బార్స్‌లో ‘పర్ఫెక్ట్ 10’తోనే ఆమె ఆగిపోలేదు. ఆ మెగా ఈవెంట్లో మరో ఆరు సార్లు ఆమె ‘పర్ఫెక్ట్ 10’ను సాధించగలిగిందంటే ఆ అద్భుత ప్రతిభ ఏమిటో అర్థమవుతుంది. రొమేనియా దేశం తరఫున ‘ఒలింపిక్ ఆల్‌రౌండ్’ టైటిల్ గెలిచిన తొలి ప్లేయర్‌గా నాదియా నిలిచింది. సహజ ప్రతిభతో.. శరీరాన్ని విల్లులా వంచుతూ ఎన్నెన్నో విన్యాసాలతో కనువిందు చేసే జిమ్నాస్టిక్స్‌కు క్రీడా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒలింపిక్ క్రీడల్లోనైతే జిమ్నాస్ట్‌ల ప్రదర్శన ప్రతిసారీ విశేషమైన ఆసక్తే. అలాంటి పోటీలకు నాదియా అదనపు ఆకర్షణను తెచ్చింది. అపార ప్రతిభ, బ్యాలెన్సింగ్, క్లీన్ టెక్నిక్‌తో ఆమె ఈ పోటీల్లో శిఖరాలను అందుకుంది. ఒక్కసారి బరిలోకి దిగితే కేవలం సాంకేతికాంశాలు, పాయింట్లు మాత్రమే కాదు, నాదియా ఆట కొత్త తరహాలో అందంగా మారిపోయేది. ఆమె చేసిన విన్యాసాలు మరెవరికీ సాధ్యం కాలేదంటే ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. బీమ్‌పై ఏరియల్ వాకోవర్ చేసిన తొలి జిమ్నాస్ట్ నాదియానే! కళ్లు తిప్పుకోలేని ఏరియల్ కార్ట్‌వీల్ బ్యాక్ హ్యాండ్స్ప్రింగ్ను, డబుల్ ట్విస్ట్ డిస్మౌంట్ను, ఫ్లోర్‌పై డబుల్ బ్యాక్ సాల్టోను ప్రదర్శించిన తొలి జిమ్నాస్ట్‌గా ఘనత వహించింది. వరుస విజయాలు సాధించి.. ‘చిన్నప్పుడు అత్యంత చురుగ్గా ఉండేది. ఎగరడం, గెంతడం, దూకడం, ఇలా అన్నింటా నేను ఆమెను అదుపు చేయలేకపోయేదాన్ని, అందుకే ఆమెను జిమ్నాస్టిక్స్‌లో చేర్పించాను’ నాదియా గురించి ఆమె తల్లి చెప్పిన మాట అది. అయితే ఆ అల్లరి పిల్ల అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని తల్లి కూడా ఊహించలేకపోయింది. ఆరేళ్ల వయసులో పాఠశాల స్థాయిలో ఆటలో ఓనమాలు నేర్చుకుంది. ఏడేళ్ల వయసులో కోచింగ్ అకాడమీలో అత్యుత్తమ ప్రదర్శనతో గుర్తింపు, 9 ఏళ్ల వయసు వచ్చే సరికి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడమే కాదు రొమేనియా జాతీయ చాంపియన్‌గా నిలిచిన అత్యంత పిన్న వయస్కురాలనే రికార్డ్ కూడా నమోదు చేసేసింది. అదే ఏడాది తొలి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న నాదియా వరుస విజయాలతో సత్తా చాటింది. 13 ఏళ్లకు యూరోపియన్ టోర్నీలో అన్ని టైటిల్స్ సాధించేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మన్ హటన్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ‘అమెరికన్ కప్’లో సత్తా చాటి పతకాలు సాధించడంతో నాదియా పేరు మార్మోగింది. భవిష్యత్తు తారగా ఆమెను క్రీడా ప్రపంచం గుర్తించింది. నిజంగానే ఆపై ఆమె తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకోవడంలో సఫలమైంది. ఒలింపిక్స్‌లో జోరు.. మాంట్రియల్ ఒలింపిక్స్‌లో మొదటినుంచి నాదియా హవా కొనసాగింది. అన్ ఈవెన్ బార్స్ విభాగంలోనే కాకుండా బ్యాలెన్స్ బీమ్, వ్యక్తిగత ఆల్‌రౌండ్ ప్రదర్శనల్లో కూడా ఆమె స్వర్ణాలు సొంతం చేసుకుంది. ఇదే ఒలింపిక్స్‌లో టీమ్ ఆల్‌రౌండ్‌లో రజతంతో పాటు ఫ్లోర్ ఎక్సర్సైజ్లో కాంస్యం కూడా గెలుచుకుంది. హార్ట్వాల్ట్లో మాత్రం త్రుటిలో కాంస్యం చేజారి నాలుగో స్థానం దక్కింది. ఈ విజయాలు, ‘పర్ఫెక్ట్ 10’ప్రదర్శనతో నాదియా ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. పలు అవార్డులు, రివార్డులు వచ్చి పడ్డాయి. అప్పటికే పాపులర్ అయిన పాట ‘కాటన్ డ్రీమ్స్’ను ఆమె గౌరవ సూచకంగా ‘నాదియాస్ థీమ్’ అంటూ పేరు మార్చడం విశేషం. ఆ తర్వాత నాదియా ఫ్లోర్ ఎక్సర్సైజ్ పోటీల సమయంలో ఇదే పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించడం విశేషం. ఒలింపిక్స్ విజయాల తర్వాత కూడా ఆమె జోరు కొనసాగింది. ఈ పోటీలకు, 1980 మాస్కో ఒలింపిక్స్‌కు మధ్య నాదియా ప్రపంచ చాంపియన్‌షిప్‌లు, యూరోపియన్ చాంపియన్‌షిప్‌లు, వరల్డ్ కప్‌లలో కలిపి 7 స్వర్ణాలు సహా 14 పతకాలు సాధించింది. ఇదే ఉత్సాహంతో ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టిన ఆమె మరో మంచి ప్రదర్శనను నమోదు చేసింది. ఇక్కడా 2 స్వర్ణాలు, 2 రజతాలు సాధించడంలో ఆమె సఫలమైంది. మోత్తంగా నాదియా గెలిచిన 5 ఒలింపిక్స్ స్వర్ణాలు కూడా వ్యక్తిగత విభాగంలోనివే కావడం విశేషం. దేశం దాటి వెళ్లి.. స్టార్‌గా ఎదిగిన తర్వాత నాదియా.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా క్రీడాభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో ‘నాదియా 81’ పేరుతో ఆమె, ఇతర కోచ్‌లు అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో రొమేనియాలో కమ్యూనిస్ట్ నికోల్ సీషెస్ నాయకత్వంలో నియంతృత్వ ప్రభుత్వం నడుస్తోంది. దాంతో వారి దేశంలో పలు ఆంక్షలు, ఆర్థిక సమస్యలు ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టసాగాయి. ఇలాంటి స్థితిలో అమెరికాను చేరిన బృందంలో నాదియా మినహా మిగతావారంతా అక్కడే ఉండిపోయారు. తాను మాత్రం స్వదేశం వెళ్లాలనే నిర్ణయించుకుంది. అది ఎంత పెద్ద తప్పో ఆ తర్వాత ఆమెకు తెలిసొచ్చింది. ఇతర ఆటగాళ్లు, కోచ్‌లు అమెరికాలోనే ఉండిపోవడంతో నాదియా పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోయింది. ‘మా దేశపు జాతీయ సంపత్తి’ అంటూ నాదియాపై ప్రభుత్వం దేశం దాటి వెళ్లకుండా పలు ఆంక్షలు విధించడంతో పాటు ఆమె ప్రతికదలికపై నిఘా పెట్టింది. ‘నా కుటుంబం కోసం కొంత అదనంగా సంపాదించే అవకాశాన్ని నాకు దూరం చేయడంతో పాటు నన్ను ఖైదీగా మార్చారు’ అంటూ ఆమె వాపోయింది. ఎట్టకేలకు 1989 నవంబర్‌లో కొందరి సహకారంతో ఒక అర్ధరాత్రి నడుస్తూనే రొమేనియా సరిహద్దు దాటింది. ఆపై హంగరీ, ఆస్ట్రియా మీదుగా వెళ్లి మొత్తానికి అమెరికా విమానం ఎక్కింది. అక్కడ ఆమెకు తగిన సహకారం, గౌరవం లభించాయి. తర్వాత కొన్ని వారాలకే రొమేనియా విప్లవంతో అక్కడి ప్రభుత్వం కుప్పకూలి ప్రజాస్వామ్యం రావడంతో పరిస్థితులు మెరుగుపడ్డాయి. గతంలో తనకు స్నేహితుడిగా ఉన్న అమెరికా జిమ్నాస్ట్, రెండు ఒలింపిక్స్ స్వర్ణాల విజేత బార్ట్ కానర్‌ను 1996లో వివాహమాడింది. స్వదేశానికి తిరిగొచ్చి రొమేనియా రాజధాని బుకారెస్ట్లోనే ఆమె పెళ్లి చేసుకోవడం విశేషం. రిటైర్మెంట్ తర్వాత కూడా వేర్వేరు హోదాల్లో ప్రపంచ జిమ్నాస్టిక్స్తో నాదియా అనుబంధం కొనసాగుతోంది. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
Khelo India Youth Games: ‘స్వర్ణ’ సురభి
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఆదివారం జరిగిన జిమ్నాస్టిక్స్ అండర్–18 బాలికల టేబుల్ వాల్ట్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కె.సురభి ప్రసన్న పసిడి పతకం సాధించింది. సురభి 11.63 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఈవెంట్లో సురభి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. అథ్లెటిక్స్‌లో 2000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో డిండి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అథ్లెటిక్స్ అకాడమీ విద్యార్థిని చెరిపెల్లి కీర్తన (పాలకుర్తి) రజత పతకం సొంతం చేసుకుంది. కీర్తన 7 నిమిషాల 17.37 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. బాలికల కబడ్డీ మ్యాచ్‌లో తెలంగాణ జట్టు 28–46తో మధ్యప్రదేశ్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈనెల 11 వరకు జరగనున్న ఈ క్రీడల్లో తెలంగాణ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో 11వ స్థానంలో ఉంది. -
గుంటూరు: జిమ్నాస్టిక్స్తో ఆకట్టుకున్నారు ( ఫొటోలు )
-
జిమ్నాస్టిక్స్‌లో ఏపీకి స్వర్ణం
సాక్షి, అమరావతి: ఏకలవ్య ఆదర్శ గురుకులాల విద్యార్థుల మూడవ జాతీయ క్రీడా పోటీల్లో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ జట్లు వివిధ విభాగాల్లో సత్తా చాటారు. విజయవాడలోని లయోలా కాలేజీ, గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణాల్లో ఆదివారం పలు ఈవెంట్లలో పోటీలు జరిగాయి. జిమ్నాస్టిక్స్ అండర్–14 (బాలుర ఈవెంట్ ఫ్లోర్ ఎక్సర్సైజ్) విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వి.లక్ష్మణ్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్) స్వర్ణపతకం సాధించారు. కె.క్రోనాల్ (మహారాష్ట్ర) రజతం, బి.ఆదిత్య (మధ్యప్రదేశ్) కాంస్య పతకాలు పొందారు. జిమ్నాస్టిక్స్ అండర్–14 (బాలికల ఈవెంట్ ఫ్లోర్ ఎక్సర్సైజ్) విభాగంలో బి.అమూల్య (తెలంగాణ) స్వర్ణం సాధించగా.. కె.తేజస్వి (ఆంధ్రప్రదేశ్) రజతం, ఎం.జ్యోతిక కాంస్యం గెలుచుకున్నారు. జిమ్నాస్టిక్స్ అండర్–19 (బాలుర ఈవెంట్ ఫ్లోర్ ఎక్సర్సైజ్)లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జె.చిరంజీవి, బాలికల విభాగంలో పి.సావిత్రి రజత పతకాలు సాధించారు. బి.రాజు (మధ్యప్రదేశ్) స్వర్ణం, డి.దేవ్ (మధ్యప్రదేశ్) కాంస్య పతకాలు సాధించారు. బాలికల విభాగంలో ఎ.వైష్ణవి (తెలంగాణ) స్వర్ణం, అంకిత (మహారాష్ట్ర) కాంస్య పతకాన్ని సాధించారు. కబడ్డీలో సత్తా చాటిన తెలంగాణ కబడ్డీ బాలుర విబాగంలో తెలంగాణ, కబడ్డీ పూల్–బి రెండో మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్ విజయం సాధించాయి. బాలికల విభాగం పూల్–బీ కబడ్డీ పోటీల మొదటి మ్యాచ్‌లో తెలంగాణ, రాజస్థాన్ జట్లు విజయం సాధించాయి. బాలుర (అండర్–19) పూల్‌లో తెలంగాణ, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ జట్లు విజయం సాధించాయి. బాలికల (అండర్–19) పూల్‌లో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర జట్లు విజయం సాధించాయి. ఆర్చరీలో చెలరేగిన మన్నెం వీరులు ఆర్చరీ 20 మీటర్ల కేటగిరీ అండర్–14 (బాలుర)లో 297 పాయింట్లతో రాజస్థాన్‌కు చెందిన ఆయూష్ చర్పోటా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 291 పాయింట్లతో రెండో స్థానంలో జార్ఖండ్‌కు చెందిన ఆజాద్ కుశల్ బాస్కే, 289 పాయింట్లతో మూడవ స్థానంలో రాజస్థాన్‌కు చెందిన హిమ్మత్ ఖాదియా నిలిచారు. 20 మీటర్ల కేటగిరీ అండర్–14 (బాలికల)లో 288 పాయింట్లతో అగ్రస్థానంలో ఉత్తరాఖండ్‌కు చెందిన వైష్ణవి జోషి, 253 పాయింట్లతో రెండవ స్థానంలో తెలంగాణకు చెందిన సనప మమత, 242 పాయింట్లతో మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బసాయ్ ప్రీతి నిలిచారు. 30 మీటర్ల కేటగిరీ అండర్ –14 (బాలుర)లో 299 పాయింట్లతో జార్ఖండ్‌కు చెందిన ఆజాద్ కుశల్ బాస్కే వీర విజృంభణ చేసి మొదటి స్థానంలో నిలిచాడు. 298 పాయింట్ల స్వల్ప తేడాతో రెండో స్థానంలో రాజస్థాన్‌కు చెందిన హిమ్మత్ ఖాదియా, 265 పాయింట్లతో మూడవ స్థానంలో రాజస్థాన్‌కు చెందిన రంజిత్ నిలిచారు. 30 మీటర్ల కేటగిరీలో అండర్ –14 (బాలికల)లో 232 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బసాయ్ ప్రీతి మొదటి స్థానం కైవసం చేసుకుంది. 226 పాయింట్లతో ఉత్తరాఖండ్‌కు చెందిన వైష్ణవి జోషి, 216 పాయింట్లతో తెలంగాణకు చెందిన సనప మమత రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆర్చరీ గ్రూప్ (4) అండర్–14(బాలుర)లో 1,669 పాయింట్లతో రాజస్థాన్‌కు చెందిన హిమ్మత్ ఖాదియా, అయూష్ చర్పొట, రంజిత్, సునీల్ బృందం మొదటి స్థానంలో నిలిచింది. 1,399 పాయింట్లతో జార్ఖండ్, 1,383 పాయింట్లతో ఛత్తీస్‌గఢ్ బృందాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఆర్చరీ గ్రూప్ (4) అండర్–14 విభాగం (బాలికల)లో 1,166 పాయింట్లతో తెలంగాణ సనప మమత, మందరకల నవ్యశ్రీ, కుంజ భవ్యశ్రీ, పొట్ట ప్రవల్లిక బృందం మొదటి స్థానంలో నిలిచింది. 1,056 పాయింట్లతో ఉత్తరాఖండ్, 999 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ బృందాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. -
Commonwealth Games 2022: పతకాల బోణీ కొట్టేనా?
కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ లాంఛనం ముగియడంతో... నేటి నుంచి క్రీడాకారులు ఇక పతకాల వేట మొదలుపెట్టనున్నారు. తొలి రోజు స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ట్రయాథ్లాన్ క్రీడాంశాల్లో మొత్తం 16 స్వర్ణాల కోసం పోటీలు జరుగుతాయి. ఈ నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత క్రీడాకారులు బరిలో ఉన్నారు. ట్రయాథ్లాన్ మినహాయిస్తే మిగతా మూడు ఈవెంట్స్‌లో భారత ఆటగాళ్లు క్వాలిఫయింగ్‌ను దాటి ముందుకెళితేనే పతకాల రేసులో ఉంటారు. ఇతర క్రీడాంశాల్లో తొలిరోజు పోటీపడనున్న భారత క్రీడాకారుల వివరాలు ఇలా ఉన్నాయి. పురుషుల బాక్సింగ్ (తొలి రౌండ్): శివ థాపా గీ సులేమాన్ (పాకిస్తాన్–63.5 కేజీలు; సాయంత్రం గం. 4:30 నుంచి) మహిళల టి20 క్రికెట్: భారత్ గీ ఆస్ట్రేలియా (మ. గం. 3:30 నుంచి). మహిళల హాకీ లీగ్ మ్యాచ్: భారత్ గీ ఘనా (సాయంత్రం గం. 6:30 నుంచి). బ్యాడ్మింటన్ (మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లీగ్ మ్యాచ్): భారత్ గీ పాకిస్తాన్ (మధ్యాహ్నం గం. 2 నుంచి) స్విమ్మింగ్ (హీట్స్; మధ్యాహ్నం గం. 3 నుంచి): సజన్ (50 మీటర్ల బటర్‌ఫ్లయ్), శ్రీహరి (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్), కుశాగ్ర (400 మీటర్ల ఫ్రీస్టయి ల్; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 11:35), ఆశిష్ (100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్; పారా స్విమ్మింగ్). స్క్వాష్ (తొలి రౌండ్): అనాహత్ సింగ్ గీ జాడా రోస్ (సెయింట్ విన్సెంట్; రాత్రి గం. 11 నుంచి); అభయ్ సింగ్ గీ జో చాప్మన్ (బ్రిటిష్ వర్జీన్ ఐలాండ్స్; రాత్రి గం. 11:45 నుంచి). టేబుల్ టెన్నిస్ (టీమ్ లీగ్ మ్యాచ్‌లు): మహిళల విభాగం: భారత్ గీ దక్షిణాఫ్రికా (మధ్యాహ్నం గం. 2 నుంచి); భారత్ గీ ఫిజీ (రాత్రి గం. 8:30 నుంచి); పురుషుల విభాగం: భారత్ గీ బార్బడోస్ (సాయంత్రం గం. 4:30 నుంచి); భారత్ గీ సింగపూర్ (రాత్రి గం. 11 నుంచి). ట్రాక్ సైక్లింగ్: విశ్వజీత్, నమన్, వెంకప్ప, అనంత, దినేశ్ (పురుషుల టీమ్ పర్సూట్ క్వాలిఫయింగ్: మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 8:30 నుంచి). రోజిత్, రొనాల్డో, డేవిడ్, ఎసో (పురుషుల టీమ్ స్ప్రింట్ క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 8:30 నుంచి). మయూరి, త్రియష, శశికళ (మహిళల టీమ్ స్ప్రింట్ క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 2:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్; గం. 8:30 నుంచి). ట్రయాథ్లాన్: ఆదర్శ్, విశ్వనాథ్ యాదవ్ (పురుషుల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్; మ.గం. 3:30 నుంచి); ప్రజ్ఞా మోహన్, సంజన జోషి (మహిళల వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్; మ.గం. 3: 30 నుంచి). ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: యోగేశ్వర్, సత్యజిత్, సైఫ్ (క్వాలిఫయింగ్; మధ్యాహ్నం గం. 1:30 నుంచి; అర్హత సాధిస్తే ఫైనల్: రాత్రి గం. 10 నుంచి). -
‘అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ సిమోన్ బైల్స్
విఖ్యాత టైమ్ మేగజైన్ 2021కి గానూ ‘అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’గా అమెరికన్ స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్‌ను ఎంపిక చేసింది. నాలుగుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన బైల్స్ టోక్యో ఒలింపిక్స్ సమయంలో తాను ‘ద ట్విస్టీస్’తో బాధపడుతున్నట్లు చెప్పి నాలుగు బంగారు పతక ఈవెంట్ల నుంచి తప్పుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అనంతరం అమెరికా జిమ్నాస్టిక్స్ టీమ్ మాజీ డాక్టర్ ల్యారీ నాసర్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సెనేట్ ముందు సాక్ష్యం చెప్పింది. -
సునిసా లీ ‘స్వర్ణ’ విన్యాసం
టోక్యో: సిమోన్ బైల్స్ లేకపోతేనేమి... సునిసా లీ ఉందిగా! అమెరికా జిమ్నాస్టిక్స్ అభిమానులు గురువారం సరిగ్గా ఇలాగే సంతోషించారు. మహిళల జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్‌లో యునైటెడ్ స్టేట్స్ (యూఎస్) తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. వరుసగా ఐదోసారి అమెరికా జిమ్నాస్ట్ ఈ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. 18 ఏళ్ల సునిసా లీ అద్భుత విన్యాసాలతో చెలరేగి స్వర్ణ పతకం గెలుచుకుంది. ఆమె మొత్తం 57.433 పాయింట్లు స్కోర్ చేసింది. బైల్స్ గైర్హాజరులో తొలి స్థానంలో నిలవాలని ఆశించిన బ్రెజిల్ జిమ్నాస్ట్ రెబెకా ఆండ్రాడేకు నిరాశ తప్పలేదు. 57.298 పాయింట్లు సాధించిన ఆమె రజత పతకంతో సరిపెట్టుకుంది. ఏంజెలినా మెల్నికోవా (ఆర్ఓసీ) 57.199 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. -
Simone Biles: మానసిక ఆరోగ్యం బాలేదు.. అందుకే తప్పుకుంటున్నా
టోక్యో: అమెరికా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ తన అభిమానులను షాక్‌కు గురి చేసింది. గురువారం జరగనున్న వ్యక్తిగత ఆల్‌రౌండ్ ఫైనల్స్ నుంచి బైల్స్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. తన మానసిక ఆరోగ్యం సరిగా లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జిమ్నాస్టిక్స్‌లో ఆరుసార్లు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన బైల్స్ ఈసారి కూడా హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగింది. కాగా సోమవారం ఆమె ఉమెన్స్ టీమ్ ఫైనల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా గురువారం జరగనున్న వ్యక్తిగత ఆల్‌రౌండ్ ఫైనల్ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ఆమె ప్రకటించింది. ఆమె ప్రకటనపై అమెరికా జిమ్నాస్ట్ స్పందించింది. '' బైల్స్ మానసిక ఆరోగ్యం సరిగా లేదని.. వైద్యుల సూచన మేరకే ఆమె పోటీ నుంచి తప్పుకుందని'' పేర్కొంది. అయితే ప్రతీరోజు బైల్స్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నామని తెలిపింది. వచ్చే వారం జరిగే వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్స్‌లో బైల్స్ పాల్గొంటుందో లేదో ఇప్పుడే చెప్పడం కష్టమని వెల్లడించింది. అయితే క్వాలిఫికేషన్స్ రౌండ్లో 9వ హైయ్యెస్ట్ స్కోర్ వచ్చిన జేడ్ క్యారీ బైల్స్ స్థానంలో ఆల్ రౌండ్ ఈవెంట్లో పాల్గొంటుందని అమెరికా జిమ్నాస్ట్ సంఘం తెలిపింది. కాగా బైల్స్ నిర్ణయం తాము గౌరవిస్తున్నామని మరో ప్రకటనలో పేర్కొంది. -
29 ఏళ్ల తర్వాత జిమ్నాస్టిక్స్‌లో స్వర్ణం సాధించారు
టోక్యో: ఒలింపిక్స్‌లో పోటీల నాలుగో రోజు రష్యన్ల పాలిట మరుపురాని రోజుగా మిగిలిపోయింది. విశ్వక్రీడల స్విమ్మింగ్‌లో ఎదురులేని అమెరికా స్విమ్మర్లకు చెక్ పెట్టిన రష్యన్లు... జిమ్నాస్టిక్స్‌లో అమెరికాకు షాక్ ఇచ్చారు. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో మంగళవారం మహిళల టీమ్ విభాగం పతకాల పోటీ జరిగింది. ఇందులో రష్యా మెరుపు విన్యాసాలతో బంగారు పతకం కొల్లగొట్టింది. 1992లో సోవి యట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్‌లో రష్యా పసిడి నెగ్గడం ఇదే తొలిసారి. అమెరికా గ్రేటెస్ట్ జిమ్నాస్ట్, ఒలింపిక్ చాంపియన్ సిమోన్ బైల్స్ పోటీల మధ్యలోనే తప్పుకోవడం జట్టుకు ప్రతికూలించింది. తద్వారా టీమ్ విభాగంలో వరుసగా మూడో ఒలింపిక్ స్వర్ణం సాధించాలనుకున్న అమెరికా ఆశలు ఆవిరయ్యాయి. బైల్స్ ఒక్క వాల్ట్‌లోనే పోటీ పడింది. తదుపరి అన్ఈవెన్ బార్స్, బ్యాలెన్స్ బీమ్, ఫ్లోర్ ఈవెంట్లలో పోటీ పడకుండా తప్పుకుంది. మరోవైపు అకయిమోవా, లిస్టునోవా, మెలి్నకొవా, వురజొవాతో కూడిన రష్యా బృందం 169 స్కోరుతో స్వర్ణం గెలిచింది. సిమోన్, చిలెస్, సునిసా లీ, గ్రేస్‌లతో కూడిన అమెరికా 166 స్కోరుతో రజతం దక్కించుకుంది. 164 పాయింట్లు సాధిం చిన బ్రిటన్ కాంస్యం నెగ్గింది. 1928 తర్వాత టీమ్ విభాగంలో బ్రిటన్‌కు పతకం రావడం విశేషం. -
ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్స్ కోచ్ ఆత్మహత్య!
వాషింగ్టన్: అమెరికాలో ఒలింపిక్ మాజీ జిమ్నాస్టిక్స్ కోచ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జాన్ గెడ్డార్ట్ గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. గతంలో ఒలింపిక్ జిమ్నాస్టిక్స్ కోచ్‌గా పని చేసిన గెడ్డార్ట్ మిచిగన్‌లో మహిళా జిమ్నాస్ట్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఇందులో లారీ నాసర్ డాక్టర్‌గా పని చేస్తున్నాడు. అనేక మంది మహిళలు జిమ్నాస్టిక్ శిక్షణ కోసం ఈ సెంటర్‌కు తరలి వచ్చేవారు. అయితే గెడ్డార్ట్, నాసర్ అక్కడి మహిళా జిమ్నాస్ట్‌లను లైంగికంగా వేధించడంతో పాటు, మానసికంగా హింసించేవారని నాసల్ అనే వ్యక్తి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. నాసల్ చేసిన ఆరోపణల మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. లైంగిక వేధింపులకు గురైన వారిలో ఎక్కువగా 13, 16 సంవత్సరాల లోపు వయసువారే అని మిచిగాన్ అటార్నీజనరల్ డెనా నిసెల్ తెలిపారు. గెడ్డార్ట్, నాసర్‌లు తన కూతురిని కూడా లైంగికంగా వేధించారని ఒక జిమ్నాస్టిక్ ట్రైనీ తల్లి ఆరోపించింది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన జాన్ గెడ్డార్ట్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా గెడ్డార్ట్ తనను లైంగికంగా వేధించాడని మాజీ జిమ్నాస్ట్ రాచెల్ డెస్హోలాండర్ 2000 సంవత్సరంలోనే సోషల్ మీడియా వేదికగా ఆరోపించించిన విషయం తెలిసిందే. చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కుప్పలుగా తల్లో పేలు! -
'నేను రిషబ్ పంత్.. కొత్త ఉత్సాహంతో ఉన్నా'
చెన్నై: టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ యమ ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. ఆసీస్‌తో సిరీస్ తర్వాత పంత్ తన జోష్‌ను మరింత పెంచాడు. టీమిండియా తొలి టెస్టులోఓటమి పాలైనా పంత్ దూకుడైన ఇన్నింగ్స్ ఆకట్టుకుంది. 97 పరుగులు చేసిన పంత్ మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ కావడం నిరాశపరిచింది. తాజాగా పంత్ జిమ్సెషన్కు సంబంధించిన వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో పంత్ తీవ్రమైన కసరత్తులు చేసినట్లుగా కనిపించింది. ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు మరింత ఉత్సాహంగా సన్నద్దమవుతున్నట్లు సూచిక పంపాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ట్విటర్లో షేర్ చేసింది. 'నేను మీ రిషబ్ పంత్.. కొత్త ఉత్సాహంతో సన్నద్ధమవుతున్నా' అంటూ క్యాప్షన జత చేశాడు. కాగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఓలి బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ .. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా 8ఓవర్లలో వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. రోహిత్ 23, పుజారా 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: పాక్ వికెట్ కీపర్ ఖాతాలో అరుదైన రికార్డులు -
ప్రపంచంలోనే బలమైన బాలిక
అమెరికాలోని ఒట్టోవా నగరానికి చెందిన రోరి వ్యాన్ ఉల్ఫిట్కు సరిగ్గా ఏడేళ్లు. ఏకంగా 80 కిలోల బరువును తేలిగ్గా లేపుతుంది. ఇటీవల జరిగిన అమెరికా జాతీయ చాంపియన్ షిప్ అండర్ 11, అండర్ 13 వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనడం ద్వారా ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడంతోపాటు 80 కిలోల బరువును ఎత్తే అతి పిన్న వయస్కురాలిగా ప్రపంచ పుటల్లోకి ఎక్కింది. ఆ పాప 61 కిలోల బరువుతో స్క్వాట్స్ (మోకాళ్ల మీద కూర్చొని లేవడం) చేయగలదు. రోరి వ్యాన్ తన ఐదవ ఏటనే జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడానికి క్లాస్‌లకు వెళ్లింది. ఓ పక్క జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటూనే మరో పక్క వెయిటిలిఫ్టింగ్ ప్రాక్టీస్ చేసింది. ఇప్పటికీ ఆ పాప వారానికి తొమ్మిది గంటలపాటు జిమ్నాస్టిక్స్, నాలుగు గంటలపాటు వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఈ రెండు క్రీడల ప్రాక్టీస్, పోటీల సందర్భంగా పాపకు ఎలాంటి గాయాలు కాకుండా కోచ్‌లతోపాటు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. -
ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌కు అరుణా రెడ్డి
హైదరాబాద్: వచ్చే నెలలో జర్మనీలో జరిగే ప్రపంచ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. అక్టోబర్ 4 నుంచి 13 వరకు స్టుట్‌గార్ట్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్లో భారత్ నుంచి ఆరుగురు ప్రాతినిధ్యం వహిస్తారు. మహిళల విభాగంలో తెలంగాణ జిమ్నాస్ట్ బుద్ధా అరుణా రెడ్డితోపాటు ప్రణతి నాయక్, ప్రణతి దాస్‌లకు చోటు లభించింది. పురుషుల విభాగంలో ఆశిష్ కుమార్, ఆదిత్య సింగ్ రాణా (రైల్వేస్), యోగేశ్వర్ సింగ్ (సర్వీసెస్) భారత జట్టులోకి ఎంపికయ్యారు. 2018లో అరుణా రెడ్డి మెల్బోర్న్లో జరిగిన ప్రపంచకప్‌లో కాంస్యం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందింది. -
జ్ఞాపకశక్తి కోల్పోయా
నిన్న, మొన్న ఏం జరిగిందో, ఏం చేశామో మనకు ఒక్కోసారి గుర్తుకు రాకపోతేనే కంగారు పడతాం. అలాంటిది ఓ ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తి కోల్పోతే? సినిమాల్లో ఇలా జరుగుతుంది కానీ నిజజీవితంలో జరుగుతుందా అనుకుంటున్నారా? హీరోయిన్ దిశా పాట్నీ లైఫ్‌లో ఇలా జరిగింది. తలకు తగిలిన గాయం వల్ల ఆమె ఓ ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తిని కోల్పోయారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ సినిమాలో వరుణ్ తేజ్‌తో జోడీ కట్టిన ఈ బ్యూటీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్‌పై దృష్టి సారించారామె. తాను చేస్తున్న సినిమా విశేషాలు, జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలు, ఫిట్నెస్ విషయాల గురించి ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. మూడేళ్లుగా దిశా జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా, ఓసారి జిమ్నాస్టిక్స్ చేస్తున్న సమయంలో ఆమె తల నేలకు తగలడంతో బలమైన గాయం తగిలింది. ఆ గాయం కారణంగా ఆమె ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తిని కోల్పోయారు. ఆ విషయం గురించి దిశా మాట్లాడుతూ – ‘‘ఆర్నెల్ల జీవితాన్ని నేను కోల్పోయాను. ఎందుకంటే అంతకుముందు ఏం జరిగిందో ఆ ఆరు నెలల్లో గుర్తుకు రాలేదు’’ అన్నారు. ట్రీట్మెంట్తో మళ్లీ మామూలు మనిషి అయ్యారామె. ‘‘జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ చేయాలంటే చాలా ధైర్యం, శక్తి, ఓపిక కావాలి. వర్కవుట్స్ చేసే టైమ్‌లో దెబ్బలు తగిలినప్పుడు మినహా మిగతా అన్నిరోజులూ చేయాల్సిందే. నేనివాళ ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడమే’’ అన్నారు దిశా. -
‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’
తలకు తగిలిన గాయం కారణంగా ఆరు నెలల పాటు తన జీవితంలో ఏం జరిగిందో తనకు గుర్తు లేదు అంటున్నారు బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని. సినిమాల తర్వాత దిశా పటాని ఎక్కువగా వర్కవుట్ వీడియోలు, ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాల గురించే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. షూటింగ్ నుంచి ఏ మాత్రం విరామం దొరికినా జిమ్‌లో ప్రత్యక్షం అయ్యే దిశా.. ప్రస్తుతం జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ విషయం గురించి దిశా మాట్లాడుతూ.. ‘20 ఏళ్ల లోపే జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం ప్రారంభిస్తే మేలు. గత మూడేళ్ల నుంచి నేను జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. దాంతో పాటు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాను. జిమ్నాస్టిక్స్ సాధన చేయాలంటే ఎంతో ధైర్యం, శక్తి కావాలి. సాధన సమయంలో దెబ్బలు తగులుతాయి. కాళ్లు, చేతులు కూడా విరుగుతాయి. కొన్ని నెలల క్రితం జిమ్నాస్టిక్స్ చేస్తుండగా.. కింద పడ్డాను. తలకు గాయమైంది. కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది. అయితే ఆ ఆరు నెలల్లో నా జీవితంలో ఏం జరిగిందో నాకు గుర్తు లేదు. ఓ రకంగా చెప్పాలంటే ఆరు నెలల జీవితాన్ని నేను కోల్పోయాను’ అని చెప్పుకొచ్చారు దిశా. కాగా సల్మాన్ ఖాన్ ‘భారత్’ సినిమా షూటింగ్లో దిశా జిమ్నాస్టిక్ విన్యాసాలు చేస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇక కెరీర్ విషయానికొస్తే దిశ ప్రస్తుతం.. ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి ‘మళంగ్’ చిత్రంలో నటిస్తున్నారు. -
జిమ్మాస్టిక్స్.. పాపం సమంత!
జిమ్నాస్టిక్స్ అంటేనే వ్యాయామ సంబధితమైన క్రీడ. ఈ ఆటకు బలం, సమతుల్యత, చురుకుదనం, ఓర్పుతో పాటు నియంత్రణ చాలా ముఖ్యం. కొంచెం పట్టుతప్పినా ప్రాణాల మీదకు వస్తుంది. అలాంటి జిమ్నాస్టిక్స్ను ప్రాణంగా భావించే ఓ క్రీడాకారిణి తన రెండు కాళ్లను విరగొట్టుకొని కేరిర్కే గుడ్‌బై చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. అమెరికాలోని ఆబర్న్ యూనివర్సిటీకి చెందిన సమంతా సెరియో అనే జిమ్నాస్ట్.. శుక్రవారం జరిగిన బేటన్ రోగ్ రీజనల్ పోటీల్లో పాల్గొంది. ఫస్ట్ పాస్ చేస్తున్న సందర్భంలో ఆమె ఎగిరి మ్యాట్‌పై ల్యాం డ్ అయ్యింది. కానీ, ఆ ల్యాండింగ్ అదుపుతప్పడంతో రెండు కాళ్లూ మోకాళ్ల వద్ద విరిగిపోయాయి. నొప్పి తో ఆమె విలవిల్లాడిపోయింది. కొద్ది సేపటిదాకా ఎవరికీ ఏం అర్థం కాలేదు. తీవ్రమైననొప్పి తో ఆమె ఏడ్చే వరకూ కాళ్లు విరిగిన సంగతి అక్కడి వారికి తెలియలేదు. డాక్టర్లు వచ్చి ఆమెను స్ట్రెచర్‌పై అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే ఆమె గుడ్డిగా హ్యాండ్స్ప్రింగ్ ఫ్రంట్ ఫ్లిప్ చేయడం వల్లే రెండు కాళ్లు విరగిపోయాయని జిమ్నాస్టిక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ తీవ్ర గాయంతో సమంత ఆరోజే తన జిమ్నాస్టిక్స్ కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. గత18 ఏళ్లుగా తన కెరీర్‌కు జిమ్నాస్టిక్స్ ఎంతగానో తోడ్పడిందని, అదే కష్టపడేతత్వాన్ని, గౌరవాన్ని, సమగ్రత, అంకితభావాన్ని నేర్పిందని చెబుతూ.. తనకు ఇష్టమైన ఆటకు దూరం అవుతున్నందుకు బాధగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం సమంత గాయానికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. View this post on Instagram Never let fear overpower you passion #SEC #ItJustMeansMore A post shared by Samantha Cerio (@sam_cerio) on Mar 23, 2019 at 8:30am PDT -
జిమ్మాస్టిక్స్.. పాపం సమంత!
-
దీపా విఫలం
బాకు (అజర్‌బైజా¯Œ ): ప్రపంచకప్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ టోర్నమెంట్లో భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు నిరాశ ఎదురైంది. ఇప్పటికే వాల్ట్ విభాగంలో ఫైనల్‌కు అర్హత పొందిన ఆమె బ్యాలెన్సింగ్ బీమ్ విభాగంలో మాత్రం తడబడింది. త్రిపురకు చెందిన 25 ఏళ్ల దీపా శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో 10.633 పాయింట్లు స్కోరు చేసి 25 మందిలో 20వ స్థానాన్ని సంపాదించింది. ఎమ్మా నెదోవ్ (ఆస్ట్రేలియా–13.466 పాయింట్లు) అందరికంటే ఎక్కువ స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టాప్–8లో నిలిచిన వారికి ఫైనల్ బెర్త్ లభిస్తుంది. నేడు జరిగే వాల్ట్ ఫైనల్లో దీపా పతకమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. -
ప్రపంచకప్ ఫైనల్ రౌండ్లోకి దీప
బాకు (అజర్బైజాన్): భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో ఫైనల్ రౌండ్‌కు అర్హత సంపాదించింది. వాల్ట్ ఈవెంట్లో గురువారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్ బరిలోకి దిగిన భారత జిమ్నాస్ట్ మూడో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత పొందింది. 25 ఏళ్ల దీప రెండు క్వాలిఫయింగ్ రౌండ్లలో వరుసగా 14.466, 14.133 పాయింట్లు సాధించింది. మొత్తంమీద 14.299 సగటును నమోదు చేసి ఫైనల్ చేరింది. అమెరికాకు చెందిన జేడ్ క్యారీ (14.70 పాయింట్లు), మెక్సికో మెరిక అలెక్సా మోరెనో (14.533 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాలు పొందారు. ఈ క్వాలిఫయింగ్‌లో టాప్–8 జిమ్నాస్ట్‌లు ఫైనల్ చేరతారు. రేపు (శనివారం) వాల్ట్ ఫైనల్ ఈవెంట్ జరగనుంది. రియో ఒలింపిక్స్‌లో భారత అమ్మాయి తృటిలో కాంస్యం చేజార్చుకొని నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. గత ఏడాది మోకాలి గాయం నుంచి కోలుకున్నాక బరిలోకి దిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ (జర్మనీ)లో దీప కాంస్యం గెలిచింది. గాయం వల్లే అంతకుముందు జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల ఫైనల్లో ఆమె పోటీపడలేకపోయింది. -
ఇండియన్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ షురూ
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు పలు అంతర్జాతీయ టోర్నమెంట్లకు ఆతిథ్యమిచ్చిన భాగ్యనగరం తొలిసారి ఇండియన్ రిథమిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌కు వేదికైంది. శనివారం ఈ టోర్నమెంట్ ప్రారంభం కావడంతో నగరంలోని ప్రఖ్యాత గచ్చిబౌలి స్టేడియం యువ జిమ్నాస్ట్‌లతో కళకళలాడింది. స్థానిక ఇండోర్ స్టేడియంలో జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రీడల కార్యదర్శి బి. వెంకటేశం, శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రాణిస్తోన్న 65 మంది జిమ్నాస్ట్‌లు ఈ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇందులో భారత్‌తో పాటు స్లోవేనియా, ఇటలీ, శ్రీలంక, థాయ్‌లాండ్, మలేసియా దేశాలకు చెందిన జిమ్నాస్ట్‌లు తలపడనున్నారు. ఒలింపిక్స్‌లో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన స్పెలా డ్రాగస్... ఈ టోర్నీలోనూ జడ్జీగా విధులు నిర్వహించనున్నారు. మొత్తం 10 మంది సభ్యులు గల జడ్జీల బృందం టోర్నీలో విజేతలను నిర్ణయించనుంది. అండర్–10, 12, 15, సీనియర్ బాలికల విభాగాల్లో బాల్, క్లబ్స్, హూప్, రోప్, రిబ్బన్ కేటగిరీలలో పోటీలు జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్‌కు చెందిన స్టార్ జిమ్నాస్ట్ జి. మేఘన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఘనంగా జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, భారత జిమ్నాస్టిక్స్ సమాఖ్య ఉపాధ్యక్షులు రియాజ్ భటి, అజర్బైజాన్ కోచ్ లాలా యుసిఫోవా తదితరులు పాల్గొన్నారు. -
ప్రభాస్ అంటే పిచ్చి: అరుణా రెడ్డి
‘నా లక్ష్యం 2020 ఒలింపిక్స్. ఇక నుంచి నా దృష్టంతా దానిపైనే ఉంటుంది. మరో ఆరేళ్లు పెళ్లి గురించి ఆలోచించను. ఖాళీ సమయాల్లో ఇంట్లో వంటలు, షాపింగ్ చేస్తుంటాను. కారులో తిరుగుతూ సిటీలో రౌండ్స్ వేయడమంటే మరీఇష్టమ’ని చెప్పింది జిమ్నాస్ట్ బుద్దా అరుణారెడ్డి. ఆమె చెప్పిన మరిన్ని విశేషాలు.. హిమాయత్‌నగర్ :‘పెళ్లి ప్రపోజల్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు నా ఆలోచనంతా ఒలింపిక్స్ మీదనే. నా వయసు కూడా చాలా చిన్నదే కాబట్టి ఇప్పుడే పెళ్లేంటని ఆలోచిస్తున్నాను. సో... సిక్స్ ఇయర్స్ వరకు నో మ్యారేజ్. ఆరేళ్ల తర్వాతే పెళ్లి. అది ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనేది అప్పుడే చెబుతాను. అప్పటి వరకు సీక్రెట్’ అంటూ చెప్పుకొచ్చింది జిమ్నాస్ట్ బుద్దా అరుణారెడ్డి. కాలికి గాయంతో మూడు నెలలు చికిత్స తీసుకున్న ఆమె పూర్తిగా కోలుకుంది. శుక్రవారం ఓ హోటల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అరుణారెడ్డి ‘సాక్షి’తో పంచుకున్నవిశేషాలివీ... నాకు టైమ్ దొరికితే ఫ్యామిలీతోనే ఉంటాను. మా అక్క, బావ, వారి పిల్లలతో ఎంజాయ్ చేస్తాను. పిల్లలు పూర్వీ, నిషాంత్‌లతో ఆడుకుంటాను. వాళ్లే నా ప్రపంచం. ప్రతిరోజు అమ్మ సుభద్ర, అక్క పావని నాకోసం వెరైటీ వంటలు చేస్తుంటారు. వారికి రెస్ట్ ఇచ్చేందుకు అప్పుడప్పుడు వంటలు ట్రై చేస్తుండేదాన్ని. అలా అలా వంటలు నేర్చుకున్నాను. ఎక్కువగా ‘బ్రౌనీస్’ చేస్తుంటాను. వీకెండ్స్‌లో చికెన్, మటన్, ఫిష్ కర్రీ వండి ఇంట్లో వాళ్లపైనే ట్రై చేస్తుంటాను (నవ్వుతూ). అవి ఎలా ఉంటాయో వాళ్లు చెప్పరు. కానీ సూపర్ ఉందని మాత్రం అంటారు. డ్రైవింగ్.. షాపింగ్ ఈ మధ్య డ్రైవింగ్‌పై ఇష్టం పెరిగింది. సిటీలోని ఇరుకు రోడ్లపై డ్రైవింగ్ చేయడం థ్రిల్‌గా అనిపిస్తుంది. మొదట్లో డ్రైవింగ్ చేయాలంటే భయం వేసేది. కానీ ఆటల నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడ అమ్మాయిలు డ్రైవింగ్ చేయడం చూశాను. నేనెందుకు నేర్చుకోకూడదని, ఇంటికి వచ్చాక నేర్చుకున్నాను. ఈ ప్రోగ్రామ్‌కి కూడా నేనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను (నవ్వూతూ). టైమ్ దొరికితే చాలు.. షాపింగ్‌కి ఎక్కువ ప్రాధాన్యమిస్తా. స్పోర్ట్స్ డ్రెస్సెస్ ధరించడంతో అవే అలవాటు అయ్యాయి. దీంతో ప్రతిసారి ప్రముఖ బ్రాండ్ల టీషర్టులను కొనుక్కుంటాను. నా దగ్గర దాదాపు 100కు పైగా టీషర్టులు ఉన్నాయి. చీరలు కట్టుకోవాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. కానీ ఇప్పటి వరకు ఒక్క చీర కూడా కొనుక్కోలేదు. అక్క చీరలన్నీ కట్టి పడేస్తూ విసుగు తెప్పిస్తుంటాను (నవ్వుతూ). పండగల సమయంలో చీరలు కట్టుకుంటాను. సిటీలో రౌండ్స్ స్కూల్ టైమ్ నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. మొదట్లో ఏదైనా సినిమా చూడాలనిపిస్తే నాన్నకి చెప్పేదాన్ని. నాన్న ప్రాక్టీస్ అయిపోయాక తీసుకెళ్లేవారు. నాన్న మరణించాక అక్క, బావ వాళ్లతో వెళ్తున్నాను. హీరో ప్రభాస్ అంటే పిచ్చి. అనుష్క అంటే కూడా అభిమానం. బాలీవుడ్లో సారా అలీఖాన్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. నైట్‌లో మన సిటీ చాలా అందంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లినప్పుడు మన సిటీని బాగా మిస్సవుతున్న ఫీలింగ్ వస్తుంటుంది. ఆ టైమ్‌లో అక్కకి, బావకి చెప్పి కారులో సిటీ మొత్తం రౌండ్స్ వేస్తాం. ట్యాంక్‌బండ్, బిర్లామందిర్, చార్మినార్, హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తదితర ప్రాంతాల్లో తిరుగుతుంటాం. ఫిట్నెస్... ఫిట్నెస్ కోసం చాలా కష్టపడతాను. ప్రారంభంలో చాలా ఇబ్బందిగా ఉండేది. తర్వాత అలవాటై పోయింది. ఉదయం 6 గంటలకు నిద్రలేస్తాను. 10 నిమిషాలు వ్యాయామం చేశాక... లెమన్ వాటర్ తీసుకొని ప్రాక్టీస్‌కి వెళ్తాను. మళ్లీ 9గంటలకు ఇంటికి వస్తాను. బ్రేక్‌ఫాస్ట్‌లో వెజ్ కర్రీ విత్ చపాతీ తింటాను. ఆ తర్వాత రెండు గంటలు నిద్రపోతాను. లంచ్‌లో లైట్‌గా రైస్, నాన్‌వెజ్‌తో రోటీ తీసుకుంటాను. మళ్లీ మూడు గంటలకు జిమ్‌కి వెళ్తాను. ఆ తర్వాత ప్రాక్టీస్. రాత్రి ఇంటికి వచ్చాక రోటీ తిని పడుకుంటాను. ప్రతిరోజు 6–7గంటలు ప్రాక్టీస్ చేస్తుంటాను. టార్గెట్ ఒలింపిక్స్.. ఇప్పుడే గాయం నుంచి కోలుకున్నాను. ఒలింపిక్స్‌కు ఎంపికయ్యే అవకాశం అక్టోబర్‌లో ఉంది. అక్టోబర్‌లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్ చివరి క్వాలిఫయర్‌లో హాజరవుతాను. అందులో కచ్చితంగా ఎంపికై 2020లో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొంటాను. పతకం సాధిస్తాననే నమ్మకం ఉంది. గాయం నాలో మరింత కసి, పట్టుదలను పెంచింది. ఇప్పుడు నా దృష్టంతా ఒలింపిక్స్ పైనే. -
లక్ష్యం 2020 ఒలింపిక్స్
హైదరాబాద్: ‘విశ్వ క్రీడలు ఒలింపిక్స్‌కి ఎంపికవ్వాలని, దేశానికి ప్రాతినిధ్యం వహించి, పతకం తేవాలనే ఆకాంక్ష, పట్టుదల, సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అదే పట్టుదలతో ఇంటి నుంచి వెళ్లాను. ఒలింపిక్స్ అర్హత కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాను. మొదటి క్వాలిఫికేషన్ గేమ్‌లో ‘ఫార్వర్డ్ 5/40’ చేస్తూ కిందకు దిగుతుండగా పడిపోయాను. ఎలా పడ్డానో.. ఏం జరిగిందో.. కూడా నాకు అర్థం కాలేదంటూ’ వివరించింది జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్ కాంస్య పతక విజేత బుద్దా అరుణా రెడ్డి. కాలికి బలమైన గాయం తగలడంతో క్వాలిఫయింగ్‌కు దూరమైయ్యింది. మూడు నెలల పాటు హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు అరుణా రెడ్డికి చికిత్స చేశారు. చికిత్స విజయం కావడంతో శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో ఆమె ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అరుణా రెడ్డి మాట్లాడుతూ... ‘కాలికి గాయమైన సమయంలో నేను జర్మనీలో ఉన్నాను. గాయం తగ్గదని, ఆటకు దూరం అవుతానని చాలా మంది నన్ను భయపెట్టారు. మా కోచ్‌ని ఒప్పించి కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నాను. ఇప్పుడు దెబ్బ తగిలిన ఫీలింగ్ లేకుండా నన్ను మామూలు మనిషిని చేశారు. గాయం నాలో చాలా కసిని పెంచింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు ఏడు క్వాలిఫయింగ్ టోర్నమెంట్లు ఉన్నాయి. మొదటి దాంట్లోనే నేను గాయంపాలై ఇంటి బాట పట్టాను. నేను ఇంకా పూర్తిగా కోలుకోవడానికి ఆరు నెలల సమయం పడుతుంది. చివరి క్వాలిఫయింగ్ అక్టోబర్‌లో ఉంది. దానిలో పాల్గొంటా, అర్హత సాధిస్తా. 2020లో జరిగే ఒలిపింక్స్‌కు ఎంపికై దేశానికి పతకం తీసుకొస్తా. ఇప్పుడు నా ఆలోచన అంతా ఒలింపిక్స్‌పైనే ఉంది’ అని అరుణ పేర్కొంది. కాంటినెంటల్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ ఫైజల్ సిద్దిఖీ మాట్లాడుతూ... అరుణ ‘ఏసీఎల్ రీకన్‌స్రక్షన్’ కోసం మా వద్దకు వచ్చింది. అర్థోపెడిక్స్ డాక్టర్ మోహన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, శ్రీధర్ల పర్యవేక్షణలో శస్త్రచికిత్స చేశాం. ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ విజయవంతం అయ్యిందని ఆనందం వ్యక్తం చేశారు. -
దీపా కర్మాకర్‌కు కాంస్యం
న్యూఢిల్లీ: ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ సత్తా చాటింది. జర్మనీలోని కోట్బస్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో కాంస్య పతకాన్ని గెలుపొందింది. శనివారం జరిగిన వాల్ట్ ఈవెంట్ ఫైనల్లో 25 ఏళ్ల దీప 14.316 పాయింట్లు స్కోర్ చేసి మూడోస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో రెబెకా ఆండ్రాడే (బ్రెజిల్) స్వర్ణం గెలుచుకోగా, జేడ్ కారీ (యూఎస్)కు రజతం లభించింది. శుక్రవారం జరిగిన వాల్ట్ క్వాలిఫయింగ్ రౌండ్లో 14.100 పాయింట్లు సాధించి ఆరో స్థానంతో ఫైనల్‌కు చేరిన ఈ త్రిపుర అమ్మాయి తుదిపోరులో మెరుగ్గా రాణించి పతకాన్ని ఒడిసి పట్టింది. మరోవైపు వాల్ట్ ఫైనల్స్‌కు ముందు జరిగిన బ్యాలన్స్ బీమ్ ఈవెంట్ క్వాలిఫయర్స్‌లో దీపాకు నిరాశ ఎదురైంది. 11.066 (4.8+ 6.266) పాయింట్లు స్కోర్ చేసిన దీప 23వ స్థానంలో నిలిచింది. -
అరుణా రెడ్డికి ఏడో స్థానం
జకార్తా: ఆసియా క్రీడల జిమ్నాస్టిక్స్‌లో తెలుగుతేజం బుద్దా అరుణారెడ్డి (12.775 పాయింట్లు) విఫలమైంది. మహిళల వాల్ట్ ఫైనల్ ఈవెంట్లో బరిలోకి దిగిన ఆమె ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. మరో భారత జిమ్నాస్ట్ ప్రణతి నాయక్‌కు (12.650 పాయింట్లు) చివరిదైన ఎనిమిదో స్థానం దక్కింది. ఫైనల్లో మహిళల కబడ్డీ జట్టు... భారత పురుషుల కబడ్డీ జట్టు కాంస్యంతో సరిపెట్టుకోగా... భారత మహిళల కబడ్డీ జట్టు వరుసగా మూడో స్వర్ణంపై గురి పెట్టింది. సెమీఫైనల్లో భారత్ 27–14తో చైనీస్ తైపీని ఓడించింది. మరో సెమీఫైనల్లో ఇరాన్ 23–16తో థాయ్‌లాండ్‌పై గెలిచింది. శుక్రవారం జరిగే ఫైనల్లో ఇరాన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీని 2010లో ప్రవేశ పెట్టారు. గురి తప్పిన దీపిక భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి మళ్లీ నిరాశపరిచింది. ఈ ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఆర్చర్ మూడో రౌండ్లో 3–7తో చియెన్ యింగ్ లీ (చైనీస్ తైపీ) చేతిలో ఓడింది. పురుషుల రికర్వ్‌లో అతాను దాస్ క్వార్టర్స్‌లో 3–7తో రియు ఎగా అగత సాల్సా బిల్లా (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశాడు. -
ఏషియాడ్‌లో నేటి భారతీయం
జిమ్నాస్టిక్స్: మహిళల వాల్ట్ ఫైనల్: బుద్దా అరుణా రెడ్డి, ప్రణతి నాయక్ (మ.గం.3 నుంచి). బ్యాడ్మింటన్: మహిళల సింగిల్స్: సింధు(vs)వు తి ట్రాంగ్ (వియత్నాం); సైనా (vs) సొరయ (ఇరాన్). మహిళల డబుల్స్: సిక్కిరెడ్డి, అశ్విని (vs) ఎన్గా తింగ్ యుంగ్, వింగ్ యుంగ్ (హాంకాంగ్). మిక్స్డ్ డబుల్స్: సిక్కి రెడ్డి, ప్రణవ్ (vs)లూ యింగ్ గో, పెంగ్ సూన్ చాన్ (మలేసియా); అశ్విని, సాత్విక్(vs)సప్సిరి, డెచాపొల్ (థాయ్‌లాండ్) (ఉ.గం.10.30 నుంచి). షూటింగ్ : మహిళల డబుల్ ట్రాప్ ఫైనల్స్: వర్ష వర్మన్, శ్రేయసి సింగ్ (ఉ.గం.9.15 నుంచి). వెయిట్‌లిఫ్టింగ్: సతీశ్ శివలింగం (77 కేజీలు– ఉ.గం. 9.30 నుంచి). టెన్నిస్: మహిళల సింగిల్స్ సెమీస్: అంకిత(vs)షువాయి జంగ్ (చైనా) (ఉ. 8.30 గంటల నుంచి). ►సోనీ టెన్–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం -
ఏషియాడ్‌లో నేటి భారతీయం
జిమ్నాస్టిక్స్: మహిళల టీమ్ ఫైనల్ (సా.గం.5 నుంచి) పురుషుల హాకీ: భారత్(vs)హాంకాంగ్ (మ.గం. 12.30 నుంచి) షూటింగ్: మహిళలు: అంజుమ్, గాయత్రి (50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫయింగ్; ఉ.గం. 8 నుంచి, ఫైనల్స్ ఉ.గం. 11.30 నుంచి) మను భాకర్, రాహీ సర్నోబాత్ (25 మీ. పిస్టల్ క్వాలిఫయింగ్; ఉ.గం. 8 నుంచి, ఫైనల్స్ ఉ.గం. 11.30 నుంచి) పురుషుల గ్రీకో రోమన్ రెజ్లింగ్: గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), హర్‌ప్రీత్ సింగ్ (87 కేజీలు), హర్దీప్ (97 కేజీలు), నవీన్ (130 కేజీలు) (మధ్యాహ్నం గం. 12 నుంచి). సోనీ టెన్–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం -
దీపా కర్మాకర్‌కు గోల్డ్ మెడల్..
న్యూఢిల్లీ : జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ వరల్డ్ చాలెంజ్ కప్‌లో బంగారు పతకం సాధించారు. ఆదివారం టర్కీలోని మెర్సిన్ వేదికగా జరిగిన ఫిజ్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ చాలెంజ్ కప్‌లో ఆమె బంగారు పతకం గెలుచుకున్నారు. రియో ఒలింపిక్స్‌లో ప్రొడునోవా వాల్ట్ విభాగంలో దీప నాలుగో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా రెండు సంవత్సరాలు జిమ్నాస్టిక్స్‌కు దూరంగా ఉన్న ఆమె పట్టుదలతో ఈ విజయం సాధించారు. భారత్ గర్విస్తోంది : ప్రధాని నరేంద్ర మోదీ దీపా కర్మాకర్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. ఫిజ్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ చాలెంజ్ కప్‌లో బంగారు పతకం సాధించటం పట్ల భారత దేశం గర్విస్తోందని అన్నారు. ఈ విజయం దీపా పట్టుదలకు, ఓటమి ఒప్పుకోని ధైర్యానికి చిహ్నంగా ఆయన అభివర్ణించారు. -
ప్రియాంకకు ప్రతిభ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడల్లో రాణిస్తున్న వర్ధమాన క్రీడాకారులకు శనివారం అవార్డులను అందజేశారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిమ్నాస్టిక్స్‌లో ప్రతిభ కనబరుస్తోన్న కె. ప్రియాంక చౌదరి ప్రతిభా పురస్కారాన్ని గెలుచుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. రఘునందన్ రావు, రాచకొండ కమిషనర్ మహేశ్ భాగవత్ చేతుల మీదుగా ఆమె ప్రతిభా పురస్కారాన్ని అందుకుంది. ఉత్తమ స్పో ర్ట్స్ పర్సన్ అవార్డుతోపాటు ఆమెకు రూ. 51,116 నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ తనను ప్రోత్స హించిన కోచ్ పులి రవీందర్ కుమార్ (సాయ్), రంగారెడ్డి జిల్లా జిమ్నాస్టిక్స్ సంఘం డీవైఎస్ఓ వెంకటేశ్వర రావుకు కృతజ్ఞతలు తెలిపింది. -
ప్రముఖ జిమ్నాస్టిక్స్ కోచ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ‘శాట్స్’ జిమ్నాస్టిక్స్ కోచ్ ఎన్. బ్రిజ్ కిశోర్ కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1993లో శాట్స్‌లో కోచ్‌గా చేరిన బ్రిజ్‌కిశోర్ ఎంతో మంది జాతీయ స్థాయి జిమ్నాస్ట్‌లను తీర్చిదిద్దారు. ఇటీవల జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన బుద్ధా అరుణా రెడ్డి కూడా ఆయన శిష్యురాలే. ఆయన మృతి పట్ల ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సంతాపసభను ఏర్పాటు చేసి రెండు నిమిషాల మౌనం పాటించింది. అధ్యక్షుడు కె. రంగారావు, కార్యదర్శి ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్ ఆయన సేవలను కొనియాడారు. బ్యాడ్మింటన్ కార్యదర్శి కె. ఫణిరావు, జిమ్నాస్టిక్స్ కార్యదర్శి కె. మహేశ్వర్, హాకీ కార్యదర్శి భీమ్‌సింగ్ సంతాపసభలో పాల్గొన్నారు. కోచ్ బ్రిజ్ కిషోర్‌కు శాట్స్ చేయూత -
జిమ్నాస్టిక్స్ కోచ్ రవీందర్‌కు సన్మానం
హైదరాబాద్: ‘శాట్స్’ జిమ్నాస్టిక్స్ కోచ్ ఆర్. రవీందర్ ఆదివారం రిటైరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కార్యదర్శి ఎస్ఆర్ ప్రేమ్‌రాజ్, రంగారెడ్డి డీవైఎస్ఓ వెంకటేశ్వర్ రావు, తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం కార్యదర్శి మహేశ్వర్ పాల్గొన్నారు -
ప్రియాంకకు ఐదు పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రిథమిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి కె. ప్రియాంక సాగర్ మెరిసింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో ఐదు పతకాలను సాధించింది. సీనియర్ విభాగంలో జరిగిన హూప్, బాల్, క్లబ్, రిబ్బన్, ఆల్‌రౌండ్ ఈవెంట్లలో మూడో స్థానంలో నిలిచిన ప్రియాంక ఐదు కాంస్యాలను తన ఖాతాలో వేసుకుంది. టీమ్ విభాగంలో మహారాష్ట్ర జట్టు విజేతగా నిలవగా... ఛత్తీస్‌గఢ్, హరియాణా జట్లు వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. వ్యక్తిగత ఆల్‌రౌండ్ విభాగంలో అదితి దండేకర్ (మహారాష్ట్ర), దిశా (మహారాష్ట్ర), కె. ప్రియాంక (తెలంగాణ)... హూప్ ఈవెంట్లో అదితి దండేకర్, కిమాయ కదమ్ (మహారాష్ట్ర), కె. ప్రియాంక... బాల్ ఈవెంట్లో అదితి , దిశా, ప్రియాంక... క్లబ్ ఈవెంట్లో కిమాయ కదమ్, దిశా, ప్రియాంక... రిబ్బన్ విభాగంలో అదితి, దిశా, ప్రియాంక వరుసగా తొలి మూడు స్థానాలను దక్కించుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు కె. రంగారావు, కార్యదర్శి ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ రిథమిక్ జిమ్నాస్టిక్స్ టోర్నీ షురూ
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో జిమ్నాస్టిక్స్ సందడి మొదలైంది. సరూర్‌నగర్ స్టేడియంలో జాతీయ రిథమిక్ జిమ్నాస్టిక్స్ టోర్నీ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తీగల కష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో జరిగే ఈ టోర్నమెంట్లో దేశంలోని 9 రాష్ట్రాలకు చెందిన 100 మంది జిమ్నాస్ట్‌లు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు హూప్, బాల్, క్లబ్స్, రిబ్బన్ ఈవెంట్లలో వ్యక్తిగత, ఆల్‌రౌండ్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జీఎఫ్ఐ ఉపాధ్యక్షులు కౌశిక్ బిడివాలా, టోర్నమెంట్ డైరెక్టర్ శశి, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఓఏటీ) అధ్యక్షుడు ప్రొఫెసర్ కె. రంగారావు, సలహాదారు సత్యనారాయణ, టీఆర్ఎస్ నేతలు అరవింద్ రెడ్డి, దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ట్రాంపొలీనింగ్
చుట్టూ స్టీల్ ఫ్రేమ్, మధ్యలో ఫ్యాబ్రిక్ సెటప్ బిగించబడి ఉండే ఆట పరికరాన్ని ట్రాంపొలీన్ అంటారు. ట్రాంపొలీన్లో ఫ్యాబ్రిక్‌కు సాగే గుణం ఉండదు. దానికింద స్ప్రింగుల అమరికే ట్రాంపొలీన్కు ఆ గుణాన్ని తెచ్చిపెడుతుంది. ట్రాంపొలీన్ మీదకు ఎక్కి, ఎగురుతూ, గంతులేస్తూ ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. ఈ ఆటను ట్రాంపొలీనింగ్ అని, ట్రాంపొలీన్ జంప్ అని పిలుస్తారు. 1935లో లారీ గ్రిజ్వోల్డ్, జార్జ్ నిస్సెన్ ట్రాంపొలీన్ను కనిపెట్టారు. ఈరోజుకి ట్రాంపొలిన్ జంప్ దాదాపు అన్ని దేశాలకూ పరిచయమైంది. ట్రాంపొలీన్ అనే పేరు కూడా నిస్సెన్ పెట్టినదే. స్పానిష్ పదం నుంచి ఆయన ఈ పేరును కనిపెట్టాడు. మొదట్లో సరదాగా పిల్లలు ఆడుకునే ఈ ఆట కొన్ని దశాబ్దాల కాలంలో సీరియస్ గేమ్‌గా అవతరించింది. జిమ్నాస్టిక్స్ చేసే అథ్లెట్స్ ట్రాంపొలీనింగ్లో ప్రయోగాలు చేస్తూ ఆడతారు. 2000వ సంవత్సరంలో ఇది ఒలింపిక్స్‌లోకి కూడా ఎక్కింది. ఇప్పుడు ట్రాంపొలీనింగ్ ఒలింపిక్ గేమ్. డైవింగ్, స్కేటింగ్ చేసేవాళ్లు ట్రాంపొలీనింగ్ను తమ ఫిజికల్ ఫిట్నెస్ కోసం బాగా ఆడుతూంటారు. అంతరిక్ష్యంలో వ్యోమగాములు అక్కడి పరిస్థితులను అలవాటు చేసుకోవడానికి, భూమ్మీద ఉన్నప్పటి నుంచే ట్రాంపొలీనింగ్లో శిక్షణ పొందుతుంటారు. -
విశ్వవేదిక పైన మెరిసిన తెలుగు తేజం
-
అరుణకు రైల్వే ఉద్యోగం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ జిమ్నాస్ట్ బుద్దా అరుణరెడ్డికి నజరానాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెకు రూ. 2 కోట్ల నగదు ప్రోత్సాహకం ప్రకటించగా... తాజాగా దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) గ్రూప్ ‘సి’ ఉద్యోగాన్ని కేటాయించింది. అంతర్జాతీయ వేదికపై అదరగొట్టిన అరుణకు ఎస్సీఆర్లో ఉద్యోగం కేటాయించడం సంతోషంగా ఉందని జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. -
ఒలింపిక్స్ పతకమే జీవిత లక్ష్యం!
పుష్కర కాలానికి పైగా ఆ అమ్మాయి తాను ఎంచుకున్న ఆటలో తీవ్రంగా శ్రమించింది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తన పోరాటాన్ని ఆపలేదు. తనను నడిపించిన నాన్న దూరమైనా ఆయన కోరుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మరింత కష్టపడింది. ఫ్లోర్‌పై, అన్ ఈవెన్ బార్స్‌పై కెరీర్ ‘బ్యాలెన్స్’ చేసుకుంటూ వెళ్లింది. కామన్వెల్త్ నుంచి ఆసియా క్రీడల వరకు, ఆసియా చాంపియన్‌షిప్ నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్ వరకు పాల్గొనడమే తప్ప పతకానికి చేరువ కాలేకపోయిన సమయంలోనూ పట్టు వదల్లేదు. ఎట్టకేలకు ఇప్పుడు ప్రపంచ కప్‌లో పతకంతో మెరిసిన బుద్దా అరుణ రెడ్డి విజయగాథ ఇది. సాక్షి సిటీ బ్యూరో, హైదరాబాద్ :ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న క్రీడ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన అమ్మాయి 22 ఏళ్ల బుద్దా అరుణ. ఇటీవల జిమ్నాస్టిక్స్ ప్రపంచ కప్‌లో కాంస్య పతకం సాధించిన ఆమె ఈ ఘనత సాధిం చిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందింది. ఇంతటితో ఆగిపోకుండా భవిష్యత్తులో మరిన్ని విజ యాలు సాధిస్తానని ఆమె ఆత్మవిశ్వాసంతో చెబుతోం ది. అయితే తన కెరీర్ తుది లక్ష్యం మాత్రం ఒలింపిక్ పతకం మాత్రమే అని చెప్పింది. శుక్రవారం స్వస్థలం హైదరాబాద్‌కు చేరుకున్న 22 ఏళ్ల అరుణ తాజా విజయం, తన కెరీర్‌కు సంబంధించిన విశేషాల గురించి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... కెరీర్ ఆరంభంపై... చార్టెడ్ అకౌంటెంట్ అయిన నాన్న నారాయణ రెడ్డికి ఆటలంటే కూడా ఆసక్తి. అయితే ముందుగా అమ్మాయికి ఆత్మరక్షణ కోసమంటూ నన్ను కరాటేలో చేర్పించారు. అయితే ఆ తర్వాత కరాటే మాస్టర్ బాలసుబ్రమణ్యం సూచనపై నేను జిమ్నాస్టిక్స్ వైపు మళ్లాను. ఎల్బీ స్టేడియంలో కోచ్‌లు స్వర్ణలత, రవీందర్, ఇప్పుడు బ్రిజ్ కిశోర్ మార్గ నిర్దేశనంలో నేను చాలా నేర్చుకున్నాను. ప్రాథమికాంశాల నుంచి వివిధ ఈవెంట్లలో పోటీ పడే వరకు అన్ని రకాలుగా శ్రమించాను. నేను మంచి ఫలితాలు సాధిస్తూ పోయాను. సబ్ జూనియర్ స్థాయి మొదలు ఇంటర్ యూనివర్సిటీ, సీనియర్ నేషనల్స్ వరకు వరుసగా పతకాలు సాధించాను. అయితే అంతర్జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ ఫలితాలు రాకపోవడంతో నాకు పెద్దగా గుర్తింపు లభించలేదు. నాన్న మరణం తర్వాత... నేను ఇంకా కెరీర్లో నిలదొక్కుకోక ముందే నాన్న 2010లో అకస్మాత్తుగా చనిపోవడం నన్ను కలచివేసింది. ఇక ఆటను కొనసాగించడం కష్టమనిపించింది. నాన్న ఉన్నంత వరకు నేను చాలా ధైర్యంగా ఉన్నాను. నాన్న అండ, ప్రేమ, ఆప్యాయతతో ధైర్యంగా అన్ని ఆటలు ఆడాను. ఆ క్షణాన నేను ఓ బలమైన శక్తిని కోల్పోయాను అనిపించింది. అప్పటి నుంచి నాకు కష్టాలు చాలా ఎదురయ్యాయి. నాన్న ఉన్నప్పుడు ప్రాక్టీస్‌కి, గేమ్స్‌కి, శిక్షణ శిబిరాలకు తనే స్వయంగా తీసుకెళ్లేవారు. నాన్న చనిపోయాక నేను ఒక్కదానినే ట్రావెల్ చేస్తుంటే చాలా కష్టంగా ఉండేది. నా శిక్షణ, సాధన విషయాల్లో ఎన్ని డబ్బులు ఖర్చు అయ్యాయనే విషయాలు కూడా నాకు తెలీదు, నాన్న ఎప్పుడూ చెప్పలేదు. నాన్న మరణానంతరం ఆర్థిక సమస్యలు తలెత్తడంతో మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను. నేను విజయం సాధించిన ప్రతిసారీ నాన్న ఉండి ఉంటే ఎంత సంతోషించేవారో అని మా అమ్మ సుభద్ర గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నాన్న మరణించాక అక్క పావని, బావ జనార్ధన్ రెడ్డి నిరంతరం ప్రోత్సహించి నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. కుటుంబసభ్యుల అండతో ఎన్ని సమస్యలు వచ్చినా ఆట నుంచి వెనక్కి వెళ్లాలనే ఆలోచన మాత్రం ఎప్పుడూ రాలేదు. సీనియర్ స్థాయిలో ఫలితాలపై... జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ అనేక పతకాలు గెలుచుకున్నాను. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కూడా నాకు అండగా నిలిచింది. దాంతో అంతర్జాతీయ టోర్నీలలో వరుసగా పాల్గొన్నాను. ముఖ్యంగా 2014లో జరిగిన కామన్వెల్త్, ఆసియా క్రీడలు, 2013లో ప్రపంచ చాంపియన్‌షిప్, గత ఏడాది ఆసియా చాంపియన్‌షిప్ వాటిలో ముఖ్యమైనవి. దురదృష్టవశాత్తూ వీటిలో పతకానికి చేరువగా రాలేకపోయాను. అయితే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలలో పాల్గొనడం వల్ల నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. నా స్థాయి గురించి తెలుసుకొని తప్పులు దిద్దుకునేందుకు ఎంతో ఉపయోగపడింది. ప్రపంచ కప్ పతకంపై... నేను ఈ టోర్నీ కోసం ప్రత్యేకంగా తాష్కెంట్లో సిద్ధమయ్యాను. ఈ శిక్షణ కోసం గ్రీన్కో గ్రూప్‌తో పాటు వ్యాపారవేత్త, మాజీ క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ కూడా ఆర్థికంగా చాలా సహాయ పడ్డారు. టోర్నీలో నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. వాల్ట్ ఈవెంట్లో నా సహజ శైలిలోనే ఆడాను. కొన్ని విన్యాసాలు కష్టంగా ఉన్నా... సుదీర్ఘ కాలంగా అదే సాధన కాబట్టి కొత్తగా అనిపించలేదు. పతకం గెలుచుకున్న క్షణాన ఎంతో గర్వ పడ్డాను. చాలా ఉద్వేగానికి లోనయ్యాను. తర్వాతి రోజు ఫ్లోర్ విభాగంలో కూడా బాగానే రాణించినా చివరకు పతకం మాత్రం దక్కలేదు. జిమ్నాస్టిక్స్‌కు ఉత్తర భారతంలో చాలా ప్రాధాన్యత ఉంది. మన దక్షిణాదిలో దీనికి పెద్దగా గుర్తింపు లేదనే చెప్పాలి. రియో ఒలింపిక్స్‌లో దీపా కర్మాకర్ తన ప్రతిభను కనబరచడంతో అందరి దృష్టి ఆమెపై పడింది. నేను కూడా అలాంటి గుర్తింపునే కోరుకున్నాను. ఈ పతకంతో నేను ఏంటో అందరికీ తెలిసింది. మున్ముం దు కూడా ఇలాంటి ఫలితాలు సాధించా లని కోరుకుంటున్నా. ప్రభుత్వం నుంచి జిమ్నాస్టిక్స్‌కు ప్రోత్సాహం ఉంటే పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు రావడంతో పాటు మంచి ఫలితాలు సాధించవచ్చు. తర్వాతి లక్ష్యాలపై... వచ్చే నెలలో కామన్వెల్త్ క్రీడలు, ఆ తర్వాత ఇదే ఏడాది ఆసియా క్రీడలు కూడా ఉన్నాయి. వీటిలో పతకాలు గెలుచుకోవడంపైనే ప్రస్తుతం నా దృష్టి. ఆదివారమే తిరిగి తాష్కెంట్ వెళ్లిపోతున్నాను. మరోసారి మంచి ఫలితం రాబడతాననే నమ్మకముంది. అయితే ఏ క్రీడాకారిణికైనా అంతిమ లక్ష్యం ఒలింపిక్స్ పతకం సాధించడమే. నేను కూడా దాని గురించే కలలుగంటున్నాను. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం నెగ్గాలనే లక్ష్యంతో ఉన్నాను. అందుకోసం ఎంతయినా కష్టపడతా. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పథకం ‘టాప్’లో ఉండటంతో ఆర్థికపరంగా కూడా పరిస్థితి కొంత మెరుగైంది. -
జిమ్నాస్ట్ అరుణకు ఘనస్వాగతం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ కప్ జిమ్నాస్టిక్స్‌లో పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి బుద్దా అరుణ రెడ్డికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. ప్రపంచకప్‌లో పతకాన్ని సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందిన అరుణను రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి ఘనంగా సన్మానించారు. అనంతరం శంషాబాద్ నుంచి హైదర్ గూడ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ ప్రపంచ్ కప్ జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కుటుంబ సభ్యుల సహకారం, ప్రభుత్వ సహాకారంతో ఈ మెడల్ సాధించినట్టు ఆమె పేర్కొన్నారు. జిమ్నాస్టిక్స్ లో బంగారు పతకం సాధించడమే తన లక్ష్యమని అరుణ రెడ్డి తెలిపారు. -
జిమ్నాస్ట్ అరుణకు సన్మానం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి బుద్దా అరుణ రెడ్డిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఓఏటీ) అధ్యక్షుడు ప్రొఫెసర్ కె. రంగారావు, తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం కార్యదర్శి కె.మహేశ్వర్ ఆమెను అభినందించారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఆమెను కలిసి సత్కరిం చారు. ప్రపంచకప్‌లో పతకాన్ని సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందిన అరుణను చూసి దేశం ఎంతో గర్విస్తోందని రంగారావు ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. -
కోచ్ బ్రిజ్ కిషోర్‌కు శాట్స్ చేయూత
సాక్షి, హైదరాబాద్: శాట్స్ జిమ్నాస్టిక్స్ కోచ్ బ్రిజ్ కిషోర్‌ను సోమవారం శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి పరామర్శించారు. గత పది రోజులుగా అనారోగ్యంతో బ్రిజ్ కిషోర్ పంజగుట్టలోని ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన చికిత్స కోసం రూ. 2 లక్షల చెక్‌ను అందజేశారు. ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన అరుణ రెడ్డికి ఆయనే కోచ్‌గా ఉన్నారు. -
అరుణ చరిత్ర
విశ్వ వేదికపై మరో తెలుగు తేజం మెరిసింది. ప్రతిష్టాత్మక ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి బుద్దా అరుణ రెడ్డి కొత్త చరిత్ర లిఖించింది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో అరుణ మహిళల వాల్ట్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించింది. తద్వారా ఈ టోర్నమెంట్ చరిత్రలో పతకం నెగ్గిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా ఈ హైదరాబాద్ అమ్మాయి రికార్డు నెలకొల్పింది. ఆమె ఖాతాలో మరో పతకం చేరే అవకాశం ఉంది. నేడు జరిగే ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఫైనల్లో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. సాక్షి, హైదరాబాద్: అందరి అంచనాలను తారుమారు చేస్తూ తెలుగు అమ్మాయి బుద్దా అరుణ రెడ్డి ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో పతకం సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 22 ఏళ్ల అరుణ వాల్ట్ ఈవెంట్లో మూడో స్థానాన్ని సంపాదించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్లో అరుణ రెడ్డి 13.649 పాయింట్లు స్కోరు చేసింది. జాసా కిస్లెప్ (స్లొవేనియా–13.800 పాయింట్లు) స్వర్ణం దక్కించుకోగా... ఎమిలీ (ఆస్ట్రేలియా –13.699 పాయింట్లు) రజతం గెల్చుకుంది. భారత్‌కే చెందిన ప్రణతి నాయక్ (13.416 పాయింట్లు) ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ తర్వాత అంతే ప్రాముఖ్యత కలిగిన టోర్నమెంట్‌గా ప్రపంచకప్‌కు పేరుంది. అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ సమాఖ్య ఆధ్వర్యంలో 2010లో ప్రపంచకప్ సిరీస్ మొదలైంది. రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఆసియా చాంపియన్‌షిప్, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాలు గెలిచినా... ప్రపంచకప్‌లో మాత్రం పతకాలను సాధించలేకపోయింది. నిరీక్షణ ముగిసింది... పద్నాలుగేళ్లుగా జిమ్నాస్టిక్స్‌లో కొనసాగుతున్న అరుణ రెడ్డి జాతీయస్థాయిలో ఎన్నో పతకాలు సాధిం చింది. అయితే అంతర్జాతీయస్థాయిలో మాత్రం పతకం నెగ్గడం ఇదే తొలిసారి. 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2014 కామన్వెల్త్ క్రీడలు, 2014 ఆసియా క్రీడలు, 2017 ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించినా క్వాలిఫయింగ్ దశను దాటలేకపోయింది. ఈసారి మాత్రం రెండు ఈవెంట్స్‌లో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. కరాటే నుంచి జిమ్నాస్టిక్స్ వైపు... ఐదేళ్ల వయసులో కరాటేలో అడుగు పెట్టిన అరుణ మూడేళ్లపాటు అదే క్రీడలో కొనసాగింది. ఈ దశలో అరుణ శరీరాకృతి జిమ్నాస్టిక్స్‌కు అనువుగా ఉందని ఆమె కరాటే మాస్టర్ సలహా ఇచ్చారు. దాంతో ఆమె కరాటేను వదిలి జిమ్నాస్టిక్స్ వైపు మళ్లింది. హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడి యంలో కోచ్ బ్రిజ్ కిశోర్ వద్ద పదేళ్లుగా శిక్షణ పొందుతోన్న అరుణ ఒక్కో అడుగు ముందుకేస్తూ నేడు అంతర్జాతీయ జిమ్నాస్ట్‌గా ఎదిగింది. నాన్నకు ప్రేమతో... జిమ్నాస్ట్‌గా కెరీర్లో కుదురుకుంటున్న వేళ 2012లో అరుణ రెడ్డి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. తన కూతురును ఏనాటికైనా చాంపియన్‌గా చూడాలనుకున్న ఆమె తండ్రి నారాయణ రెడ్డి హఠాన్మరణం చెందారు. ఈ ఘటనతో కలత చెందిన అరుణ ఒకదశలో ఆటకు వీడ్కోలు చెప్పాలని భావించింది. అయితే తన కెరీర్‌కు ఎలాంటి ఆటంకం ఉండకూడదనే ఉద్దేశంతో... సొంత ఇంటిని విక్రయించిన నాన్న త్యాగం వృథా కాకూడదని అరుణ భావించింది. అదే ఏడాది ఉదయ్‌పూర్‌లో జరిగిన జాతీయ పోటీల్లో వాల్ట్, బ్యాలెన్సింగ్ బీమ్‌లో స్వర్ణాలు గెలిచి నాన్న కలను సాకారం చేసింది. తండ్రి మరణంతో ఆటపై ఏకాగ్రత లోపించిన దశలో ఆమె తల్లి, అక్క, బావ ధైర్యం చెప్పి నిరంతరం ప్రోత్సహించడంతో అరుణ కెరీర్ మళ్లీ సరైన ట్రాక్‌లోకి వచ్చింది. -
చరిత్ర సృష్టించిన అరుణారెడ్డి
మెల్బోర్న్ : జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్‌లో అరుణా రెడ్డి కాంస్య పతకం గెలుపొందిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించారు. మెల్బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్స్‌లో స్లొవేనియాకు చెందిన కైసెల్ప్, ఆస్ర్టేలియా క్రీడాకారిణి వైట్హెడ్లు వరుసగా స్వర్ణ, రజత పతకాలు గెలుచుకున్నారు. 13.369 పాయింట్ల స్కోర్‌తో అరుణా రెడ్డి కాంస్య పతకం దక్కించుకున్నారు. ఫైనల్స్‌లో కైసెల్ఫ్ 13.800, వైట్‌హెడ్ 13.699 పాయింట్ల స్కోర్ సాధించారు. జిమ్నాస్టిక్స్ బరిలో నిలిచిన రెండవ భారతీయురాలు ప్రణతి నాయక్ 13.416 స్కోర్‌తో ఆరవ స్ధానంలో నిలిచారు. అరుణా రెడ్డి సాధించిన పతకం జిమ్నాస్టిక్స్‌లో అంతర్జాతీయ స్ధాయిలో భారత్‌కు మూడవ మెడల్ కావడం గమనార్హం. 2010 న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తొలి భారతీయుడిగా అశిష్‌కుమార్ నిలిచారు. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో దీపా కర్మాకర్ జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పతకం దక్కించుకున్నారు.22 ఏళ్ల అరుణా రెడ్డి కరాటేలో బ్లాక్‌బెల్ట్ పొందారు. ఆమె గతంలో జిమ్నాస్టిక్స్‌లో పలు జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించారు. -
ఫ్లోర్, వాల్ట్ ఫైనల్స్‌లో అరుణ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి బుద్దా అరుణ రెడ్డి ఫ్లోర్, వాల్ట్ ఈవెంట్స్‌లో ఫైనల్లోకి చేరింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్‌లో అరుణ తన విన్యాసాలతో ఆకట్టుకుంది. ఫ్లోర్ ఎక్సర్సైజ్ క్వాలిఫయింగ్‌లో అరుణ రెడ్డి 11.466 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. వాల్ట్ క్వాలిఫయింగ్‌లో అరుణ రెడ్డి 13.566 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి ఫైన -
వైద్యునికి 175 ఏళ్ల జైలు శిక్ష!
వైద్యం చేయాల్సిన ఓ వైద్యుడు దారి తప్పాడు. తన వద్దకు వచ్చిన జిమ్నాస్టిక్ మహిళా అథ్లెట్లను లైంగికంగా వేధించాడు. మెడికల్ ట్రీట్మెంట్ పేరుతో మహిళలను లైంగికంగా వేధిస్తున్న డాక్టర్‌కు ఏకంగా 175 ఏళ్ల శిక్ష పడింది. అమెరికాకు చెందిన డాక్టర్ లారీ నసార్ జిమ్నాస్టిక్ మహిళా క్రీడాకారులను లైంగికంగా వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. ఈ కేసులో మిచిగాన్ కోర్టు డాక్టర్‌కి 40 నుంచి 175 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఇలాంటి నీచునికి జైలు బయట బతికే అర్హత లేదు అంటూ కోర్టు తీర్పులో పేర్కొంది. కోర్టు విచారణకు 160 మంది మహిళలు హాజరై డాక్టర్ తమను లైంగికంగా వేధించాడని కోర్టులో విన్నవించుకున్నారు. బాధితుల్లో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత జిమ్నాస్ట్ సైమోన్ బైల్స్, అలీ రైజ్మాన్, గ్యాబీ డగ్లస్, మెక్ కాలే మరోనే లాంటి అథ్లెట్లు ఉన్నారు. -
నల్లగా ఉందని ఆమెను పట్టించుకోలేదట..!
బెంగళూరు: నల్లగా ఉందన్ని టీచర్లు పక్షపాతం చూపటంతో ఓ బాలిక కసితో జిమ్నాస్టిక్స్‌లో కఠోర సాధన చేసింది. అసాధారణ ప్రతిభ చూపి దేశంలోనే ప్రప్రథమంగా జిమ్నాస్టిక్స్‌లో గిన్నిస్ రికార్డు సృష్టించింది. బెంటళూరు నగరానికి చెందిన గిరిశ్, మంజుల దంపతుల కుమార్తె దీక్ష(8) గంట సమయంలోనే 2,776 ఫార్వర్డ్ రోలింగ్‌తో 4.5 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించింది. గతంలో అమెరికాకు చెందిన అశ్రితా ఫర్మాన్ చేసిన 1,330 ఫార్వర్డ్ రోలింగ్, 3.5 కిలోమీటర్ల రికార్డును బద్దలు కొట్టింది. శుక్రవారం నగర ప్రెస్‌క్లబ్‌లో మీడియా ముందు జిమ్నాస్టిక్స్ లో తనకు అందిన గిన్నిస్ రికార్డు పత్రాన్ని దీక్ష ప్రదర్శించింది. తల్లిదండ్రుల, వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ల సమక్షంలో దీక్షా జిమ్సాస్టిక్స్లో ఫార్వర్డ్ రోలింగ్‌ను ప్రదర్శించింది. తండ్రి గిరీశ్ మాట్లాడుతూ.. తన కుమార్తె ఈ రికార్డు సృష్టించేందుకు ప్రధానమైన కారణం పట్టుదలే అన్నారు. అందరితో పాటు చక్కగా జిమ్నాస్టిక్ చేయగలిగిన దీక్షా నల్లగా ఉందన్న కారణంతో ఆమె తరగతిలోనే అందంగా ఉన్న మరో విద్యార్థిని ఎంపిక చేశారు. ప్రతిభను పట్టించుకోకుండా తన కూతురును అవమానపరిచారని విచారం వ్యక్తం చేశారు. దీంతో దీక్షాను ఉన్నత స్థాయిలో ఉన్న రికార్డును చేధించాలని సుమారు ఏడాది పాటు కఠిన శిక్షణ ఇప్పించానని ఆయన తెలిపారు. తన కూతురు కూడా పట్టుదలతో శిక్షణ తీసుకుని గిన్నిస్ రికార్డు సృష్టించి కర్ణాటకకు గౌరవం తెచ్చిందని చెప్పారు. ఈ సందర్భగా దీక్షా గిరీశ్‌ను వివిధ జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు అభినందించారు. -
స్నేహ, సంగీతలకు డబుల్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ నిర్వహిస్తోన్న వేసవి శిబిరాల జిమ్నాస్టిక్స్ అండర్–12 పోటీల బాలికల విభాగంలో వీఎన్సీకి చెందిన స్నేహ విజేతగా నిలిచింది. శనివారం విజయనగర్ కాలనీలో జరిగిన ఫ్లోర్ ఎక్సర్సైజ్, టేబుల్ వాల్ట్ విభాగాల్లో స్నేహ విజేతగా నిలిచింది. రెండు పోటీల్లోనూ భానుశ్రీకి రజతం, అలేఖ్యకి కాంస్యం దక్కాయి. అండర్–11 బాలికల విభాగంలో సంగీత రెండు స్వర్ణాలు అందుకోగా.. యశ్ని రజతాలు కైవసం చేసుకుంది. అండర్ 5–9 బాలబాలికలకు ఫ్లోర్ ఎక్సర్సైజ్లు, అండర్ 10–16 మధ్య వారికి ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌తో పాటు టేబుల్ వాల్ట్ విభాగంలోనూ పోటీలు నిర్వహించారు. విజేతలకు విజయనగర్ కాలనీ కార్పొరేటర్ సల్మా అమీన్, తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం జనరల్ సెక్రటరీ మహేశ్వర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బాలాజీ, హైదరాబాద్ జిల్లా జిమ్నాస్టిక్స్ సంఘం సెక్రటరీ విజయ్‌పాల్ రెడ్డి, జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉమేశ్, సీనియర్ నేషనల్ జిమ్నాస్టిక్స్ కోచ్ బ్రహ్మానంద ప్రసాద్ పాల్గొని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇతర విజేతల వివరాలు అండర్–5 బాలురు: వెంకట్ సాయి, వైష్ణవ్, ఇషాన్ దేవ్; బాలికలు: మేఘన, రుమైల రెహమాన్, అద్విక. అండర్–6 బాలురు: వీర్, సాయి వెంకట నవదీప్, తావిశ్; బాలికలు: సహస్ర, వంశిక, ప్రసన్న. అండర్–8 బాలురు: అంగద్, రామ్ (అమీర్‌పేట్), రాంచరణ్; బాలికలు: రిధి, ఖుషి, వైష్ణవి. అండర్–9 బాలురు: తేజ కుమార్, చేతన్ సాయి, కార్తీక్; బాలికలు: దియా, నిహారిక, సింధు. అండర్–10 బాలురు (ఫ్లోర్ ఎక్సర్సైజ్, టేబుల్ వాల్ట్): వివేక్, పవన్, మణిరాజ్; బాలికలు: ఫ్లోర్ ఎక్సర్సైజ్: స్నిగ్థ, దీపిక, అఖిల; టేబుల్ వాల్ట్: ప్రీతి, భవాని, దీపిక; అండర్–11 బాలురు: ఫ్లోర్ ఎక్సర్సైజ్– తనుష్ రాజ్, శివ శంకర్, సంతోష్; టేబుల్ వాల్ట్– కార్తీక్, హరీశ్, అబ్దుల్ రబ్బాని. -
మాధవన్‌కు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఖేలో ఇండియా జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్ ఈవెంట్లో రాష్ట్రానికి చెందిన మాధవన్ సత్తా చాటాడు. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో మాధవన్ స్వర్ణ పతకంతో మెరిశాడు. జిమ్నాస్టిక్స్ అండర్–14 టేబుల్‌వాల్ట్ ఈవెంట్లో మాధవన్ 13.34 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఢిల్లీకి చెందిన వీర్ 13.20 పాయింట్లతో రెండోస్థానం దక్కించుకోగా... పంజాబ్‌కు చెందిన కృష్ణ (12.57 పాయింట్లు) మూడో స్థానాన్ని సాధించాడు. బాస్కెట్‌బాల్‌లో నిరాశ ఖేలో ఇండియా పోటీల్లో భాగంగా జరుగుతోన్న బాస్కెట్‌బాల్ ఈవెంట్లో రాష్ట్ర జట్లకు నిరాశ ఎదురైంది. మూడో స్థానం కోసం బుధవారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాష్ట్ర జట్లు ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాయి. అండర్–14 బాలికల మ్యాచ్‌లో కర్ణాటక 47–38తో తెలంగాణను ఓడించగా... బాలుర విభాగంలో మధ్య ప్రదేశ్ 52– 38తో తెలంగాణపై గెలిచి కాంస్య పతకాలు సాధించాయి. టెన్నిస్‌లో 7 పతకాలు జాతీయస్థాయి టెన్నిస్ టోర్నమెంట్లో రాష్ట్ర క్రీడాకారులు ఆకట్టుకున్నారు. వ్యక్తిగత, డబుల్స్, టీమ్ విభాగాల్లో కలిసి మొత్తం 7 పతకాలను దక్కించుకున్నారు. అండర్–14 విభాగంలో బాలికల సింగిల్స్‌లో సాయిధన్వి రజతాన్ని, జనని కాంస్య పతకాన్ని సాధించగా... డబుల్స్ విభాగంలో ఎస్. సంజన– ఆశ్రిత జోడి స్వర్ణంతో మెరిసింది. టీమ్ విభాగంలో తెలంగాణ బాలికల జట్టు రజతాన్ని, బాలుర జట్టు కాంస్య పతకాలు గెలుచుకున్నాయి. అండర్–17 విభాగంలో బాలికల డబుల్స్ కేటగిరీలో ఎ. సంజన– ఆర్. సంజన ద్వయం కాంస్యాన్ని సాధించింది. బాలుర టీమ్ విభాగంలో తెలంగాణ జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. -
తెలంగాణకు మిశ్రమ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఖేలో ఇండియా బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గచ్చిబౌలిలో జరుగుతోన్న ఈ పోటీల్లో అండర్–14 బాలబాలికల విభాగాల్లో గెలుపొందిన తెలంగాణ... అండర్–17 విభాగాల్లో ఓటమి పాలైంది. మంగళవారం జరిగిన అండర్–14 బాలుర మ్యాచ్‌లో తెలంగాణ 86– 33తో కర్ణాటక జట్టుపై గెలుపొందగా... బాలికల విభాగంలో 28–4తో జమ్ము, కశ్మీర్ జట్టును ఓడించింది. అండర్–17 విభాగంలో జరిగిన బాలికల మ్యాచ్‌లో తెలంగాణ 7–40తో కేరళ చేతిలో, బాలుర విభాగంలో 31–66తో రాజస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. జిమ్నాస్టిక్స్‌లో రాణించిన నిఖిత ఖేలో ఇండియా పోటీల్లో భాగంగా జిమ్నాస్టిక్స్ ఈవెంట్లో రాష్ట్రానికి చెందిన నిఖితా గౌడ్ అద్భుత ప్రతిభతో ఆకట్టుకుంది. టేబుల్ వాల్ట్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ విభాగాల్లో ఫైనల్స్‌కు అర్హత సాధించింది. టేబుల్ వాల్ట్ ఈవెంట్లో 9.07 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచిన నిఖిత... ఫ్లోర్ ఎక్సర్సైజ్ విభాగంలో 11.60 స్కోరుతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఫ్లోర్ ఎక్సర్సైజ్ విభాగంలో రాష్ట్రానికే చెందిన జి. స్వాతి కూడా 11.34 పాయింట్లు స్కోరు చేసి ఐదోస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. జాహ్నవి, భార్గవిల ముందంజ బ్యాడ్మింటన్ పోటీల్లో రాష్ట్ర క్రీడాకారులు జాహ్నవి, భార్గవి, సాహస్, రాజ్ ముందంజ వేశారు. అండర్–14 బాలుర సింగిల్స్ విభాగంలో రాజ్ (తెలంగాణ) 15–12, 15–9తో దేవహిత్ శర్మపై గెలుపొందగా... మరో సాహస్ కుమర్‌కు వాకోవర్ లభించింది. ఆంధ్రకు చెందిన సంజీవ రావు 15–11, 15–6తొ హర్షిక్ (ఉత్తరాఖండ్)పై విజయం సాధించాడు. బాలికల విభాగంలో కె. భార్గవి (తెలంగాణ) 21–16, 21–8తో సరోజ్‌ఖాన్ (తిరుపతి)పై, ఎన్. జాహ్నవి (ఏపీ) 21–16, 11–21, 21–8తో సాహు (గుజరాత్)పై గెలుపొందారు. -
'ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించండి'
న్యూఢిల్లీ: ఇటీవల రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్ ఈవెంట్లో తృటిలో పతకాన్ని సాధించే అవకాశాన్ని కోల్పోయిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌ను ఆ క్రీడకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ మేరకు భారత ఫుట్ బాల్ దిగ్గజం, లోక్ సభ ఎంపీ ప్రసూన్ బెనర్జీ కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. భారత్‌లో జిమ్నాస్ట్‌కు మరింత ఆదరణ తీసుకురావాలంటే ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలంటూ ప్రసూన్ కోరారు. ' దీపా కర్మాకర్ కేవలం కళాత్మకమైన జిమ్నాస్టే కాదు.. ఈ ఏడాది రియోకు అర్హత సాధించి తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్ . దాంతో పాటు గత 52 ఏళ్లలో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారత జిమ్నాస్ కూడా. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఆమెను జిమ్నాస్ట్ అనే క్రీడకు బ్రాండ్ అంబాసిడర్ చేస్తే బాగుంటుంది. అలా చేస్తే ఇంకా అత్యున్నత శిఖరాలను ఆమె అధిరోహించే అవకాశం ఉంది' అని ప్రసూన్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు క్రీడా మంత్రితో జరిగిన చర్చల్లో ఆయన సానుకూలంగా స్పందించినట్లు ప్రసూన్ అన్నారు. -
'క్రికెట్‌తో సమానంగా చూస్తున్నారు'
కోల్‌కతా: ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించి ఇటీవల జరిగిన రియోకు వెళ్లిన దీపా కర్మకర్... ప్రస్తుతం జిమ్నాస్టిక్స్ పై పెరుగుతున్న ఆదరణపై సంతోషం వ్యక్తం చేసింది. గతంలో తాను క్రికెట్లో చూసిన విశేష అభిమానుల సంఖ్య ఇప్పుడు జిమ్నాస్టిక్స్‌లో చూస్తున్నట్లు దీపా తెలిపింది. ఈ మేరకు చాలా మంది అభిమానులు జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడానికి అడ్మిషన్లు తీసుకున్నట్లు తనతో చెప్పారని పేర్కొంది. 'ఇప్పటికే చాలామంది జిమ్నాస్టిక్ గేమ్స్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. చాలామంది జిమ్నాస్టిక్స్ను నేర్చుకోవడానికి సిద్ధమవుతున్న విషయం విని సంతోషం కల్గింది. జిమ్నాస్టిక్స్ను క్రికెట్ తో పోల్చుతూ ఆ గేమ్‌ను ఎంచుకుంటున్నారు' అని దీపా స్పష్టం చేసింది. ఈ ఒలింపిక్స్‌లో పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయినా, వచ్చే టోక్యో ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకంతో తిరిగి వస్తానని పేర్కొంది. -
'జిమ్నాస్టిక్స్ అంటే సర్కస్ ఫీట్లా అని అడిగారు'
న్యూఢిల్లీ: భారత్ నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించి తొలి మహిళా జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్‌కు రియోలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయట. రియోకు వచ్చిన అభిమానుల్లో కొంతమంది జిమ్నాస్టిక్స్ గేమ్స్‌ను సర్కస్ ఫీట్లతో పోల్చడమే కాకుండా, తనను పదే పదే అవే ప్రశ్నలతో సతమతం చేశారని దీపా కర్మాకర్ తాజాగా స్పష్టం చేసింది. 'నేను రియోలో పతకం సాధించాలనే ఒత్తిడిలో ఉన్నప్పుడు పలువురు నా వద్దకు వచ్చి జిమ్నాస్టిక్స్ అంటే ఏమిటని అడిగారు. అలా అడగమే కాకుండా సర్కస్‌ను పోలి ఉంటుందా అని అడిగారు. కానీ వాటిని నేను పెద్దగా పట్టించుకోకుండా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి యత్నించా' అని వాల్ట్ విభాగంలో నాల్గోస్థానంలో నిలిచి తృటిలో కాంస్య పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయిన దీపా పేర్కొంది. ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రియో జ్ఞాపకాల్ని నెమరవేసుకున్న త్రిపుర అమ్మాయి.. జిమ్నాస్టిక్స్ను సర్కస్ తో పోల్చడం కొంతవరకూ ఇబ్బందికరంగా అనిపించిందని పేర్కొంది. -
15న చెస్, జిమ్నాస్టిక్స్ జట్ల ఎంపిక
సంగారెడ్డి టౌన్: అండర్ 14, 17 చెస్, జిమ్నాస్టిక్ క్రీడా జట్ల ఎంపిక ఈ నెల 15న జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మైదానంలో జరుగుతుందని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతోపాటు నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, చెస్ క్రీడాకారులు చెస్ బోర్డులతో గురువారం ఉదయం 10 గంటలకు మైదానంలో హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు సెల్ నం. 9866140016, 9493676216లో సంప్రదించాలని సూచించారు. -
టోక్యోలో గెలుస్తా...
రియోలో పతకం ఆశించలేదు నా ప్రదర్శన సిమోన్ కన్నా గొప్ప జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్‌లో దీపా కర్మాకర్ ప్రదర్శనపై భారతదేశం మొత్తం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. కేవలం 0.15 పాయింట్ల తేడాతో కాంస్యం కోల్పోయినా అందరితో శభాష్ అనిపించుకుంది. ఈ త్రిపుర అమ్మాయి కూడా తన ప్రదర్శన పట్ల అమితానందాన్ని వ్యక్తం చేసింది. తృటిలో పతకం కోల్పోయినందుకు తానేమీ బాధపడడం లేదని, వాస్తవానికి రియో గేమ్స్‌లో మెడల్ ఆశించలేదని స్పష్టం చేసింది. ఫైనల్స్‌లో తను ల్యాండింగ్ సరిగ్గానే చేసినా కొన్ని సెకన్ల పాటు కింద కూర్చోవడంతో పాయింట్లు కోల్పోయింది. అయితే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం కచ్చితంగా స్వర్ణం నెగ్గుతానని ధీమా వ్యక్తం చేస్తోన్న 23 ఏళ్ల దీపా చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే.. పతకాన్ని ఊహించలేదు: నిజం చెప్పాలంటే రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని ఆశించలేదు. కానీ నాలుగో స్థానంలో నిలవడం గర్వంగా ఉంది. బాక్సింగ్లోనైతే ఈ స్థానంలో వస్తే కాంస్యం దక్కేది. కానీ నాలుగేళ్ల తర్వాత నా లక్ష్యం స్వర్ణంపైనే ఉంటుంది. ఇది నా తొలి ఒలింపిక్స్ కాబట్టి నిరాశ అవసరం లేదు. అత్యుత్తమ స్కోరు సాధించా: ఓవరాల్‌గా నా ప్రదర్శనపై సంతృప్తికరంగా ఉన్నాను. ఫైనల్స్‌లో 15.066తో నా అత్యధిక స్కోరు సాధించా. అయితే పతకం సాధించిన వారు నాకన్నా మెరుగైన ప్రదర్శన చేశారు. కొద్ది పాయింట్ల తేడాతో పతకం కోల్పోయాను. అయినా నా తొలి గేమ్స్‌లో నాలుగో స్థానాన్ని నేను ఊహించలేదు. రెండు వాల్ట్స్‌లో నా స్కోరును మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెట్టి విజయవంతమయ్యాను. ప్రొడునోవాలో గతంలో 15.1 స్కోరు అత్యధికంగా ఉండేది. ఇక్కడ 15.266 వరకు సాధించగలిగాను. స్వదేశీ కోచ్‌తోనే ఇంత సాధించాను: జిమ్నాస్టిక్స్ అంత సులువైన క్రీడ కాదు. మనకు ఇందులో విదేశీ కోచ్ కూడా లేడు. నేనింత వరకు సాధించింది కూడా స్వదేశీ కోచ్ బిశ్వేశ్వర్ నంది, సాయ్ కృషితోనే. ఒలింపిక్స్‌కు మూడు నెలల ముందే సన్నాహకాలు ప్రారంభమయ్యాయి. ఒలింపిక్ మాజీ చాంపియన్లను కూడా వెనక్కినెట్టి నాలుగో స్థానంలో నిలవగలిగాను. అందుకే ఇది సిమోన్ బైల్స్ సాధించిన దానికన్నా పెద్ద ఘనతగా నేను భావిస్తున్నాను. విశేష మద్దతు: కోట్లాది మంది భారతీయుల ప్రార్థనల వల్లే ఇక్కడిదాకా రాగలిగాను. వారందరికీ నా కృతజ్ఞతలు. గతంలో మిల్కా సింగ్, పీటీ ఉష కూడా నాలుగో స్థానంలో నిలిచారని పోలిక తెస్తున్నా... నేను వారితో సరితూగలేను. స్వర్ణం సాధించాకే వారితో పోల్చుకోగలను. అభినందనల వెల్లువ తృటిలో పతకం చేజార్చుకున్న దీపా కర్మాకర్‌పై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘గెలుపు, ఓటమి అనేది ఏ క్రీడలోనైనా సహజమే. కానీ నీవు లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నావు. భారతదేశమంతా నీ ఘనతకు గర్విస్తోంది’ అని సచిన్ ట్వీట్ చేయగా... ‘దీపా.. నువ్వు నా హీరోవి’ అని షూటర్ అభినవ్ బింద్రా స్పందించాడు. అమితాబ్ సహా పలువరు బాలీవుడ్ ప్రముఖులు కూడా ట్వీట్ల ద్వారా అభినందనలు తెలిపారు. గేమ్స్ విలేజికి వెళ్లాక బాధను ఆపుకోలేక భోరున విలపించింది. ‘దీప పోరాటాన్ని అంతా పొగిడినా మేం మాత్రం ప్రపంచాన్ని కోల్పోయినట్టుగా భావించాం. మా దృష్టిలో ఈ స్వాతంత్య్ర దినోత్సవం భారంగా గడిచింది. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. దీప చాలాసేపు విలపించింది’ అని కోచ్ నంది అన్నారు. -
జిమ్నాస్టిక్స్
అబ్బురపరిచే విన్యాసాలు చేస్తున్న యువతేజాలు కఠోరమైన సాధనతో ప్రత్యేక గుర్తింపు ఓరుగల్లు పేరును నలుదిశలా చాటుతున్న క్రీడాకారులు జాతీయ స్థాయిలో అనేక పతకాలు ‘‘ఒకటే గమనం.. ఒకటే పయనం.. గెలుపు పొందే వరకూ.. అలుపులేదు మనకు..’’ అని ఓ సినీకవి రాసిన పాటను వీరు అక్షరాల పాటిస్తున్నారు. కష్టాలు వచ్చినా.. కన్నీళ్లు వచ్చినా.. వాటిని దిగమింగుకుని లక్ష్యసాధనకు పాటుపడుతున్నారు. నిత్యం కఠోరమైన సాధనతో అబ్బురపరిచే విన్యాసాలు చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. క్రమశిక్షణ.. అంకితభావానికి మారుపేరుగా నిలిచే ‘జిమ్నాస్టిక్్స’లో జిల్లాకు చెందిన పలువురు యువతేజాలు రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. –వరంగల్ స్పోర్ట్స్ దీపా కర్మాకర్ స్ఫూర్తిగా.. మేటి జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి ‘దీపా కర్మాకర్’ భారతదేశం గర్వించదగిన ముద్దుబిడ్డ. మునుపెన్నడూ లేని రీతిలో ఆమె దేశచరిత్రను తిరగరాసింది. తాజాగా జరుగుతున్న రియో ఒలింపిక్స్‌లో దీపా కర్మాకర్ అద్భుత ప్రదర్శనతో జిమ్నాస్టిక్స్‌లో ఫైనల్స్‌కు చేరడం గమనార్హం. అయితే ప్రపంచ ప్రజలందరి దృష్టిని ఆక్షరించిన 23 ఏళ్ల దీపా కర్మాకర్‌ను స్ఫూర్తిగా తీసుకుని మన జిల్లాకు చెందిన విద్యార్థులు, యువకులు జిమ్నాస్టిక్స్‌లో సత్తాచాటుతున్నారు. 1570లో ఆవిర్భావం.. జిమ్నాస్టిక్స్ అంటే వాడుక భాషలో సర్కస్ ఫీట్లు అని అర్థం. బలం, సమతుల్యత, చురుకుదనం, ఓర్పు, నియంత్రణ కలగలిపిన వ్యాయామాల ప్రదర్శనే జిమ్నాస్టిక్స్ అని చెప్పొచ్చు. ఈ క్రీడ 1570లో పురాతన గ్రీసులో ఆవిర్భవించింది. 1759–1839 మధ్య కాలంలో జర్మనీలో భౌతిక విద్యావేత్త జోహన్ ఫ్రెడరిక్ యువకులను ఉత్తేజ పరిచేందుకు ఈ ఆటను కనుగొన్నారు. అయితే అనేక పరిణామాల తర్వాత 1928లో జిమ్నాస్టిక్స్ను ఒలింపిక్స్ క్రీడగా గుర్తించారు. అనంతరం ప్రతిదేశం తన సొంత జాతీయ పాలకమండలిని ఏర్పాటు చేసుకుంది. జిమ్నాస్టిక్స్‌లో రిథమిక్, ట్రామ్ఫోలిన్, ఏరోబిక్స్, తదితర ఈవెంట్లు ఉంటాయి. ఈ క్రీడలో జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించారు. ఎనిమిదేళ్లుగా శిక్షణ నేను ఎనిమిదేళ్లుగా హన్మకొండలోని అకాడమీలో ఉంటూ జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాను. ఇప్పటివరకు 12 జాతీయ, 18 రాష్ట్రస్థాయి జూనియర్స్, సీనియర్స్ పోటీలకు హాజరయ్యాను. 2012లో తమిళనాడులో జరిగిన జూనియర్ నేషనల్స్‌లో సిల్వర్, 2013లో హైదరాబాద్‌లో జరిగిన నేషనల్స్‌లో సిల్వర్ మెడల్స్ సాధించాను. అలాగే 2012లో బెంగళూరులో జరిగిన సౌత్ ఇంటర్ నేషనల్స్‌లో పాల్గొన్నాను. ఇప్పటివరకు 30 టోర్నమెంట్లలో పాల్గొని 15 సిల్వర్, 10 బ్రాంజ్ మెడల్స్ సాధించాను. – ఈ. ప్రశాంత్, డిగ్రీ సెకండియర్ పది బంగారు పతకాలు నేను పదేళ్లుగా హన్మకొండలోని అకాడమీలో జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ పొందుతున్నాను. 2008 నుంచి ఇప్పటి వరకు మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 20 జాతీయస్థాయి, 20కి పైగా రాష్ట్రస్థాయి పోటీలకు హాజరై 10 గోల్డ్, 12 సిల్వర్, 5 బ్రాంజ్ మెడల్స్ సాధించాను. భవిష్యత్‌లో మరింత సాధన చేసి అంతర్జాతీయస్థాయిలో రాణించాలన్నదే లక్ష్యం. – కె. ప్రవళిక, ఇంటర్ సెకండియర్ ఆర్టిస్టిక్ విభాగంలో పట్టు నేను జిమ్నాస్టిక్స్లోని ఆర్టిస్టిక్ విభాగంలో జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. ఆర్టిస్టిక్పై మరింత పట్టు సాధించేందుకు ఉదయం, సాయంత్రం వేళలో కఠోరంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. కోచ్‌ల సూచనలు పాటిస్తూ అంతర్జాతీయస్థాయిలో రాణించే విధంగా శిక్షణ పొందుతున్నాను. ఇప్పటివరకు 20 జాతీయ, 15 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. జాతీయ స్థాయిలో 10 బంగారు, 20 సిల్వర్ మెడల్స్ సాధించాను. – బి. సంజయ్‌కుమార్, డిగ్రీ సెకండియర్ -
మన 'దీపం' వెలిగింది
• ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో ఫైనల్‌కు అర్హత • వాల్ట్ ఈవెంట్లో సత్తా చాటిన కర్మాకర్ • ఈ నెల 14న ఫైనల్స్ భారత జిమ్నాస్టిక్స్ను ఒక్కో మెట్టు పైకి ఎక్కిస్తూ ఒలింపిక్స్‌కు తీసుకెళ్లిన దీపా కర్మాకర్.... తన మీద ఉన్న భారీ అంచనాలను అందుకుంటూ... పతక అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. రియోలో పతకం కచ్చితంగా సాధిస్తారని భావించిన వారు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతుండగా... దీపా మాత్రం మొక్కవోని దీక్షతో పోరాడింది. తనకు అత్యంత ఇష్టమైన, పట్టు ఉన్న వాల్ట్ ఈవెంట్లో ఫైనల్‌కు చేరి భారత శిబిరంలో ఆశలు పెంచింది. రియో : తన 23వ పుట్టిన రోజుకు రెండు రోజుల ముందు దీపా కర్మాకర్ మరోసారి దేశం గర్వించే ప్రదర్శనను కనబర్చింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా ఇప్పటికే రికార్డు అందుకున్న ఆమె తనపై దేశం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టింది. ఆదివారం జరిగిన ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఈవెంట్లో దీప ఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యింది. తద్వారా తొలి ప్రయత్నంలో ఫైనల్‌కు చేరిన మరో ఘనతను అందుకుంది. మొత్తం 14.850 పాయింట్లతో ఆమె ఎనిమిదో స్థానంలో నిలవడం విశేషం. క్వాలిఫయింగ్ పోటీల్లో అమెరికా స్టార్ సైమన్ బైల్స్ అగ్రస్థానంలో (16.050 పాయింట్లు) నిలిచింది. ఇతర ఈవెంట్లలో 11.666 (అన్ ఈవెన్ బార్స్), 12.866 (బ్యాలెన్సింగ్ బీమ్), ఫ్లోర్ ఎక్సర్సైజ్ (12.033) స్కోరు చేసిన దీప, ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది. ఫ్లోర్ ఎక్సర్సైజ్లో ఆమెపై పెనాల్టీ కూడా పడింది. ఆల్‌రౌండ్ జాబితాలో 51.665 పాయింట్లతో 47వ స్థానంతో సరి పెట్టుకున్న ఆమె... తన ప్రధాన ఈవెంట్ వాల్ట్‌లో మాత్రం అంచనాలను అందుకుంది. ‘ఇవి నా తొలి ఒలింపిక్స్. ఫైనల్‌కు చేరడం చాలా గొప్పగా అనిపిస్తోంది. హాల్లో విపరీతమైన గోలతో నేను మ్యూజిక్‌ను కూడా సరిగా వినలేకపోయాను. పాయింట్లు ఇచ్చే విషయంలో జడ్జిలు కొంత కఠినంగానే వ్యవహరిస్తున్నట్లు నాకనిపిస్తోంది. నా ప్రదర్శన సంతృప్తినిచ్చినా ఇంతకంటే ఇంకా బాగా చేయాల్సింది’ అని దీపా కర్మాకర్ వ్యాఖ్యానించింది. కోచ్ ఉద్వేగం... ఒలింపిక్స్‌లో దీప ప్రదర్శన పట్ల ఆమె కోచ్ విశ్వేశ్వర్ నంది గర్వపడుతున్నాడు. అయితే అదే సమయంలో తమపై తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘వంద కోట్ల మంది భారతీయుల ఆశలను ఆమె మోస్తోంది. దేశంలో ప్రతీ ఒక్కరు దీప పతకం గెలిచి చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నారు. అది ఎంత కష్టమో చాలా మందికి తెలీదు. 0.001 పాయింట్ తేడాతో మెడల్ కోల్పోయే అవకాశం ఇక్కడ ఉంది. ఇంత ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదు’ అని విశ్వేశ్వర్ వ్యాఖ్యానించారు. దీప కెరీర్ ఆరంభంలో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఆయన సొంత తెలివితేటలు ఉపయోగించి పాత సెకండ్ హ్యాండ్ స్కూటర్ విడి భాగాలు, తుక్కు సామాను ఉపయోగించి ప్రాక్టీస్‌కు కావాల్సిన స్ప్రింగ్ బోర్డు, వాల్ట్ తదితర పరికరాలను తయారు చేసిన రోజులు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం తనను కనీసం ఎవరూ గుర్తు పట్టలేకపోయేవారని, ఇప్పుడు దీప కారణంగా ఒక్కసారిగా అందరికీ తెలిసినట్లు విశ్వేశ్వర్ ఉద్వేగంగా చెప్పారు. ప్రపంచానికి దూరంగా... ఆదివారం జరిగే ఫైనల్స్‌కు ముందు దీపా కర్మాకర్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండకుండా, ఇతర అంశాల వైపు ధ్యాస మళ్లకుండా కోచ్ విశ్వేశ్వర్ నంది అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం నాలుగేసి గంటల పాటు సాధన తప్ప ఆమెకు మరో ప్రపంచం ఉండరాదని ఆయన భావిస్తున్నారు. మంగళవారం దీప పుట్టిన రోజున కూడా తల్లిదండ్రులతో తప్ప మరెవరితో మాట్లాడరాదని కూడా కోచ్ చెప్పేశారు. ‘ఆమె మొబైల్‌నుంచి సిమ్ కార్డు తీసేశాను. తల్లిదండ్రులతో మాత్రం మాట్లాడనిస్తాను. ఎలాగూ పెద్దగా స్నేహితులు కూడా లేరు. ఆదివారం ఆమె పతకం గెలుస్తుందని నాకు నమ్మకముంది. ఈవెంట్ ముగిసే సమయానికి భారత కాలమానం ప్రకారం ఆగస్టు 15 అవుతుంది. గెలిస్తే స్వాతంత్య్ర దినోత్సవం, పుట్టిన రోజు ఒకేసారి జరుపుకుంటాం’ అని విశ్వేశ్వర్ చెప్పారు. అంత సులభం కాదు... దీపా కర్మాకర్ ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ (వాల్ట్)లో ఫైనల్‌కు అర్హత సాధించిందనగానే మనందరిలో సహజమైన ఆనందం పొంగుకొచ్చేసింది. ఈ నెల 14న జరిగే ఫైనల్లో ఆమె మరింత బాగా ఆడి పతకం సాధించాలని కూడా కోరుకుంటున్నాం. మొత్తం నాలుగు ఈవెంట్లలో పాల్గొన్న ఆమె, మూడు విభాగాలు అన్ ఈవెన్ బార్స్, ఫ్లోర్ ఎక్సర్సైజ్, బీమ్‌లలో విఫలమైంది. వాల్ట్ ఈవెంట్లో మాత్రం సత్తా చాటి ముందుకు దూసుకుపోయింది. అసలు ఈ వాల్ట్ ఎలా ఉంటుంది, ఇందులో పాయింట్లు ఎలా ఇస్తారంటే... ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో వాల్ట్ ఒక ఈవెంట్. పోటీల కోసం వాల్టింగ్ టేబుల్‌ను ఏర్పాటు చేస్తారు. జిమ్నాస్ట్‌లు రన్‌వేపై పరుగెత్తుకు వచ్చి స్ప్రింగ్ బోర్డు ఆధారంగా పైకి లేస్తారు. అదే ఊపులో వాల్ట్పై రెండు చేతులు ఉంచి (ప్రి ఫ్లయిట్) ఆ తర్వాత గాల్లో పల్టీలు కొట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత జిమ్నాస్ట్ టేబుల్ ఇదే విభాగంలో భాగమైన యుర్చెంకోలో అయితే స్ప్రింగ్ బోర్డుపై వెళ్లక ముందు కూడా మ్యాట్‌పై చేతులు ఉంచాలి. వాల్ట్పైనుంచి పల్టీలు కొడుతూ సరైన విధం గా మ్యాట్‌పై నిలవాలి. గాల్లో లేచినప్పుడు సులభంగానే అనిపించినా పల్టీలు కొట్టే సమయంలో జిమ్నాస్ట్‌కు చాలా నియంత్రణ ఉండాలి. వాల్ట్‌లోనే వేర్వేరు స్టైల్లు ఉంటాయి. హ్యండ్స్ప్రింగ్, యమషిత, సుకహారా, యుర్చెంకో, ఖోర్కినా అంశాలలో జిమ్నాస్ట్‌లు ప్రదర్శన ఇస్తారు. పాయింట్లు ఎలా ఇస్తారంటే... ఎలాంటి గందరగోళం, తడబాటు లేకుండా మ్యాట్‌పై చూపించిన ల్యాండింగ్ జోన్లో వాలడాన్ని బట్టే పాయింట్లు ఉంటాయి. ప్రతీ వాల్ట్‌కు నిర్ణీత పాయింట్లు కేటాయిస్తారు. దానిని పూర్తి చేస్తే ఆ పాయింట్లే లభిస్తాయి. పడిపోవడం, సరిగ్గా నిలబడలేకపోతే పాయింట్లు పోతాయి. జడ్జీలు ప్రధానంగా నాలుగు అంశాలు ప్రి ఫ్లయిట్, సపోర్ట్, ఆఫ్టర్ ఫ్లయిట్, ల్యాండింగ్లపై దృష్టి పెట్టి పాయింట్లు ఇస్తారు. వేగంగా సాగిపోయే ఈ ఆటలో జిమ్నాస్ట్‌ల మధ్య సాధారణంగా 0.2 పాయింట్ల తేడా మాత్రం ఉంటుంది. 2005నుంచి వచ్చిన నిబంధనల ప్రకారం కష్టమైన అంశాలకు ఎక్కువ పాయింట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఫ్లిప్పింగ్, ట్విస్టింగ్, టర్నింగ్ తదితర ఎనిమిది అంశాలు ఎలా చేశారనేదానిపై పాయింట్లు ఆధారపడి ఉంటాయి. దీప ఏం చేసింది... వాల్ట్‌లో దీప మొత్తం 14.850 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మొదటి ప్రయత్నంలో డిఫికల్టీలో 7 పాయింట్లు స్కోర్ చేసిన ఆమె, ఎగ్జిక్యూషన్లో 8.1 పాయింట్లు సాధించింది. ఆమెకు ఎక్కువ పాయింట్లు అందించడంలో ప్రొడునోవా ఈవెంట్దే కీలక పాత్ర. ఎగ్జిక్యూషన్ స్కోర్ ఎలా చేశారనే దాని ఆధారంగా పాయింట్లు వస్తాయి. బేస్ స్కోర్ 10 ఉంటే... ఫాల్స్, తడబాటు, మధ్యలో ఆగిపోవడం వంటివి చూసి జడ్జిలు పాయింట్లు తగ్గిస్తారు. ఈ ప్రక్రియను ఎగ్జిక్యూషన్ స్కోర్ అంటారు. డిఫికల్టీ స్కోర్ ఎంత కష్టమైన, ప్రమాదకరమైన ప్రక్రియను ఎంత బాగా చేశారనేదాన్ని బట్టి డిఫికల్టీ స్కోరు లభిస్తుంది. గరిష్ట డిఫికల్టీ స్కోరు అని ఏమీ ఉండదు. ప్రొడునోవా: ప్రాణాలకే ప్రమాదకర విన్యాసం ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో ఇది అత్యంత ప్రమాదకరమైన, క్లిష్టమైన ఈవెంట్. ఫ్రంట్ హ్యాండ్ స్ప్రింగ్‌తో పాటు రెండు ఫ్రంట్ సోమర్ సాల్ట్‌లు కలిసి ఉంటాయి. దీని ప్రస్తుత డిఫికల్టీ స్కోరు 7. ఎక్కువ పాయింట్లు సాధించడం కోసం ఈ ప్రమాదకరమైన అంశాన్ని కొంత మంది జిమ్నాస్ట్‌లు ఎంచుకుంటారు. దీపా కూడా అదే చేసింది. ఓవరాల్‌గా కూడా ప్రొడునోవాను ప్రపంచంలో ఐదుగురు మాత్రమే పర్ఫెక్ట్గా పూర్తి చేయగలిగినవారిలో దీప కూడా ఉంది. 1980 ఒలింపిక్స్ మొదలు ఇప్పటి వరకు చాలా మంది ఈ సాహసం చేయబోయే తీవ్ర గాయాల పాలై, చావుకు దగ్గరగా వెళ్లిన ఘటనలు చాలా ఉన్నాయి. దీనితో ఈ అంశాన్ని నిషేధించాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆదివారం పోటీల్లో అగ్రస్థానంలో నిలిచిన అమెరికా జిమ్నాస్ట్ దిగ్గజం సైమన్ బైల్స్ కూడా గతంలో ‘నేను చనిపోవడానికి ప్రయత్నించను’ అని దీని గురించి వ్యాఖ్యానించింది. రియోలో కూడా ఆమె దీనికి దూరంగానే ఉంది. -
దీపా.. నువ్ సూపర్.. !
భారత జిమ్మాస్ట్ దీపా కర్మాకర్ తన అద్భుతమైన ప్రదర్శనతో రియో ఒలింపిక్స్ ఫైనల్లో బెర్తు సాధించడమే కాదు.. ఇటు దేశ ప్రజల హృదయాలనూ గెలుచుకుంది. అత్యంత క్లిష్టమైన వ్యక్తిగత వాల్ట్ విభాగంలో గెలిచి.. నిలిచి ఫైనల్‌కు చేరిన దీప సరికొత్త చరిత్ర లిఖించింది. భారత్ నుంచి ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గా ఇప్పటికే రికార్డు సృష్టించిన దీప సంచనాలు కొనసాగిస్తూ.. ఫైనల్లోనూ అడుగుపెట్టింది. ఆమె అపూర్వమైన రికార్డును కొనియాడుతూ ట్విట్టర్లో దేశవాసులు అభినందనలు తెలిపారు. భారతీయుల ఆశలను నిలబెడుతూ ఫైనల్లోనూ అద్భుతంగా రాణించి పతకం సాధించాలని, దేశం గర్వపడేలా మరింత ఉన్నత శిఖరాలను ఆమె అధిరోహించాలని పలువురు నెటిజన్లు ఆకాంక్షించారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మొదలు.. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, విజయ్ గోయల్, బాక్సర్ విజిందర్ సహా పలువురు నెటిజన్లు దీపా కర్మాకర్‌కు అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్ వేదికపై భారతీయుల ఆకాంక్షలను నిలబెట్టాలని కోరారు. మరోవైపు దీపా కర్మాకర్ వాల్ట్ విన్యాసాలను లైవ్ ప్రసారంలో చానెల్లో చూపకపోవడంపై అమితాబ్ సహా పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. #Rio2016 Congratulations #DipaKarmakar on making history in #ArtisticGymnastics .Good luck for finals. #GoForGold pic.twitter.com/6f56jaXnrc — Sudarsan Pattnaik (@sudarsansand) August 8, 2016 And #DipaKarmakar vaults into finals. First Indian woman to achieve this... May the medal be your bday gift tmrw. pic.twitter.com/PnfAhrp6UK — Naveen Jindal (@MPNaveenJindal) August 8, 2016 -
'దీపా కర్మాకర్ పై ఒత్తిడి ఉంది'
రియో డి జనీరో:ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత తొలి మహిళా జిమ్నాస్టిక్‌గా రియోలో అడుగుపెట్టిన దీపా కర్మాకర్‌పై యావత్ భారతావని చాలా ఆశలు పెట్టుకుందని ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది స్పష్టం చేశారు. ప్రస్తుతం తమపై ఒలింపిక్స్ పతకం సాధించాల్సిన ఒత్తిడి అధికంగా ఉందని పేర్కొన్నారు. గత ఏప్రిల్‌లో దీపా సంచలన ప్రదర్శనతో రియోకు అర్హత సాధించిన అనంతరం ఆమెపై ఒక్కసారిగా ఆశలు పెరిగిపోయాయని..ఇప్పుడు ఒలింపిక్స్‌లో పతకం తీసుకొస్తుందని వంద కోట్ల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే తమపై అధిక ఒత్తిడి పడుతుందన్నాడు. ' రియోలో దీపా కర్మాకర్ పతకం సాధిస్తుందని అంతా భారీ అంచనాలతో ఉన్నారు. భారత అభిమానులకు పతకం కానుకగా ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇది బిలియన్ భారత ప్రజల ఆశ. దీపా కర్మాకర్ రియోకు అర్హత సాధించిన తరువాత ఆమెపై అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. కాకపోతే మెగా ఈవెంట్లో పతకం సాధించడమనేది కష్టంతో కూడుకున్నదని వారికి తెలియదు. మా శాయశక్తులా పతకం సాధించడానికి యత్నిస్తాం. ఆ విషయాన్ని అంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.దీపా కర్మాకర్ ప్రదర్శనపై నాకు కూడా నమ్మకం ఉంది.' అని బిశ్వేశ్వర్ నంది పేర్కొన్నారు. ఏప్రిల్ లో రియో డీ జెనీరియోలో జరిగిన ఫైనల్ క్వాలిఫయర్ లో 52.698 పాయింట్లు నమోదు చేసిన దీపా కర్మాకర్ రియోకు అర్హత సాధించింది. తద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా దీప రికార్డు నెలకొల్పింది. త్రిపురకు చెందిన ఈ 22 ఏళ్ల అమ్మాయి.. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వరల్డ్ జిమ్నాస్ట్ చాంపియన్‌షిప్ కు అర్హత సాధించింది. ఒలింపిక్స్‌లో ఫైనల్ రౌండే లక్ష్యంగా బరిలోకి దిగిన దీపా కర్మాకర్.. ఆగస్టు 7వ తేదీన తొలి రౌండ్ పోరులో తలపడనుంది. -
జిమ్నాస్టిక్స్
అందుబాటులో ఉన్న స్వర్ణాలు 18 (ఆర్టిస్టిక్ 14+ రిథమిక్ 2+ ట్రెంపోలిన్ 2) ఖేల్ కహానీ శరీరాన్ని విల్లులా వంచడం, స్ప్రింగ్‌లా మెలిక తిప్పడం, చిన్న ఆధారంపై పెద్దపెద్ద విన్యాసాలు చేయడం జిమ్నాస్టిక్స్ ప్రత్యేకత. ఇందులో మూడు భాగాలు ఉంటాయి. వాటిలో దేనికదే సాటి. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో బ్యాలెన్స్ బీమ్, పామెల్ హార్స్, పారలల్ బార్స్, రింగ్స్, ఫ్లోర్, వాల్టింగ్ హార్స్, అన్ఈవెన్ బార్స్‌పై విన్యాసాలు చేస్తారు. ఏథెన్స్ (1896) ఒలింపిక్స్ నుంచి ఇవి జరుగుతున్నాయి. రిథమిక్ జిమ్నాస్టిక్స్ కేవలం మహిళలకే పరిమితం. అందమైన అమ్మాయిలు సంగీతానికి అనుగుణంగా లయ బద్దంగా విన్యాసాలను చూపిస్తారు. 1984లో ఈ విభాగాన్ని ప్రవేశపెట్టారు. అద్భుతమైన డ్రెస్సింగ్‌తో కళ్లు చెదిరే విన్యాసాలు ప్రదర్శిస్తూ జడ్జీలను ఆకట్టుకోవాలి. ఇందులో వ్యక్తిగతంగానూ టీమ్ విభాగాల్లోనూ పోటీలు ఉంటాయి. గాల్లో తేలాడుతూ విన్యాసాలు చేయడం ట్రెంపోలిన్ ప్రత్యేకత. ఓ ప్రత్యేకమైన వలలో పడిన తర్వాత దాదాపు 8 మీటర్లు పైకి లేస్తారు. సోమర్‌సాల్ట్స్, ఏరియల్ ఏక్రోబ్యాటిక్స్లో రకరకాల విన్యాసాలు ఉంటాయి. సిడ్నీ ఒలింపిక్స్‌లో వీటిని ప్రవేశపెట్టారు. రష్యాదే జోరు... రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో రష్యాదే ఆధిపత్యం. 1964 టోక్యో గేమ్స్‌లో 6 స్వర్ణాలు నెగ్గిన లారిసా లాతియానా తర్వాత మెక్సికోలోనూ 7 స్వర్ణాలతో దుమ్మురేపింది. ఇప్పటికీ టాప్-3లో రష్యా అథ్లెట్లే ఉంటున్నారు. తర్వాత ఉక్రెయిన్, కొరియా, బెలారస్, ఇజ్రాయిల్, బల్గేరియా జిమ్నాస్ట్‌లు సత్తా చాటుతున్నారు. ఆర్టిస్టిక్స్ జిమ్నాస్టిక్‌లో అమెరికాదే జోరు. పురుషుల, మహిళల విభాగాల్లో వాళ్లను కొట్టేవారు లేరు. తర్వాత బ్రిటన్, బ్రెజిల్, జపాన్, చైనా, స్విట్జర్లాండ్‌లు అటు ఇటుగా ఉన్నాయి. ట్రెంపోలిన్కు వచ్చేసరికి రష్యా, బెలారస్, చైనాల మధ్యే ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎక్కువగా రష్యా అథ్లెట్లదే పైచేయి. ఇక ప్రారంభ ఒలింపిక్స్‌లో జర్మనీ అన్ని పతకాలను కొల్లగొట్టేది. తర్వాత కొన్నాళ్లు బెల్జియం, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్‌ల హవా సాగింది. ఆ తర్వాత ఫ్రాన్స్ తన మార్క్‌ను చూపడం మొదలైంది. -
నేల మీద... గాల్లో తేలుతూ..!
మంచి పాత్ర దొరకాలే కానీ, దానికోసం ఎంతైనా కష్టపడతానంటున్నారు అదా శర్మ. ‘హార్ట్ ఎటాక్’ నుంచి మొన్నటి ‘క్షణం’ వరకూ గ్లామరస్ పాత్రలు ఎక్కువగా చేసిన అదా ఇప్పుడు తనలో మరో కోణాన్ని చూపించనున్నారు. హిందీ చిత్రం ‘కమాండో 2’లో పవర్ఫుల్ అదాని చూడబోతున్నాం. ఈ చిత్రంలో ఈ బ్యూటీ డ్యూయెట్లు పాడతారో లేదో కానీ, ఫైట్లు మాత్రం చేస్తారు. అది కూడా రిస్కీ ఫైట్స్ అన్న మాట. అందుకే కసరత్తులు చేస్తున్నారు. ఈ పాత్ర కోసం జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నారు. ఆ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఫొటోలు కూడా దిగారు. నేల మీద మాత్రమే కాదు.. గాల్లో కూడా అదా రిస్కులు చేసేస్తున్నారు. దీన్నిబట్టి ‘కమాండో 2’లో అదా అదరిపోయే ఫైట్స్ చేస్తారని ఊహించవచ్చు. ఈ చిత్రంతో పాటు హిందీలో ‘జగ్గా జాసూస్’లో కూడా అదా నటిస్తున్నారు. ‘‘నా మటుకు నేను ఏ పాత్రకైనా న్యాయం చేయాలనుకుంటా. అది గ్లామరస్ అయినా.. పవర్ఫుల్ అయినా. ఒకే రకం పాత్రలకే పరిమితం కాను. అలాగే నాకు భాష గురించి కూడా పట్టింపు లేదు. ఎక్కడ మంచి అవకాశాలొస్తే అక్కడ చేస్తా’’ అని అదా శర్మ పేర్కొన్నారు. -
ఒలింపిక్ పతకమే నా లక్ష్యం
జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ న్యూఢిల్లీ: క్రీడాకారులెవరైనా కెరీర్‌ను ప్రారంభించే ముందు ఆయా రంగంలో అత్యున్నత శిఖరాలకు చేరాలని... ఒలింపిక్స్‌లో పోటీపడాలని కలలు కంటుంటారు. అయితే ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు. కానీ జిమ్నాస్టిక్స్‌లో భారత్ నుంచి ఇప్పటిదాకా అసాధ్యమనుకున్న ఫీట్‌ను సాధ్యం చేసిన దీపా కర్మాకర్ మాత్రం ఈ కేటగిరీలోకి రాదు. తాను చిన్నప్పటి నుంచే ఒలింపిక్స్‌లో అడుగు పెట్టాలని భావిం చింది. అనుకున్నది సాధించడమే కాకుండా దేశం నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్‌గానూ నిలిచింది. ఈ నేపథ్యంలో రియో డి జనీరోలో జరిగిన క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో పాల్గొని స్వదేశానికి చేరుకున్న దీపకు ఘనస్వాగతం లభించింది. ‘ఏదో ఓ రోజు నేను ఒలింపిక్స్‌లో పోటీ పడి దేశానికి గౌరవం తీసుకురావాలని కలలు కన్నాను. నిజానికి కెరీర్ ఆరంభం నుంచే ఈ కోరిక నాలో పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు నిజంగానే నేను ఒలింపిక్స్‌కు అర్హత సాధించాను. ఇక ఇప్పుడు గతంకన్నా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంది. రియో గేమ్స్‌లో పతకం సాధిస్తాననే భావిస్తున్నాను. దీనికోసం శాయశక్తులా ప్రయత్నించి చరిత్ర సృష్టించాలని అనుకుంటున్నాను. ఇప్పుడిదే నా లక్ష్యం’ అని 22 ఏళ్ల దీప తెలి పింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనే ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని అనుకున్నా, ఐదో స్థానం లో నిలిచానని చెప్పింది. అయితే ఇటీవల క్వాలిఫయింగ్ టోర్నీలో ఆమె 52.698 పాయింట్లు సాధించి ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఒక్కసారిగా వచ్చిన తాజా గుర్తింపుతో తానేమీ స్టార్ అథ్లెట్‌గా భావించడం లేదని, తన గురి అంతా పతకంపైనే ఉందని స్పష్టం చేసింది. -
దీపా కర్మాకర్ కు రూ.30 లక్షల ప్రోత్సాహకం
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన దీపా కర్మాకర్‌కు క్రీడల శాఖ ప్రోత్సాహకం ప్రకటించింది. ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డుకు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గురువారం రూ.30 లక్షల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. అయితే ఆ చిన్న మొత్తం దీపా కర్మాకర్ ఒలింపిక్స్ గేమ్స్‌లో పాల్గొనేందుకు సరిపోతాయా అనేది ప్రశ్నార్థకమే. కాగా త్రిపురకు చెందిన 22 ఏళ్ల దీప జిమ్నాస్టిక్స్‌లో అద్భుతాలు స్పష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. రియో డీ జెనీరియోలో ఫైనల్ క్వాలిఫయర్ లో 52.698 పాయింట్లు నమోదు చేసి అద్భుత ప్రతిభను కనబర్చింది. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా ఆమె ఇదివరకే రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వరల్డ్ జిమ్నాస్ట్ చాంపియన్‌షిప్‌కు కూడా దీపా కర్మకార్ అర్హత సాధించింది. -
దీపకు ప్రధాని ప్రశంస
కట్రా (జమ్మూ): మహిళల జిమ్నాస్టిక్ విభాగంలో భారత్ నుంచి తొలిసారిగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన దీపా కర్మాకర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ‘దీప భారత్ గర్వపడేలా చేసింది. ఒలింపిక్స్‌లో తొలిసారి భారత పుత్రిక జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనబోతోంది. అకుంఠిత దీక్షతోనే తాను అనుకున్నది సాధించగలిగింది. సౌకర్యాల లేమి ఆమె ప్రతిభను అడ్డుకోలేకపోయింది. జీవితంలో పైకి ఎదగాలంటే ఎవరైనా ఇలాంటి కృషి చేయాల్సిందే. ఎలాంటి సాకులు చూపకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి’ అని ప్రధాని సూచించారు. మరోవైపు ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని దీప తెలిపింది. -
దీపా కర్మకార్పై ప్రశంసల వర్షం
న్యూఢిల్లీ:ఈ ఏడాది బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మకార్పై సర్వత్రా ప్రశంలస వర్షం కురుస్తోంది. ఈ చారిత్రాత్మక ఫీట్‌తో ఆమె భారతీయ యువతకు ఆదర్శంగా నిలుస్తుందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొనియాడాడు. దీపా కర్మకార్ సాధించిన ఘనత అసాధారణమని సచిన్ పొగడ్తలతో ముంచెత్తాడు. దేశంలోని యువతలో మరింత స్ఫూర్తిని నింపడానికి ఆమె నమోదు చేసిన అరుదైన ఘనత కచ్చితంగా దోహదం చేస్తుందని తెలిపాడు. ఈ సందర్భంగా ఆమెకు సచిన్ శుభాకాంక్షలు తెలియజేశాడు. మరోవైపు దీపా సాధించిన ఘనత భారత జిమ్నాస్టిక్స్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిందంటూ క్రీడామంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రశంసించారు. బ్రెజిల్లో జరిగే రియో ఒలింపిక్స్‌కు దీపా కర్మాకార్ అర్హత సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా దీప రికార్డు నెలకొల్పింది. రియో డీ జెనీరియోలో ఫైనల్ క్వాలిఫయర్ లో 52.698 పాయింట్లు నమోదు చేసి అద్భుత ప్రతిభను కనబర్చింది. త్రిపురకు చెందిన 22 ఏళ్ల దీప జిమ్నాస్టిక్స్‌లో అద్భుతాలు స్పష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా ఆమె ఇదివరకే రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వరల్డ్ జిమ్నాస్ట్ చాంపియన్‌షిప్‌కు కూడా దీపా కర్మకార్ అర్హత సాధించింది. -
మెరుపుతీగలాంటి బామ్మ
తిక్క లెక్క ఫొటోలో కనిపిస్తున్న జర్మన్ బామ్మగారి పేరు జోహానా కువాస్. వయసు పదహారుకి జస్ట్ డెబ్బయి మాత్రమే ఎక్కువ. అయితేనేం..? జిమ్నాస్టిక్స్‌లో పదహారేళ్ల పడుచుపిల్లలతో కూడా సై అంటే సై అని పోటీ పడుతుంది ఈమె. సమాంతరంగా నిలిపి ఉంచిన లోహపు చువ్వలను ఆసరా చేసుకుని ఈమె చేసే చిత్రవిచిత్ర విన్యాసాలను చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే! యూట్యూబ్‌లో ఉంచిన ఈమె వీడియోలను ఇప్పటికే లక్షలాది మంది తిలకించారు. ఆ దెబ్బకు గిన్నెస్‌బుక్ కూడా ఆమె ప్రతిభాపాటవాలను గుర్తించింది. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జిమ్నాస్ట్‌గా ఆమె పేరును నమోదు చేసుకుంది. -
ఫీట్లు చెయ్యగలడు... ఈ గుంటడు గోడలెక్కగలడు!
నెట్ ఇంట్లో రెండేళ్ల అరట్ హుసైనీ గత జన్మలో గబ్బిలమై ఉంటాడు. అందుకే తలకిందులుగా వేళ్లాడగలుగుతాడు. కనీసం కోతి అయినా అయి ఉంటాడు. ఎందుకంటే ఆ బుడతడు కోతి కొమ్మచ్చి ఆడితే కోతులు సిగ్గుపడిపోతాయి. ఇవన్నీ కాకపోయినా ఖచ్చితంగా అమీబా అయి ఉంటాడు. ఎటు పడితే అటు శరీరాన్ని మెలిపెట్టేయగలడు. ఏ రూపమంటే ఆ రూపం దాల్చేయగలడు. హుసైనీ టీవీపై చేసే జిమ్నాస్టిక్లు చేయగలడు. గోడలపై ఎగబాకేయడాలు చేయగలడు. చిటారు కొమ్మల నుంచి వేలాడగలడు. చిన్న డబ్బాలో శీర్షాసనం వేయగలడు. చూస్తే ఔరా అనిపిస్తుంది. కాస్త ఖాళీగా ఉంటే చాలు పిల్లిమొగ్గలు వేస్తాడు. ఎత్తుల నుంచి దూకేస్తాడు. ఇరాన్‌కి చెందిన అరట్ హుసైనీ ఇన్స్టాగామ్ అకౌంట్‌కి గ్రాములు కాదు, కిలోలు కాదు, టన్నుల కొద్దీ అభిమానులున్నారు. ఏకంగా ఇరవై వేల మంది ఫాలోయర్ల్లు ఉన్నారు. ఈ గుంటడి ఘనకార్యాలను ఇన్స్టాగ్రామ్ విడియోల్లో చూడొచ్చు. http://www.buzzfeed.com/andreborges/pantles.va7x8pWn1 తప్పిపోయిన కొడుకు తల్లిని వెతుక్కుంటూ రావాలంటే ఇప్పుడు యాదోంకీ బారాత్ లాంటి పాటలు పాడాల్సిన అవసరం లేదు. అమర్, అక్బర్, ఆంథోనీలను కలిపే మన్మోహన్ దేశాయ్ లాంటి డెరైక్టర్ అంతకన్నా అవసరం లేదు. గూగుల్ ఎర్త్‌ను నమ్ముకుంటే చాలు, న్యూయార్క్ సబ్ వే మెట్లమీద ఎలుకైనా, ఇరాన్లో రెండేళ్ల హుసైనీ అయినా ఇన్స్టంట్ హీరోలు అయిపోవాలంటే నెట్ ఒక్కటి ఉంటే చాలు. నెట్ యుగంలో కొత్త దంపతులకు అరుంధతి, వశిష్టులను నక్షత్రాలుగా చూపించనక్కర్లేదు... పండుటాకులు లారా, హోవార్డ్ల యూట్యూబ్ విడియో చూపిస్తే చాలు. తినలేక వదిలేసిన ఆహారాన్ని ఆకలిగొన్నవారి నోళ్లలోకి పెట్టే ఆడమ్ స్మిత్ చేయూత... కర్తవ్యనిష్ఠకోసం జీవితంలోని అత్యంత ఆనందమయ క్షణాలను కూడా కాదనుకున్న గువో యువాన్ అనే నర్సు మంచి మనసు... ఎంచుకునే ఛాయిస్ మీది! కానీ వాళ్ల కథ చెప్పే వాయిస్ మాత్రం సోషల్ మీడియాదే! కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు! అన్నయ్య రైళ్లలో చెత్త ఊడుస్తున్నాడు. తమ్ముడికి ప్లాట్‌ఫారంపైనే నిద్ర పట్టేసింది. కళ్లు తెరిచి చూసేసరికి అన్నయ్య లేడు. ముందు ఒక రైలు ఆగి ఉంది. అన్నయ్య అందులో ఉన్నాడేమోనని అందులోకి మనవాడు ఎక్కేశాడు. అంతలో రైలు కదిలింది. ఆ రైలు కోల్‌కతాకి చేరింది. అక్కడి వేలాది వీధి బాలుళ్లలో మనవాడూ ఒకడయ్యాడు. కొన్నాళ్లకి అనాథాశ్రమం చేరుకున్నాడు. ఆ అనాథాశ్రమం అతడిని ఆస్ట్రేలియన్ దంపతులకు దత్తత ఇచ్చేసింది. కటికపేదరికం నుంచి కనక వర్షంలోకి వెళ్లాడు మనవాడు. కానీ మనను మ్యాప్ మీద ముద్రితమైన తన ఊరి రైల్వే ప్లాట్ ఫారం, పక్కనే జలపాతం, కొద్ది దూరంలో ఉన్న డ్యామ్ చిత్రాలు మాత్రం చెక్కు చెదరలేదు. సరూ అనే వీధిబాలుడి నుంచి సరూ బ్రెయర్లీగా మారిన మనవాడు గూగుల్ తల్లినే నమ్ముకుని కోల్‌కతా నుంచి 1200 కిమీ దూరంలో రైల్వే స్టేషన్, డ్యామ్, జలపాతం ఉన్న ఊరిని వెతికాడు. అలాంటి ఊరు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా అని తేలింది. అలా వెతుక్కుంటూ ఖాండ్వాకి వచ్చాడు. అక్కడకు చేరుకునేసరికి మనసు లోయల ముడుతల్లో దాగున్న జ్ఞాపకాలపై పొగమంచు పొరలు కరిగిపోయాయి. నేరుగా తన ఇంటికే వెళ్లి తలుపు తట్టాడు. తన వద్దనున్న చిన్నప్పటి ఫోటో చూపిస్తే తప్ప ఇంట్లో వాళ్లు 31 ఏళ్ల తర్వాత కాలం కలిసొచ్చిందని, తమ కొడుకే నడిచొచ్చాడని నమ్మలేకపోయారు. 1981 నుంచి 2012 దాకా ఖాండ్వా నుంచి కోల్‌కతా మీదుగా టాస్మేనియా వెళ్లి తిరిగొచ్చిన సరూ బ్రెర్లే నెట్ కనెక్టివిటీ ఉదంతం జస్ట్ కథకాదు, ఇది ఖరాఖండి నిజం. ఇప్పుడు సరూ కథ ’స్లమ్ డాగ్ మిలియనీర్’ దేవ్ పటేల్ హీరోగా ఒక సినిమాగా తయారవుతోంది. http://www.telegraph.co.uk/culture/film/11362518/Remarkable&story&of&lost&boy&who&found&mother&using&Google&Earth&after&25&years&to&become&film.html పిడికెడు బియ్యం - గుప్పెడు సాయం ఏడాదికి 1.3 బిలియన్ టన్నుల ఆహారం తినడానికి యోగ్యంగా ఉన్నా చెత్తకుప్పల్లోకి చేరుతోంది. ఇది మొత్తం ప్రపంచంలో తయారైన ఆహారంలో మూడో వంతు. తినడానికి యోగ్యంగా ఉన్నా చెత్తకుప్పల్లో పారేసే ఆహారాన్ని ఆకలిగొన్న వారికి అందిస్తే...? ఆడమ్ స్మిత్ అనే షెఫ్ గారికి ఇదే ఆలోచన వచ్చింది. 2013లో ఆయన ఇంగ్లండ్‌లో ఇలాంటి ఆహారాన్ని సేకరించి పేదలకు అతి తక్కువ ధరలకు ఇవ్వడం మొదపెట్టాడు. ఈ పనికి రియల్ జంక్ ఫుడ్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టాడు. మీకు తోచినంత ఇవ్వండి అని హోటళ్లకు పే యాజ్ యూ ఫీల్ అని నామకరణం చేశాడు. వ్యంగ్యాలు, వెటకారాలు, ఎత్తిపొడుపులు, విపరీతార్థాల్లాంటి విఘ్నాలన్నిటినీ దాటి, మూడేళ్లలో ఇప్పుడు ఈ ఉద్యమం 120 దేశాలకు పాకింది. వందలాది కార్యకర్తలు ఆడమ్ స్మిత్ భుజం తట్టి, నడుం కట్టి ముందుకొచ్చారు. ఇప్పుడు ఏడాదికి దాదాపు 200 టన్నుల ఆహారాన్ని పేదలకు చేరుస్తున్నాడు స్మిత్. అన్నానికి, ఆకలి కడుపుకి మధ్య వారధిగా నిలవడం భగవంతునికీ భక్తునికీ అనుసంధానం చేసినంత పుణ్యకార్యం. అలాంటి ఆడమ్ స్మిత్‌ను అభినందిద్దామా మరి! అంతకు ముందు మీరు చేయాల్సింది ఫేస్బుక్లో ది రియల్ జంక్ ఫుడ్ ప్రాజెక్ట్ పేజీ (http://www.therealjunkfoodproject.org/)ని లైక్ చేయడం. మోస్ట్ బ్యూటిఫుల్ నర్స్ ఆమె చైనాలోని మోస్ట్ బ్యూటిఫుల్ నర్స్! కొద్దిరోజుల క్రితం ఆమె చైనాలోని ఒక బీచ్‌లో కాబోయే భర్తతో వెడ్డింగ్ ఫోటో దిగుతోంది. ఖరీదైన వెడ్డింగ్ గౌన్, కాస్ట్లీ మేకప్‌తో ఆమె పోజు ఇస్తోంది. అంతలో సముద్రంలో ఒక వ్యక్తి మునిగిపోతూ కేకలు వేస్తున్నాడు. అతనికి నీళ్లలోనే గుండె పోటు వచ్చింది. అంతే! ఆమె పరుగులు తీసింది. అతడిని కాపాడేందుకు శతథా ప్రయత్నించింది. ఆఖరికి అతనికి తన నోటి ద్వారా కృతిమ శ్వాస కల్పించేందుకు కూడా ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో ఆమె ఖరీదైన గౌను పాడైపోయింది. విలువైన మేకప్ చెదిరిపోయింది. గోళ్లు విరిగిపోయాయి. అయినా ఆమె లెక్క చేయలేదు. తన జీవితంలోని అత్యంత ఆనందమయమైన క్షణాలను కూడా వదులుకుని కర్తవ్యనిష్ఠతో పనిచేసిన గువో యువాన్ యువాన్ అనే ఆ నర్సు మనసు ఎంతో అందమైనదని చైనా మీడియా ప్రశంసిస్తోంది. ఆమె సేవా తత్పరతే అసలైన అందమని ఆమె భర్త కూడా అంటున్నాడు. ప్రజలు ఆమెని చైనాలోని మోస్ట్ బ్యూటిఫుల్ నర్స్ అంటున్నారు. మన నర్సమ్మలు కూడా ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ నుంచి కాసింత నేర్చుకుంటే బాగుంటుందేమో కదూ! http://www.dailymail.co.uk/news/ peoplesdaily/article&3244492/ Nurse&hailed&prettiest&bride& China&trying&save&drowned& man&wearing&wedding&dress.html నీ నగుమోము నా కనులార కడదాకా..... ‘‘వయసున్న నాడే అనురాగము... వయసైన కొలదీ అనుబంధము’’ అని భానుమతి ఎప్పుడో చెప్పింది. ఆ మాట 93 ఏళ్ల లారా, 92 ఏళ్ల హోవార్డ్లను చూస్తే అక్షరాలా నిజం అనిపిస్తుంది. యౌవనంలో పెనవేసుకున్న అనురాగం, వార్థక్యంలో విడదీయరాని అనుబంధంగా మారింది. లారా మృత్యుశయ్య మీదుంది. తుది పిలుపుకోసం ఎదురుచూస్తోంది. హోవార్డ్ ఆమె భావోద్వేగంతో తడుముతూ, యౌవనంలో కలిసి పాడుకున్న పాటను ఆమె కోపం కన్నీళ్లు ఆపుకుంటూ పాడుతుంటే మరణశయ్య మీదున్న లారా పదే పదే ‘ఐ లవ్ యూ’ అంటుంది. రెండో ప్రపంచయుద్ధంలో పోరాడేందుకు హోవార్డ్ వెళ్లినప్పుడు లారా పదేపదే ఇదే పాట పాడుకునేది. ఆ తరువాత కూడా వారిద్దరూ ఈ పాట ఎన్నోసార్లు కలిసి పాడారు. ఆఖరి క్షణాల్లో అదే పాటను హోవార్డ్ ఆమె కోసం పాడుతుంటే ఎవరికైనా కంటి కొసల్లో కాసింతైనా తడి రాకుండా ఉండదు. ఒకటా రెండా ... 73 ఏళ్లుగా వారిద్దరిదీ సాహచర్యం, సహయాత్ర! చిన్న చిన్న విషయాలకే విడాకుల దాకా వెళ్లే నేటి తరం ఈ పండుటాకుల భావోద్వేగం, సహజీవన మాధుర్యాన్ని చూసి నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. ‘‘మన జంట జంటలకే కన్నుకుట్టిపోవాలి. ఇంక ఒంటరిగా ఉన్నవాళ్లు జంటలైపోవాలి’’ అనిపించే ఈ జంట విడియో ఈ వారానికే కాదు, ఏ వారానికైనా బెస్ట్ విడియోనే! https://www.youtube.com/watch?v=wWPOGhxkTE కూర్పు: కె. రాకా సుధాకరరావు www.sakshipost.com -
శరీరాన్ని విల్లులా వంచేశారు
-
వీళ్లు మనకు తెలుసునా..!
గతవారం ఢిల్లీలో క్రీడా ఆవార్డుల కార్యక్రమం ముగిసింది. జాతీయ మీడియా నుంచి ప్రాంతీయ మీడియా వరకూ అంతా రాజీవ్ ఖేల్ రత్న సానియా మీర్జా ఫోటోను ప్రముఖంగా ప్రచురించాయి. ప్రొఫెషనల్ టెన్నిస్ లో సానియా సాధించిన విజయాలకు ఖేల్ రత్న ఖచ్చితంగా సముచితమైన గౌరవమే..అయితే సానియా తో పాటు మరో డజను మంది ఆటగాళ్లు గత ఏడాది కాలంగా తమ తమ రంగాల్లో చూపిన అత్యుత్తమ ప్రదర్శనకు అర్జున అవార్డులు గెలుచుకున్నారు. దురదృష్ట వశాత్తు వీరిని మీడియా పట్టించుకోలేదు. అవార్డుల వెనక రాజకీయాలు... క్రీడా బోర్డుల అతి చొరవ, అనేక వివాదాలు మాత్రమే మీడియా దృష్టిని ఆకర్షస్తాయి. ఆటలంటే.. క్రికెట్, చెస్, సానియా, సైనాలు మాత్రమే కాదు అని ఎంతో మంది తమ అద్వితీయ ఆటతీరుతో నిరూపిస్తున్నా.. కోట్లాది భారతీయుల గుర్తింపునకు మాత్రం నోచుకోవడం లేదు.. అలాంటి అన్ సంగ్ హీరోస్ దేశంలో చాలా మందే ఉన్నా.. కనీసం ఈ ఏడాది రాష్ట్ర పతి చేతులతో అవార్డులు పొందిన క్రీడాకారుల ఎంత మంది మనకు తెలుసు.. ? సందీప్ కుమార్: ఆర్చరీ పూనేకి చెందిన సందీప్ కుమార్ ఆసియా క్రీడల్లో పటిష్ట కొరియాని మట్టి కరిపించి ఈ విభాగంలో తొలి బంగారు పతకాన్ని భారత్ కు అందించాడు. పూనమ్మ: అథ్లెటిక్స్ ఆఫ్రికా, యూరప్, అమెరికాలు డామినేట్ చేసే ఈ విభాగంలో మన పూవమ్మ ప్రపంచ 42 రెండో ర్యాంక్ లో కొనసాగుతోంది. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో 400మీటర్ల వ్యక్తిగత కాంస్య పతకంతో పాటు, బంగారు పతకం గెలుచుకున్న 4X400 మీటర్ల రిలే టీమ్ లో సభ్యురాలు. అంతే కాదు ఆసియా స్థాయిలో బోలెడు వ్యక్తిగ పతకాలు సాధించి.. అర్జున అవార్డుకు అర్హత పొందింది. దీపా కుమార్: జిమ్నాస్టిక్స్ జిమ్నాస్టిక్స్ లో దీపా కుమార్ చరిత్రే సృష్టించింది. గ్లాస్కో కామన్ వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించి.. ఈ విభాగంలో పోడియం ఫినిష్ ఇచ్చిన తొలి భారత మహిళగా రికార్డులకెక్కింది. ఆసియా క్రీడల్లో పతకం తృటిలో కోల్పోయినా.. దీపా ప్రదర్శన విమర్శకుల ప్రశంసలందుకుంది. శ్రీజేష్ : హాకీ మన జాతీయ క్రీడా హాకీలో అద్భుత ప్రదర్శనకు గానూ.. శ్రీజేష్ అర్జున అవార్డు అందుకున్నాడు. 2014 ఆసియా క్రీడల్లో బంగారు పతకం అందుకున్న భారత జట్టు గోల్ కీపర్ శ్రీజేష్. అంతే కాదు. ఈ క్రీడల్లో పాకిస్తాన్ మ్యాచ్ లో శ్రీజేష్ అద్వితీయ ప్రదర్శన ఆయనకు ఆర్జున అవార్డు తెచ్చిపెట్టింది. ఫైనల్లో పాకిస్థాన్ సంధించిన రెండు పెనాల్టీ స్ట్రోక్ లను శ్రీజేష్ అడ్డుకున్నాడు. ఇక 2014 ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో గోల్ కీపర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. సతీష్ కుమార్: వెయిట్ లిఫ్టింగ్ అనామకుడిగా కామన్ వెల్త్ క్రీడల్లో అడుగు పెట్టిన ఈ 23ఏల్ల తమిళనాడు క్రీడాకారుడు... 77 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో గేమ్స్ రికార్డు బద్దలు కొట్టడమే కాదు.. బంగారు పతకాన్ని సాధించాడు. స్వరణ్ సింగ్ : రోయింగ్ 2012 సమ్మర్ ఓలింపిక్స్ లో రోయింగ్ లో ఫైనల్ కు చేరిన స్వరణ్.... 2013 ఆసియా రోయింగ్ చాంఫియన్ షిప్ లో బంగారు పతకం సాధించాడు. ఇక 2014 ఆసియా క్రీడల్లో తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతూ కూడా కాంస్య పతకాన్ని సాధించాడు. ఇక అందరికంటే స్పెషల్ క్రీడాకారుడిని వరించి అర్జున అవార్డు మరింత వన్నెలద్దుకుంది. అతని పేరు శరత్ గైక్వాడ్. వివిద విభాగాల్లో అత్యధిక మెడల్స్ సాధించిన ప్రఖ్యాత క్రీడాకారిణి పీటీ ఉష రికార్డును బద్దలు కొట్టిన శరత్ బెంగుళూరు వాసి. 2014 ఆసియా క్రీడల్లో ప్యారా స్విమ్మింగ్ విభాగంలో 6 పతకాలు సాధించాడు. 2012లండన్ ఒలింపిక్స్ లో పాల్గొన్న శరత్.. భారత్ తరఫున పారాలంపిక్స్ కు వెళ్లిన తొలి భారతీయ క్రీడాకారుడు కావడం గమనార్హం. -
‘అరుణ’ పతాకం ఎగిరేనా!
‘కామన్వెల్త్’లో నేడు హైదరాబాదీ విన్యాసాలు పతకం వస్తుందన్న ఆశలో అభిమానులు సాక్షి, సిటీబ్యూరో: కామన్వెల్త్ గేమ్స్‌లో హైదరాబాదీ అరుణారెడ్డి మంగళవారం తన విన్యాసాలు ప్రదర్శించనున్నారు. యూసుఫ్‌గూడలోని సెయింట్‌మేరీస్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న అరుణారెడ్డి మనదేశం తరఫున ఆర్టిస్టిక్స్, జిమ్నాస్టిక్స్ విభాగంలో విన్యాసాలను ప్రదర్శించేందుకు వెళ్లిన ఐదుగురు సభ్యుల్లో ఒకరు. దక్షిణ భారతదేశం నుంచి ఆమె ఒక్కరే ఈ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాజేంద్రనగర్‌లో నివాసం ఉండే అరుణ గతంలో వరల్డ్ స్కూల్ గేమ్స్(దోహ), జూనియర్ ఏషియన్ చాంపియన్‌షిప్(జపాన్)లలో అద్భుత ప్రతిభ కనబరిచారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకు గ్లాస్గోలోని ఎస్ఎస్ఈ హైడ్రోలో జరిగే ఈవెంట్ లో అరుణ భారతదేశం తరఫున ఫోర్స్ ఈవెంట్, అన్ఈవెన్బార్స్, బ్యాలెన్సింగ్భీం, వాల్ట్ విభాగాల్లో పోటీ పడనుంది. కామన్వెల్త్ గేమ్స్ కోసం జనవరి నుంచి ఢిల్లీలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న అరుణ ఈసారి తప్పకుండా పతకంతో తిరిగి వస్తుందని ఆమె సన్నిహితులు, బంధువులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. -
గగన్ సతీశ్... గ్రేట్ ఫీట్!
ఒంటిని విల్లులా వంచి చేసేది జిమ్నాస్టిక్స్. దానికి స్కేటింగును మిక్స్‌చేసి, ఏకంగా గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు ఓ ఆరేళ్ల బాలుడు. అతడు ఏ విదేశీయుడో కాదు. మన భారతీయ పిల్లాడు. బెంగళూరుకు చెందిన బుడ్డోడు. శరీరాన్ని నేలకు వంచి... శక్తిని క్రోడీకరించుకొని... ఐదే సెంటీమీటర్ల గ్యాప్‌తో... కేవలం 29 సెకనుల్లో 230 అడుగుల దూరం దూసుకెళ్లాడు... అది కూడా పార్క్‌చేసి ఉన్న 39 కార్ల కింద నుంచి! చూసే వాళ్లలో ఆశ్చర్యం. ఆ వెనువెంటనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం! ఈ ఘనతను సాధించిన చిన్నారి గగన్ సతీష్! గగన్ శరీరం ఒక ధనుస్సులాంటిదని మొదట్లోనే గ్రహించారట తల్లిండ్రులు హేమ, రాజన్నలు. అందుకే తనను ఏదైనా క్రీడలో ప్రావీణ్యుడిని చేద్దామని భావించారట! ‘తనకు సరైన కోచింగ్ ఇచ్చి క్రీడాకారుడిని చేద్దామని అనుకొన్నాం. అందుకు తగ్గట్టుగా మూడేళ్ల వయసు నుంచే సతీశ్ స్కేటింగ్ మీద ఆసక్తిని పెంచుకొన్నాడు. దాంతో అందులోనే శిక్షణనిప్పించాం. రోలర్‌స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఎన్నోసార్లు గాయపడ్డాడు. అయినా బెదిరేవాడు కాదు. మానేస్తాను అనేవాడు కూడా కాదు. పట్టుదలతో సాధించాడు’ అంటారా తల్లిదండ్రులు పుత్రోత్సాహంతో. మామూలుగా చిన్నపిల్లలో ఉండే బద్దకం, మారాం చేయడం వంటి లక్షణాలు గగన్‌లో మచ్చుకు కూడా కనిపించవు. ఉదయం ఐదింటికే లేస్తాడు. తండ్రితో కలిసి హుషారుగా కోచింగ్ క్లాసులకు వెళ్లిపోతాడు. కొన్ని గంటలసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత అట్నుంచటే స్కూల్‌కు వెళ్లిపోతాడు. సాయంత్రం బడి ముగిసాక మళ్లీ ప్రాక్టీస్ మొదలు. తన ఆసక్తి చూస్తే ముచ్చటేస్తుందంటూ ఉంటారు గగన్ కోచ్ యతీశ్గౌడ! 39 వాహనాల కిందనుంచి స్కేటింగ్ చేయడాన్ని గొప్ప విజయంగా భావించడం లేదు గగన్. వంద కార్ల కింద నుంచి వెళ్తే, అప్పుడు సంతోష పడతానంటున్నాడు. అంతే కాదు... ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని ముద్దు ముద్దు మాటలతో చెబుతున్నాడు. చిన్న వయసులోనే ఇంతటి బలమైన లక్ష్యాలను ఏర్పరచుకున్నవాడు... ఆ లక్ష్యాన్ని సాధించకుండా వదిలిపెడతాడా!