![Jammu girl Arshiya Sharma gets standing ovation at America Got Talent for her spooky dance performance](/styles/webp/s3/article_images/2024/06/9/Arshiya-dance.jpg.webp?itok=32RdKNMq)
వైరల్
నృత్య ప్రదర్శనలో ఆకట్టుకునే అందమైన డ్రెస్ అనేది కామన్. ఆర్షియా మాత్రం భయపెట్టే డ్రెస్‌తో, హారర్ లుక్‌తో స్టేజీ మీదికి వచ్చింది. ‘ఇదేం లుక్కు బాబోయ్’ అనుకునేలోపే తన అద్భుత నృత్యప్రతిభతో ప్రేక్షకులను అబ్బురపరిచింది.
‘అమెరికాస్ గాట్ టాలెంట్’ టీవీ షో న్యాయనిర్ణేతలు ‘వావ్’ అనుకునేలా చేసింది.
జమ్మూ కశ్మీర్‌కు చెందిన 13 ఏళ్ల ఆర్షియా శర్మ స్వదేశం దాటి వేరే దేశానికి రావడం ఇదే తొలిసారి. ఈ ఇంటర్నేషనల్ షోలో ΄ాల్గొనడానికి ముందు ఆర్షియా శర్మ లిటిల్ మాస్టర్స్, సూపర్ డ్యాన్సర్ 4 లాంటి షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అంతర్జాతీయ వేదికపై చప్పట్లతో ‘ఆహా’ అనిపించుకున్న ఆర్షియా ప్రత్యేకత ఏమిటి... అనే విషయానికి వస్తే....డాన్స్‌కు జిమ్నాస్టిక్స్ జోడించి ‘వారెవ్వా’ అనేలా చేసింది. ఆర్షియ ‘డ్యాన్సమ్నాస్టిక్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment