Dance performances
-
డ్యాన్సమ్నాస్టిక్
నృత్య ప్రదర్శనలో ఆకట్టుకునే అందమైన డ్రెస్ అనేది కామన్. ఆర్షియా మాత్రం భయపెట్టే డ్రెస్‌తో, హారర్ లుక్‌తో స్టేజీ మీదికి వచ్చింది. ‘ఇదేం లుక్కు బాబోయ్’ అనుకునేలోపే తన అద్భుత నృత్యప్రతిభతో ప్రేక్షకులను అబ్బురపరిచింది. ‘అమెరికాస్ గాట్ టాలెంట్’ టీవీ షో న్యాయనిర్ణేతలు ‘వావ్’ అనుకునేలా చేసింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన 13 ఏళ్ల ఆర్షియా శర్మ స్వదేశం దాటి వేరే దేశానికి రావడం ఇదే తొలిసారి. ఈ ఇంటర్నేషనల్ షోలో ΄ాల్గొనడానికి ముందు ఆర్షియా శర్మ లిటిల్ మాస్టర్స్, సూపర్ డ్యాన్సర్ 4 లాంటి షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.అంతర్జాతీయ వేదికపై చప్పట్లతో ‘ఆహా’ అనిపించుకున్న ఆర్షియా ప్రత్యేకత ఏమిటి... అనే విషయానికి వస్తే....డాన్స్‌కు జిమ్నాస్టిక్స్ జోడించి ‘వారెవ్వా’ అనేలా చేసింది. ఆర్షియ ‘డ్యాన్సమ్నాస్టిక్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Ayodhya Ram Mandir: ఆహూతులను ఆకట్టుకున్న నృత్య, సంగీత ప్రదర్శనలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణ ప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన నృత్య, సంగీత,నాటక ప్రదర్శనలు మంత్రిముగ్ధుల్ని చేశాయి. రామ చరితతోపాటు, 500 ఏళ్ల నుంచి రామ మందిర ప్రాణ ప్రతిష్ట వరకు జరిగిన విశేషాలను ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. ‘బధాయ్, చారీ, గూమర్, భవాయ్, ఝుమర్, ధోబియా, రాయ్, రస్లీల, మయూర్, ఖయాల్ నృత్యం, సతారియా’వంటి జానపద నృత్యాలతో కళాకారులు అమితానందం కల్గించారు. భరతనాట్యం, ఒడిస్సీ, కూచిపూడి, మణిపూరి, మోహని ఆట్టం, కథాకళి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్యాల ప్రదర్శనలు జరిగాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ప్రాణ ప్రతిష్ఠ ముగిసేదాకా ఈ నృత్య ప్రదర్శనలు జరిగాయి. సినీ, క్రీడా రంగ ప్రముఖులు, వ్యాపార, రాజకీయ దిగ్గజాలు ఈ నృత్య, సంగీత, నాటక ప్రదర్శనలను సెల్ఫోన్లలో బంధించారు. చలనచిత్ర, సంగీత కళాకారులు బాల రాముడిపై అభిమానాన్ని పాటల రూపంలో చాటారు. ప్రముఖ సంగీత కళాకారులు శంకర్ మహదేవన్, సోను నిగమ్ ‘రామ్ భజన్’ చేశారు. అనురాధ పౌడ్వాల్, మాలినీ అవస్తీ ‘రామాష్టకం’తో అలరించారు. ‘రాం సియా రాం’ అంటూ సోను నిగం పాడిన పాట ఆకట్టుకుంది. -
ఏడు నృత్య రీతుల్లో గురు దక్షిణ
ఆది గురువు పరమ శివుడికి అద్భుతమైన గురు దక్షిణ సమర్పించారు ప్రవాస భారతీయులు. ద్వాదశ జ్యోతిర్లింగాల మహిహను ఏడు సంప్రదాయ నృత్య రీతుల్లో అమోఘంగా ప్రదర్శించారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని సామవేదం షణ్ముఖశర్మ రచించిన శివపద కీర్తనలకు అమెరికా , రష్యా దేశాల్లో నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. జులై 23వ తేదిన రుషిపీఠం వేదికగా ఈ వర్చువల్ నృత్య ప్రదర్శన జరిగింది. మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథుడి ఆవిర్భావఘట్టం నుంచి మొదలు పెట్టి ద్వాదశ జ్యోతిర్లింగాలను వర్ణిస్తూ సామవేదం షణ్ముఖశర్మ రచించిన కీర్తనలకు అనుగుణంగా నృత్య ప్రదర్శన చేశారు. ప్రముఖ నాట్యకారిణి వాణీ గుండ్లపల్లి వన్ నెస్ ఆఫ్ గాడ్ అనే కాన్సెప్ట్‌తో భారత దేశం లోని పన్నెండు జ్యోతిర్లింగాల విశిష్టతను ఏడు శాస్త్రీయ నృత్య రీతులలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అమెరికా, రష్యా దేశాలకు చెందిన 11 నృత్య శిక్షణాలయాలకు చెందిన 58 మంది గురు- శిష్యుల బృందం పాల్గొన్నారు. ఆది గురువు పరమ శివుడి జ్యోతిర్లింగాలతో పాటు పరమేశ్వరుడి మహిమను కళ్లకు కట్టినట్టుగా కూచిపూడి, భరతనాట్యం, మొహినియాట్టం, మణిపురి , ఒడిస్సి , కథక్ , ఆంధ్రనాట్య నృత్య రీతులలో సమ్మోహనకరంగా ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో రాజేష్ శిష్యబృందం (కూచిపూడి), చందన శిష్యబృందం, నైనా శిష్య బృందాలు (భరత నాట్యం), భిధీష, సీమ శిష్యబృందాలు (ఒడిస్సీ) సరస్వతి శిష్యబృందం (మోమినియట్టం), హేమ శిష్యబృందం (ఆంధ్ర నాట్యం), మిత్ర శిష్యబృందం (మణిపురి), ప్రగ్య , దిపన్విత శిష్యబృందాలు (కథక్)లు ప్రదర్శించారు. గురుపౌర్ణమి సందర్భంగా పరమ శివుడి గొప్ప నృత్య రూపకంగా గొప్పగా ప్రదర్శించారంటూ వాణీ గుండ్లపల్లి , రవి గుండ్లపల్లిలను సామవేదం షణ్ముఖ శర్మ అభినందించారు. సామవేదం షణ్ముఖ శర్మ తెలుగు, సంస్కృత భాషలలో 1100 పైగా శివపదం కీర్తనలు రచించారు. వాటిలో దాదాపు 200 పైగా కీర్తనలకు స్వరకల్పన జరిగింది. -
ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ డ్యాన్స్
-
నాట్యం.. ప్రణామ నృత్యం..
-
ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
విజయవాడ కల్చరల్ : స్వరాజ్యమైదానంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన కళావేదికపై సోమవారం నిర్వహించిన కూచిపూడి నృత్యాంశాలు ఆకట్టుకున్నాయి. బాలానందం నిర్వాహకురాలు పద్మశ్రీ హేమంత్ బృందం నృత్యాంశాలను ప్రదర్శించింది. గణపతి ప్రార్థనతో ప్రారంభమై పుష్పాంజలి, అన్నమాచార్య కీర్తన, లేఖ్యాభరణి కథక్ నృత్యం, వినాయక కౌత్వం, చందన చర్చిత శరణం భవ తదితర నృత్యాంశాలను ప్రదర్శించారు. మాలిక, లేఖ్యాభరణి, ప్రియాంక, లహరి, కార్తికేయ తదితర చిన్నారులు నృత్యాన్ని అభినయించారు. అనంతరం వివిధ రంగాల్లోని ప్రముఖులు న్యాయవాది వరప్రసాద్, సినీ దర్శకుడు ఎస్.గోపాలకృష్ణ, రచయిత అతిథి వెంకటేశ్వరరావు, కళాపోషకులు గంగిరెడ్డి బాబూరావు, విద్యాదాత గోవాడ రాబర్ట్, ఆకాశవాణి ఉద్యోగి బి.జయప్రకాష్, నటుడు బండి రామచంద్రరావు, నాట్యాచార్య సురేంద్ర, రచయిత కృష్ణమోహన్ , కళాకారుడు జి.బాబూరావు, నాటక రంగప్రముఖులు ఎస్డీ అమీర్ భాషా తదితరులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. 30న సంప్రదాయ వస్త్రధారణ పోటీలు ఈనెల 30వ తేదీన సంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహిస్తునట్లు నిర్వాహకుడు నాని తెలిపారు. ఈ పోటీల్లో 16 నుంచి 25 సంత్సరాలలోపు మహిళలు పాల్గొనాలని, వివరాలకు 92464 72100 నంబరులో సంప్రదించాలని సూచించారు. -
గచ్చిబౌలిలో శాంతి సరోవర్ వార్షికోత్సవం