ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
విజయవాడ కల్చరల్ : స్వరాజ్యమైదానంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటుచేసిన కళావేదికపై సోమవారం నిర్వహించిన కూచిపూడి నృత్యాంశాలు ఆకట్టుకున్నాయి. బాలానందం నిర్వాహకురాలు పద్మశ్రీ హేమంత్ బృందం నృత్యాంశాలను ప్రదర్శించింది. గణపతి ప్రార్థనతో ప్రారంభమై పుష్పాంజలి, అన్నమాచార్య కీర్తన, లేఖ్యాభరణి కథక్ నృత్యం, వినాయక కౌత్వం, చందన చర్చిత శరణం భవ తదితర నృత్యాంశాలను ప్రదర్శించారు.
మాలిక, లేఖ్యాభరణి, ప్రియాంక, లహరి, కార్తికేయ తదితర చిన్నారులు నృత్యాన్ని అభినయించారు. అనంతరం వివిధ రంగాల్లోని ప్రముఖులు న్యాయవాది వరప్రసాద్, సినీ దర్శకుడు ఎస్.గోపాలకృష్ణ, రచయిత అతిథి వెంకటేశ్వరరావు, కళాపోషకులు గంగిరెడ్డి బాబూరావు, విద్యాదాత గోవాడ రాబర్ట్, ఆకాశవాణి ఉద్యోగి బి.జయప్రకాష్, నటుడు బండి రామచంద్రరావు, నాట్యాచార్య సురేంద్ర, రచయిత కృష్ణమోహన్ , కళాకారుడు జి.బాబూరావు, నాటక రంగప్రముఖులు ఎస్‌డీ అమీర్ భాషా తదితరులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
30న సంప్రదాయ వస్త్రధారణ పోటీలు
ఈనెల 30వ తేదీన సంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహిస్తునట్లు నిర్వాహకుడు నాని తెలిపారు. ఈ పోటీల్లో 16 నుంచి 25 సంత్సరాలలోపు మహిళలు పాల్గొనాలని, వివరాలకు 92464 72100 నంబరులో సంప్రదించాలని సూచించారు.