TV show
-
చూసి తెలుసుకోదగ్గ డాక్యుమెంటరీ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో బాలీవుడ్ చిత్రం ది రోషన్స్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ జీవితమనే చక్రంలో కొందరి వంతు వస్తుంది, కొందరి వంతు ముగుస్తుంది. ముగిసిన వారి జ్ఞాపకాలు మన మనసులో పదిలంగా ఉంటాయి. వారిలో ఎందరో మహానుభావులుంటారు. వారి జ్ఞాపకాలైతే మనం నెమరువేసుకోవచ్చేమో కానీ ఆ కాలంలో వారు పడ్డ కష్టం, ఆనందం కానీ మనకు తెలియవు. అటువంటి వారి జీవిత చక్రానికి వెండితెర రూపమిస్తే మన ఆనందం అవధులు దాటుతుంది.ఆ కోవకు చెందినదే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ది రోషన్స్’ టీవీ షో. ఇదో డాక్యుమెంటెడ్ మినీ సిరీస్. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి జీవిత చక్రాలకు తెర రూపమే ఈ షో. బాలీవుడ్ దిగ్గజ రోషన్ కుటుంబానికి చెందిన నాటి సంగీత కళాకారులు రోషన్ లాల్ నాగ్రత్ నుండి నేటి తరం నటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) వరకు... వారి జీవిత ప్రయాణాన్ని ఎంతో అందంగా చూపించారు.ఈ డాక్యుమెంటరీలో. ఓ రకంగా చెప్పాలంటే మనం ఈ షో ద్వారా నాలుగు తరాలు ప్రయాణిస్తాం. ముందుగా రోషన్ కుటుంబం నుండి రోషన్ లాల్ నాగ్రత్ సంగీత ప్రయాణంతో ఈ షోప్రారంభమై ఆ పై అతని కొడుకు రాజేష్ రోషన్ బాలీవుడ్ ప్రయాణంతో సాగి, ఆ తరువాత ఆయన కొడుకు రాకేశ్ రోషన్ నటనా ప్రయాణంతో పాటు ప్రోడ్యూసర్‌గా ఎలా రాణించారు? అన్నది చూపిస్తూ నేటి తరం కథానాయకుడు హృతిక్ రోషన్ బాలీవుడ్ ప్రయాణంతో షో ముగుస్తుంది.ఈ షో ద్వారా నాటి బాలీవుడ్ సంగీతం నుంచి నేటి తరం సినిమాల వరకు మనకు తెలియని ఎన్నో రహస్యాలతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలోని అప్పటి ఒడిదుడుకులను ఇప్పటి పట్టు విడుపులను సవివరంగా చూపించారు. ఈ రోషన్ కుటుంబానికి బాలీవుడ్ పరిశ్రమలో ఉన్న నాటి, నేటి దిగ్గజాలు తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేక్షకులకు చెప్పడం మరింత బావుంది. అందుకే ‘ది రోషన్స్’ చూసి నేర్చుకోదగ్గ, తెలుసుకోదగ్గ డాక్యుమెంటరీ. ఇది ప్రతి సినిమా ప్రేక్షకుడు తమ వ్యక్తిగత లైబ్రరీలో భద్రపరుచుకోదగ్గ డాక్యుమెంటెడ్ మినీ సిరీస్. వర్త్‌ఫుల్ టు వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది: ఫరియా అబ్దుల్లా
డ్యాన్స్ లవర్స్‌ను మెప్పించిన ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1’(Dance Ikon) కు కొనసాగింపుగా ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2(Dance Ikon 2) వైల్డ్‌ఫైర్’ రానుంది. ఫిబ్రవరి 14 నుంచి ఈ షో ఆహా ఓటీటీలో ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. ఈ షోకు ఓంకార్(Ohmkar), హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. ‘డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్‌ఫైర్’ షోలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటారని, హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్స్‌తో ఈ డ్యాన్స్ షో వీక్షకులను అలరిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘డ్యాన్స్ ఐకాన్ 2’ షో ప్రెస్మీట్లో హోస్ట్స్‌లో ఒకరైన ఓంకార్ మాట్లాడుతూ– ‘‘డ్యాన్స్ ఐకాన్ 2–వైల్డ్‌ఫైర్’లో ఐదుగురు కంటెస్టెంట్స్ సర్ప్రైజ్ చేస్తారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లల పెర్ఫార్మెన్స్లు చర్చనీయాంశమవుతాయి. ముగ్గురు హోస్ట్‌లతో పాటు సింగర్ జాను లైరి, ప్రకృతి, మానస్, దీపిక ఈ నలుగురు మెంటార్స్ ఉంటారు. ‘డ్యాన్స్ ఐకాన్ 2: వైల్డ్ ఫైర్’ వీక్షకులకు హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంప్లీట్ డ్యాన్స్ షో’’ అని అన్నారు.ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ–‘‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1’కు కూడా నన్ను హోస్ట్‌గా అడిగారు. కానీ, ఆ సమయంలో చేయలేకపోయాను. ఇప్పుడు ఓంకార్, శేఖర్ మాస్టర్లతో కలిసి హోస్ట్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ప్రతి ఎపిసోడ్ అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. ఈ షో వీక్షకులకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని గ్యారంటీగా చెప్పగలను’’ అని తెలిపారు. ‘‘ఈ షోలో వీక్షకులను సర్ప్రైజ్ చేసే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు ఉంటాయి’’ అని చె΄్పారు శేఖర్ మాస్టర్. ఈ కార్యక్రమంలో మెంటార్ యశ్, మెంటార్ మానస్, సింగర్ జాను లైరి, మెంటార్ ప్రకృతి మాట్లాడారు. -
ఇది అన్ని టాక్ షోలలా ఉండదు
ప్రస్తుత జెనరేషన్‌కు మార్పు అన్నది ఆక్సిజన్ లాంటిది. ప్రతిక్షణం నిత్య నూతనంగానే కాదు వినూత్నంగా చూడాలని కోరుకుంటుంది నేటి తరం. మామూలుగా ఇంటర్వ్యూ, టాక్ షోలంటే ఇద్దరు ఎదురెదురుగా పద్ధతిగా కూర్చోవడం నుండి నడుస్తూ మాట్లాడడం వరకు చూశాం. నాటి దూరదర్శన్ టాక్ షోల నుండి నేటి ఓటీటీ టాక్ షోల వరకు ఇంచుమించుగా ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. కానీ వాటన్నిటికీ విభిన్నంగా నేటి తరం నేటివిటీకి దగ్గరగా ‘ది రానా దగ్గుబాటి షో’ ఉంది. దీనికి హోస్ట్‌గా పేరుకు తగ్గట్టే నేటి ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి వ్యవహరించడం విశేషం. ఈ కార్యక్రమం స్ట్రీమ్ అయ్యేకన్నా ముందు ప్రముఖ యాంకర్ సుమతో ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రమోషనల్ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు.ఆప్రోమోలోనే ఈ షోకి సంబంధించిన కాన్సెప్ట్ రిలీజ్ చేశారు. ప్రోమోలో సుమ స్టూడియోకి వచ్చి రానాను కలుస్తుంది. ‘టాక్ షో అన్నావు కదా... గెస్టులు ఎవరు? దానికి సంబంధించిన అధికారిక అనౌన్సమెంట్ ఇలా ఉండాలి’ అని రానాకి సూచిస్తుంటే, ‘నేను టాక్ షో అన్నాను కానీ అనౌన్స్మెంట్, ఇంట్రో అని చెప్పలేదు కదా... చాలా షోస్ ఇలానే రొటీన్‌గా చేస్తున్నావు కదా.. మా టాక్ షో వాటన్నిటికీ విభిన్నం’ అని రానా చెబుతారు. రానా అన్నట్టే ఇప్పటిదాకా తెలుగులో వచ్చిన టాక్ షోస్ సంప్రదాయాన్ని ‘ది రానా దగ్గుబాటి షో’ బ్రేక్ చేసిందనే చెప్పాలి.ముఖ్యంగా ఈ షోలో రానా హోస్ట్ అనే కంటే వచ్చిన గెస్ట్‌లతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ క్యాజువల్‌గా షో నడపడం చాలా బాగుంది. ఈ షో మొదటి ఎపిసోడ్లో భాగంగా ప్రముఖ తెలుగు హీరో నాని, ‘హను– మాన్’ ఫేమ్ తేజ సజ్జా, నటి ప్రియాంకా మోహన్ అతిథులుగా వచ్చారు. వారిని షోలకి పిలవడం దగ్గర నుండి వాళ్ళతో మాట్లాడడం, ఆటలాడడం అంతా సరికొత్తగా అనిపిస్తుంది. ఎదుటివారి అభిరుచిని కనిపెట్టడం మీడియాలో దర్శకులకు తెలిసినంత మరెవరికీ తెలిసుండదు. అలా వాళ్లు ప్రేక్షకుల నాడిని పడతారు కాబట్టే వారి కాన్సెప్ట్స్ ప్రేక్షకాదరణ పొందుతాయి. దానికి నిలువెత్తు నిదర్శనమే ఈ ‘ది రానా దగ్గుబాటి షో’. ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ షో వర్తబుల్... వాచిట్. – హరికృష్ణ ఇంటూరు -
అలా పిలిస్తే నా లక్ష్యం నెరవేరినట్టే!
తెనాలి: మోక్ష... టీవీ షో, సీరియల్, వెబ్ సిరీస్‌ల ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. మూడున్నరేళ్లకే కెమెరా ముందు కనిపించింది. 13 ఏళ్లకు బాలనటిగా స్టార్‌డమ్‌ను తెచ్చుకుంది. తన అద్భుత నటనతో పద్మమోహన అవార్డు, జాతీయ ప్రతిభా పురస్కార్ సహా 19 అవార్డులను గెలుచుకుంది. ఇటీవల బాలల దినోత్సవంలో భాగంగా జరిగిన వివేక కల్చరల్ ఫెస్ట్‌లో బాల అతిథిగా తన మాట, ఆట, పాటతో సందడి చేసింది. ఈ నేపథ్యంలో పలుకరించిన ‘సాక్షి’తో బోలెడు కబుర్లు పంచుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘ నా పూర్తి పేరు మోక్ష విజయ రామలక్ష్మి. తల్లిదండ్రులు సురేష్‌బాబు, శంకరీ రాజ్యలక్ష్మి. స్వస్థలం రాజమహేంద్రవరం. మూడున్నరేళ్ల వయసులో ఓ ఫంక్షనుకు తీసుకెళ్లారు. అక్కడే టీవీ షోకు ఆడిషను జరుగుతోంది. నన్ను చూసి బాగుందనటంతోపాటు ఆడిషనులో కూర్చోబెట్టారు. సెలెక్టు చేసుకున్నారు. అందరికీ టికెట్లు పంపి, హైదరాబాద్‌కు ఆహ్వానించారు. అలా ఊహ తెలీని వయసులో ‘పిల్లలు పిడుగులు’ టీవీ షోలో నటించాను. తర్వాత అవకాశాలు వరుసకట్టాయి. హైదరాబాద్‌కు వచ్చేశాం..నాన్నకు ఊరిలో ఉన్న అట్టల ఫ్యాక్టరీని లీజుకిచ్చి హైదరాబాద్‌కు వచ్చేశారు. అమ్మ ఇక్కడే ‘అమెజాన్’లో వర్క్ చేస్తోంది. పలు టీవీ ఛానళ్లలో ‘అయస్కాంతం’, ‘కోడలు’, ‘సూర్యకాంతం’, ‘గుండమ్మకథ’, ‘శుభస్య శీఘ్రం’, ‘నువ్వేకావాలి’ సీరియల్స్, ‘పిల్లలు పిశాచాలు’తో ఆరంభించి ‘డ్రామా జూనియర్స్’, ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ వంటి టీవీ షోలు, ‘మ్యూజిక్ స్కూల్’, ‘హీరో’ సినిమాలు, మరికొన్ని వెబ్ సిరీస్‌లలో నటించాను. కొన్ని కంటిన్యూ అవుతున్నాయి. విభిన్న కళల్లోనూ ప్రతిభ నటనే కాదు.. రచన, చిత్రలేఖనం, డ్యాన్స్, యాంకరింగ్ నాకిష్టం. సినీనటులు శ్రేయ, నాని, అనసూయ ఈ విషయం తెలిసి ప్రశంసించారు. ప్రముఖ యాంకర్ సుమ, ‘నా తర్వాత నువ్వే మోక్ష’ అనటం సంతోషమేసింది. రచనంటే ఇష్టమని చెప్పాకదా... నేను మూడు కథలు రాసుకున్నా. అందులో రెండు షార్ట్ ఫిలిమ్స్, మరోటి వెబ్ సిరీస్. శివుడుకి సంబంధించిన భక్తిపూర్వక కథనం. నాకొచ్చిన కలను డెవలప్ చేసి కథ, స్క్రిప్టు సిద్ధం చేశా. నా దర్శకత్వంలోనే తీయాలని ఆశ పడుతున్నా. తగిన ప్రొడ్యూసర్ ముందుకొస్తే వెబ్ సిరీస్ తీసి, అతి పిన్న దర్శకురాలు అనిపించుకోవాలని ఆశిస్తున్నా. కథానాయిక కావాలనేదే లక్ష్యంపెద్దయ్యాక హీరోయిన్గా నటించాలనేది నా మరో డ్రీమ్. హైదరాబాద్‌లోనే తొమ్మిదో తరగతి చదువుతున్నా. నెలలో రెండు వారాలు బడికి, రెండు వారాలు షూటింగులకు కేటాయించుకున్నా. ఎక్కడకు వెళ్లిన బుక్స్ వెంటే ఉంటాయి. షూటింగ్ గ్యాప్‌లో చదువుకుంటా. పరీక్షల్లో 90 శాతం పైగానే మార్కులు వస్తుంటాయి. కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్నా. నా కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఎంతో త్యాగం చేశారు. చదువు, నటన, రచన... అన్నింటిలోనూ గెలిచి, నా తల్లిదండ్రులను గెలిపిస్తూ ఉండాలనేది నా ఆశయం. టాలెంట్ ఉంటే బోలెడు వేదికలుటీవీ, ఓటీటీ ప్లాట్‌ఫాంలు వచ్చాక చిన్న పిల్లల్నుంచి పెద్దల వరకు నటన, సాంకేతిక నైపుణ్యంలో ఎన్నో అవకాశాలున్నాయి. టాలెంట్ ఉన్నవాళ్లు అలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాణించవచ్చు. పిల్లలు చదువుతోపాటు ఏదో ఒక కళలో నైపుణ్యం సాధించాలనేది నా భావన. అప్పుడు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారని చెబుతాను. అందుకు నేనే నిదర్శనం. తెనాలి, రాజమహేంద్రవరం అంటే నాకెంతో ఇష్టం. ఎందరో కళాకారులు ఇక్కడ్నుంచి వచ్చారు. మహానటి సావిత్రి నాకు ఆదర్శం. ఆమె సినిమాలు ఇప్పటికీ ఎవర్‌గ్రీనే కదా!’’ -
జీ తెలుగు ‘స రే గ మ ప - సీజన్ 16’ .. త్వరలో
తెలుగు నాట సంగీతానికి సంబంధించిన రియాల్టీ షోలు బుల్లితెరపై బహుళ ఆదరణ సంపాదించాయి. అలాంటి వాటిల్లో ఒకటి జీ తెలుగు సమర్పించిన సరిగమప. ఈ కార్యక్రమం ద్వారా గత 15 సీజన్లలో ఎంతోమంది గాయనీగాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇపుడిక ‘సరిగమప సీజన్ 16- ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్’ త్వరలో రాబోతోంది. ప్రతిభావంతులైన గాయనీగాయకులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకునే అవకాశం అందిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాల్లో ఆడిషన్స్ నిర్వహంచింది. కొత్త గాయకులను పరిచయం చేసే ఈ పోటీలో 15-30 సంవత్సరాల వయస్సుగల , గాయనీ గాయకులు పాల్గొనేందుకు అర్హులు. విజేతగా నిలిచిన గాయని లేదా గాయకుడు ‘సరిగమప సీజన్ 16–ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్’ టైటిల్ గెల్చుకుంటారు. -
చిన్న పిల్లలతో లిప్ కిస్‌లా.. యాంకర్‌పై చిన్మయి ఫైర్!
టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. మహిళలకు, చిన్న పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండిస్తూనే..అవగాహన కలిగించే అంశాలను చెబుతుంటారు. అయితే సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్టులు కాంట్రవర్సీకి దారి తీసిన సందర్భాలూ ఉన్నాయి. మీటు ఉద్యమంలో భాగంగా వైరముత్తు లాంటి దిగ్గజ నటులపై ఆరోపణలు చేయడంతో కోలీవుడ్ ఆమెను బ్యాన్ చేసింది. అయినా కూడా చిన్మయి తన పోరాటం ఆపడం లేదు. ఇటీవల ప్రముఖ నటుడు విజయ్ జాన్ చేసే వికృతాలను బయటపెట్టిన చిన్మయి.. తాజాగా సోషల్ మీడియాలో మరో సంచలన పోస్ట్ పెట్టింది. టీవీ షోలో ఓ యాంకర్ చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.పిల్లల భవిష్యత్తుతో ఆటలా?ఓ టీవీ షోలో క ఫీమేల్ హోస్ట్.. ఒక చిన్న పిల్లాడిని ముద్దు ఇవ్వమని అడిగే సీన్ చూశాను. ఆ సీన్ చూసి.. అక్కడి ఆడియెన్స్‌తో పాటు తల్లిదండ్రులు తెగ నవ్వుతున్నారు.. అంతేకాదు వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి చేయడం వల్ల పిల్లలపై దుష్ప్రభావం పడుతుంది. ఒక వేళ ఈ పిల్లాడికి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ క్లాసులు చెబితే.. ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలియక అయోమయోగానికి గురవుతాడు.టీవీల్లో ప్రసారం అయ్యే ఇలాంటి షోలు చిన్నారుల భద్రతకు ఏ మాత్రం ఉపయోగపడవు. సమాజం కూడా వీటిని అంగీకరించకూడదు. ఇదంతా లైంగిక హింస కిందకే వస్తుంది. కానీ ఫన్ ఎప్పటికీ కాదు. దయచేసి అందరూ దీనని గుర్తుంచుకోండి’ అని చిన్మయి తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. అయితే చిన్మయి ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసిందనే విషయం తెలియదుక కానీ.. గతంలో ఓ పిల్లల షోలో మాత్రం టాలీవుడ్‌కి చెందిన స్టార్ యాంకర్ అనసూయ ఓ పిల్లాడితో ఇలా లిప్ కిస్ చేయించుకుంది. అయితే ఆమెను ఉద్దేశించే చిన్మయి ఈ పోస్ట్ పెట్టిందని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
డ్యాన్సమ్నాస్టిక్
నృత్య ప్రదర్శనలో ఆకట్టుకునే అందమైన డ్రెస్ అనేది కామన్. ఆర్షియా మాత్రం భయపెట్టే డ్రెస్‌తో, హారర్ లుక్‌తో స్టేజీ మీదికి వచ్చింది. ‘ఇదేం లుక్కు బాబోయ్’ అనుకునేలోపే తన అద్భుత నృత్యప్రతిభతో ప్రేక్షకులను అబ్బురపరిచింది. ‘అమెరికాస్ గాట్ టాలెంట్’ టీవీ షో న్యాయనిర్ణేతలు ‘వావ్’ అనుకునేలా చేసింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన 13 ఏళ్ల ఆర్షియా శర్మ స్వదేశం దాటి వేరే దేశానికి రావడం ఇదే తొలిసారి. ఈ ఇంటర్నేషనల్ షోలో ΄ాల్గొనడానికి ముందు ఆర్షియా శర్మ లిటిల్ మాస్టర్స్, సూపర్ డ్యాన్సర్ 4 లాంటి షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.అంతర్జాతీయ వేదికపై చప్పట్లతో ‘ఆహా’ అనిపించుకున్న ఆర్షియా ప్రత్యేకత ఏమిటి... అనే విషయానికి వస్తే....డాన్స్‌కు జిమ్నాస్టిక్స్ జోడించి ‘వారెవ్వా’ అనేలా చేసింది. ఆర్షియ ‘డ్యాన్సమ్నాస్టిక్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
రచనా బెనర్జీ. అందం, అభినయం కలబోసిన నటిగా దక్షిణాదికి చిరపరిచితం. ఒడిశా సినీ పరిశ్రమలోనూ వెలుగు వెలిగిన బెంగాలీ బ్యూటీ. దీదీ అనగానే తృణమూల్ అధినేత్రి మమతాయే గుర్తొస్తారు. అయితే సూపర్‌హిట్ బెంగాలీ టీవీ షో ‘దీదీ నంబర్‌వన్’కు హోస్ట్‌గా అలరిస్తూ రచన దీదీ నంబర్‌వన్ అయ్యారు. తృణమూల్ నుంచే రాజకీయ అరంగేట్రమూ చేస్తున్నారు...!నటిగా ప్రయాణం.. 1974 అక్టోబర్ 2న కోల్‌కతాలో జన్మించిన రచన అసలు పేరు ఝుంఝుమ్ బెనర్జీ. కోల్‌కతా సౌత్ సిటీ కాలేజీలో డిగ్రీ చేశారు. 1990లో సెకండియర్‌లో ఉండగానే మిస్ కలకత్తా టైటిల్ గెలుచుకున్నారు. 1994లో మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నారు. ఆకర్షణీయమైన ముఖం, అందమైన చిరునవ్వు ఆమెకు బోలెడు సినీ అవకాశాలు తెచి్చపెట్టాయి. బెంగాలీ చిత్రం ‘డాన్ ప్రొటిడాన్’తో తొలిసారి వెండితెరపై కనిపించారు. బెంగాలీతో పాటు దక్షిణాదిలోనూ వరుసగా సినిమాలు చేశారు. కన్యాదానం సినిమాతో తెలుగువారికి పరిచయమయ్యారు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, మిథున్ చక్రవర్తి వంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేశారు. ఒరియా నటుడు సిద్ధాంత మహాపాత్రతో కలిసి ఏకంగా 40 సినిమాలు చేశారు. ప్రసేన్‌జిత్ ఛటర్జీతోనూ 35 బెంగాలీ సినిమాల్లో నటిస్తే వాటిలో 32 సూపర్ డూపర్హిట్లే! సినిమాలు చేస్తూనే వ్యాపారవేత్తగానూ ఎదిగారు. సామాజిక మాధ్యమాల్లో కూడా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్స్టాగ్రాం, ఎక్స్‌లో రచనకు లక్షల్లో ఫాలోవర్లున్నారు. రాజకీయాల్లోకి... సినిమాలకు గుడ్‌బై చెప్పాక రచన టీవీపై దృష్టి సారించారు. సూపర్‌హిట్ బెంగాలీ టీవీ షో దీదీ నంబర్‌వన్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీని కలిశారు. రాజకీయాల్లోకి వెళ్తారని అప్పుడే ప్రచారం జరిగినా కొట్టిపడేశారు. బీజేపీకి బెంగాల్లో బలం పెరుగుతుండటం, పలువురు టీఎంసీ నేతలపై ఆరోపణల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బలమైన కొత్త ముఖాన్ని తెరపైకి తేవాలని మమత భావించారు. ఆ మేరకు భారీ ర్యాలీలో రచనను హుగ్లీ నుంచి లోక్‌సభ అభ్యరి్థగా ప్రకటించారు. అక్కడి బీజేపీ సిట్టింగ్ ఎంపీ లాకెట్ చటర్జీ కూడా సినీ నటే. పైగా రచనకు మంచి స్నేహితురాలు కూడా. అదంతా వ్యక్తిగతమని, పోటీ పోటీయేనని అంటున్నారు రచన.వంద శాతం ఇస్తా...తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా మమత అడిగినప్పుడు కాస్త ఆలోచించి అంగీకరించినట్టు చెప్పారు రచన. ‘‘దీదీ నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. జీవితంలో ప్రతి దశలోనూ కొత్త అవకాశం వస్తుంది. దాన్ని అందిపుచ్చుకోవాలి. అందుకే లోక్‌సభకు దీదీ నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు పొంగిపోయా. నాన్న ఉంటే ఎంతో సంతోషించేవాడు. నా నిర్ణయంతో అమ్మ సంతోషంగా ఉంది. గతంలో లైవ్ స్టేజ్ షోల కోసం రెండు మూడుసార్లు హుగ్లీ వెళ్లా. ఇక నుంచి అదే నా అడ్డా. జీవితంలో ఏం చేసినా 100 శాతం చిత్తశుద్ధితో కష్టపడ్డా. అదే స్ఫూర్తితో నాయకురాలిగానూ రాణించి దీదీ నమ్మకం నిలబెడతా’’ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐపీఎల్ అంత బోరింగ్‌గా ఉందా..!? అమ్మడు పనికి నెటిజన్లు షాక్!
బెంగళూరు ఎం. చిన్నస్వామి స్టేడియంలో తాజా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా దర్శమిన్చిన దృశ్యాలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లు స్వయంగా స్టేడియంలో కూచుని చూడటమంటే చాలా ఖరీదైన వ్యవహారం. టికెట్లు దొరకడం చాలా గగనం కూడా. అయితే టికెట్ కొనుక్కుని మరీ మ్యాచ్‌ను చూడటం మానేసిన ఒక అమ్మడు తీరిగ్గా అమెరికన్ పాపులర్ షో చూస్తూ కూచోవడం కెమెరా కంట పడింది. దీంతో ఇది నెట్టింట్ వైరల్‌గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ సందర్బంగా ఏప్రిల్ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీపక్ కుమార్ అనే ట్విటర్ యూజర్ "ఈ అమ్మాయి ఐపిఎల్ మ్యాచ్‌లో ‘ఫ్రెండ్స్’ చూస్తోందంటే నమ్మలేకపోతున్నాను" అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను షేర్ చేశాడు. అంతే ఇది లక్షల వ్యూస్, లైక్స్‌తో చక్కర్లు కొడుతోంది. ‘‘ఈ సంవత్సరం ఐపీఎల్ అస్సలు ఆసక్తికరంగా లేదు, బోరింగ్‌గా కనీసం నా సర్కిల్లో కూడా ఆసక్తికరంగా లేదు’’ ఒకరు, ‘‘ఇందులో నమ్మలేకపోవడానికేమీ లేదు.. చిన్న స్వామి స్టేడియం అంతే.. ఆ అమ్మాయిని నిందించి లాభం లేదు’’ అని మరొకరు "మ్యాచ్ తప్పనిసరిగా బోరింగ్‌గా ఉందేమో బ్రో’’, ‘‘ఆర్సీబీ ఫ్యాన్ అందుకే’’ ఇలా రక రకాల కమెంట్లు చేయడం విశేషం. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో ఓటమిని మూట గట్టుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. Can’t believe this girl is watching Friends during an IPL match 😭 pic.twitter.com/fgL14lPGyC — Deepak Kumaar (@immunewolf_) April 2, 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 22నప్రారంభమైంది. ఐపీఎల్ క్రికెట్ అనగానే లైవ్‌లో మ్యాచ్‌ను, అభిమాన ఆటగాళ్లను చూడాలనే ఉత్సాహం, థ్రిల్ కోసం స్టేడియం టిక్కెట్లను కూడా బుక్ చేసుకుంటారు. టికెట్లు దక్కని వారు, స్థోమత లేని క్రికెట్ అభిమానులు టెలివిజన్ స్క్రీన్లకు అతుక్కుపోతారు.అన్నట్టు మ్యాచ్ సందర్బంగా కెమెరా మెన్లు పనితీరును మెచ్చుకోవాల్సిందే. మ్యాచ్‌లోని అద్భుత క్షణాలను మాత్రమే కాదు, గ్యాలరీలో చోటు చేసుకునే దృశ్యాలను క్యాప్చర్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా అన్నట్టు ఉంటారు. అందమైన అమ్మాయిలు వారి చేష్టలు, సెలబ్రిటీ హావభావాలు, తదితర దృశ్యాలు టీవీల ముందు కూర్చున్నవారికి మంచి కాలక్షేపం. -
టీవీ షోలో ఛాన్స్ ఇప్పిస్తానంటూ యువతి మీద లైంగిక దాడి
హైదరాబాద్: మేకప్ ఆర్టిస్ట్‌తో శారీరక వాంఛలు తీర్చుకొని అనంతరం అతని ప్రియురాలితో కలిసి దాడిచేసిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఏపీలోని వినుకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి మేకప్ ఆర్టిస్ట్ గా కొంతకాలంగా పనిచేస్తూ రహమత్‌నగర్‌లో నివాసం ఉంటుంది. గత ఏడాది తన స్వగ్రామం వినుకొండకు బస్సులో బయలుదేరింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న జొన్నలగడ్డ రాజా అనే యువకుడితో పరిచయం అయింది. ఓ టీవీలో వచ్చే కామెడీ ప్రోగ్రాంలో జూనియర్ ఆర్టిస్ట్నని చెప్పారు. తనకు ఇండస్ట్రీలో బాగా పలుకుబడి ఉందని, మేకప్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించాడు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన ఆమెను శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. రూ. 50 వేలు కూడా తీసుకున్నాడు. కొద్దిరోజుల కిందట భాను అనే మహిళ ఆమెకు ఫోన్ చేసి రాజు తన భర్త అని ఎందుకు సంబంధం పెట్టుకున్నావంటూ బెదిరించింది. ఆమెతో మాట్లాడటానికి సికింద్రాబాద్ రమ్మని చెప్పగా ఈ యువతి నమ్మి అక్కడు వెళ్లింది. అక్కడ యువతి ఆధార్ కార్డు, ఫొటోలు తీసుకుని విషయం బయటకు చెబితే చంపుతామని బెదిరించారు. దాంతో తాను మోసపోయానని తెలుసుకుని యువతి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నటి అన్నపూర్ణ కన్నీళ్లు.. కూతురి ఆత్మహత్య విషయం గుర్తొచ్చి!
సీనియర్ నటి అన్నపూర్ణ.. ప్రస్తుత జనరేషన్ ప్రేక్షకులకు బామ్మ పాత్రలతో బాగానే పరిచయం. కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈమె.. దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ కలిసి నటించింది. ఇప్పటి యంగ్ హీరోలతో సినిమాలు, తెలుగు టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా అలా ఓ షోలో పాల్గొన్న ఈమె.. తన కూతురు చనిపోవడాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈ వీడీయో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: స్టార్ హీరో ప్రేమ వ్యవహారం.. మోసం చేసిన క్లోజ్ ఫ్రెండ్!) అసలేం జరిగింది? నటి అన్నపూర్ణకి పిల్లలు లేరు. దీంతో ఆమె చిన్నప్పుడే కీర్తి అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. పెంచి పెద్ద చేసింది. తెలిసిన వాళ్లకే ఇచ్చి పెళ్లి చేసింది. కీర్తికి ఓ పాప కూడా పుట్టింది. అయితే ఐదేళ్లయినా సరే ఆ పాపకు మాటలు రాకపోవడంతో థెరపీ చేయించారు. కానీ లాభం లేకుండా పోయింది. అలా పాప విషయమై బెంగ పెట్టుకున్న అన్నపూర్ణ కూతురు మానసికంగా కుంగిపోయి, ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అన్నపూర్ణ ఏం చెప్పింది? తాజాగా సుమ అడ్డా షోలో పాల్గొన్న అన్నపూర్ణ.. కూతురిని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయింది. 'నేను బజ్జీలు పట్టుకొచ్చి పిలిచాను. రెండు తిని ఇక చాలా మమ్మీ అని చెప్పింది. మా అత్తగారు ఊరెళ్తున్నారని అంటే ఇక్కడ పడుకో అమ్మా అని అన్నాను. లేదు లేదు మా ఆయన ఉంటాడు కదా నేను అక్కడే పడుకుంటాను అని చెప్పి వెళ్లిపోయింది. తాను ఉరివేసుకుంటుందనే ఆలోచనే నాకు రాలేదు' అని అన్నపూర్ణ కన్నీళ్లు పెట్టుకుంది. (ఇదీ చదవండి: 'KCR' మూవీకి అడ్డంకులు.. 'జబర్దస్త్' కమెడియన్ ఎమోషనల్ వీడియో) -
ఏడుసార్లు రిజెక్ట్.. విరక్తితో ఆత్మహత్యాయత్నం.. ఇప్పుడు లక్ష కోట్ల కంపెనీకి బాస్
ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'రాధికా గుప్తా' షార్క్ ట్యాంక్ ఇండియా 3 (Shark Tank India 3) ప్యానెల్లో నమితా థాపర్, వినీతా సింగ్, పీయూష్ బన్సాల్, అమన్ గుప్తా, అనుపమ్ మిట్టల్‌లతో కలిసి కనిపించనున్నారు. షార్క్ ట్యాంక్ ఇండియా 3 లో కనిపిస్తున్న రాధికా గుప్తా ఎవరు? ఆమె బ్రాగ్రౌండ్ ఏంటి? ప్రముఖ వ్యాపారవేత్తగా ఎలా ఎదిగిందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో అతి తక్కువ వయసులోనే ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎదిగిన రాధికా.. ఒకానొక సమయంలో ఉద్యోగం రాక చనిపోదామని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.స్నేహితురాలు కాపాడటంతో బ్రతికి ఈ రోజు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. పాకిస్తాన్లో జన్మించిన రాధికా ఆమె కుటుంబంతో కలిసి ఖండాంతరాలు దాటింది. పుట్టుకతోనే సమస్యలున్న ఆమె మెడ విరిగిపోవడంతో తలా కొంత వంగిపోయింది. చదువుకునే రోజుల్లో చాలామంది ఎగతాళి చేసేవారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అప్లైడ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, 2005లో పెన్సిల్వేనియా యూనివర్సిటీ - ది వార్టన్ స్కూల్ నుంచి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం కోసం ప్రయత్నించే క్రమంలో ఏడు ఉద్యోగాలకు అప్లై చేసింది, కానీ ఒక్క ఉద్యోగానికి ఎంపిక కాలేదు. ఉద్యోగం రాకపోవడంతో నిరాశ చెంది ఆత్మహత్యా ప్రయత్నం చేసింది, స్నేహితురాలు కాపాడింది. ఆ తరువాత చాలా రోజులు నాలుగు చక్రాల కుర్చీకే పరిమితమైంది. 25 సంవత్సరాల వయసులో భారతదేశానికి వచ్చిన రాధికా తన భర్త, ఫ్రెండ్‌తో సొంతంగా అసెట్ మేనేజ్మెంట్ సంస్థను ఏర్పాటు చేసి.. కొన్నేళ్ల తర్వాత ఆ కంపెనీని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది. ఇదీ చదవండి: పండుగ సీజన్లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే.. ఇవి బెస్ట్ ఆప్షన్స్! ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్‌కి కొత్త సీఈవో ఎంపిక సమయంలో కొంత భయపడినప్పటికీ భర్త ప్రోత్సాహంతో 33 ఏళ్లలోనే దేశంలోనే అతి పిన్న వయస్కులైన సీఈవోలలో ఒకరిగా బాధ్యతలు చేపట్టింది. ఒకప్పుడు లోపాన్ని చూసి ఎగతాళి చేసిన వారు ఎందరో ఆదర్శంగా తీసుకోవడం మొదలుపెట్టారు. #SharkReveal ⚡🥁Drumrolls & Trumpets 🎺⚡ Presenting the new Shark Radhika Gupta, MD & CEO, Edelweiss Mutual Fund. ✨ Stay tuned for more exciting updates!#SharkTankIndia Season 3 streaming this January on Sony LIV#SharkTankIndiaOnSonyLIV pic.twitter.com/kAcM7Rt6cx — Shark Tank India (@sharktankindia) November 4, 2023 -
కామాఖ్య అమ్మవారి దర్శనంలో టీవీ రాముడు
టీవీ నటుడు గుర్మీత్ చౌదరి దుర్గాష్టమి రోజున అసోంలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గుర్మీత్ సోషల్ మీడియాలో పలు ఫోటోలు షేర్ చేశారు. ఈ ఫోటోలలో గుర్మీత్ కండువా కప్పుకుని, నుదుటన తిలకం ధరించడాన్ని చూడవచ్చు. గుర్మీత్ అమ్మవారి భక్తిలో మునిగిపోయినట్లు కనిపించారు. ఫోటోలు షేర్ చేసిన గుర్మీత్ చౌదరి క్యాప్షన్‌లో..‘జై మా కామాఖ్య. అందరికీ అష్టమి శుభాకాంక్షలు’ అని రాశారు. గుర్మీత్.. కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఆలయం వెలుపల అభిమానులతో ఫొటోలు కూడా దిగారు. కాగా ఈ ఫోటోల్లో గుర్మీత్ ఒంటరిగా కనిపిస్తున్నారు. భార్య డెబినా బెనర్జీ, కుమార్తెలు లియానా, దివిషా అతని వెంట లేరు. గుర్మీత్ టీవీలో ప్రసారమైన రామాయణం సీరియల్లో రాముడి పాత్రలో కనిపించారు. ఈ షో ద్వారా గుర్మీత్‌కు మంచి పేరు వచ్చింది. అతనిని అభిమానించేవారి సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం గుర్మీత్ పలు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇది కూడా చూడండి: యూట్యూబ్‌లో మొదటి వీడియో ఏది? ఎంతమంది చూశారు? -
'బిగ్‌బాస్-7' గ్రాండ్ లాంచ్‌కి డేట్ ఫిక్స్
తెలుగు రియాలిటీ షోల్లో డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే చాలామంది చెప్పే పేరు బిగ్‌బాస్. ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తవగా, మరికొన్ని రోజుల్లో ఏడో సీజన్ ప్రారంభించనున్నట్లు గత కొన్నాళ్లుగా ఊరిస్తూ వచ్చారు. ఓ టీజర్ కూడా రిలీజ్ చేశారు. మరోవైపు తేదీపై అప్పుడు ఇప్పుడు అనుకుంటూ వచ్చారు. ఫైనల్ గా ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ చేశారు. (ఇదీ చదవండి: అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!) గత కొన్ని సీజన్ల నుంచి తెలుగు బిగ్ బాస్ షోపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో ఈసారి ఉల్టా పల్టా కాన్సెప్ట్ అని నాగ్ చెప్పారు. అందుకు సంబంధించిన టీజర్ వీడియోని ఈ మధ్య రిలీజ్ చేశారు. అయితే అది ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఓ మాదిరి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా సెప్టెంబరు 3 నుంచి కొత్త సీజన్ షురూ కానుందని ప్రకటించారు. ఇకపోతే ఈసారి బిగ్‌బాస్ హౌసులోకి యూట్యూబర్ అనిల్, కార్తీకదీపం శోభాశెట్టి, కమెడియన్ మహేశ్, షకీలా, ఆట సందీప్ జోడీ, సింగర్ మోహన భోగరాజు, జబర్దస్త్ కమెడియన్ తేజ, యూట్యూబర్ షీతల్ గౌతమన్, సీరియల్ నటి ఐశ్వర్య, హీరోయిన్ శుభ శ్రీ తదితరులు వెళ్లబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. వీటిపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగితే సరి! Gear up for a Bigg Boss revolution! It's not a conclusion, but an electrifying new chapter that will flip your perceptions "Ulta Pulta" with the ever-charming @iamnagarjuna .Are you intrigued? Excited? The grand launch is on September 3rd.#BiggBossTelugu7, exclusively on #StarMaa pic.twitter.com/zaUGvJcIpf — Starmaa (@StarMaa) August 20, 2023 (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీదేవి చివరి కోరిక నెరవేర్చిన భర్త) -
ప్రియురాలిని పరిచయం చేసిన హైపర్ ఆది.. పేరు విహారిక!
తనదైన పంచ్ డైలాగులతో ట్రెండింగ్ కమెడియన్‌గా మారాడు హైపర్ ఆది. జబర్ధస్త్ కామెడీతో షో అతని జీవితాన్ని మార్చేసింది. ఆ షోలో మొదటగా కంటెస్టెంట్‌గా వచ్చి, తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు. ప్రస్తుతం మల్లెమాల ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న పలు టీవీ షోలలో ఆది పాల్గొంటూ తనదైన కామెడీతో నవ్వులు పూయిస్తున్నాడు. పలు షోలలో తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. (చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!) తాజాగా ఓ టీవీ షోలో తన ప్రియురాలిని పరిచయం చేశాడు. తాను గత కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆమెను పరిచయం చేస్తానంటూ స్టేజ్‌పైకి పిలిచాడు. ‘ఇప్పటివరకు కంటెంట్ కోసం చాలా మందికి లైన్ వేసినట్లు చెప్పాను. కానీ నేను నిజంగా ప్రేమించింది ఒక అమ్మాయిని మాత్రమే. ఆమె ఇక్కడే ఉందంటూ ‘బేబీ ఒక్కసారి స్టేజ్‌పైకి రా’అని ఆది పిలవగా.. ఒక అమ్మాయితో నవ్వులు చిందిస్తూ స్టేజ్ మీదకు వచ్చింది. ఆ తర్వాత ఆది తనకు ‘ఐ లవ్ యూ విహారిక’ అంటూ ప్రపోజ్ చేశాడు. విహారిక కూడా ‘లవ్ యూ టూ ఆది’ అని చెప్పింది. అంతేకాదు ఇద్దరూ ఒకరి బుగ్గలను ఒకరు ముద్దాడారు. దీంతో షోలో ఉన్నవారంతా చప్పట్లు కొడుతూ ఆ జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. విహారికతో ప్రేమాయణం నిజమేనా? హైపర్ ఆది పెళ్లిపై గతంలో చాలా సార్లు పలు రూమర్స్ వినిపించాయి. ఓ యాంకర్‌తో ఆది లవ్‌లో ఉన్నాడని త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్త ఆ మధ్య నెట్టింట చక్కర్లు కొట్టింది. తాజాగా ఆ యాంకర్ వర్షిణితో పెళ్లి అనే పుకార్లు వినిపించగా.. ఆమె కొట్టిపారేసింది. అయితే ఆది మాత్రం ఈ రూమర్స్‌పై ఎప్పుడూ స్పందించలేదు. పైగా తన పెళ్లిపై తానే పంచ్‌లు వేసుకుంటాడు. గతంలో కూడా తాను పెళ్లి చేసుకునేది ఈ అమ్మాయినే అంటూ పలు షోలలో కొంతమందిని పరిచయం చేశాడు. కాకపోతే అది స్కిట్లో భాగమే. కేవలం హైప్ కోసం ఆది అలా చెప్పేవాడు. ఇక తాజాగా ఆది పరిచయం చేసిన అమ్మాయి కూడా షోలో భాగమే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది అయితే ఆ అమ్మాయిని ఏ టీవీ షోలోనూ చూడలేదు. నిజంగానే ఆమె ఆది ప్రియురాలే కావొచ్చునని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమేది అనేది ఆ షో ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక తెలుస్తుంది. -
బిగ్ బాస్ 7లోకి రాబోతున్న ఫైనల్ కంటెస్టెంట్స్..
-
ఏప్రిల్‌లో గుండెనొప్పి.. ఇప్పుడేమో మళ్లీ స్టేజీపై!
తెలుగు ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ అంటే టీవీ షోలు గుర్తొస్తుంటాయి. పలు ఛానెల్స్ ఎప్పటికప్పుడు ఈ విషయంలో పోటీపడుతూనే ఉంటాయి. అయితే షో ఏదైనా సరే ఆర్గనైజర్స్.. కమెడియన్స్ కచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. అలా ఇప్పటికే బోలెడంత మంది గుర్తింపు తెచ్చుకున్నారు. కమెడియన్ చలాకీ చంటి ఈ లిస్టులో ముందుంటాడు. అతడు చాలారోజుల తర్వాత మళ్లీ స్టేజీపై కనిపించాడు. (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్‌పై బాడీ షేమింగ్.. ఆయన వల్ల!) నాని 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాతో హాస్య నటుడిగా ఎంట్రీ ఇచ్చిన చంటి... ఆ తర్వాత 'జబర్దస్త్' షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు వల్ల ఆ షోకి వస్తూ పోతూ ఉండేవాడు. అయితే గతేడాది 'బిగ్‌బాస్' షోలో పాల్గొన్న చంటి.. కొన్ని వారాలపాటు బాగానే ఎంటర్ టైన్ చేశాడు గానీ ఆ తర్వాత పెద్దగా ఫెర్ఫార్మ్ చేయలేదు. దీంతో హౌస్ నుంచి బయటకొచ్చేశాడు. ఈ షోలో పాల్గొన్న తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు, షోల్లోనూ కనిపించలేదు. అలాంటిది సడన్‌గా ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో చంటికి గుండెపోటు వచ్చిందనే న్యూస్ బయటకొచ్చింది. ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ, దాన్నుంచి బయటపడ్డాడు. ఇది జరిగిన మూడు నెలలు కూడా కాలేదు. ఇప్పుడు ప్రముఖ కామెడీ షోలో ప్రత్యక్షమయ్యాడు. అయితే చూడటానికి కాస్త డల్‌గానే కనిపించాడు. దీంతో ఫ్యాన్స్.. చంటి హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నారు. కుదుటపడినట్లేనా అని యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. (ఇదీ చదవండి: 'రంగబలి' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే) -
నటికి ఘోర అవమానం.. ఏకంగా ఆ బాడీ పార్ట్స్‌పైనే కామెంట్స్!
Sumona Chakravarti Kapil Sharma Show: ఒకప్పుడు టీవీల్లో వచ్చే షోలు బాగుండేవి. బోలెడంత కామెడీ ఉన్నా అది ఎవరినీ ఎలాంటి ఇబ్బంది పెట్టేది కాదు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. షోలు అంటేనే డబుల్ మీనింగ్ డైలాగ్స్, బాడీ పార్ట్స్ షేమింగ్ అన్నట్లు తయారైంది. మీకు అలాంటి కార్యక్రమాల ఏవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఓ నటి, తనకు ఓ షోలో జరిగిన అవమానం గురించి బయటపెట్టింది. స్వయానా యాంకరే కామెడీ అనగానే చాలామందికి తెలుగులో ఓ షో గుర్తొస్తుంది. కానీ దానికంటే 'కపిల్ శర్మ షో' చాలా ఫేమస్. చాలా ఏళ్లుగా ఇది సక్సెస్ ఫుల్‌గా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇందులోనే యాంకర్ కపిల్ శర్మ చేసే కామెడీ నెక్స్ట్ లెవల్ ఉంటుంది. షోకి వచ్చే గెస్టులతో మస్తు ఫన్ జనరేట్ చేస్తుంటాడు. ఇక ఇదే షోలో కపిల్ శర్మకు భార్యగా సుమోనా చక్రవర్తి చేస్తోంది. అయితే ఈమె పాల్గొన్న తొలి ఎపిసోడ్‌లోనే మూతి-పెదాలని టార్గెట్ చేస్తూ కపిల్ శర్మ జోకులు వేశాడు. (ఇదీ చదవండి: నా భర్త నన్ను మోసం చేశాడు: సన్నీ లియోన్) కొన్నాళ్ల తర్వాత తొలి ఎపిసోడ్ లో సుమోనాపై వేసిన జోక్స్ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో కపిల్ శర్మ ఆ తరహా జోక్స్ ని వదిలేశాడు. కానీ కొన్నాళ్ల తర్వాత ఓ ఎపిసోడ్ సందర్భంగా కపిల్ శర్మ స్క్రిప్ట్ లో లైన్స్ మర్చిపోయాడు. ఏం చేయాలో తెలీక ఈ నటి మూతి-పెదాలపై కామెంట్స్ చేస్తూ కామెడీ జనరేట్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా సుమోనా చక్రవర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. అప్పుడు చాలా అప్సెట్ అయిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. అంతా సెట్ షోలో జరిగిన దానికి బాధపడిన నటి సుమోనాని, అదే షోలో చేస్తున్న అర్చన పురానా సింగ్ ఓదార్చింది. అసలు కపిల్ శర్మ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో సుమోనాకి వివరించింది. దీంతో కాస్త కుదుటపడింది. ఏదైతేనేం ఇప్పుడు ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి. మరీ బాడీ పార్ట్స్‌ని టార్గెట్ చేస్తూ కామెడీ చేయడం ఏంటని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: 'బేబి' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!) -
స్టేజీపైనే ముద్దులతో రెచ్చిపోయిన నరేశ్- పవిత్ర లోకేశ్..!
టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. అయితే అదంతా అందరూ అది నిజమే అనుకున్నారు. కానీ ఆ తర్వాత ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు నరేశ్- పవిత్ర. ఓ సినిమా కోసం ఆ వీడియో చేసినట్లు వెల్లడించారు. మళ్లీ పెళ్లి అనే చిత్రంలో పవిత్ర లోకేశ్, నరేశ్ జంటగా నటిస్తున్నారు. ఎంఎస్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రబృందం. (ఇది చదవండి: Malli Pelli Teaser: నరేశ్- పవిత్రల 'మళ్లీ పెళ్లి'.. ముహూర్తం ఫిక్స్!) ఈ సందర్భంగా ఓ టీవీ షోలో నరేశ్, పవిత్ర పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. వేదికపైనే ఈ ప్రేమజంట ముద్దులతో రెచ్చిపోయారు. వీరిద్దరిని చూసిన యాంకర్ ఓ చిలిపి ప్రశ్న వేశారు. మీ ఇద్దరి రిలేషన్షిప్ ఏంటని అడగగా.. దీనికి క్రేజీ ఆన్సరిచ్చారు నరేశ్. 'ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం' నవ్వుతూ చెప్పారు. దీంతో ఈ ప్రేమజంటను చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: చిన్న రూమ్ రెంట్‌కు..ఒక్క పూట మాత్రమే తినేవాడిని : శివ బాలాజీ) -
భర్త గురించి మనసులో మాట చెప్పిన సుధా మూర్తి, తొలి పరిచయం అలా..
'సుధా మూర్తి' ఈ పేరుకి భారతదేశంలో పరిచయమే అవసరం లేదు, ఎందుకంటే ఒక రచయిత్రిగా, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా మాత్రమే కాకుండా పరోపకారిగా కూడా చాలా మందికి సుపరిచయమే. అయితే ఈమె ఇటీవల తన భర్త నారాయణ మూర్తితో ఏర్పడిన తొలి పరిచయం గురించి ఒక టీవీ షోలో వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల జరిగిన ఒక ప్రముఖ 'బాలీవుడ్ టాక్ షో'లో సుధా మార్తి పాల్గొన్నారు. ఇందులో బాలీవుడ్ నటి రవీనా టండన్, ప్రొడ్యూసర్ గుణీత్ మోంగా కూడా పాల్గొన్నారు. ఈ షోకి సంబంధించిన ఒక టీజర్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో నారాయణ మూర్తిని మొదటి సారి ఎప్పుడు కలిసారని వ్యాఖ్యాత కపిల్ శర్మ సుధా మూర్తిని అడిగారు. ఈ సందర్భంలో సుధా మూర్తి తన స్నేహితురాలి ద్వారా నారాయణ మూర్తి పరిచయమయ్యారని చెప్పుకొచ్చారు. ప్రసన్న అనే స్నేహితురాలు రోజూ ఒక పుస్తకం తీసుకువచ్చేదని, అందులోని ఫస్ట్ పేజీలో నారాయణ మూర్తి పేరు మాత్రమే కాకుండా పక్కన పెషావర్, ఇస్తాంబుల్ వంటి ప్రదేశాల పేర్లు ఉండేవని చెప్పింది. ఇది చూసినప్పుడు నారాయణ మూర్తి బహుశా ఇంటర్నేషనల్ బస్ కండక్టర్ అయి ఉంటాడేమో అనుకున్నట్లు చెప్పింది. ఒక రోజు నారాయణ మూర్తిని కలవడానికి వెళ్లాలని, కలవడానికి ముందు ఆయన సినిమా హీరోలా ఉంటాడని ఊహించినట్లు చెప్పింది. కానీ డోర్ ఓపెన్ చేయగానే ఎవరీ చిన్నపిల్లాడు? అనిపించిందని అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ఇది విన్న అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. (ఇదీ చదవండి: 17 సార్లు ఫెయిల్.. ఇప్పుడు రూ. 40వేల కోట్ల సామ్రాజ్యం - ఇది కదా సక్సెస్ అంటే!) సుధా మూర్తి 44 సంవత్సరాల కిందట నారాయణ మూర్తిని వివాహం చేసుకుంది. వీరికి అక్షతా మూర్తి, రోహన్ మూర్తి అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్షతా మూర్తి భర్త బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. సుధా మూర్తి గొప్ప మానవతా మూర్తి. ఈమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి గొప్ప పురస్కారాలను అందించింది. -
బ్లాక్ అండ్ వైట్ డేస్... ఎంత బంగారమో!
కేబుల్ ఛానల్స్, ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీసులకు ముందు వినోదానికి దూరదర్శన్ పెద్ద దిక్కు. దూరదర్శన్‌కు, ప్రేక్షకులకు మధ్య దూరం పెరిగినా ఆ నాస్టాల్జియాకు మాత్రం దూరం కాలేదు. దీనికి ఉదాహరణ వైరల్ అయిన ఈ వీడియో. ‘అల్బెల’ సినిమాలోని ‘షోల జో బడ్కే’ పాటను హార్మోనియం వాయిస్తూ సి.రామచంద్ర, కవితా కృష్ణమూర్తితో కలిసి పాడుతున్న బ్లాక్ అండ్ వైట్‌కు సంబంధించిన వీడియోను నటి హేమమాలిని పరిచయం చేస్తున్న దూరదర్శన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ వీడియో నెటిజనులను టైమ్‌మిషన్‌లో బ్లాక్ అండ్ వైట్ జమానాలోకి తీసుకువెళ్లింది. ఆరోజుల్లో దూరదర్శన్‌లో తమకు నచ్చిన కార్యక్రమాలతోపాటు ‘మహా... భారత్’ అనే టైటిల్ సాంగ్ వినిపించగానే తాము రెక్కలు కట్టుకొని టీవీల ముందు వాలిన దృశ్యాలను కూడా నెటిజనులు గుర్తుతెచ్చుకున్నారు. ఈ వీడియోను ‘గోల్డ్’ అండ్ ‘ప్యూర్’ అని ఆకాశానికెత్తారు నెటిజనులు. -
‘గుడ్ మార్నింగ్..అమెరికా’ అంటున్న రామ్ చరణ్
‘గుడ్‌మార్నింగ్ హైదరాబాద్’ అంటూ ‘శంకర్ దాదా జిందాబాద్' సినిమాలో చిరంజీవి పాట పాడితే.. ఇప్పుడు ఆయన తనయుడు, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ‘గుడ్ మార్నింగ్..అమెరికా’అంటున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ‘గుడ్‌మార్నింగ్ అమెరికా’ అనే పాపులర్ టీవీ షోలో చరణ్ పాల్గొననున్నారు. ఈ షో అమెరికన్ టైమింగ్స్ ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు, ఇండియన్ టైమింగ్స్ ప్రకారం రాత్రి 11.30 గంటలకు ప్రసారం కానుంది. ఈ షో ద్వారా తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులతో పంచుకోనున్నారు. తమ అభిమాన హీరో అమెరికన్ పాపులర్ టాక్ షో పాల్గొనడం పట్ల మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో అత్యంత ప్రేక్షకుల ఆదరణ పొందిన టీవీ షోలలో ’గుడ్ మార్నింగ్ అమెరికా’ ఒకటి. ఈ పాపులర్ షోలో గతంలో టామ్ క్రూజ్, లియోనార్డో డికాప్రియో, ర్యాన్ రెనాల్డ్స్ వంటి హాలీవుడ్ హీరోలు పాల్గొన్నారు. టాలీవుడ్ నుంచి పాల్గొన్న తొలి హీరోగా రామ్ చరణ్ రికార్డుకెక్కారు. గతంలో ఇడియా నుంచి ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్ ఈ పాపులర్ షో పాల్గొన్నారు. Mega Power Star @alwaysRamCharan is going to be a part of Good Morning America 3, a very popular American talk show. The show will be aired at 1pm PST. Truly a proud moment to see our star on one of the most known shows in the world. #RamCharan pic.twitter.com/xAmf2rir4E — Ramesh Bala (@rameshlaus) February 22, 2023 -
రూటు మార్చిన మెగాస్టార్ చిరంజీవి
-
ఉగ్రవాదాన్ని విస్తరిస్తున్న పాకిస్తాన్‌ను ఇంకా ఏమనాలి?
వియన్నా: భారత్‌లోకి ఉగ్రవాదులను ఎగ దోస్తూ, ఉగ్రవాదాన్ని విస్తరింపజేస్తున్న పాకిస్తాన్‌పై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సమర్థించుకున్నారు. ఆస్ట్రియా జాతీయ వార్తాప్రసార సంస్థ ఓఆర్‌ఎఫ్‌కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్ పలు అంశాలు మాట్లాడారు. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రస్థానం పాక్‌లో ఉందని మీరు చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో ఒక భారతీయ దౌత్యవేత్త హోదాలో సమర్థించుకుంటారా అని వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు జైశంకర్ బదులిచ్చారు ‘భారత పార్లమెంట్‌పై దాడి, ముంబై వంటి నగరాల్లో దాడి చేసి భారతీయులను, విదేశీ పర్యాటకులను చంపి, రోజూ సరిహద్దు గుండా ఉగ్రవాదుల చొరబాట్లకు ప్రయత్నించే పాక్‌నుద్దేశించి ఇంకా ఏమనాలి? ఇంకాస్త పరుష పదం వాడితే బాగుండేది. ఉగ్రవాదానికి కేంద్రస్థానం అనే పదం మంచిదే’ అని వ్యాఖ్యానించారు. ‘పట్టపగలే నగరాల్లో ఉగ్రవాదులకు సైన్యం తరహాలో యుద్ధతంత్రాలు నేర్పిస్తున్నారు. ఈ విపరీతాలను యూరప్ దేశాలు ఎందుకు నిలదీయవు? భారత్, పాక్ మధ్య మళ్లీ యుద్ధం వస్తుందేమోననే భయం ప్రపంచానికి ఉంటే ముందుగా ఉగ్రవాదంపై ప్రపంచదేశాలు దృష్టిపెట్టాలి’ అని హితవు పలికారు. ఇదీ చదవండి: వీడియో: అన్నా చెల్లెలి అనురాగం.. చెల్లిపై ఉప్పోంగిన ఆప్యాయతతో.. -
స్పేస్ ఎక్స్ ‘చంద్రయాన్’లో భారత నటుడు దీప్ జోషి
వాషింగ్టన్: ‘డియర్ మూన్’ పేరుతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అంతరిక్ష యాత్రకు వెళ్లే బృందంలో బాల్వీర్ టీవీ షోతో దేశవ్యాప్త క్రేజ్ సాధించిన భారత నటుడు దీప్ జోషి చోటు దక్కించుకున్నారు! చంద్రుని సమీపానికి స్పేస్ ఎక్స్ చేపడుతున్న తొలి వాణిజ్య అంతరిక్ష యాత్ర డియర్ మూన్. దాంట్లో అందుబాటులో ఉన్న టికెట్లన్నింటినీ జపాన్ కుబేరుడు యసాకు మజావా కొనుగోలు చేశారు. తన వెంట పలు రంగాల నుంచి 8 మంది ప్రఖ్యాత కళాకారులను తీసుకెళ్లాలని తొలుత భావించినా చివరికి వారిని ఇంటర్వ్యూల ద్వారా ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 10 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఏడాదిన్నర పాటు అనేకానేక వడపోతల అనంతరం జోషితో పాటు ప్రఖ్యాత బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ కరీం ఇలియా, అమెరికా నుంచి ప్రముఖ డీజే, నిర్మాత స్టీవ్ అవోకీ, సినీ దర్శకుడు బ్రెండన్ హాల్, యూట్యూబర్ టిమ్ డాడ్, దక్షిణ కొరియాకు చెందిన కె–పాప్ మ్యుజీషియన్ షొయ్ సెయంగ్ హుయాన్ (టాప్) విజేతలుగా నిలిచారు. వీరంతా వచ్చే ఏడాది స్పేస్ ఎక్స్ స్టార్‌షిప్ వెహికిల్‌లో మజావాతో పాటు 8 రోజుల పాటు అంతరిక్షంలో విహరిస్తారు. 3 రోజులు చంద్రుని చుట్టూ తిరుగుతారు. 22 ఏళ్ల జోషి ఈ బృందంలో అత్యంత పిన్న వయస్కుడు. 2000 నవంబర్‌లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పుట్టారు. పలు గుజరాతీ సినిమాల్లో నటించారు. ‘‘దేవ్ యువోత్సాహం తమకెంతో స్ఫూర్తినిస్తుంది. అందుకే ఆయన్ను ఎంపిక చేసుకున్నాం’’ అని మజావా పేర్కొన్నారు. -
సూపర్ సింగర్ జూనియర్ గ్రాండ్ ఫైనల్, పోటీలో ఐదుగురు!
గాత్రం మీది... వేదిక మాది... వయసుతో పనేముంది? ప్రతిభే కదా ఉండాల్సింది! వందమందిలో అయినా ఆత్మవిశ్వాసంతో పాడగలననే ధైర్యం.. శాస్త్రీయమైనా, సమకాలీనమైనా శృతి తప్పకుండా వినపించనగలననే నమ్మకం... వెరసి, మీరే సూపర్ సింగర్!! ఔత్సాహిక గాయనీగాయకులకు అపూర్వ అవకాశమందిస్తున్న స్టార్‌మా సూపర్ సింగర్ జూనియర్ పోటీలు ముగింపు దశకు వచ్చాయి. గత 13 వారాలుగా బుల్లితెర ప్రేక్షకులను తమ అపూర్వ గాన ప్రతిభతో కట్టిపడేసిన బుల్లి గాయనీగాయకులు ఇప్పుడు టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. తెలుగు టెలివిజన్ రంగ చరిత్రలో ఎంతోమంది సూపర్ సింగర్స్‌ను వెలుగులోకి తీసుకువచ్చిన స్టార్ మా సూపర్ సింగర్ జూనియర్ పోటీల ఫైనల్స్‌ను ఈ ఆదివారం (ఆగస్టు 28) మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించబోతున్నారు. పదమూడు వారాలు... 14 మంది అపూర్వ గాయనీ గాయకులతో రసవత్తరంగా జరిగిన పోటీల ఫైనల్స్‌లో ఐదుగురు పోటీపడబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కు ముఖ్య అతిథులుగా అక్కినేని నాగార్జున, బ్రహ్మానందంతో పాటు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రబృందం కృతీశెట్టి, సుధీర్ బాబు, ఇంద్రగంటి మోషన కృష్ణ విచ్చేయనున్నారు. హాట్‌స్టార్‌లోనూ ప్రసారం కాబోయే ఫైనల్స్‌కు గాయకులు చిత్ర, మనో, హేమచంద్ర, రనీనా రెడ్డి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. అనసూయ, సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. చదవండి: వేరే అమ్మాయితో నా మాజీ బాయ్‌ఫ్రెండ్, గుండె పగిలింది: సింగర్ నెట్టింట వైరల్ అవుతున్న ‘అర్జున్‌రెడ్డి’ డిలీటెడ్ సీన్ -
హీరోయిన్ బాత్రూమ్లోకి చొరబడ్డ ఫ్యాన్.. పెళ్లి చేసుకోకుంటే చస్తానని బెదిరింపు
Sonakshi Sinha Fan Threatens Her In The Khatra Khatra Show: సల్మాన్ ఖాన్ 'దబాంగ్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగి అశేష అభిమానులన్ని సంపాదించుకుంది. అయితే తాజాగా తన అభిమాని నుంచి వింత అనుభవాన్ని చవిచూసింది సోనాక్షి. 'ది ఖత్రా ఖత్రా' షోలో పాల్గొనేందుకు వెళ్లిన సోనాక్షి సిన్హాకు తన ఫ్యాన్ ఒకరు తనను పెళ్లి చేసుకోమ్మని, లేకుంటే తన గొంతు కోసుకుంటానని బెదిరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వెరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సోనాక్షి సిన్హా తన వ్యానిటీ వ్యాన్‌లో ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో వాష్ రూమ్ నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి 'మేడమ్ నేను మీకు పెద్ద అభిమానని. మీకోసమే రాత్రి నుంచి ఇక్కడ ఎదురుచూస్తున్నా' అని చెబుతాడు. చదవండి: నాలుగో తరగతిలో లైంగిక వేధింపులు.. ఆ దెబ్బతో మళ్లీ చూడలేదు తర్వాత సోనాక్షి సిన్హా అని పచ్చబొట్టు వేసుకున్న తన చేతిని చూపిస్తాడు. అనంతరం సోఫాలో కూర్చుని 'నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. దయచేసి నన్ను పెళ్లి చేసుకోండి.' అని అంటాడు. తర్వాత అక్కడ పరిస్థితులు అంతాగా బాగాలేనట్లు కనిపించింది. అద్దంపై లిపిస్ట్క్తో 'ఐ లవ్ యూ సోనా' అని రాశాడు. అంతేకాకుండా 'ఇది నా రక్తంతో కూడా రాయగలను' అని సోనాక్షితో ఆ అభిమాని చెబుతాడు. ఇదంతా అర్థంకానీ సోనాక్షి అదేం వద్దూ అని చేతులతో సైగ చేస్తూ చెబుతుంది. దీంతో ఆవేశానికి లైనైనా ఆ అభిమాని అక్కడున్న వస్తువులను విసిరేయడం వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా తన జేబులో నుంచి కత్తి తీసి 'నువ్ నన్ను పెళ్లి చేసుకోకుంటే నా గొంతు కోసుకుంటాను' అని సోనాక్షిని బెదిరిస్తాడు. దీంతో షాక్‌కు గురైన సోనాక్షి కేకలు వేయడంతో వీడియో ముగుస్తుంది. చదవండి: జిమ్ ఫొటో షేర్ చేసిన హీరో.. భార్య రియాక్షన్ ఏంటో తెలుసా ? అయితే ఈ వీడియో అంతా 'ది ఖత్రా ఖత్రా' షో ప్రచారంలో భాగంగా సోనాక్షికి తెలియకుండా తనపై ప్రాంక్ చేశారని తెలుస్తోంది. ఈ షోలో భారతీ సింగ్, హర్ష్ లింబాచియా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ శుక్రవారం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్ స్పెషల్ హోస్ట్‌గా కనువిందు చేయనున్నారు. ఇదిలా ఉంటే సోనాక్షి సిన్హా.. హ్యూమా ఖురేషీ, జహీర్ ఇక్బాల్‌తో కలిసి డబుల్ ఎక్స్ఎల్ సినిమాలో నటించనుంది. View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) చదవండి: నా నటన చూసి నా భార్య నన్ను వదిలేస్తానంది: షాహిద్ కపూర్ -
అక్తర్ కొంప ముంచిన హర్భజన్.. దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పీటీవీ
Shoaib Akhtar Gets 100 Million Defamation Notice By PTV: పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్‌కు అదే దేశానికి చెందిన ప్రముఖ క్రీడా ఛానల్ పీటీవీ(పాకిస్తాన్ టెలివిజన్ కార్పొరేషన్) దిమ్మతిరిగిపోయే షాకిచ్చింది. అక్తర్‌పై రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేసింది. ముందస్తు సమాచారం లేకుండా ఛానల్ నుంచి వైదొలిగాడని, నిబంధనలకు విరుద్ధంగా టీ20 ప్రపంచకప్-2021 వేదిక అయిన దుబాయ్ విడిచి వెళ్లిపోయాడని, తద్వారా తమ సంస్థకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లిందంటూ పీటీవీ.. అక్తర్‌కు నోటీసులు జారీ చేసింది. అక్తర్.. భారత క్రికెటర్ హర్భజన్ సింగ్‌తో కలిసి ఓ ఇండియన్ టీవీ షోలో పాల్గొనడం వల్ల తమకు నష్టం కలిగిందని పీటీవీ నోటీసుల్లో పేర్కొంది. ఇందుకుగాను అక్తర్ తన మూడు నెలల జీతం(రూ. 33, 33, 000)తో పాటు నష్టపరిహారంగా రూ. 10 కోట్లు చెల్లించాలంటూ దావా వేసింది. ఇలా జరగని పక్షంలో అక్తర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య అక్టోబర్ 26న జరిగిన మ్యాచ్ అనంతరం నిర్వహించిన పీటీవీ లైవ్ షోలో అక్తర్‌కు ఘోర అవమానం జరిగింది. ఆ లైవ్ షోలో ప్రముఖ పాకస్థానీ వ్యాఖ్యాత, హోస్ట్ డాక్టర్ నౌమాన్ నియాజ్ అక్తర్‌ను లైవ్ లోనుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఊహించని ఈ పరిణామంతో షాక్‌కు గురైన అక్తర్.. మైక్‌ను విసిరేసి షో నుంచి వాకౌట్ చేశాడు. అనంతరం ఆ టీవీ ఛానల్‌తో తనకున్న ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకున్నాడు. చదవండి: T20 WC 2021: అక్తర్‌కు ఘోర అవమానం.. లైవ్‌లో పరువు తీసిన హోస్ట్ -
వైరల్ వీడియో: చేతల్లో చూపించగలగేవాడికి చేతులతో పని ఏమి?
-
చేతల్లో చూపించగలగేవాడికి చేతులతో పని ఏమి ?
చాలామంది అన్ని సక్రమంగా ఉన్న నేను ఆ పని చేయలేను, నా వల్ల కాదు అంటూ రకరకాలుగా చెబుతుంటారు. అంతెందుకు పరిస్థితులు అన్ని బాగున్నప్పటికీ ఏవేవో సాకులతో కాలక్షేపం చేసేస్తుంటారు. ఇక్కొడక వ్యక్తి పుట్టుకతో అవయవాలు ఏమి సరిగా లేవు అయినా చక్కగా మేకప్ వేసుకోగలడు. (చదవండి: వ్యాక్సిన్ వేయించుకుంది ...రూ 7.4 కోట్లు గెలుచుకుంది) అసలు విషయంలోకెళ్లితే....గేబ్ ఆడమ్స్-వీట్లీ అనే వ్యక్తి హన్ హార్ట్ సిండ్రోమ్ అనే పుట్టుకతో వచ్చే వ్యాధితో జన్మించాడు. దీంతో అతని తల్లిదండ్రులు పుట్టిన వెంటనే బ్రెజిల్ ఆసుపత్రిలోనే వదిలి వెళ్లిపోయారు. ఇది అవయవాలపై ప్రభావం చూపే అరుదైన వ్యాధి. ఈ సిండ్రోమ్ కారణంగా అతనికి దవడ, నాలుక, చేతులు, కాళ్లు పూర్తిగా ఏర్పడలేదు. అంతే కాదు తొమ్మది నెలల వయసులో ఉన్న గేబ్ని ఉటాకు చెందిన ఒక కుటుంబం దతత్త తీసుకుంది. దీంతో అతని జీవితం ఊహించని మలుపు తిరిగింది. అతని దత్తత తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో తాను శిశువులా ఉండిపోకూడదని అన్ని నేర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అతను ప్రముఖ టీవీ షో 'యుఫోరియా ప్రేరణతో తన ముఖానికి తాను చక్కగా మేకప్ వేసుకుంటాడు. అంతేకాదు అతని మేకప్ కళకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడమే కాకా కాళ్లు, చేతులు లేకపోవడంతో తాను రోజువారీ పనులు చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడో కూడా వివరిస్తుంటాడు. అయితే ప్రస్తుతం గేబ్కి మేకప్ కళకు సంబంధించి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పైగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: అక్తర్‌కు పరువు నష్టం నోటీస్.. భజ్జీతో కనిపించినందుకే!) -
అక్తర్‌కు పరువు నష్టం నోటీస్.. భజ్జీతో కనిపించినందుకే!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ టెలివిజన్ కార్పొరేషన్ (పీటీఈ) తమ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు 10 కోట్ల రూపాయల పరువు నష్టం నోటీసు ఇచ్చింది. పీటీఈ నుంచి అక్తర్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వైదొగలడమే కాక ఒప్పంద నిబంధనలకు విరుధంగా టీ20 ప్రపంచకప్ ప్రసార నిమిత్తం దుబాయ్ వెళ్లిపోయాడంటూ పీటీవీ నోటీస్‌లో ఆరోపించింది. అంతేకాదు మూడు నెలల వ్రాతపూర్వక నోటీసు లేదా చెల్లింపుల ద్వారా అతని ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు ఇరుపక్షాలకు ఉంటుంది. (చదవండి: ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!) కానీ అక్తర్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాజీనామా చేయడంతో తమ సంస్థకు భారీ నష్టాలు చవిచూసినట్లు నోటిస్లో పేర్కొంది. పైగా అక్తర్ భారత క్రికెటర్ హర్భజన్ సింగ్‌తో కలిసి ఒక భారతీయ టీవీ షోలో కనిపించడం కూడా తమ సంస్థకి కోలుకోలేని నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ మేరకు పీటీవీ మూడు నెలల జీతానికి సమానమైన రూ. 33,33,000 మొత్తంతో పాటు నష్టపరిహారంగా 10 కోట్ల రూపాయలు చెల్లించాలని పీటీవీ నోటిస్లో అక్తర్‌ను కోరింది. ఈ మేరకు అక్తర్ చెల్లించనట్లయితే పీటీసీ చట్టపరమైన చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది. (చదవండి: అక్కడ అలా కొట్టుకోవడమే ఆచారమటా!!) -
T20 WC 2021: అక్తర్‌కు ఘోర అవమానం.. లైవ్‌లో పరువు తీసిన హోస్ట్
Shoaib Akhtar Insulted On Live Television Show: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య అక్టోబర్ 26న జరిగిన మ్యాచ్ అనంతరం నిర్వహించిన ఓ లైవ్ షోలో పాక్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్‌కు ఘోర అవమానం జరిగింది. పీటీవీ నిర్వహించిన ఆ లైవ్ షోలో ప్రముఖ పాకస్థానీ వ్యాఖ్యాత, హోస్ట్ డాక్టర్ నౌమాన్ నియాజ్ అక్తర్‌ను లైవ్ లోనుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడు. మ్యాచ్ విశ్లేషణలో భాగంగా అక్తర్ పాక్ బౌలర్లు హరీస్ రౌఫ్, షాహిన్ అఫ్రిదిలపై ప్రశంసలు కురిపిస్తుండగా, నౌమన్ అభ్యంతరం చెప్పాడు. Dr Nauman Niaz and Shoaib Akhtar had a harsh exchange of words during live PTV transmission. pic.twitter.com/nE0OhhtjIm — Kamran Malik (@Kamran_KIMS) October 26, 2021 అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతర విషయాల గురించి మాట్లాడొద్దని వారించాడు. ఇందుకు నొచ్చుకున్న అక్తర్.. ‘మీరు చాలా దురుసుగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని బదులిచ్చాడు. దీంతో సహనం కోల్పోయిన నౌమన్.. 'అతి తెలివిగా మాట్లాడితే సహించేది లేదు.. షో నుంచి వెళ్లిపోండి’ అంటూ లైవ్‌లో ఫైర్ అయ్యాడు. ఊహించని ఈ పరిణామంతో షాక్‌కు గురైన అక్తర్.. మైక్‌ను విసిరేసి షో నుంచి వాకౌట్ చేశాడు. అనంతరం ఆ టీవీ ఛానల్‌తో తనకున్న ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకున్నాడు. ఈ కార్యక్రమంలో అక్తర్‌తో పాటు వివ్ రిచర్డ్స్, డేవిడ్ గోవర్, రషీద్ లతీఫ్, ఉమర్ గుల్, ఆకిబ్ జావిద్, పాక్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ సనా మీర్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. Multiple clips are circulating on social media so I thought I shud clarify.dr noman was abnoxious and rude wen he asked me to leave the show,it was embarrassing specially wen u have legends like sir Vivian Richards and David gower sitting on the set with some of my contemporaries — Shoaib Akhtar (@shoaib100mph) October 26, 2021 కాగా, సదరు విషయంపై అక్తర్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. టీవీల్లో మిలియన్ల మంది చూస్తుండగా నౌమన్ తనతో దురుసుగా ప్రవర్తించాడని, ఇది తనను ఎంతో బాధించిందని పేర్కొన్నాడు. ఇదంతా జరిగినప్పటికీ.. నౌమన్ తనను క్షమాపణలు కోరతాడని ఆశించానని, కానీ అందుకు అతను సుముఖంగా లేకపోవడం విచారకరమని అన్నాడు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ నాలుగు వికెట్లతో చెలరేగి కివీస్ పతనాన్ని శాశించాడు. అంతకుముందు టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో సైతం పాక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చదవండి: 'ఆటగాళ్లను గౌరవించండి..' షమీకి మద్దతుగా నిలిచిన పాక్ ఓపెనర్ -
బుల్లితెరపై సందడి చేయనున్న తమన్నా!
-
బుల్లితెర ఎంట్రీకి సిద్ధమైన తమన్నా, ఎలాంటి షో అంటే... !
మిల్కీ బ్యూటీ తమన్నా ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఒకపక్క వరుస సినిమాలు చేస్తూనే డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ఆహాలో ‘లెవన్త్ అవర్’, డిస్నీ హాట్ స్టార్‌లో ‘నవంబర్ స్టోరీ’ అనే వెబ్‌సిరీస్‌ల్లో నటించి డిజిటల్ ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను కూడా పలకరించేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ టీవీ ఛానెల్ కోసం హోస్ట్‌గా మారనుందట. ‘మాస్టర్ చెఫ్’ తరహాలో ఓ షోని ప్లాన్ చేయగా, ఈ షోకి తమన్నా జడ్జ్‌గా ఉంటుందని, ఇప్పటికే సైన్ చేయడం కూడా అయిపోందని వినికిడి. త్వరలోనే దీనికి సబంధించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం తమన్నా తెలుగులో ఎఫ్ 3, సీటీమార్, మ్యాస్ట్రో చిత్రాలతో పాటు గుర్తుందా శీతాకాలం అనే మూవీలో కూడా నటిస్తోంది. చదవండి: NTR 31: ఎన్టీఆర్ సినిమాపై క్రేజీ రూమర్ లాక్డౌన్ టైంలోనూ రెండు చేతులా సంపాదిస్తున్న సుమ.. ఎలాగంటే.. బుల్లితెరపై శివగామిలా అదరగొడుతున్న రాశీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? -
Ott Netflix : ఈ టెక్నిక్ తో మీకు నచ్చిన సినిమాల్ని ఒక్క క్లిక్ తో చూడొచ్చు
కరోనా కారణంగా ఇంటికి పరిమితమైన చాలా మంది ఎంటర్టైన్మెంట్ కోసం బ్రౌజింగ్ చేయడమో లేదంటే టీవీ చూస్తుంటారు. ఇక ఓటీటీ ప్లాట్ ఫాం ను వినియోగించే వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కక్లిక్ తో బోలెడన్ని సినిమాల్ని వీక్షించవచ్చు. కానీ ఇక్కడొచ్చిన చిక్కేంటంటే మనకు నచ్చిన జానర్ లో నచ్చిన సినిమానో లేదంటే వెబ్ సిరీస్ ఎక్కడుందో వెతుక్కోవడం కొంచెం కష్టం. అందుకోసం కొంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అయితే కొన్ని కోడ్స్ వినియోగించి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో మనకు నచ్చిన సినిమాలను చూడొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫాం. ఆయా దేశాల్ని బట్టి ఓటీటీ ప్లాట్ ఫాం లోవీక్షించాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ ల జాబితా పెద్దగా ఉంటుంది. వాటన్నింటిని సులభంగా చూసే సౌకర్యంలోలేదు. ఒక్కో జానర్ క్లిక్ చేసుకుంటూ ఆ జానర్ లో మనకు నచ్చిన సినిమాను చూడాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఆ సమస్యను అధిగమించేలా నెట్ ప్లిక్స్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ సాయంతో ఒక్క కోడ్ ను అప్ల్ చేసి యూజర్స్ ఏ జానర్ లో ఎంటర్ టైన్మెంట్ కోరుకుంటున్నారు. ఆ జానర్ సినిమాలు డైరెక్ట్ గా డిస్ ప్లే అవుతాయి. కావాలంటే మనం ఆ ఫీచర్ ను వినియోగించుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్ సీక్రెట్ కోడ్స్ యాక్షన్ & అడ్వెంచర్ (1365), ఇండియన్ మూవీస్ (10463), కామిక్ బుక్ అండ్ సూపర్ హీరో మూవీస్ (10118), క్రైమ్ యాక్షన్ & అడ్వెంచర్ (9584), పిల్లల పుస్తకాల ఆధారంగా సినిమాలు (10056), క్లాసిక్ వార్ మూవీస్ (48744), లేట్ నైట్ కామెడీస్ ( 1402), రొమాంటిక్ కామెడీస్ (5475), హిస్టారికల్ డాక్యుమెంటరీలు (5349), బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీలు (3652), రియల్ లైఫ్ సినిమాలు (3653), హర్రర్ మూవీస్ (42023), డిస్నీ మ్యూజికల్స్ (59433). నెట్‌ఫ్లిక్స్ సీక్రెట్ కోడ్లను ఎలా ఉపయోగించాలి? మీరు నెట్‌ఫ్లిక్స్ సీక్రెట్ కోడ్లను ఉపయోగించాలనుకుంటే మొదట బ్రౌజర్లో నెట్‌ఫ్లిక్స్‌కు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత యాక్షన్ లేదా మీకు నచ్చిన జానర్ సినిమాకు చెందిన లిస్ట్ ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసి URL ని కాపీ చేయాలి. URL ఉదాహారణకు ఇలా ఉంటుంది (https://www.netflix.com/browse/genre/action) ఇప్పుడు ఆ URL చివరి పదంలో పైన చూపించిన కోడ్ లలో మీకు నచ్చిన జానర్ కోడ్ ను ఎంటర్ చేయాలి. ఉదాహరణకు,మీరు మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ & రెజ్లింగ్ (6695) కింద ట్యాగ్ చేయబడిన సినిమాలను చూడాలనుకుంటే, URL(https://www.netflix.com/browse/genre/6695 ) ఇలా ఉంటుంది. కావాలంటే ఒక్కసారి ట్రై చేయండి. చదవండి : OTT: నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్ లిస్ట్ ఇదిగో! -
FriendsReunion: ఆర్టిస్టులతో పాటు ఫ్యాన్స్ కంటతడి
ఆరు మెయిన్ క్యారెక్టర్లు, పది సీజన్లు, 236 ఎపిసోడ్లు.. పదేళ్లపాటు స్నేహంలోని రకరకాల భావోద్వేగాలను అందించి నవ్వించింది ఫ్రెండ్స్ టీవీ సిరీస్. ఇప్పుడు మళ్లీ రీయూనియన్ ఎపిసోడ్‌తో సంచలనాలకు తెరతీసింది. ఫ్రెండ్స్ : ది రీయూనియన్ పేరుతో టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌కి గ్లోబల్ వైడ్‌గా భారీ స్పందన వస్తోంది. ఈ క్రమంలో ఫ్రెండ్స్ పాత అల్లర్లను గుర్తు చేసుకుంటూ చాలామంది భావోద్వేగానికి లోనవుతున్నారు. 1994 నుంచి 2014 దాకా అమెరికన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బుల్లితెర ప్రేక్షకులను అలరించింది ఫ్రెండ్స్ సిట్కామ్(సిచ్యుయేషనల్ కామెడీ). ఆరుగురు స్నేహితులు, వాళ్ల మధ్య లవ్ బ్రేకప్, అల్లరి, గొడవలు.. అంతిమంగా స్నేహాన్ని నిలుపుకోవడానికి చేసే ప్రయత్నాలతో సరదాగా సాగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పదిహేడు సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ టీం మళ్లీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. జెన్నిఫర్ అనిస్టన్, కోర్టెనె కాక్స్, లీసా కుడ్రో, మాట్ లెబ్లాంక్, మాథ్యు పెర్రీ, డేవిడ్ ష్విమ్మర్.. అదే ఆర్టిస్టులు, అదే టెక్నికల్ టీం.. ఈ రీయూనియన్ కోసం పనిచేశారు కూడా. గెట్ టు గెదర్గా వచ్చిన ఈ ఎపిసోడ్‌ను బెన్ విన్స్టన్ డైరెక్ట్ చేశారు. మన దగ్గర జీ5 ఈ రీయూనియన్‌ను టెలికాస్ట్ చేస్తోంది. ఇక సోషల్ మీడియా అకౌంట్లలో #FriendsReunion రికార్డు స్థాయి ట్వీట్లతో దూసుకుపోతోంది. ఆరుగురు లీడ్ క్యారెక్టర్లు ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడంతో ఎపిసోడ్ మొదలవుతుంది. సెట్లో ఆనాటి జ్ఞాపకాలన్నింటిని ఉంచారు. బిహైండ్ సీన్స్‌తో నవ్వులు విరిశాయి. అభిమానుల ప్రశ్నలకు సరదా జవాబులు ఇచ్చింది ఫ్రెండ్స్ టీం. ఇక రీయూనియన్ పట్ల ఆ ఆర్టిస్టులు భావోద్వేగానికి లోనుగాక.. అది చూసి అభిమానులు ఫీలవుతున్నారు. VIDEO: Lady Gaga performs “Smelly Cat” with “Phoebe” #FriendsReunionpic.twitter.com/Rf3pQkfNPU — GAGAIMAGES (@gagaimages) May 27, 2021 కళ్లు చెదిరే డీల్ ఫ్రెండ్స్ రీయూనియన్ ఎపిసోడ్లో ఆరుగురు మెయిన్ క్యారెక్టర్లతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా కనిపించారు. లేడీ గాగా, బీటీఎస్, జస్టిన్ బీబర్, డేవిడ్ బెక్‌హమ్, జేమ్స్ కార్డన్.. ఇలా కొందరు కనిపించారు. ఫ్రెండ్స్ టీంతో సరదాగా అల్లరి చేశారు. ఇక ఈ ఎపిసోడ్ కోసం భారీగా డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. 1996లో ఫ్రెండ్స్ ఆర్టిస్టుల ఒక్కొక్కరి రెమ్యునరేషన్ 22,500 డాలర్లు ఉండేది. ఇప్పుడు రీయూనియన్ కోసం ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు మిలియన్ల డాలర్లు తీసుకున్నట్లు హాలీవుడ్ వెబ్‌సైట్స్ కథనాలు ప్రచురించాయి. అలాగే మొన్నటిదాకా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన ఫ్రెండ్స్ ఎపిసోడ్స్‌ను 425 మిలియన్ డాలర్ల చెల్లించి హెచ్‌బీవో కొనుక్కుంది. ఈ రీయూనియన్ స్ట్రీమింగ్‌లో మరెన్ని రికార్డులు నెలకొల్పుతుందో చూడాలి. -
టీవీ లైవ్ షోలో షాకింగ్ ఘటన : వైరల్ వీడియో
సాక్షి,న్యూఢిల్లీ: టీవీ లైవ్ షోలు, చర్చలు సందర్బంగా గెస్ట్‌ల మధ్య వివాదాలు, తీవ్ర ఘర్షణ, ఒక్కోసారి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం లాంటి అనేక వింత వింత ఘటనలు చోటు చేసుకున్న ఉదంతాలను గతంలో అనేకం చూశాం. తాజాగా కొలంబియాలోని ఓ వార్తా ఛానెల్లో లైవ్ షో సందర్భంగా అనూహ్య ఘటన జరిగింది. ఈ ఊహించని పరిణామానికి అక్కుడున్నవారూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో అంతా ఊరట చెందారు. లైవ్ ప్యానెల్ చర్చ సందర్భంగా అనుకోని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఈఎస్పీఎన్ కొలంబియాకు చెందిన జర్నలిస్ట్ కార్లోస్ ఓర్డుజ్ లైవ్ షోలో ప్యానెలిస్టులలో ఒకరు. చర్చా కార్యక్రమం నడుస్తుండగానే అకస్మాత్తుగగా టీవీ సెట్ కార్లోస్‌పై పడింది. దీంతో అతను ముందున్న టేబుల్‌ను వేగంగా ఢీకొన్నాడు. ఈ సమయంలో ఎటూ కదల్లేని పరిస్థితుల్లో స్క్రీన్ కిందే చిక్కుకుపోయాడు. దీంతో యాంకర్‌తోపాటు అక్కడున్నవారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. దీంతో యాంకర్.. షోకు కాసేపు విరామం ప్రకటించక తప్పలేదు. అయితే గాయపడిన జర్నలిస్టు క్షేమంగానే ఉన్నాడని, అతడి ముక్కుకు చిన్న గాయమైందంటూ టీవీ యాంకర్ తెలిపారు. మొత్తానికి జర్నలిస్టు స్వల్ప గాయాలతో తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. నెటిజన్లు ఈ ఘటనపై విభిన్నంగా సందిస్తున్నారు. మరోవైపు తాను క్షేమంగానే ఉన్నానంటూ కార్లోస్ కూడా ట్వీట్ చేశారు. అలాగే తనపై అభిమానం ప్రకటించిన, తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యావాదాలు తెలిపారు. UPDATE: ESPN anchor Carlos Orduz reassures viewers he is fine after being hit by falling set piece: “I must tell you I am fine, thank God, after a medical check-up and examination, any issue was ruled out, only a bruise and blow to the nose (no fracture).” — Mike Sington (@MikeSington) March 10, 2021 Shocking video. ESPN anchor crushed live on the air by falling set piece. Thankfully he was uninjured. pic.twitter.com/CeFxy8AksY — Mike Sington (@MikeSington) March 10, 2021 UPDATE: ESPN anchor Carlos Orduz reassures viewers he is fine after being hit by falling set piece: “I must tell you I am fine, thank God, after a medical check-up and examination, any issue was ruled out, only a bruise and blow to the nose (no fracture).” pic.twitter.com/JbtIIOlUmf — Carlos Orduz (@orduzrubio) March 10, 2021 -
ప్రముఖ టీవీ షో సెట్లో అగ్నిప్రమాదం
ముంబై: అత్యంత ప్రేక్షకాదరణ పొందిన టీవీ షో ‘పాండ్యా స్టోర్’ సెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం తెల్లవారుజామున మంటలు వ్యాపించడంతో సెట్లోని వస్తువులు కాలి బూడిదయ్యాయి. అయితే ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రూ.కోట్లలో నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. సంజయ్ వాద్వా, కోమల్ సంజయ్ వాద్వా నిర్మాణంలో స్టార్ ప్లస్ ఛానల్లో జనవరి 25 నుంచి ‘పాండ్యా స్టోర్’ అనే టీవీ షో ప్రసారం మొదలైంది. షైనీ దోషి, కిన్షిక్ మహాజన్ పాత్రధారులుగా ఈ షో ప్రారంభమైంది. ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే మంచి గుర్తింపు వచ్చింది. తమిళంలో వచ్చిన పాండ్యాన్ స్టోరీస్‌ను రీమేక్ చేస్తూ ‘పాండ్యా స్టోరీ’ చేస్తున్నారు. అయితే ముంబై శివారులోని గోరెగావ్‌లో ఉన్న ఫిల్మ్ సిటీలో శనివారం తెల్లవారుజామున 2.30 సమయంలో ప్రమాదం సంభవించింది. సెట్లోని మేకప్ రూమ్ నుంచి మొదట మంటలు వ్యాపించాయి. అనంతరం ఆ మంటలు సెట్టంతా వ్యాపించాయి. మంటల్లో క్యాస్టూమ్స్, విలువైన సామగ్రి, షూటింగ్ సామగ్రి తదితర వస్తువులు దగ్ధమయ్యాయి. రూ.కోట్లలో నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. నటీనటులు, షూటింగ్ బృందం అందరూ క్షేమంగా ఉన్నారని.. అయితే ప్రమాదంతో కొంత నష్టం ఏర్పడిందని షో నిర్వాహకులు ప్రకటించారు. సెట్లోని కొంత భాగం దగ్ధమైందని తెలిపింది. ఈ ఘటనతో ఆ షోకు కొన్ని రోజులు ఆగిపోయే అవకాశం ఉంది. The sets of Pandya Store caught fire 🔥 Thank God no one was shooting there when this unfortunate incident took place but major parts of the sets are damaged, as per the reports 😔 #KinshukMahajan #ShinyDoshi #PandyaStore #FilmCity #ItsEZone • • • • Follow 👉 @its_ezone 📱 pic.twitter.com/kjIUe7xeH0 — ItsEZone (@Its_EZone) February 20, 2021 -
20 గంటల షిఫ్ట్: ప్రముఖ టీవీ షో ఏఏడీ మృతి
ముంబై : ప్రముఖ క్రైం టీవీ షో ‘సావ్ధాన్ ఇండియా’ యూనిట్ సభ్యులు ఇద్దరు రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. శనివారం షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. ప్రమోద్ ‘సావ్ధాన్ ఇండియా’ షోకు అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన టీవీ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్లో పాల్గొన్నాడు. ఈ మధ్యాహ్నం 3.30 గంటల వరకు దాదాపు 20 గంటల పాటు షూటింగ్ జరిగింది. షూటింగ్ ముగిసిన తర్వాత ప్రమోద్ ఓ యూనిట్ సభ్యుడితో కలిసి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ( హీరో సల్మాన్‌ఖాన్ గుర్రం పేరిట మోసం ) 4.30 గంటల ప్రాంతంలో బైక్ యాక్సిడెంట్‌కు గురై దానిపై ఉన్న ఇద్దరూ మృత్యువాతపడ్డారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రమోద్ బైక్ నడుపుతున్నాడు. 20 గంటల షిఫ్ట్‌తో ఒత్తిడికి గురవ్వటం కారణంగానే ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రమాదం జరగటానికి గల సరైన కారణాలు తెలియరాలేదు. -
బుల్లితెరపై మరోసారి హోస్ట్‌గా ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నారు. బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు.ఎన్టీఆర్ షోకు హోస్ట్ గా వ్యవహరించడంతో మంచి సక్సెస్ అయింది. ఆ తర్వాత రెండో, మూడో సీజన్‌కు కూడా తారక్ వచ్చే అవకాశం ఉందని పుకార్లు వచ్చాయి కానీ, అది జరగలేదు. బిగ్ బాస్ లాంటి షో కాకుండా ఏదైనా టాక్ షో చేస్తే బావుంటుందని ఎన్టీఆర్ అనుకున్నారట. (చదవండి : ‘బంగారు తల్లి.. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను’) ఎన్టీఆర్ కోసం ఓ ప్రముఖ టీవీ చానెల్ ప్రత్యేకమైన షోను ఏర్పాటు చేసిందట. ఈ టాక్ షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడన్న వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఇక టాక్ షోను ఎలా ప్లాన్ చేస్తున్నారో తెలియదు గాని శని ఆదివారాల్లో తారక్ రెండు గంటల సమయాన్ని కేటాయిస్తే చాలాట. అందుకే తారక్ ఈజీగా ఒప్పేసుకున్నాడట. షోను కొనసాగిస్తూనే షూటింగ్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మీలో ఎవరు కోటీశ్వరుడు లైన్స్ లో ఈ టాక్ షో సాగుతుందని సమాచారం. ఈ షో కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేస్తున్నట్టు టాక్. దీనికోసం రెండు ఫ్లోర్ లను బుక్ చేసుకున్నాడట మేకర్స్. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. -
చాలెంజ్‌గా తీసుకుని చేశాను
‘‘సామ్‌జామ్ షో నాకు చాలా పెద్ద చాలెంజ్. దీంతో పోల్చుకుంటే సినిమా యాక్టింగ్ చాలా సులభం అనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఈ షో చేయటం ముఖ్యమనిపించింది. అందుకే చాలెంజ్‌గా తీసుకుని ఈ షో చేశాను’’ అన్నారు సమంత. ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ‘సామ్‌జామ్’ అనే షోతో ఈ నెల 13నుండి ప్రేక్షకుల ముందుకు రానున్నారు సమంత. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమంత మాట్లాడుతూ– ‘‘సామ్‌జామ్ టాక్ షో కాదు. ఈ షోలో సమాజంలోని సమస్యల గురించి మాట్లాడతాం. టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తాం. నేను బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా చేయటం నాగ్‌మామ నిర్ణయం. ఆ షో చేసే టైమ్‌లో పెద్దగా నిద్ర పట్టలేదు. చాలా హార్డ్‌వర్క్ చేశాను’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘ఆహా’ను ఫిబ్రవరిలో లాంచ్ చేశాం. ఈ ప్లాట్‌ఫామ్‌ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడానికి సమంతగారితో ఓ పెద్ద షో చేయాలనుకున్నాం. ఇది నార్మల్ షో కాదు. నందినీరెడ్డి ఈ షోను తన భుజాలపై మోస్తున్నారు’’ అన్నారు. నందినీరెడ్డి మాట్లాడుతూ– ‘‘కాఫీ విత్ కరణ్’, ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ షోలు చేసిన టీమ్‌తో పని చేయటం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను’’ అన్నారు. -
యూపీఎస్సీ జిహాద్ : ఎవరిపై కుట్ర?
సాక్షి, న్యూఢిల్లీ : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటుతున్నప్పటికి ఓ వర్గంపై మరో వర్గం బురదజల్లే ప్రయత్నాలు మాత్రం మానడంలేదు. భారత్ లౌకిక దేశమని నేతలంతా గర్వంగా రాజకీయ ప్రకటనలు చేస్తున్నా.. మైనార్టీ వర్గాలపై మాత్రం ఏదో ఒక విధంగా వివక్ష చూపుతూనే ఉన్నారు కొందరు. ఇటీవల ఓ మీడియా ప్రసారం చేసిన ఓ కథనమే దీనికి నిదర్శనం. సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన మీడియా ఓ వర్గాన్ని కించపరుస్తూ కథనాలు టెలికాస్ట్ చేయడం సరైనది కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మెట్టికాయలు వేయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. దేశ రాజధాని ప్రాంతం కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్న టెలివిజన్ సంస్థ సుదర్శన్ టీవీ. ఇటీవల ఈ టీవీలో ఓ ఎపిసోడ్ ప్రసారమైంది. ‘యూపీఎస్సీ జిహాద్’ పేరిట ఆ సంస్థ ప్రసారం చేసిన కార్యక్రమం తీవ్ర వివాదాస్పదమైంది. దేశంలో మైనార్టీలుగా ఉన్న ముస్లింలు కేంద్ర సంస్థల్లోకి పెద్ద ఎత్తున రిక్రూట్ అవుతున్నారు అనేది ఆ కార్యక్రమం సారాంశం. దేశ జనాభాలో కేవలం 13 నుంచి 15 శాతం ఉన్న ముస్లింలు పెద్ద సంఖ్యలో కేంద్ర సంస్థల్లోకి ప్రవేశిస్తున్నారని, దీని వెనుక ఎవరికీ తెలియని ఓ రహస్యం దాగిఉందనేది నిర్వహకుల అభిప్రాయం. (బీజేపీకి ఊహించని షాకిచ్చిన మిత్రపక్షం) అయితే ఓ వర్గాన్ని కించపరుస్తూ సుదర్శన్ టీవీ నిర్వహిస్తున్న యూపీఎస్సీ జిహాద్ కార్యక్రమాన్ని నిషేధించాలని పలువురు సివిల్స్ అధికారులు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికీ ఆ షో మూడు ఎపిసోడ్స్‌ని కూడా ప్రచారం చేసింది. దీనిపై రెండురోజుల క్రితం విచారణ చేపట్టిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం టీవీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లౌకిక దేశంలో ఓ వర్గాన్ని నేరుగా టార్గెట్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని, వెంటనే ఆ షోను నిలిపివేయాలని ఆదేశించింది. స్వతంత్ర ప్రతిపత్తి గల యూపీఎస్సీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా షో ఉందని ఆక్షేపించింది. వాక్ స్వాతంత్రం పేరుతో ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరిస్తామంటే ఊరుకునే ప్రసక్తేలేదని న్యాయస్థానం స్పష్టం చెప్పింది. ఇకపై తదుపరి షోలను టెలికాస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు సైతం జారీచేసింది. (30న బాబ్రీ కూల్చివేత తీర్పు) కాగా కేంద్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం.. 2019 సివిల్ సర్వీస్ పరీక్షల్లో మొత్తం 829 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయితే వారిలో 42 మంది ముస్లిం కమ్యూనిటికి చెందిన అభ్యర్థులు ఉన్నారు. అంటే మొత్తంలో 5శాతం మంది కేంద్ర సర్వీసులకు అర్హత సాధించారు. ఇక 2018లో మొత్తం 759 మంది అభ్యర్థులు అర్హత సాధిస్తే వారిలో 28 మంది ముస్లింలు ఉన్నారు. ఇక 2012, 13,14లో వరుసగా 30,34,38 మంది చొప్పున అభ్యర్థులు ఎన్నికవుతూ వస్తున్నారు. కాగా జాతీయ స్థాయిలోనూ మైనార్టీల ప్రాతినిధ్యం పెరగాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రత్యేక సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్స్‌తో పాటు మైనార్టీలకూ ప్రత్యేకంగా స్టడీ సర్కిల్స్‌ను ఏర్పాటు చేస్తోంది. మరోవైపు ముస్లింలపై కుట్ర పన్నేవిధంగా షోలు నిర్వహించడం సరైనదికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
సిద్దార్థ్ శుక్లా నన్ను చాలా హింసించాడు...
న్యూఢిల్లీ: బిగ్ బాస్ 13 నుంచి ఇటీవల బయటకు వచ్చిన కంటెస్టెంట్ కేసరి లాల్ యాదవ్ తన సహచరుడు సిద్దార్థ్ శుక్లా గురించి షాకింగ్ విషయం వెల్లడించారు. సిద్థ్ తనను 'హింసించే యంత్రం' అని ఆరోపించారు. కేసరి లాల్ యాదవ్ మాట్లాడుతూ, ‘రెండు వారాల పాటు సిద్దార్థ్ శుక్లా నన్ను చాలా హింసించాడు. అతను చాలా సమస్యలను సృష్టించాడు. అతను హింసించే యంత్రంలా మారాడు. మూడవ వారంలో, అతను నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. మేమిద్దరం మంచి బంధం కలిగి వున్నాం. అతను తన తప్పును తెలుసుకున్నాడు. నేను ఎలిమినేట్ అయినప్పుడు చాలా బాధపడ్డాడు’ అని తెలిపారు. ఇంకా ఈ షో గురించి మాట్లాడుతూ, ‘ఈ కార్యక్రమ ఫార్మాట్ నాకు సరిపోలేదు. ఈ ఇంట్లో మనుషులు దెయ్యాలుగా మారారు. ఒకరిని ఒకరు తిట్టుకుంటేనే షోలో తమకు ప్రాధాన్యత వస్తుందని వారు భావించారు. నేను అలాంటి జీవితాన్ని ఇప్పటి వరకు గడపలేదు. నేను అనవసరమైన గొడవలలో తల దూర్చను, ఇతరులను దూషించలేను’ అని తెలిపారు. దాదాపు రెండు వారాల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో గడిపిన కేసరి లాల్ శుక్రవారం ఎలిమినేట్ అయ్యారు. చదవండి: హీరోయిన్‌తో బిగ్‌బాస్ విన్నర్ పెళ్లి! -
తమన్నా ఆహా
తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళుతున్నారు తమన్నా. కేవలం కథానాయికగానే కాదు.. అతిథి పాత్రల్లో, ప్రత్యేక పాటల్లోనూ మెరుస్తున్నారీ మిల్కీ బ్యూటీ. తెలుగులో ఆమె నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, బాలీవుడ్లో నటించిన ‘బోలే చుడియా’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్‌తో కలిసి ‘సీటీమార్’ చిత్రంలో నటిస్తున్నారు తమన్నా. అయితే ‘ది నవంబర్స్ స్టోరీ’ అనే తమిళ వెబ్ సిరీస్‌తో డిజిటల్ మాధ్యమంలోనూ ఎంట్రీ ఇస్తున్నారు తమన్నా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఇక నిర్మాత అల్లు అరవింద్ స్టార్ట్ చేసిన తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో తమన్నా మెరవనున్నారట. ‘ఆహా’లో ఓ స్పెషల్ టాక్ షోను ప్లాన్ చేశారని, ఆ షోకి తమన్నా వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారని సమాచారం. -
కొత్త యాంగిల్‌తో ముందుకొస్తున్న తరుణ్ భాస్కర్
‘నీకు మాత్రమే చెప్తా’ షోతో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నానంటున్నాడు తరుణ్ భాస్కర్. పీపీ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కుతున్న ఈ కార్యక్రమానికి ప్రజా ప్రభాకర్, శ్రీకాంత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శరత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు దర్శకుడిగా, నటుడిగా కనిపించిన ఆయన తాజాగా వ్యాఖ్యాతగా అవతారం ఎత్తాడు. ఈ ప్రోగ్రామ్ మొదటి ఎపిసోడ్ ఈ నెల 14న ఓ టీవీ చానల్లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తరుణ్ భాస్కర్, శరత్, నిర్మాతలు ప్రభాకర్, శ్రీకాంత్ పాల్గొన్నారు. నిర్మాత ప్రజా ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘ఒక సినిమా వెనుక, ఒక డైరెక్టర్ వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేది ఈ షోలో చూపించాం. ముందుగా ఈ కాన్సెప్ట్ చెప్పగానే ఒప్పుకున్న తరుణ్ భాస్కర్‌కు ధన్యవాదాలు. మార్చి 14 నుంచి ‘నీకు మాత్రమే చెప్తా’ మొదలుకానుంది. డైరెక్టర్ అవ్వకముందు తాను పడిన కష్టాలు ఈ ప్రోగ్రామ్‌లో ఎంటర్టైన్ విధానంలో చెప్పాం. దర్శకుడు శరత్ మాట్లాడుతూ... నిర్మాత శ్రీకాంత్ ఒకరోజు ఈ కాన్సెప్ట్ చెప్పి డైరెక్ట్ చెయ్యమన్నారు. అలా నన్ను నమ్మి ఈ ప్రోగ్రామ్ నాతో డైరెక్ట్ చేయించినందుకు థ్యాంక్స్. షూట్ సమయంలో తరుణ్ భాస్కర్ బాగా ఎంకరేజ్ చేశారు. నా డైరెక్షన్ టీమ్ బాగా సపోర్ట్ చేసింది. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా’నని పేర్కొన్నారు. (ప్రతి ఒక్కరి ఫోన్లో కచ్చితంగా ఒక సీక్రెట్ ఉంటుంది) వాళ్ల మీద అభిప్రాయాలు మారాయి తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ... నన్ను ఆదరిస్తూ వస్తున్న వారందరికోసం మరో కొత్త ప్రయత్నంతో మీ ముందుకు వస్తున్నాను. ఒక డైరెక్టర్ మరో డైరెక్టర్‌ను ఇంటర్వ్యూ చెయ్యడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. బుల్లితెరపై ప్రోగ్రామ్ చెయ్యడంతో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. శనివారం నుంచి ప్రసారం కాబోతున్న ‘‘నీకు మాత్రమే చెప్తా’’ షో నన్ను చాలా మార్చింది, ఈ షో ప్రభావం మీ మీద కూడా ఉంటుందని అనుకుంటున్నాను. నాకు ఇతర డైరెక్టర్ల మీద ఉన్న అభిప్రాయాలు చాలా వరకు మారాయి. నిర్మాతలు శ్రీకాంత్, ప్రభాకర్ ఈ కాన్సెప్ట్‌తో మా దగ్గరికి రావడం.. అది నాకు నచ్చడంతో ఈ షో వెంటనే ప్రారంభించాం. ఇది ఫస్ట్ సీజన్, ఇప్పటివరకు కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేశాము. సక్సెస్ ఫుల్ దర్శకులతో పాటు రీసెంట్గా విజయాలందుకున్న కొత్త దర్శకులను కూడా ఈ ప్రోగ్రామ్‌లో పరిచయం చేయబోతున్నాము. నేను వెంకటేష్ గారితో చేయబోయే ప్రాజెక్ట్ త్వరలోనే మొదలవుతుంది. ఇది సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కుతుంది. నేను నెట్ ఫ్లిక్స్‌కు చేసిన వెబ్ సిిరీస్ చాలా బాగా వచ్చింది. అందులో మంచు లక్ష్మి ఓ ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఈ సిరీస్‌తో మేఘనా శాన్వి అనే కొత్తమ్మాయి ఇంట్రడ్యూస్ అవుతుంది. తను చాలా బాగా చేసింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. నేను ఔట్ పుట్ తో చాలా హ్యాపీగా ఉన్నాను’ అని తెలిపారు. -
చనిపోయిన పాపను ఇలా కలుసుకున్న తల్లి
సాక్షి, న్యూఢిల్లీ : ఆత్మీయులు అకాలంగా మరణిస్తే ఎవరికైనా అంతులేని దు:ఖం కలుగుతుంది. అలా కన్న పేగు దూరమైతే వారి దు:ఖం ఇంకా అంతులోనిది. పొగిలి పొగిలి ఏడ్చినా తీరనిది ఆ బాధ. కలలో తప్పించి వారు వారికి కనిపించరు. అలా దూరమైన వారిని, పేగు బంధాన్ని నిజంగా కలుసుకుంటే....కళ్లతో చూస్తూ పెదవులతో మాట్లాడుతూ, చేయి చేయి పట్టుకొని స్పర్శిస్తే..... నిజంగా అది సాధ్యమైతే ఆ అనుభూతి అపారమైనతి. ఎన్నటికీ మరవలేనిది. మరపురానిది. ఓ కొరియన్ టీవీ ‘మీటింగ్ యూ’ అనే షోలో జాంగ్ జీ సంగ్ అనే తల్లికి 2016లో మరణించిన తన కూతురు నయ్యేన్ను చూడటమే కాదు, కలసుకొని మాట్లాడే వీలు కల్పించింది. ఆ తల్లిని ఓ మైదానంలోకి తీసుకెళ్లింది. ఆడుతూ, ఆడుతూ చెక్కల చాటున దాచుకొని అప్పుడే అమ్మా అంటూ ఏడేళ్ల పాప ఆ తల్లి ముందుకు రావడం, ‘ఓ మై ప్రెటీ ఐ మిస్డ్ యూ’ అంటూ ఆ తల్లి ఆ పాప ముఖాన్ని ముట్టుకొని స్పర్శించే ప్రయత్నించడం మనమూ చూడగలం. ఊదారంగు గౌను, నల్లటి జుట్టు కలిగి మెరుస్తున్న కళ్లతో ఆ తల్లిని చూస్తూ ‘ఎక్కడికి పోయావ్ ఇంతకాలం. అసలు నేను గుర్తున్నానా?’ అంటూ అమాయకంగా ప్రశ్నించడం, ‘నిన్ను ఎలా మరచిపోతాను రా కన్నా!’ అంటూ ఆ తల్లి చెప్పడం, ‘అమ్మా నిన్ను ఎంతో కోల్పోయాను’ ‘నేను కూడా ఎంతో కోల్పోయాను’ అంటూ తల్లీ కూతుళ్లు పరస్పరం చెప్పుకోవడం ఆ తల్లికే కాదు, వారిని చూస్తున్న ప్రేక్షకుల్లోని ఆ పాప తండ్రి, సోదరుడు, సోదరితోపాటు ప్రేక్షకులు కంటతడి పెట్టడం అందరిని కలచివేస్తుంది. ఆ పాప ఓ పువ్వు పట్టుకొని తల్లి దగ్గరకు పరుగెత్తుకు రావడం ‘అమ్మా! ఇక నిన్నెప్పుడు బాధ పెట్టను’ అని హామీ ఇవ్వడం అందరి హృదయాలను హత్తుకుంటుంది. ఆ తర్వాత ఆ పాప టుంగుటూయల పరుపెక్కి ఏదో చదివి తల్లికి వినిపించడం, అలసిపోయానమ్మా, ఇక పడుకుంటానంటూ చెప్పడం, అందుకు పాపకు బాయ్ చెప్పడంతో ఆ తల్లి, ప్రేక్షకులు ఈ లోకం లోకి వస్తారు. ఈ పాటికి అర్థమై ఉండాలి. ‘వర్చువల్ రియాలిటీ (వీఆర్)’ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జాంగ్ జీ సంగ్ అనే తల్లికి తన కూతురుని కలసుకునే అవకాశాన్ని కొరియన్ టీవీ కల్పించింది. ‘మున్వా బ్రాడ్ క్యాస్టింగ్ కార్పొరేషన్ (ఎంబీసీ)’ నయ్యోన్ డిజిటల్ క్యారెక్టర్‌ను సృష్టించేందుకు ఎంతో శ్రమించింది. డిజిటల్ కెమెరా ముఖానికి, డిజిటల్ గ్లౌవ్స్‌ను ధరించడం ద్వారా జాంగ్ నిజంగా తన కూతురును కలుసుకున్న అనుభూతిని పొందారు. తాను తన కూతురు నయ్యేన్ ఎప్పటికీ మరచిపోనని, ఈ టీవీ షోను చూసిన వారెవరు కూడా నయ్యేన్ మరచిపోరాని జాంగ్ తన బ్లాక్‌లో రాసుకున్నారు. -
చనిపోయిన పాపను ఇలా కలసుకున్న తల్లి
-
ది ఫర్గాటన్ ఆర్మీ.. గిన్నిస్ రికార్డు
ముంబై: ప్రముఖ ఫిల్మ్‌మేకర్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘ది ఫర్గాటన్ ఆర్మీ’ గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఆజాద్ హింద్ ఫౌజ్‌కు చెందిన వెలుగు చూడని వీరులకు నివాళిగా ముంబైలోని సబర్బన్ హోటల్లో శుక్రవారం రాత్రి భారీ సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఇందులో దాదాపు 1000 మంది గాయకులు, వాయిద్యకారులు పాల్గొన్నారు. దీంతో భారత సినిమాటిక్ సంగీత బ్యాండ్‌లో నిర్వహించిన అతిపెద్ద కార్యక్రమంగా ఇది నిలిచిందని గిన్నిస్ ప్రపంచ రికార్డుల అడ్జడికేటర్ స్వాప్నిల్ దంగారికర్ ప్రకటించారు. -
అత్తగారూ కోడలూ
అత్తగారూ కోడలూ టీవీల్లో ఒకరినొకరు హింసించుకోవడం కనిపిస్తుంది. నిజ జీవితంలో వారు సఖ్యంగా ఉండరనే అపవాదు ఉంది. కాని ఒక సెలబ్రిటీ కోడలు తన సెలబ్రిటీ అత్తగారితో ఒక రేడియో షో నిర్వహించడం చాలామందిని ఆకట్టుకుంది. ‘ఇష్క్’ రేడియో 104.8 ముంబై, కోల్‌కతా, ఢిల్లీలో ప్రసారం అవుతోంది. ఇందులో కరీనా కపూర్ ‘వాట్ ఉమెన్ వాంట్’ (స్త్రీలకు ఏమి కావాలి?) అనే షో చేస్తోంది. మొదటి సీజన్ ముగిసి రెండో సీజన్ ప్రారంభం కాగా మొదటి ఎపిసోడ్లో తన అత్తగారూ సైఫ్ అలీ ఖాన్ తల్లి అయిన షర్మిలా టాగోర్తో సంభాషించింది. పది నిమిషాలకు పైగా సాగిన ఈ షోను యూ ట్యూబ్ ప్రచారం కోసం వీడియోగా కూడా అందుబాటులో ఉంచారు. కరీనా, షర్మిలా పక్కపక్కన కూచుని మాట్లాడుకోవడం అభిమానులను కుతూహలపరిచింది. ‘మీరు స్త్రీగా మీ కెరీర్‌ను కుటుంబాన్ని ఎలా అనుసంధానించుకున్నారు’ అని కరీనా అడిగితే ‘నా సినిమాలను మానుకోవడం ద్వారా’ అని షర్మిలా సమాధానం ఇచ్చారు. ‘పని చేసే భార్ య ఉన్నప్పుడు ఇంట్లో ఉండే భర్త– అంటే హౌస్ హజ్బెండ్స్ ఉండటం మన సమాజం అంగీకరించదు. అలా భర్తను ఇంట్లో ఉంచితే భార్యను తప్పుగా చూస్తుంది. స్త్రీలు అలా తప్పుగా చూడబడటాన్ని అంగీకరించరు. కనుక తాము ఇంట్లో ఉండి పిల్లలను చూసుకుంటూ భర్తను పనికి పంపుతారు. నేను కూడా అలాగే చేయాల్సి వచ్చింది’ అని షర్మిలా అన్నారు. ‘కూతురికి కోడలికి తేడా ఏమిటి?’ అని కరీనా అడిగితే ‘కూతురు గురించి మనకు తెలిసి ఉంటుంది. కోడలి గురించి తెలియదు. మెల్లగా తెలుసుకోవాలి. అందుకు సమయం వెచ్చించాలి. ఓర్పు వహించాలి’ అని షర్మిల చెప్పారు. ‘కోడలిగా అడుగుపెట్టినప్పుడు నేను కూడా ఇబ్బంది పడ్డాను. నేను బెంగాలీని రైస్ తింటాను. టైగర్ (పటౌడి–భర్త) వాళ్లు రొట్టె తింటారు. నాకు చేపలు ఇష్టం. టైగర్‌కు ఇష్టం ఉండదు. ఇవన్నీ నడిచాయి. వీటిని అత్తాకోడళ్లు ఇద్దరూ అర్థం చేసుకోవాలి’ అని ఆమె అన్నారు. ఇద్దరూ కరీనా కుమారుడు తైమూర్ గురించి సోషల్ మీడియా ప్రదర్శిస్తున్న అటెన్షన్ గురించి కొద్దిగా ఆందోళన పడ్డారు. ‘మీ (నలుగురు) మనమలలో ఎవరంటే మీకు ఎక్కువ ఇష్టం’ అని షర్మిలను అడిగితే ‘అమ్మో... ఒకరినని ఎలా చెప్పడం.. నలుగురూ నాలుగు విధాలా ఇష్టం’ అని చెప్పారామె. సైఫ్–అమృతాసింగ్‌ల కుమార్తె అయిన సారా ఇప్పుడు హీరోయిన్గా సఫలం కావడం పట్ల షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. అత్తాకోడళ్ల ఈ సంభాషణలో ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ మాట్లాడుకోవడం మంచి విషయంగా అనిపించింది. చాలామంది ఇలాగే ఉంటారని ప్రచారం చేయాల్సిన అవసరం కూడా కనిపించింది. -
ఇండియన్ ఆర్మీపై ఎంఎస్ ధోని టీవి షో..!
న్యూఢిల్లీ: ప్రపంచం గుర్తించేలా క్రికెట్లో ఎన్నో రికార్డులు సృష్టించిన మిస్టర్ పర్ఫెక్ట్ ధోని ఇండియన్ ఆర్మీపై ఎప్పటికప్పుడు తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటాడు. ఎంఎస్ ధోని ప్రపంచకప్ తర్వాత బ్యాట్ పట్టలేదు. సైన్యంలో రెండు నెలలు పనిచేయాలంటూనే ఆ పని పూర్తయినా.. తన విరామాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే ఈ విరామ సమయంలో కూతురు జీవా, భార్య సాక్షితో సరదాగా వివిధ ప్రదేశాలను చుట్టేస్తున్నాడు. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా గౌరవాన్ని పొందిన మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు మన సైనికుల కోసం మరో అడుగు ముందుకు వేయబోతున్నాడు. వారితో కలిసి కొంత కాలం పనిచేసినపుడు సైనికుల సమస్యల మీద కొంత అవగాహన ఏర్పడడంతో.. సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో తెలియజేసేందుకు సొంతంగా ఒక టీవీ షోని నిర్మించేందుకు ధోని సిద్దమయ్యాడు. భారతదేశ సాయుధ దళాల పనితనాన్ని అలాగే వారు దేశం కోసం చేసిన, చేస్తున్న కృషిని గురించి అందరికీ తెలియచేసేలా ఈ షో నిర్వహించనున్నారని తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక క్రికెటర్ ఒక మంచి పనికి సిద్దమవడం విశేషం. స్టార్ ప్లస్‌లో షో టెలికాస్ట్ కానున్నట్లు సమాచారం. షో ఇంకా మొదలవ్వకముందే జనాల్లో ఈ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ధోని నిర్మిస్తున్న ఈ షో సోనీ టీవీలో ప్రసారం అయ్యే అవకాశాలున్నాయి. కాగా..ధోని గత కొద్ది కాలంగా విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. -
అమితాబ్ బాటలో రాధిక కానీ..
వెండితెర మీద ఎంత పాపులారిటీ సంపాదించారో.. బుల్లి తెర మీద కూడా అదే స్థాయిలో అభిమానులను అలరించారు సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్. ఇన్ని రోజుల్లో టీవీ సీరియల్స్‌తో అలరించిన త్వరలో హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హిందీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా కౌన్ బనేగా కరోడ్‌పతి(కేబీసీ) విశేష ఆదర సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళంలో కేబీసీ మాదిరి ‘కోడీశ్వరి’(కోటీశ్వరి) గేమ్ షోను ప్లాన్ చేస్తున్నారు. ఈ క్విజ్ షోకు రాధిక హోస్ట్‌గా ఉండనున్నారు. అయితే కేబీసీలో మహిళలకు, పురుషులకు అవకాశం కల్పించగా.. కోడీశ్వరిలో కేవలం మహిళలు మాత్రమే పాల్గొనేందకు అవకాశం కల్పించారు. ఈ షో కలర్స్ తమిళ్ చానల్లో ప్రసారం కానుంది. ఈ షోకు సంబంధించి రాధిక లుక్‌తో కూడిన చిన్న టీజర్‌ను ఆ చానల్ విడుదల చేసింది. కాగా, ఈ షో డిసెంబర్ నుంచి ప్రసారం కానున్నట్టుగా తెలుస్తోంది. கலர்ஸ் தமிழ் பெருமையுடன் வழங்கும் உலகத்தின் மிகப்பெரிய வண்ணமயமான "கேம் ஷோ..!!". முதல்முறையாகப் பெண்கள் மட்டுமே கலந்துகொள்ளும் ஒரு பிரம்மாண்டமான மேடை 'கோடீஸ்வரி'..!!#ColorsKodeeswari | #ColorsKOD | #ColorsTamil | @realradikaa pic.twitter.com/kt4FetFfaK — Colors Tamil (@ColorsTvTamil) October 17, 2019 అయితే కేబీసీ ఆధారంగా తమిళంలో ఇదివరకే ‘నీంగలుమ్ వెల్లాలుమ్ ఒరు కోడీ’పేరుతో ఓ షో ప్రసారం అయింది. మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షోకు సూర్య, ప్రకాశ్‌రాజ్, అరవింద్‌స్వామిలు ఒక్కో సీజన్లో హోస్ట్‌లుగా వ్యవహరించారు. పలు భారతీయ భాషల్లో కూడా కేబీసీ ఆధారంగా ఇప్పటికే షోలు వచ్చిన సంగతి తెలిసిందే. -
బుల్లితెర ఎంట్రీ
గ్లామరస్ క్యారెక్టర్లతో పాటు ట్రెడిషనల్ క్యారెక్టర్స్‌తోనూ సిల్వర్ స్క్రీన్‌పై ప్రేక్షకులను మెప్పిస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్. ఇప్పుడు ఆమె బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. ఓ ప్రముఖ చానెల్‌కు చెందిన డ్యాన్స్ షోలో ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. ఈ షో జూన్‌లో స్టార్ట్ కానుందని తెలిసింది. ఆల్రెడీ షో విధి విధానాలు, వాటికి సంబంధించిన విశేషాలను కరీనాకు వివరించారట నిర్వాహకులు. ఇప్పటికే రిహార్సల్స్ కూడా స్టార్ట్ చేశారామె. కరీనా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనుండటం ఇదే తొలిసారి. ఇక సినిమా విషయానికి వస్తే... ఇటీవలే ‘గుడ్‌న్యూస్’ షూటింగ్‌ను పూర్తి చేసి, ‘అంగ్రేజీ మీడియం’సినిమాతో బిజీగా ఉన్నారు. -
1 వర్సెస్ 100
నయనతార.. సౌతిండియా లేడీ సూపర్‌స్టార్. కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ బ్యాలెన్స్ చేయడంలో ఎక్స్పర్ట్. ఎన్ని సినిమాలు చేసినా ప్రమోషన్స్‌కు, టీవీ ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటారు. సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే కనిపించడానికి ఆసక్తి చూపిస్తారామె. అయితే విచిత్రంగా నయనతార తమిళంలో ఓ టీవీ షో హోస్ట్ చేయబోతున్నారని తెలిసింది. కోలీవుడ్‌లో ఇదివరకూ ఖుష్బూ, రమ్యకృష్ణ తదితరులు టీవీషోలు హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్‌లోకి లేట్ అయినా లేటేస్ట్‌గా ఎంట్రీ ఇస్తున్నారు నయన్. ‘1 వర్సెస్ 100’ అనే అమెరికన్ టీవీ షో తమిళ వెర్షన్‌కు హోస్ట్‌గా నయనతార కనిపిస్తారు. ఇన్ని సంవత్సరాలు ప్రమోషన్స్, టీవీలకు దూరంగా ఉన్న నయన్ ఈ షో అంగీకరించారంటే షోలో ఖచ్చితంగా ఏదో స్పెషాల్టీ ఉండి ఉంటుందేమో. షో స్పెషల్‌గా ఉండటంతో పాటు నయనతారకు భారీ పారితోషికం ఆఫర్ చేశారట. త్వరలోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కానుందట. ప్రస్తుతం చిరంజీవితో ‘సైరా’, రజనీతో ‘దర్బార్’, విజయ్‌తో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు నయనతార. త్వరలో దర్శకుడు శివ, సూర్య కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్గా నటిస్తారట. -
అమెరికాలో అతను డాక్టర్ కపూర్
అనుపమ్ ఖేర్‌ను మన దేశంలో అందరూ గుర్తించడంలో గౌరవించడంలో వింత లేదు.కాని అమెరికాలో అతను ఇప్పుడు సామాన్యుల గౌరవాన్ని పొందుతున్నాడు. ఇటీవల అతడు అమెరికాలోని ఒక ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ క్లియరెన్స్ దగ్గర నిలబడ్డాడు. ఏదో ఈవెంట్‌కు హాజరవ్వాల్సి ఉండగా అతని దగ్గర అనుమతించిన లగేజీకి మించిన బరువుతో కొన్ని సూట్స్ ఉన్నాయి. వాటి బరువుకు తగ్గ చార్జ్ చెల్లించాల్సి వస్తుందేమోనని అనుపమ్‌ఖేర్ సందేహించాడు. కాని కౌంటర్లో ఉన్న ఒక ఆఫ్రికన్–అమెరికన్ అతణ్ణి చూసి చిన్న చిర్నవ్వుతో ‘మిస్టర్ కపూర్.. నాకు మీ యాక్టింగ్ అంటే ఇష్టం. పర్లేదు. మీరు వెళ్లొచ్చు’ అంది. అనుపమ్ ఖేర్ అమెరికాలో ‘మిస్టర్ కపూర్’గా మారడానికి అక్కడ గత సంవత్సరం ప్రసారమైన టెలివిజన్ షో ‘న్యూ ఆమ్స్టర్డామ్’ కారణం. అమెరికాలో పాఠకాదరణ పొందిన ‘ట్వల్వ్ పేషెంట్స్: లైఫ్ అండ్ డెత్ ఎట్ బెల్వ్యూ హాస్పిటల్’ అనే పుస్తకం ఆధారంగా ఈ టెలివిజన్ షో గత సంవత్సరం 16 ఎపిసోడ్లుగా ప్రసారం అయ్యింది. ఇది ఒక సీజన్‌కు మాత్రమే పరిమితమైన షో అనుకున్నారు. కాని ఇది ప్రసారం కావడమే పెద్ద హిట్ అయ్యింది. ఇండియన్ డాక్టర్‌గా నటించిన అనుపమ్‌ఖేర్‌ను అమెరికన్లు బాగా ఇష్టపడ్డారు. దాంతో ఇప్పుడు రెండో సీజన్ కోసం ఈ షో షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. అనుపమ్ ఖేర్ అక్కడే ఉదయం ఆరు గంటల కాల్షీట్ నుంచి పని చేస్తున్నారు. ‘నేను హిందీ నటుణ్ణి. నా బుర్ర హిందీలోనే ఆలోచిస్తుంది. ఇంగ్లిష్‌లో డైలాగులు చెప్పాలంటే ఎక్కువసార్లు వాటిని మననం చేసుకోవాల్సి వస్తోంది’ అన్నారు అనుపమ్ ఖేర్. దాదాపు అమెరికన్లు తెర మీద తెర వెనుక పని చేస్తున్న ఆ సెట్లో అనుపమ్‌తో హిందీలో మాట్లాడేది అతడి మేనేజర్ మాత్రమే. మిగిలినవారితో ఇంగ్లిష్‌లోనే సంభాషణలు సాగుతున్నారు. ‘ఇక్కడ బాగా పేరొచ్చింది. న్యూయార్క్‌లో నడుస్తుంటే దారిన పోతున్నవాళ్లు విష్ చేస్తున్నారు. అందుకే ఉత్సాహంగా షూటింగ్ కోసమని వచ్చాను. కాని నా ముంబై స్టుడియోల్లోని సందడి, అరుపులు, కేకలు మాత్రం మిస్సవుతున్నాను’ అన్నాడాయన. భారతదేశంలో ఇప్పుడు ఎలక్షన్ల హడావిడి నడుస్తోందని మనందరికీ తెలుసు. అనుపమ్ ఖేర్ బిజెపి మద్దతుదారు అని కూడా తెలుసు. అయితే ప్రత్యక్షంగా ఆయన ప్రచారంలో కనిపించే అవకాశాలు ఈ షూటింగ్ వల్ల ఉండవని అర్థమవుతోంది. అదీగాక తాను నేరుగా రాజకీయాల్లోకి రాదలచుకోలేదని ఆయన ఇదివరకే ప్రకటించాడు. ఆయన భార్య కిరణ్ ఖేర్ మాత్రం చండీగఢ్ నుంచి బిజెపి ఎం.పిగా ఐదేళ్లు పూర్తిచేసి మరోసారి పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ‘హోటల్ ముంబై’కి చిక్కులు 2008లో ముంబై తాజ్ హోటల్ మీద జరిగిన ముష్కర దాడి అందరికీ తెలుసు. ఆ ఉదంతం పై రామ్‌గోపాల్ వర్మ ‘ది అటాక్స్ ఆఫ్ 24/11’ అనే సినిమా తీశాడు. అయితే ఆ ఉదంతం జరిగినప్పుడు తాజ్ హోటల్లోని సిబ్బంది అందులో బస చేసిన వారి ప్రాణాలను ఎలా కాపాడారో వివరిస్తూ ఇంగ్లిష్‌లో ‘హోటల్ ముంబై’ సినిమా సిద్ధమైంది. ఇందులో అనుపమ్ ఖేర్ తాజ్ హోటల్ చీఫ్ చెఫ్‌గా నటించారు. సినిమాలో అది కీలకపాత్ర. కాని ఆ పాత్రను అందరూ చూసే వీలు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ సినిమా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో విడుదల కాగా తాజా న్యూజిలాండ్‌లో జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో ఉగ్రవాదాన్ని చూపి భావోద్వేగాలను ప్రభావితం చేసే ఇటువంటి సినిమా అక్కర్లేదని భావించి అక్కడి ప్రభుత్వం దాని ప్రదర్శనను రద్దు చేసింది. మరోవైపు భారత్‌లో విడుదలకు నిర్మాతలకు, దుబాయ్‌లో ఉన్న ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థకు పేచీ వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ సినిమా ప్రదర్శనను విరమించుకుంది. కనుక అనుపమ్ ఖేర్ ఎంతో బాగా నటించానని అనుకుంటున్న ఆ సినిమా ఇప్పుడిప్పుడే మనం చూసే అవకాశానికి వీలు కల్పించకుండా ఉంది. -
అద్భుతం.. ‘అద్వితీయం’
పోచారం: పదిమందిలో ఉన్నప్పుడు మనకుంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. అప్పుడే గుర్తింపు వస్తుంది. ప్రస్తుత తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అలాగే ఆలోచిస్తున్నారు. తమ పిల్లలకు చదువుతో పాటు కళారంగాల్లోనూ ప్రోత్సాహం అందిస్తున్నారు. అలా వెలుగులోకి వచ్చిందే పాటల కోకిల ‘వజ్జల అద్వితీయ’. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ బాలిక పాటల తోటలో స్వేచ్ఛగా విహరిస్తోంది. తల్లిదండ్రులు సుమంగళి, రాఘవేంద్రతో పాటు పోచారం సంస్కృతి టౌన్షిప్లో నివసించే అమ్మమ్మ ఆదిలక్ష్మి, తాతయ్య జగన్మోహన్రావు ప్రోత్సాహంతో అద్వితీయ శాస్త్రీయ, లలిత సంగీతం నేర్చుకుంది. దాంతో పలు వేదికలపైన, పోటీల్లోనూ ప్రతిభను నిరూపించుకోవడంతో సినీ పాటలు పాడే అవకాశాన్ని సైతం అందిపుచ్చుకుంది. జెమినీ టీవీ ప్రసారం చేసే ‘బోల్ బేబీ బోల్’లో రెండు సీజన్ల పాటు సంగీత ప్రియులను అలరించిందీ చిన్నారి. ‘నందు ఎట్‌ది రేట్ ఆఫ్ 24’ షార్ట్ ఫిల్మ్‌కు టైటిల్ సాంగ్ పాడి ఆకట్టుకుంది. ఇక ‘పాడుతా తీయగా’, దూరదర్శన్ ‘ఆలాపన’ వంటి టీవీ కార్యక్రమాల్లో తన గళం వినిపించి ఉద్దండుల మొప్పు పొందింది. ‘స్పైడర్, మహానటి, ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాల ఆడియో లాంచింగ్ కార్యక్రమంలో పాటలు పాడి ప్రేక్షకులను అలరించింది అద్వితీయ. సంగం సంస్థ నిర్వహించిన సంగీత పోటీల్లో రాష్ట్రస్థాయి విజేతగా నిలవడంతో పాటు, సచ్చిదానంద కళాపీఠం నుంచి బాల పరిమళం, బాల గాన సౌరభం, రసమయి ఉగాది పురస్కారాల్లో ‘గానకోకిల’ బిరుదులు తన ఖాతాలో వేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో రెండు గంటలు నిర్విరామంగా సోలో, యుగళ గీతాలు పాడి ‘ట్రెడిషన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించుకుంది. మలేసియాలోనూ ‘అద్వితీయం’గా.. చిన్నారి అద్వితీయ రెండున్నరేళ్లు మలేసియాలో చదువుకుంది. అక్కడ తెలుగు వారి ఉగాది వేడుకల్లో తన గాన మాధుర్యాన్పి పంచింది. మలేషియాలోని గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటూనే ఆన్లైన్లో విజయలక్ష్మి వద్ద సంగీత పాఠాలు నేర్చుకుంది. బాలిక సంగీత ప్రతిభను గుర్తించిన ఆ స్కూల్ అద్వితీయను ‘మెలోడి సింగర్’ అవార్డుతో సత్కరించింది. మలేసియాలోని ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో జరిగే భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సైతం తన గళం వినిపించింది. తెలుగు ఎక్స్పర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాలు నిర్వహించి పలు ప్రాంతాల్లోని తెలుగు వారిని అలరించింది. అద్వితీయ మాట్లాడుతూ.. లక్ష్మణాచారి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో గురువులు టి.వాణిశ్రీ, వేదల శశికళ, ఎన్.సి.శ్రీదేవి అందించిన ప్రోత్సాహంతో తాను ఇంతటి గుర్తింపు పొందానని వినమ్రంగా చెబుతోంది. తన మిత్రులు సౌమ్య, అనుష్క, సమ్యుక్త, సాత్విక బృందంతో కలిసి పలు సంగీత విభావరులు నిర్వహించి రూ.25 లక్షల విరాళాలు సేకరించి కేన్సర్ రోగుల సహాయార్ధం గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్‌కు అందించి తన సేవాభావం చాటుకుంది అద్వితీయ. -
28 నుంచి బుల్లితెరపై..
సినిమా: ఈ నెల 28 నుంచి శ్రుతిహాసన్ బుల్లితెర ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించడానికి రెడీ అవుతోంది. ఆమె తండ్రి కమలహాసన్ బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో అంటూ బుల్లితెర ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేస్తే, తాజాగా ఆయన తనయ శ్రుతిహాసన్ హలో సాగో అంటూ బుల్లితెర ప్రేక్షకల ముందుకు రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ వీడియో సేవలందిస్తున్న వైవ్ సంస్థ, మోషన్ కంటెంట్ గ్రూప్‌తో కలిసి వైవ్ హలో సాగో పేరుతో చర్చావేదిక కార్యక్రమాన్ని రూపొందిస్తోంది. ఈ కార్యక్రమానికి సంచలన నటి శ్రుతిహాసన్ వ్యాఖ్యాతగా వ్వవహరిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం తెలుగులో నంబర్‌ఒన్ యారీ పేరుతో ప్రసారం అవుతోంది. దానికి నటుడు రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటీనటుల వ్యక్తిగత విషయాలను వెల్లడించి ప్రేక్షకుల ముందు తమ మరో కోణాన్ని ఆవిష్కరిస్తారని నిర్వాహకులు తెలిపారు. తారలు తమ నిజ జీవితాల్లోని రహస్యాలను ప్రేక్షకులతో పంచుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నటి శ్రుతిహాసన్ ఈ సందర్భంగా స్పందిస్తూ సాధారణంగా ఎంటర్టెయిన్మెంట్ రంగానికి చెందిన వారు వారి అంతరంగ విషయాల గురించి బయట ప్రపంచానికి చెప్పుకోవడానికి ఇష్టపడరన్నారు. అయితే ఈ వైవ్ హలో సాగో కార్యక్రమం ద్వారా ప్రేక్షకులు తారల మరో ముఖాన్ని చూడగలరని చెప్పారు. తారలు నిజాయితీగా చెప్పే విషయాలు, వారి అందమైన జీవిత పయనాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తానూ ఒక భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. కాగా 13 ఎపిసోడ్స్‌తో కూడిన ఈ కార్యక్రమం ఈ నెల 28 నుంచి ఆదివారం రాత్రి 8.30 గంటలకు వైవ్ యాప్‌తో పాటు సన్ టీవీలోనూ ఏకకాలంలో ప్రసారం అవుతుందని నిర్వాహకులు వెల్లడించారు. -
కొత్త జర్నీ
క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి సక్సెస్ఫుల్ హీరోగా ఎదిగారు తమిళ నటుడు విజయ్ సేతుపతి. మధ్యలో హీరో నుంచి విలన్‌గా కూడా మారారు. ఇప్పుడు మరో కొత్త పాత్ర పోషించడానికి విజయ్ సేతుపతి రెడీ అయ్యారని కోలీవుడ్ టాక్. త్వరలోనే ఆయన ఓ టెలివిజన్ నిర్వహించే టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారట. ఆమిర్ ఖాన్ చేసిన ‘సత్యమేవ జయతే’ షో తరహాలోనే ఈ కార్యక్రమం కూడా సామాజిక స్పృహ కలిగి ఉంటుందని సమాచారం. షో కాన్సెప్ట్ నచ్చడంతో వెంటనే చేయడానికి అంగీకరించారట విజయ్ సేతుపతి. త్వరలో ప్రారంభం కానున్న ఈ షోలో సేతుపతి కొత్త లుక్‌తో దర్శనమిస్తారట. -
స్మాల్‌బాస్ షో... విన్నర్ ఎవరు?
కాకులు దూరని కారడవి... చీమలు దూరని చిట్టడవి అది.ఆ అడవి మధ్యలో ఒక కొండపై అందమైన ఇల్లు ఒకటి నిర్మించారు. ఈ ఇంట్లో ఎవరు ఉన్నారో తెలుసా? పలు రంగాల ప్రముఖులతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంపు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్నారు.వీళ్లకు అక్కడేం పని?‘స్మాల్‌బాస్’ అనే టీవీ షోలో భాగంగా ఒక నెలరోజుల పాటు వాళ్లు ఈ ఇంట్లో ఉన్నారు. బట్టలు ఉతుక్కోవడం నుంచి వంట చేసుకోవడం వరకు తమ పనులు తామే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి వారం ‘స్మాల్‌బాస్’ ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్‌లో విఫలమైన వారు ఎలిమినేట్ అవుతారు.పేషెన్సీ లెవల్‌ను పరీక్షించడానికి, మనిషిలోని ఒరిజినల్ క్యారెక్టర్‌ను బయటికి తీసుకురావడానికి ఉద్దేశించిన టీవీ షో ఇది. అన్ని సవాళ్లను తట్టుకొని చివరి వరకు ఎవరు నిలుస్తారో వారే విజేత.‘డూప్లికేట్ క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్ అని రెండు వేరుగా ఉండవు. నాది ఎప్పుడూ ఒకే క్యారెక్టర్...అది ఒరిజినల్ క్యారెక్టర్. కాబట్టి నేనే విజేత’ అని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. మొదటి వారం టాస్క్:‘తన కోపమే తన శత్రువు’ఈ టాస్క్‌లో భాగంగా ఒకరినొకరు రెచ్చగొట్టుకోవాలి. అయినా సరే ఎవరు టెంప్ట్ కావద్దు. కోపం తెచ్చుకోవద్దు. ఒకవేళ తెచ్చుకుంటే షో నుంచి ఎలిమినేట్ అవుతారు.ఆరోజు...‘‘ఎక్స్‌క్యూజ్‌మీ...’’ అంటూ ట్రంపు దగ్గరకి వచ్చాడు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్.‘‘ఏమిటి మిత్రమా!’’ కిమ్‌ను ప్రేమగా పలకరించాడు ట్రంప్.‘‘ఒకసారి మీ చెంప చూపిస్తారా’’ ఆప్యాయంగా అడిగాడు కిమ్.‘‘ఇదిగో ఇదే నా చెంప’’ అని చూపించాడు ట్రంప్.చుక్కలు కనిపించేలా చెంప మీద ఒక్కటిచ్చుకున్నాడు కిమ్.ట్రంప్‌కు కోపం రాలేదు సరికదా...చిరునవ్వుతో అన్నాడు...‘‘మిత్రమా కుడిచెంప మాత్రమే వాయించావు. ఎడమ చెంప ఏ పాపం చేసింది?’’ఎడమ చెంప మీద కూడా గట్టిగా ఒక్కటి ఇచ్చాడు కిమ్.ఈసారి కూడా కోపం తెచ్చుకోలేదు. ‘థ్యాంక్స్ గురూ’ అంటూ కిమ్ కళ్లలోకి కృతజ్ఞతపూర్వకంగా చూశాడు ట్రంప్.కొద్దిసేపటి తరువాత...‘‘ఏమిటి ట్రంపుగారు ఇలా వచ్చారు?’’ అడిగాడు కిమ్.‘‘ఎప్పుడూ మీ రూమ్‌లోనే ఉంటారా. ఈరోజు నా రూమ్‌కి రావాలి...నా సీట్లో ఆసీనులు కావాలి. ఇంతకుమించి ఈ జన్మకు సార్థకత లేదు’’ మెలికలు తిరుగుతూ అడిగాడు ట్రంప్.‘‘అదెంత పని. ఇప్పుడే వస్తాను’’ అంటూ పరుగులాంటి నడకతో ట్రంప్ రూమ్‌లోకి వచ్చి ఆయన సీట్లో కూర్చున్నాడు కిమ్.అంతే...‘ఢాం...’ అని పే....ద్ద సౌండ్.కిమ్ ప్యాంట్ చీలికలు పేలికలైంది. ముఖం నల్లబారింది.‘‘ముందస్తు ఎన్నికలలాగా.... ముందస్తు దీపావళి అన్నమాట...నీ సీటు కింద లక్ష్మీబాంబులు రెండు పెట్టాను. హ్యాపీ దివాలీ’’ అన్నాడు ట్రంప్.అయినా సరే కిమ్‌కు కొద్దిగా కూడా కోపం రాలేదు.‘‘థ్యాంక్స్ అన్నయ్య. బాంబు చల్లగా ఉంది’’ అని ట్రంప్‌ను ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు.ఇలా హౌజ్మెట్లు ఒకరినొకరు రెచ్చగొట్టుకున్నారు. ఎవరూ కూడా టెంప్ట్ కాలేదు. కొద్దిగా కూడా కోపం తెచ్చుకోలేదు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఓటింగ్ పెట్టారు.‘ఆహా ఓహో’ కేటగిరీలో అందరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. ఎలిమినేట్’ కేటగిరీలో మాత్రం జీరో! అంటే ‘ఫలానా వ్యక్తిని ఎలిమినేట్ చేయాలి’ అని ప్రేక్షకులు ఎవరినీ కోరడంలేదన్నమాట. ప్రేక్షకులకు అందరూ పిచ్చపిచ్చగా నచ్చేశారు. రెండో వారం టాస్క్:‘ఆవు పేడ తెచ్చి హౌజ్ అలకాలి’ఈ పని ఎవరైనా చేయకపోతే ఎలిమినేట్ అవుతారు.ఆరోజు...తెల్లవారుజామున నాలుగు తరువాత హౌజ్‌లో ఒక్కరూ లేరు. ఆ అడవిలో తలోదిక్కు వెళ్లారు. ఆరుగంటలకల్లా అందరూ పేడతట్టలతో వచ్చారు. తాము తెచ్చిన పేడతో హౌజ్‌ను అలికారు.‘ఈసారి కూడా ఎవరూ ఎలిమినేట్ కాలేదే!’ తలపట్టుకున్నాడు స్మాల్‌బాస్.ప్రేక్షకుల ఎలిమినేట్ లిస్ట్‌లో కూడా ఎవరూ లేరు.మూడో వారం కూడా కఠినమైన టాస్క్ ఇచ్చారు. అయినప్పటికీ అందరూ విన్ అయ్యారు.ఇక చివరి వారం మిగిలింది.‘‘ఫైనల్లో అందరూ విన్ అయ్యారా? ఎవరైనా ఎలిమినేట్ అయ్యారా? గత ఎపిసోడ్లను బట్టి చూస్తే మళ్లీ అందరూ విన్ అవుతారని నాకు బలంగా అనిపిస్తుంది. ఒకవేళ అలాగే జరిగితే షో ఫ్లాప్ అయినట్లే కదా! దీనికి నీ సమాధానం ఏమిటి?’’ భేతాళుడు విక్రమార్కుడిని అడిగాడు.‘‘పిచ్చిభేతాళా! అందరూ విజేతలు కావడం కాదు...అందరూ హౌజ్ నుంచి పారిపోయారు’’ అంటూ అసలు విషయం చెప్పాడు విక్రమార్కుడు.‘‘అదేమిటి? అసలేం జరిగింది?’’ ఆత్రుతగా అడిగాడు భేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పాడు: ‘‘చివరి వారం...చావో రేవో అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో భాగంగా హౌజ్మెట్లు ఒక కొత్తవంటకాన్ని కనిపెట్టాలి. ఆ వంటకాన్ని తయారుచేసి ఎవరికో ఒకరికి తప్పనిసరిగా తినిపించాలి. అందరూ ఉత్సాహంగా కొత్త కొత్త వంటలు తయారుచేశారు. కాని తినేవారు ఏరీ? నువ్వు తిను అంటే... కాదు నువ్వు తిను. ఇదే గొడవ. ఈ గొడవలో భాగంగా ఒకరినొకరు చావబాదుకున్నారు. ఇది స్మాల్‌బాస్ నియమాలకు విరుద్ధం. ఎవరూ పోట్లాడుకోవద్దు...అని గట్టిగా అరిచాడు స్మాల్‌బాస్. ఆతరువాత ‘ఇప్పుడు నేను మీకో కొత్త టాస్క్ ఇస్తున్నాను. చాలా సింపుల్. మీరు తయారు చేసిన వంటకాన్ని మీరే తింటే చాలు’ అని ప్రకటించాడు. అంతే...ప్రాణభయంతో ఎటు వాళ్లు అటు పరుగులు తీశారు. హౌజ్‌లో ఒక్కరు ఉంటే ఒట్టు!’’ – యాకుబ్ పాషా -
కోట్లు తెచ్చిపెట్టిన 9 ప్రశ్నలు..!
దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన టీవీ షోలలో ‘‘కౌన్ బనేగా కరోడ్‌పతి’’ది ఓ ప్రత్యేక స్ధానం. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలోకి ఒట్టిచేతుల్తో వచ్చి కోట్ల రూపాయలు పట్టుకెళ్లిన వారు ఉన్నారు.. సమాధానం చెప్పలేక చివరి క్షణంలో కోట్లు చేజార్చుకున్నవారు ఉన్నారు. ఈ షోలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పటం మామూలు విషయం కాదు! మేథో సంపత్తి కలిగిన ఏ కొద్దిమంది మాత్రమే సరైన సమాధానాలు చెప్పగలిగారు. ప్రస్తుతం ఈ షో 10వ సిరీస్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో బిగ్‌బీ అడిగిన ఆ 9 ప్రశ్నలు.. కంటెస్టంట్లకు కోట్లు గెలిపించిపెట్టిన సమాధానాలు మీ కోసం. మరి మీకు ఏ మాత్రం సమాధానాలు తెలుసో? చూసుకోండి.. 1) ఈ క్రింది వారిలో ఏ కళాకారునికి భారతదేశ రాజ్యాంగ నిజప్రతిని అందంగా తీర్చిదిద్దే బాధ్యతలు అప్పగించారు? రామ్ కింకర్ బెయిజ్ బెనోడ్ బీహారీ ముఖర్జీ అబనీంద్రనాథ్ టాగోర్ నందలాల్ బోస్ 2. పార్లమెంటు ప్రొసీడింగ్స్‌లో పాల్గొనడానికి భారత రాజ్యాంగం ఎవరిని అనుమతించింది? సొలిసిటర్ జనరల్ అటార్నీ జనరల్ క్యాబినెట్ కార్యదర్శి ప్రధాన న్యాయమూర్తి 3. యూరోపియన్ వలస శక్తులు భారతదేశంలోని ఈ కింది కోటలలో దేనిని నిర్మించలేదు? ఫోర్ట్ డాన్స్ బర్గ్ ఫోర్ట్ నారెన్ ఫోర్ట్ చాంబ్రా ఫోర్ట్ శాంటా కాతేరినా 4. అక్టోబరు 18, 1868 న బ్రిటిష్ వారికి నికోబార్ దీవుల హక్కులను భారతదేశంలో స్వాధీనం చేసిన వలసరాజ్య వ్యవస్థ ఏది? బెల్జియం ఇటలీ డెన్మార్క్ ఫ్రాన్స్ 5. ప్రపంచంలోని రెండవ ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళ ఎవరు? జంకో టబాయ్ వండ రుట్కివిజ్ తామే వతనాబే చంటల్ మౌడుయి 6. 1978లో అంటార్కిటికా ఖండంలో జన్మించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఎమిలియో పాల్మ జేమ్స్ వెడెల్ నతనియేల్ పాల్మెర్ చాలెస్ విల్కెస్ 7) సూరత్ వద్దకు చేరుకున్న మొట్టమొదటి బ్రిటీష్ వాణిజ్య ఓడరేవైన ‘హెక్టార్’కు సారథ్యం వహించింది ఎవరు? పాల్ కానింగ్ విలియం హాకిన్స్ థామస్ రో జేమ్స్ లాంకాస్టర్ 8) 2017లో భారతీయ ఖగోళ శాస్త్రవేత్తల బృందం కనుగొన్నగెలాక్సీల సూపర్ క్లస్టర్‌కు పెట్టబడిన పేరు ఏమిటి ? లక్ష్మీ పార్వతి సరస్వతి దుర్గ 9. ఈ క్రింది వారిలో రక్తసంబంధం లేని ఏ ఇద్దరు నోబెల్ బహుమతులు గెలుచుకున్నారు? మేరీ క్యూరీ, ఐరీన్ జొలిట్ క్యూరీ జేజే థామ్సన్, జార్జి పాగెట్ థామ్సన్ నీల్స్ బోర్, ఆగే బోర్ హెర్మన్ ఎమిల్ ఫిస్చెర్, హన్స్ ఫిస్చెర్ సమాధానాలు: 1. నందలాల్ బోస్ 2. అటార్నీ జనరల్ 3. ఫామ్ చాంబర్ 4. డెన్మార్క్ 5.వాండ రుట్కివిజ్ 6. ఎమిలియో పాల్మ 7. విలియం హాకిన్స్ 8. సరస్వతి 9) హెర్మాన్ ఎమిల్ ఫిస్చెర్, హన్స్ ఫిస్చెర్ -
బుల్లితెరకు ఎంట్రీ!
సౌత్.. నార్త్ అనే తేడా లేకుండా హీరోయిన్గా మంచి పేరు సంపాదించారు జయప్రద. అటు రాజకీయాల్లోనూ సత్తా చాటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఆమెకు ప్రేక్షకాదరణ తగ్గలేదు. సిల్వర్ స్క్రీన్‌ని ఏలిన జయప్రద ఇప్పుడు స్మాల్ స్క్రీన్‌ని ఏలడానికి రెడీ అయ్యారు. అవును.. ఆమె హిందీ బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు. తెలుగులో ‘జయప్రదం’ పేరుతో ఆమె టీవీ షో చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం హిందీలో ‘పర్ఫెక్ట్ పతి’ అనే సీరియల్లో నటిస్తున్నారు. ఇందులో ఆయూష్ ఆనంద్‌కు తల్లిగా నటిస్తున్నారు జయప్రద. ఈ సీరియల్లో తన పాత్ర కీలకంగా ఉండటంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సీరియల్ షూటింగ్ రాజస్థాన్‌లో జరుగుతోంది. ఇందులో జయప్రద లుక్‌తో పాటు క్యారెక్టర్ కూడా డిఫరెంట్‌గా ఉంటుందట. ఈ సంగతి ఇలా ఉంచితే.. దాదాపు పదేళ్ల క్రితం ‘మహారథి’ సినిమాలో నటించారు జయప్రద. ఇప్పుడు మళ్లీ ‘సువర్ణసుందరి’లో ఓ కీ రోల్ చేశారు. ఈ సినిమా తర్వలో రిలీజ్ కానుంది. -
సమాధానం వెనుక విషాదం
లండన్ : నష్టపోయిన చోటే అదృష్టాన్ని వెతుక్కోమన్నారు పెద్దలు. అలాంటిది నష్టపోయిన చోటు వల్ల కోట్లు కలిసొస్తే.. ఇక ఆనందానికి అవధులుండవు. అలాంటి సంఘటనే లండన్‌లో చోటు చేసుకుంది. తన కాలును పోగొట్టుకున్న ప్రదేశాన్ని జవాబుగా చెప్పి అక్షరాలా 7,500,000 లక్షల రూపాయలు గెలుచుకున్నాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. కెనడాలోని హలీఫాక్స్ కు చెందిన గారెత్ కెండాల్ హు వాంట్స్ టు బీ ఏ మిలయనీర్?(మీలో ఎవరు కోటీశ్వరుడు?కు మాతృక) అనే టి.వి షోలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా.. ఉర్క్హార్ట్ కోట ఎక్కడ ఉందన్న ప్రశ్నకు గారెత్ చెప్పిన సమాధానం షో హోస్ట్‌ను నివ్వరపోయేలా చేసింది. ఉర్క్హార్ట్ కోట తనకు బాగా తెలుసునని, అక్కడే తన కాలును పోగొట్టుకున్నానని చెప్పడంతో కొద్ది సేపు హాలు మొత్తం నిశ్శబ్ధం అలుముకుంది. హోస్ట్ జెర్మీ క్లార్క్ సన్‌కు జరిగిన విషాదం గురించి వివరించాడు గారెత్. కోట దగ్గరి ప్రాంతంలో జరిగిన కారు ప్రమాదంలో తన ఎడమ కాలును పోగొట్టు కున్నానని, ఆ ప్రమాదం తర్వాత బతికుండటం మరో జన్మని అన్నాడు. హాస్పిటల్ ఐసీయూలో ఉన్న తాను బతకటం చాలా కష్టమని వైద్యులు చెప్పారని తెలిపాడు. చాలా రోజులు ఆస్పత్రి బెడ్ మీదే గడిచి పోయాయని వివరించాడు. కోట ఉన్న ప్రాంతాన్ని చెప్పడంతో లక్షల రూపాయలు గారెత్ సొంతమయ్యాయి. తర్వాత రౌండ్‌కు వెళ్లే అవకాశం ఉన్నా అంతటితో ఆటకు ముగింపు పలికి షోలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు గెల్చుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. -
బ్రేకప్ గురించి చెబుతూ బోరుమన్న నటి!
ముంబై: గత ప్రేమ జ్ఞాపకాలు గుర్తు చేసేసరికి నటి దివ్యాంక త్రిపాఠి కన్నీళ్లు పెట్టుకున్నారు. గతంలో సాగించిన ప్రేమాయణం తన జీవితంలో చీకటి కోణమంటూ ఆమె వ్యాఖ్యానిస్తూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ప్రోమో వీడియో వైరల్ అవుతోంది. రాజీవ్ ఖండేల్వాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘జజ్ బాత్’లో నటి దివ్యాంక పాల్గొన్నారు. కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత మీ గుండె ఎప్పుడైనా బద్దలైనట్లు అనిపించిందా, ఎక్కువగా బాధపడ్డ సందర్భం ఏంటని రాజీవ్ ఆమెను అడిగారు. ఇక అంతే నటి ఉద్వేగానికి లోనై ఏడ్చేశారు. గతంలో టీవీ నటుడు శరద్ మల్హోత్రా, నటి దివ్యాంక త్రిపాఠిలు గాఢంగా ప్రేమించుకున్నారు. దాదాపు ఎనిమిదేళ్లు ప్రేమాయణం తర్వాత వీరు బ్రేకప్ అయ్యారు. ఈ విషయాన్ని నటి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘ఎనిమిదేళ్లు ముగుస్తున్న సమయంలో నా జీవితం ముగిసి పోతుందనుకున్నా. ఏది నమ్మోలో.. వద్దో తెలియని స్థితి ఎదురైందంటూ’ దివ్యాంక చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. టాక్ షోలో దివ్యాంక భర్త వివేక్ దహియాతో పాల్గొని సందడి చేశారు. 2015లో శరద్‌తో బ్రేకప్ అయ్యాక ఆమె వివేక్ దహియాను వివాహం చేసుకున్నారు. గత రెండేళ్లుగా వీరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. వీరి అభిమానులు ముద్దుగా ఈ జోడీని ‘దివేక్’అని పిలుచుకోవడం తెలిసిందే. పలు హిందీ సీరియళ్లు, టీవీ షోలతో దివ్యాంక త్రిపాఠి పాపులర్ అయ్యారు. ఆమె తొలి సీరియల్ 'మే తేరి దుల్హాన్' హిట్ కావడం పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. డ్యాన్స్ షో 'నాచ్ బాలియే'లో పాల్గొని విజేతగా నిలిచిన దివ్యాంక.. త్వరలో బాలీవుడ్లో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. -
ఫన్నీ లియోన్
డంబుల్స్.. వాటిని చూస్తేనే అమ్మాయిల గుండెల్లో గుబుల్స్. కోరి కోరి అంత బరువుని నెత్తి మీద పెట్టుకుంటారా? దానికి ఎంతో ఖలేజా ఉండాలి. సన్నీ లియోన్‌కి ఆ దమ్ముంది. అంతే.. ఫొటోలో కనిపిస్తున్నట్లుగా డంబుల్స్ని నెత్తి మీద పెట్టుకున్నారు. అవి నిజమైనవేనంటారా? ఉత్తుత్తివే అని సన్నీ చెప్పలేదు కాబట్టి నిజమైనవే అనుకోవాలేమో. ఇంకో ఫొటోలో చూశారా? అందాల రాక్షసిలా కనిపిస్తున్నారు కదూ. మరో ఫొటోలో ఏకంగా తాడుతో గాల్లో వేలాడుతున్నారు. మెడలో పాము వేసుకుని ఎంత హాయిగా నవ్వుతున్నారో చూశారా? వామ్మో సన్నీ ఎంత డేరింగ్ అండ్ డ్యాషింగో కదా. ఏంటి సన్నీ? ఏం జరిగింది? అంటే.. ఓ టీవీ షో కోసం సన్నీ ఈ విన్యాసాలు చేస్తున్నారు. మెడలో ఉన్నది నిజం పాము కాదు. ‘‘ఇంకా నయం.. దర్శక–నిర్మాతలు నాకు నిజం పాము ఇవ్వలేదు. బతికిపోయాను’ అని నవ్వేశారు సన్నీ లియోన్. ఇలాంటి సరదా ఫొటోలను చూస్తే సన్నీ లియోన్‌ను ఫన్నీ లియోన్ అనకుండా ఉండలేం కదా. -
పాపులర్ టీవీ షో చూసి..దారుణం
న్యూఢిల్లీ: టీవీలో ప్రసారమయ్యే పాపులర్ క్రైమ్ సీరియల్ చూసి తోటి విద్యార్థిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి ఒక మైనర్‌బాలుడ్ని ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం కిడ్నాప్ డ్రామా ఆడి కవర్ చేసుకోవాలని ప్రయత్నించినా చివరికి పోలీసులకు చిక్కాడు. తన గర్ల్ ఫ్రెండ్‌ఫై కన్నేశాడనే అక్కసుతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఐశ్వర్ సింగ్ అందించిన సమాచారం ఢిల్లీ యూనివర్సిటీ ఆర్యభట్ట కాలేజీకి చెందిన బీఏ మొదటి సంవత్సరం విద్యార్థి నవీన్ , తన స్నేహితులతో కలిసి ఈ హత్య చేశారు. ప్రధాన నిందితుడు నవీన్..ఆకాశ్ , మరో స్నేహితుడు కలిసి ఇంటర్ విద్యార్థి జతిన్(17)ను సమోసా తిందామని పిలిచారు. చత్‌ఫూర్ ఏరియాలోని రోడ్డు పక్క షాపు సమోసా తిన్నాక.. పక్కనే ఉన్నఫాం హౌస్‌కు తీసుకెళ్లి విపరీతంగా కొట్టారు. అనంతరం ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. మొబైల్, ఐడీ కార్డ్ ఇతర వస్తువులను తీసుకొని మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో పారేశారు. ఇదే సమయంలో, జతిన్ ఇంటికి తిరిగి రాకపోవడంతో పేరెంట్స్ ఫోన్ చేశారు. దీంతో కిడ్నాప్ డ్రామా ఆడిన నిందితులు రూ.20లక్షలు ఇస్తే.. జతిన్ విడిచిపెడతామని తల్లిదండ్రులను బెదరించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు ముందుగా ఆకాశ్‌ను అదుపులోకి ప్రశ్నించారు. దీంతో మాస్టర్ మైండ్ నవీన్ ఆటకట్టింది. ‘క్రైమ్ పెట్రోల్' చూసి ఈ నేరానికి పాల్పడినట్టు విచారణలో నవీన్ చెప్పినట్టు పోలీసు అధికారి తెలిపారు. -
యాంకర్‌గా మరో పోర్న్‌స్టార్
సాక్షి: సన్నీలియోన్ తరహాలోనే మరో పోర్న్‌స్టార్ బుల్లితెరపై కనిపించే ఏర్పాట్లు జరుతున్నాయి. సన్నీలియోన్ గత జీవితాన్ని విడిచిపెట్టి బాలీవుడ్లో నటిస్తున్న తరహాలనే మరో పోర్న్‌స్టార్ మియా ఖలీఫా కూడా త్వరలోనే ఓ టాక్‌షోకు వ్యాఖ్యాతగా కనిపించబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు. 2016లో గూగుల్‌లో అందరికంటే ఎక్కువగా మియా ఖలీఫా గురించే వెతికారు. ప్రస్తుతం ఖలీఫా పోర్న్ సినిమాల్లో నటించడం మానేసింది. గతంలో ఒక ముస్లిం అయి పోర్న్ సినిమాల్లో నటిస్తావా అంటూ ఉగ్రవాద సంస్థల నుండి వార్నింగ్‌లు రావడంతో క్రైస్తవాన్ని స్వీకరించి అమెరికాలో స్థిరపడ్డారు మియాకు బేస్ బాల్, అమెరికన్ ఫుట్ బాల్ అంటే ఇష్టం. ఆమెకు ఉన్న క్రేజ్‌ను చూసి 'కాంప్లెక్స్ న్యూస్' అనే యుట్యూబ్ ఛానల్లో వ్యాఖ్యాతగా అవకాశం వచ్చింది. గిల్బెర్ట్ అరేనా అనే బాస్కెట్ బాల్ ప్లేయర్ తో కలసి ఇప్పుడు 'ఔట్ ఆఫ్ బౌండ్స్' అనే టాక్ షో వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. భారత కాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం ఈ షో ప్రసారం కానుంది. -
'బిగ్‌బాస్ షో గౌరవంగా భావిస్తున్నా'
తొలిసారిగా బుల్లితెర మీద నటిస్తున్న లోకనాయకుడు కమల్ హాసన్ స్మాల్ స్క్రీన్ ఎంట్రీపై తన అభిప్రాయాన్ని తెలిపారు. బిగ్‌బాస్ కార్యక్రమం ద్వారా తానేమీ డౌన్ కాలేదన్నారు. హాలీవుడ్, బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన బిగ్‌బాస్ గేమ్ షో తాజాగా కోలీవుడ్‌లో బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది. ఆదివారం నుంచి విజయ్ టీవీలో ప్రసారం కానున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం కమలహాసన్ విలేకరుల సమావేశంలో ముచ్చటించారు. ఈ సందర్భంగా తాను బుల్లితెరపై వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఇదే తొలిసారి అని తెలిపారు. వెండితెర మీద ఎన్నో విజయాలు సాధించిన కమల్, బుల్లితెరపై కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దక్కినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్వవహరించడాన్ని తాను గౌరవంగా భావిస్తున్నానని, ఈ గేమ్‌షోలో పాల్గొనే 14 మంది సెలబ్రిటీలు ఎవరన్నది తనకు తెలియదని, అందరి మాదిరిగానే తాను వారెవరన్నది తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నారు. -
'నెంబర్ వన్ యారి విత్ రానా'
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో రానా బుల్లితెరపై సందడి చేయనున్నాడు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో రానా త్వరలో యాంకర్ అవతారం ఎత్తనున్నాడు. నెంబర్ వన్ యారీ విత్ రానా అనే షోకు రానా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. కేవలం సెలబ్రిటీలు మాత్రమే పాల్గొనే ఈ షో కాఫీ విత్ కరణ్ తరహాలో రూపొందనుంది. ఈ షోకు సంబంధించిన టీజర్ ను ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ చేయనున్నాడు రానా. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన భల్లాలదేవ.. ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. అయితే ఈ కార్యక్రమం ఏ ఛానల్ లో ప్రసారం కానుందో వెల్లడించలేదు. ఈ మధ్యే మరో యంగ్ హీరో ఎన్టీఆర్ కూడా యాంకర్ అవతారం ఎత్తాడు. నార్త్‌లో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ షోను సౌత్‌లో తమిళ నాట కమల్ హాసన్, తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్నారు. TV a space Ive always been fascinated with, for the first time, direct to your home as TV Host 'No1 Yaari with Rana' teaser at 5pm #No1Yaari pic.twitter.com/KffNiR8Xfn — Rana Daggubati (@RanaDaggubati) 14 June 2017 -
‘టీవీ షోలకు నిర్మాతలదే బాధ్యత’
హైదరాబాద్: టీవీలో ప్రసారమైన షోను అనుకరిస్తూ ఓ బాలుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అనంతరం కాలిన గాయాలతో చనిపోయాడు. ఈ ఘటన బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. జయదీప్ అనే బాలుడు ఓ చానల్ లో ప్రసారమైన షో చూస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని చనిపోయాడు. జయదీప్ మృతికి కార్టూన్ షో నిర్మాతలు బాధ్యత వహించాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రియాల్టీ షోలతో పాటు కొన్ని టీవీ షోలను బాధ్యతారాహిత్యంగా చిత్రీకరించడంతో హైదరాబాద్ నగరంలోనే ఇప్పటి వరకు ముగ్గురు చిన్నారులు చనిపోయిన ఘటనలు వెలుగు చూశాయని చెప్పారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బాలల హక్కుల సంఘం జాతీయ బాలల హక్కుల కమిషన్‌లో పిటీషన్ దాఖలు చేస్తూ బాధ్యతరహితమైన టీవీ షోలు, రియాల్టీ షోలను రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. సదరు చానల్ నిర్మాతలపై కేసులు నమోదు చేయాలన్నారు. -
బుల్లి తెరపై కమల్ హాసన్
-
అఆ..వినోద్..ని
చిన్ని తెర హీరో...యిన్ ఇప్పటి వరకు 100 గెటప్‌లు కామెడీ షోల్లో అలరిస్తున్న వినోద్ అందమైన అమ్మారుు. పెళ్లీడుకొచ్చింది. మంచి పెళ్లి సంబంధం వచ్చింది. ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. కాని వినోదిని మాత్రం చిన్నబుచ్చుకుంది. ఎందుకని? ‘‘నేను మగవాడిని పెళ్లి చేసుకోవడం ఏమిటండీ?’’ అంటూ నవ్వేస్తాడు వినోదిని అలియాస్... వినోద్‌కుమార్. తనను తాను అందమైన అమ్మాయిగా మలచుకుని చిన్నితెర సాక్షిగా నవ్వుల పంట పండిస్తున్న పరకాయ ప్రవేశం పేరే వినోద్‌కుమార్. మేకప్‌లో బయటకు వస్తే కొర కొర చూసే ఆకతాయిల నుంచి చిలిపి మెసేజ్‌లతో చిరాకు పుట్టించే ఈవ్టీజర్ల దాకా ఎదుర్కొంటూ అమ్మాయిగా నటించడం మాత్రమే కాదు జీవిస్తున్న వినోదిని... అమ్మో... నటించడం ఏమో కాని అమ్మాయిగా జీవించడం మాత్రం కష్టమే అంటున్నాడు. - బంజారాహిల్స్ బంజారాహిల్స్ : అమ్మాయిలకే అసూయ కలిగించేంత అందం.. టీవీ షో కోసం అతడు..ఆమెగా మారాడు. లేడీ గెటప్‌లో వినోద్ కాస్తా వినోదినిగా వినుతికెక్కాడు. హొయలొలికే వయ్యారంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు. అచ్చం అమ్మాయిలా నటిస్తూ నవ్విస్తున్న వినోద్ అలియాస్ వినోదిని అచ్చూ మన ఇళ్లల్లో ముఖ్యంగా మధ్య తరగతి ఇళ్లల్లో కనిపించే భార్య, తల్లి, ప్రియురాలు, చెల్లి ఇలా అన్ని వేషాల్లోను ఆకట్టుకుంటున్నాడు. ఓ టీవీ చానెల్లో వస్తున్న కామెడీ షోలో వినోద్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. కడపకు చెందిన అప్పాయిపల్లి వినోద్‌కుమార్(21) బుల్లితెర నటుడిగా ఎదిగేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. తండ్రి విజయ్‌కుమార్ ప్రభుత్వ ఉద్యోగి కాగా తల్లి శివమణి గృహిణి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నటుడిగా ఎదగాలన్న లక్ష్యంతో కడప నుంచి కృష్ణానగర్‌కు మకాం మార్చాడు. 2012లో ప్రారంభమైన వినోద్ ప్రస్థానం ఇప్పుడు బుల్లితెరపై అగ్రస్థానానికి చేర్చింది. 2012లో మూవీ ఆడిషన్సకు వచ్చిన వినోద్ ఓ చిన్న సినిమాలో చిన్న వేషానికి పరిమితమయ్యాడు. అనంతరం మాటీవీలో కెవ్వుకేక షోలో ఆడ గెటప్‌లో ఆకట్టుకున్నాడు. జీ తెలుగులో ఫ్యామిలీ సర్కస్, మరో చానల్లో తడాఖా షోలలోనూ లేడీ గెటప్‌లు వేయాల్సి వచ్చింది. ఇక అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. జబర్దస్త్ ప్రోగ్రాం వినోద్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం బుల్లితెరపై లేడీ గెటప్‌లతో వినోద్ విశేషంగా అలరిస్తున్నాడు. మ్యారేజ్ ప్రపోజల్స్ చేస్తున్నారు... తాను పూర్తిగా లేడీ గెటప్‌లకే పరిమితమయ్యానని, తనను అలా చూడటానికే ఇష్టపడుతున్నారని వినోద్ తెలిపారు. తనకు వినోదిని అనే టైటిల్‌ను కూడా తగిలించారని తెలిపారు. ఇటీవల ఈ అందమైన అమ్మాయిని చేసుకుంటామంటూ తన తల్లిదండ్రులకు మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా పంపించారని, తీరా ‘ఆమె కాదు అతడు’ అని తెలుసుకొని నాలుక కరుచుకున్న సందర్భాలున్నాయన్నారు. వెంటపడుతున్నారు... చాలా మంది తనను బయట సాధారణ డ్రెస్‌లో ఉన్నప్పుడు గుర్తుపడుతున్నారని, ఆ సమయంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వినోద్ తెలిపారు. ముఖ్యంగా ఆటోల్లో వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు 100 గెటప్‌లు... లేడీ గెటప్‌లతో ఇప్పటి వరకు 100 సీన్లు చేశానని తెలిపారు. చాలా మంది టీమ్ లీడర్లు తన హావభావాలు, యువతిగా వేషధారణలు బాగా నచ్చి భార్యగాను, ప్రియురాలిగాను నటించేందుకు పిలుస్తున్నారని చెప్పారు. ధన్‌రాజ్‌తో, చమ్మక్ చంద్రతో చేసిన కాంబినేషన్ బాగా పేరు తీసుకొచ్చాయని వెల్లడించారు. మేకప్‌కు గంట సమయం... షూటింగ్ ఉన్నప్పుడు లేడీ గెటప్ వేయడానికి సుమారుగా గంట సమయం పడుతున్నదని వినోద్ తెలిపారు. మేకప్మెన్లు, హెరుుర్ స్టైలిస్ట్‌లు ఇస్తున్న ప్రోత్సాహంతో తనకు మంచి గెటప్‌లు వస్తున్నాయని చెప్పారు. చీర కట్టుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నదని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక మనిషిని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. చదువుకుంటున్నా.. ఇంటర్ వరకు కడపలోనే చదువుకున్నానని, ప్రస్తుతం ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎంబీఏ చదువుతున్నానని వెల్లడించారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయని పేర్కొన్నారు. మగాడిగా కనిపించడం ఇష్టం లేదు.. తాను నిజమైన రూపంలో ఎలా ఉంటానో చాలా మందికి తెలియదని, వారందరినీ అదే ఆతృతలో ఉంచాలన్నదే తన ఉద్దేశం అన్నారు. అందుకే తన ఫొటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతుంటానన్నారు. సినిమాల్లో మంచి అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. తనకు నాగబాబు, రోజాలతో పాటు టీమ్‌లీడర్ల ప్రోత్సాహం బాగా ఉందని అందుకే రాణిస్తున్నానని తెలిపారు. -
సింహంతో లైవ్ షో నిర్వహించిన వైనం
-
క్రిష్ దర్శకత్వంలో పవన్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో క్రిష్ దర్శకత్వంలో నటించబోతున్నాడట. ప్రస్తుతం గౌతమీ పుత్ర శాతకర్ణి పనుల్లో బిజీగా ఉన్న క్రిష్, ఆ పనులు పూర్తవ్వగానే పవన్‌తో కలిసి పనిచేయబోతున్నాడు. అయితే ఈ ఇద్దరు పనిచేయబోయేది సినిమా కోసం కాదు.., ఓ టివి షో కోసం. ఇప్పటికే నార్త్‌లో సూపర్ హిట్ అయిన సత్యమేవ జయతే తరహాలో ఓ తెలుగు షో నిర్వించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒక ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందట. నటుడిగానే కాక ప్రజా సేవలో కూడా ముందుండే పవన్ అయితేనే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా సరిపోతాడని భావించిన సదరు ఛానల్, పవన్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించే క్రిష్ దర్శకత్వంలో షో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ షో తెరమీదకు వస్తే మాత్రం తెలుగు బుల్లితెర మీద సంఛలనం అవుతుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. -
కన్నీళ్లు పెట్టిన హీరోయిన్
ముంబై: బాలీవుడ్ డాన్సింగ్ దేవత మాధురి దీక్షిత్ టీవీ సెట్లో కన్నీళ్లు పెట్టుకుంది. పార్కిస్సన్ వ్యాధి ఇతివృత్తంతో సాగిన నృత్య ప్రదర్శన చూసి ఆమె చలించిపోయింది. 'సో యూ థింక్ డాన్స్ యూ కెన్ డాన్స్' టీవీ షో సెట్లో షంపా అనే యువతి డాన్స్ చూసి ఉద్వేగాన్ని ఆపుకోలేక మాధురి దీక్షిత్ ఏడ్చేసింది. పార్కిస్సన్ వ్యాధితో బాధపడుతున్న అమ్మాయి ప్రేమకథ ఆధారంగా రియాన్ తో కలిసి షంపా చేసిన నృత్యం సెట్లో ఉన్నవారందరినీ కదిలించింది. 'షంపా అపారమైన ప్రతిభ కలిగిన డాన్సర్. పార్కిస్సన్ వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని తన డాన్స్ ప్రదర్శనతో తెలియజెప్పింది. మన సమాజంలో పార్కిస్సన్ తో బాధ పడుతున్న వారి కుటుంబాలకు మనమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. షంపా, రియాన్ నృత్యప్రదర్శన హృదయానికి హత్తుకునే ఉంది. బావోద్వేగాలు బాగా పండించార'ని మాధురి దీక్షిత్ పేర్కొంది. 'సో యూ థింక్ డాన్స్ యూ కెన్ డాన్స్' టీవీ షోకు మాధురితో పాటు కొరియో గ్రాఫర్లు టెరెన్స్ లూయిస్, బొస్కో మార్టిస్ జడ్డిలుగా వ్యవహరిస్తున్నారు. -
టీవీలో సంచలనం: అమ్మాయితో గొరిల్లా రొమాన్స్
ఇప్పటికే ఆమె జీవితంలో ఇద్దరు మగాళ్లున్నారు. ఒకడు నిశ్చితార్థం ముందు ఆమెను కాదని, మళ్లీ వెంటపడేవాడు. మరొకడు.. ఆమె పనిచేస్తోన్న టీవీ చానెల్ ఓనర్. రెండో వాడంటే ఆమెకూ ఇష్టమే. కానీ ఆ డబ్బున్న మారాజు తల్లిదండ్రులకు మాత్రం అతడు ఈమెను పెళ్లిచేసుకోవడం ఇష్టంఉండదు. స్వతంత్ర భావాలున్న ఆమె.. ప్రేమలో వరుస వైఫల్యాల కారణంగా కుంగిపోతుంది. దీంతో జీవితం కాస్త భారంగా మారిపోతుంది.. అదే సమయంలో ప్రేమైక జీవనం కోసం తపన పెరుగుతుంది. తనవాడి కోసం ఎదురుచూస్తోన్న ఆమె దగ్గరకు అనుకోని పరిస్థితుల్లో ఓ మనసున్న(!) గొరిల్లా వస్తుంది. కాలక్రమంలో ఇద్దరూ దగ్గరవుతారు(!). గొరిల్లాకు ఆ అమ్మాయిపట్ల ప్రేమ పుడుతుంది. పిచ్చిచేష్టలతో గుండెల్లో నిండుగా ఉన్న ప్రేమను ప్రదర్శిస్తుందా గొరిల్లా. భారతీయ బుల్లితెర చరిత్రలో ఇదొక సంచలనం. మొట్టమొదటిసారి ఓ టీవీ సీరియల్ లో భారీ జంతువు.. అది కూడా ఫుల్ లెంత్ పాత్రలో కనిపించనుంది. ఏడాది కాలంగా కలర్స్ చానెల్ లో ప్రసారం అవుతూ, మంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతోన్న 'థప్ కీ ప్యార్ కి' సీరియల్ లో ఈ అరుదైన దృశ్యాలు చోటుచేసుకోనున్నాయి. బిగ్ బ్రదర్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న జిగ్యాస్ సింగ్ 'థప్ కీ' షోలో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. గొరిల్లా ఆమె వద్దకు చేరుకునే, ఇంట్లో నానా యాగీ చేసి, ఆమెను మెప్పించే ఎపిసొడ్లు జూన్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. జిగ్యాస- గరిల్లాల మధ్య సాగే రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను ఏమేరకు రంజింపజేస్తాయో చూడాలి! -
హీరోయిన్ కొన్నేళ్ల కల నెరవేరబోతోంది..
ముంబై: బాలీవుడ్ అందాలతార మాధురీ దీక్షిత్ అద్బుతమైన డాన్సరన్న విషయం తెలిసిందే. ఎన్నో చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్‌లో మాధురి అభిమానులను అలరించింది. రెండు దశాబ్దాలకుపైగా తన డాన్స్‌లతో బాలీవుడ్‌ను ఉర్రూతలూగించిన మాధురికి.. కొరియోగ్రాఫర్ కావాలనే కోరికఉందట. కొన్నేళ్లుగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆమెకు ఇప్పుడు ఆ కల నెరవేరనుంది. ఓ టీవీ షోలో కొరియోగ్రాఫర్‌గా పనిచేసే అవకాశం మాధురికి వచ్చింది. మాధురీ నృత్యదర్శకత్వంలో టెరెన్స్ లూయిస్, బొస్కో మార్టిస్, రణదీప్ హుడా, కాజల్ అగర్వాల్ కాలుకదపనున్నారు. 'కోరియాగ్రాఫర్ కావాలని ఎప్పట్నుంచో కోరుకుంటున్నా. ఆ కల టీవీ షో ద్వారా నెరవేరింది. టెరెన్స్, బొస్కొ, రణదీప్, కాజల్‌తో డాన్స్ చేయిస్తా' అని మాధురీ చెప్పింది. మాధురి జడ్జిగా వ్యవహరిస్తున్న 'సో యు థింక్ యు కెన్ డాన్స్ అబ్ ఇండియా కి బారీ' టీవీ షో త్వరలో ప్రసారం కానుంది. -
ఒబామా చాలా ఫన్నీ!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇంట్లో విందు ఆరగించే అవకాశం రావడం అంటే మాటలు కాదు. అమెరికన్ ప్రముఖులకు ఆ చాన్స్ దక్కడమే కష్టం అంటే.... ఇక భారతీయ ప్రముఖులకు దక్కడం అంటే ఇంకా కష్టం. అందుకే ఒబామా అధికారిక నివాసం వైట్‌హౌస్ నుంచి డిన్నర్ చేసే అవకాశం దక్కించుకున్నవాళ్ల గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు ప్రియాంకా చోప్రా గురించి అలానే చెప్పుకుంటున్నారు. అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’ ద్వారా అక్కడ బాగా ఫేమస్ అయిన ప్రియాంక, ప్రస్తుతం హాలీవుడ్ చిత్రం ‘బేవాచ్’లో నటిస్తున్నారు. ఇటీవల ఆస్కార్ అవార్డుల వేడుకలో పాల్గొనడం ద్వారా ఆమె పాపులార్టీ మరింత పెరిగిపోయింది. బహుశా.. అదే ఒబామాతో డిన్నర్ చేసే అవకాశం ప్రియాంకకు తెచ్చిపెట్టి ఉంటుందని ఊహించవచ్చు. బరాక్ ఒబామా పదవీ కాలం ముగియనుంది. ఈ సందర్భంగా వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో శనివారం రాత్రి డిన్నర్ ఇచ్చారు. ఈ విందుకు బాలీవుడ్ కథానాయిక ప్రియాంకా చోప్రాకు వైట్‌హౌస్ కరస్పాండెట్స్ నుంచి ఆహ్వానం అందడం, ఆమె వెళ్లడం జరిగాయి. ‘‘ఒబామా, మిషెల్లీ ఒబామా (ఒబామా సతీమణి)తో డిన్నర్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఒబామా చాలా ఫన్నీ.. చార్మింగ్’’ అని ట్విట్టర్ ద్వారా ప్రియాంకా చోప్రా తన అనుభూతిని పంచుకున్నారు. -
టీవీ చర్చలో మంత్రిపై దాడి
కొల్లాం: ఓ టీవీ చానెల్ చర్చ కార్యక్రమం రభసగా మారింది. ప్రేక్షకులు దాడి చేయడంతో కేరళ కార్మిక మంత్రి బేబీ జాన్, లెఫ్ట్ కూటమికి చెందిన ఎన్.విజయ్ పిళ్లై గాయపడ్డారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు జాన్ బదులిస్తుండగా కొందరు వారిపై రాళ్లు రు వ్వి, కుర్చీలు విసిరారు. గాయపడిన ఇద్దరు నేతల్ని ఆసుపత్రికి తరలించారు. జాన్ తాను రెండు సార్లు నెగ్గిన చావరా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. -
జబర్దస్త్ కార్తీక్
టీవీ షోలు, పదికిపైగా సినివూల్లో నటించే అవకాశం కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు పగలు కాలేజీ, రాత్రి ఈవెంట్స్ అవకాశాలను అందిపుచ్చుకొని విజయాలు సాధిస్తున్న యువతేజం రెండో తరగతిలో ఉండగా జనవరి 26 సందర్భంగా వేసుకున్న మహాత్మా గాంధీ వేషధారణ అతడిలోని నటనా పటిమకు బీజాలు వేసింది. ఎలాగైనా అత్యుత్తమ కళాకారుడిగా ఎదగాలనే సంకల్పం పాఠశాల దశలోనే ఆ కుర్రాడి మదిలో మెదిలేది. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అహర్నిశలు కష్టపడ్డాడు. కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు అర్ధరాత్రి దాకా మిమిక్రీ ప్రోగ్రామ్స్ చేసేవాడు. మళ్లీ ఉదయాన్నే బీటెక్ క్లాస్‌లకు హాజరయ్యేవాడు. రూ.200 రెమ్యునరేషన్‌తో మొదలైన ఆయన కళా ప్రస్థానం ప్రస్తుతం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. సినిమాల్లోనూ నటించే అవకాశాలు వరించారుు. కృషి చేస్తే ఏదైనా సాధించొచ్చని నిరూపిస్తున్న ఖానాపురం మండలం బుధరావుపేట యువతేజం కార్తీక్‌పై కథనమిది. - ఖానాపురం ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన ఓడపల్లి యూదగిరి, కరుణ దంపతుల కుమారుడు కార్తీక్. కార్తీక్ 2వతరగతిలో ఉండగా జనవరి 26న వుహాత్మాగాంధి వేషధారణలో చక్కటి హావభావాలతో అందరి మన్ననలు అందుకున్నాడు. అలా మొదలైన నటనా ప్రస్థానం తరగతులు పెరుగుతున్న కొద్దీ ఇనుమడిస్తూ పోరుుంది. పాఠశాల స్థారుులో హిందీ ఉపాధ్యాయుుడు రఫీ, తెలుగు ఉపాధ్యాయుుడు సురేష్ ఆయనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చేవారు. బడిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో కార్తీక్‌తో మిమిక్రీ, యూంకరింగ్ చేరుుంచేవారు. ఈ అభ్యాసం హన్మకొండలోని రావుప్ప ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్‌లో చేరిన తర్వాత కూడా కార్తీక్‌కు ఎంతో ఉపయోగపడింది. కళాశాలలో జరిగే కార్యక్రమాల్లో తోటి విద్యార్థుల నడుమ నటనా చాతుర్యాన్ని ప్రదర్శించే అవకాశం దక్కింది. రూ.200 రెమ్యునరేషన్‌తో మొదలు అప్పటిదాకా ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తున్న కార్తీక్ తండ్రి యూదగిరికి పరకాలకు బదిలీ అరుుంది. ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్లిన తర్వాత, కొద్దిరోజులకు అనివార్య కారణాలతో ఉద్యోగం పోరుుంది. దీంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగారుు. అప్పుడు కార్తీక్ బీటెక్ చేస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ఉదయం కాలేజీ, రాత్రి ఈవెంట్స్‌కు వెళ్లేవారు. రెమ్యునరేషన్ రూ.200 కు మించి వచ్చేదికాదు. ఆ తర్వాత మెజీషియున్ కల్యాణ్‌తో కలిసి రాష్ట్రస్థాయి ఈవెంట్స్‌లో పాల్గొన్నారు కార్తీక్. ‘జబర్దస్త్’తో.. సినిమా చాన్స్ ‘ఈటీవీ’లో తఢాఖా కార్యక్రమం కోసం ఆడిషన్స్‌లో 400 వుంది పాల్గొనగా కేవలం 20 మందినే ఎంపికచేశారు. వారిలో కార్తీక్ కూడా ఉన్నారు. 2014 డిసెంబర్లో ఓ రోజు జబర్దస్త్‌లో పని చేస్తున్న ధన్‌రాజ్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ కార్యక్రమంలో కార్తీక్ 4 ఎపిసోడ్లలో పని చేశాడు. ఆ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్‌లో ప్రకాశ్ టీంలో చేరారు. కొన్ని రోజుల తర్వాత రాకెట్ రాఘవ టీంలోకి మారారు. వుుసలవ్ము, తాగుబోతు రమేష్ క్యారెక్టర్లతో గుర్తింపు సంపాదించారు. శంకరాభరణం, ఇటీవల విడుదలైన ఎమ్మెల్యే భరత్, మరో 10 సినివూల్లో నటించే అవకాశాలు వరించారుు. బుల్లితెరపై తొలి అవకాశం బీటెక్ చివరి సంవత్సరంలో ఉండగా కార్తీక్‌కు ‘జీతెలుగు’ చానల్లో 2011 సంవత్సరంలో కామెడీ క్లబ్లో మిమిక్రీ ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించింది. అందులో 3 ఎపిసోడ్లు చేశారు. మరో 2 నెలలకే ‘వూ గోల్డ్’ చానల్లో గోల్డ్ కెఫే కార్యక్రమంలో మిమిక్రీ ప్రదర్శించారు. అనంతరం హైదరాబాద్‌లో కార్తీక్ నిర్వహించిన ఓ ఈవెంట్‌ను టీవీ-1 డెరైక్టర్ సురేష్ చూసి, 2013 దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో ప్రదర్శన ఇచ్చే అవకాశమిచ్చారు. అమ్మానాన్నల ప్రోత్సాహం మరువలేనిది పాఠశాల దశ నుంచే నాకు నటన అంటే ఇష్టం. వుంచి ఆర్టిస్టు కావాలనే లక్ష్యంతో ఎన్నో ఈవెంట్స్ నిర్వహించా. నా పురోగతి వెనుక అమ్మానాన్నల ప్రోత్సాహం ఉంది. వారి సహాయ సహకారాలు లేకుంటే ఈ స్థారుుకి వచ్చేవాడిని కాదు. ‘మంచి కళాకారుడిగా ఎదగాలి బిడ్డా’ అంటూ అమ్మానాన్న చెప్పిన మాటలే తారక మంత్రాల్లా పనిచేసి నన్ను ముందుకు నడిపారుు. -
ట్రాజెడీ... నో రియాల్టీ..
టీవీ షోలకు ఆకర్షితులవుతున్న యువత నిజ జీవితంలో స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదికి గత ఏడాది స్ట్రీట్ ఫైట్... తాజాగా ఫైర్ ఫైట్ సిటీబ్యూరో: కొన్ని సర్పాలతో పాటు కీటకాలున్న గాజు పెట్టెలో చేతులు పెట్టేదొకరు.. అల్లంత ఎత్తులో ఒంటికి నిప్పుపెట్టుకుని కింద నీటిలోకి దూకేది ఇంకొకరు... బైక్‌పై వేగంగా దూసుకుపోతూ నేలపై ఉన్న వస్తువుల్ని తీసేది మరొకరు... ఇటీవల కాలంలో సినిమాలను మించిపోతున్న ఈ సీన్లు టీవీల్లోని రియాల్టీ షోల్లో నిత్యం కనిపిస్తున్నాయి. వీటిని ‘స్ఫూర్తి’గా తీసుకుంటున్న బాలురు, యువత వాటిలో పాల్గొనాలనో, ఆ స్థాయిలో స్టంట్స్ చెయ్యాలనో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా తీవ్రంగా గాయపడటంతో పాటు మృత్యువునూ కొనితెచ్చుకుంటున్నారు. సోమవారం పాతబస్తీలోని ఫలక్‌నుమ ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చిన జలాలుద్దీన్ మృతి ఉదంతం ఈ కోవకు చెందినదే. బయటపడుతున్నవి, పోలీసు రికార్డుల్లోకి ఎక్కుతున్నవి తక్కువే అయినా... ఈ రియాల్టీల ప్రభావం టీనేజర్లపై ఎక్కువగా ఉంటోందని మానసిక నిపుణులు చెప్తున్నారు. పరిపక్వత లేకపోవడమే ప్రధాన కారణం... టీవీ షోల ప్రభావానికి లోనవుతున్న వారిలో టీనేజర్లే ఎక్కువగా ఉంటున్నారు. ఓ ఛానల్లో ప్రసారమయ్యే రెజ్లింగ్‌తో ప్రేరణ పొందిన కొందరు యువకులు గత ఏడాది మేలో పాతబస్తీలో వీరంగం సృష్టించారు. ఫం జెషా బస్తీలో ఏడుగురు యువకుల మధ్య ప్రారంభమైన పందెం స్ట్రీట్ ఫైట్‌కు దారి తీసింది. ఈ పోరులో 17 ఏళ్ల నబీల్ ప్రాణాలు కోల్పోయాడు. టీనేజ్‌లో ఉన్న యువతలో పరిపక్వత తక్కువగా ఉంటోందని నిపుణులు చెప్తున్నారు. దీనికి తోడు ఆ వయసులో ఇతరుల్ని, కొన్ని కార్యక్రమాలు చూసి సాహసాలు చేయాలనే ధోరణిలోకి వెళ్లిపోతారు. అందులోనే హీరోయిజం, విజయం ఉన్నాయని భావించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. జలాలుద్దీన్ సైతం కలర్స్ ఛానల్లో ప్రసారమవుతున్న ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ కార్యక్రమంలో భాగమైన ‘ఫియర్ ఫ్యాక్టర్-ఖత్రోంకి ఖిలాడీ’ సిరీస్‌లో పాల్గొనడానికి ‘రిహార్సల్స్’ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడని దక్షిణ మండల పోలీసులు తెలిపారు. అవి చూసే బైక్ రేసులు సైతం... నగరంలోని దక్షిణ మండలంతో పాటు పశ్చిమ మండలంలోని అనేక ప్రాంతాలు ‘రేస్ ఎఫెక్డెడ్’ జాబితాలోకి వస్తాయి. మధ్య మండల పరిధిలో ఉన్న నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్ ఏరియాల్లోనూ బైక్ రేసింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకరితో ఒకరు పోటీ పడి దూసుకుపోవడం, వీలింగ్ పేరుతో వాహనాన్ని ఉన్న స్థానంలోనే గుండ్రంగా తిప్పడం, ముందు చక్రం పెకైత్తి నడిపిం చడం, వాహనంపై నిల్చోవడం... ఇలా అనేక స్టంట్స్‌కు సినిమాలు, టీవీల్లోని అంశాలే ప్రేరణగా మారుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఓ ప్రాంతంలో నిఘా ఉంచి ‘రేసర్లను’ పట్టుకుంటున్నారు. వారితో పాటు తల్లిదండ్రుల్నీ పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఈ చర్యలతో కొన్ని రోజులు మిన్నకుండిపోతున్న యువత... ఆపై ప్లేసులు మార్చి మళ్లీ రెచ్చిపోతున్నారు. అనేక సందర్భాల్లో వాహనాలు ధ్వంసం కావడం, క్షతగాత్రులు కావ డం జరుగుతున్నా వీరిలో ఆశించిన మార్పు రావట్లేదు. అసలు వాస్తవాలు మర్చిపోతున్నారు... సినిమాలు, టీవీలను అనుకరిస్తున్న టీనేజర్లు అసలు వాస్తవాలను గుర్తించలేకపోవడం, గమనించినా పట్టించుకోకపోవడం జరుగుతోందని పోలీసులు చెప్తున్నారు. వీటికి తోడు ఇటీవల కాలంలో వస్తున్న కొన్ని వాణిజ్య ప్రకటనలు సైతం యువతను ‘ప్రేరేపించేవిగా’ ఉంటున్నాయి. వాటిలో స్టంట్స్ చేసే వారు నిపుణుల పర్యవేక్షణలోనే సాగిస్తారు. ఇదే అంశాన్ని వాణిజ్య ప్రకటనలు, రియాల్టీ షోల్లో అవి ప్రసారమవుతున్నప్పుడు కింది వైపు చిన్న అక్షరాల్లో ప్రసారం చేస్తున్నారు. నిజజీవితంలో ఎడ్వెంచర్స్కు ప్రయత్నిస్తున్న బాలురు, యువత తల్లిదండ్రులకు సమాచారం లేకుండా చేస్తున్నారు. ప్రమాదాల నివారణ చర్యలు, అత్యవసర సమయాల్లో ఉపకరించే పరికరాలు, నిపుణుల పర్యవేక్షణ లేకుండా ‘రంగం’లోకి దిగుతూ ప్రాణాల పైకి తెచ్చుకుంటూ కన్న వారికి కడుపుకోత మిగుల్చుతున్నారని పోలీసులు వివరిస్తున్నారు. శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం పాతబస్తీలోని యువత, మైనర్లలో ఉన్న కొన్ని ఇబ్బందికర అంశాలను పారద్రోలడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. వేళకాని వేళల్లో రోడ్లపైకి వస్తున్న వారిని, చబుత్రలపై కాలక్షేపం చేస్తున్న వారిని, లేట్ నైట్ రోమియోస్, రహదార్లపై బైక్స్‌తో ఫీట్లు చేసే వారిని నిలువరిస్తున్నాం. వారితో పాటు తల్లిదండ్రులకూ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. సినిమాలు, టీవీల్లోని స్టంట్స్ చూసి తమంతట తాముగా స్ఫూర్తి పొందుతూ ప్రాణాల మీదికి తెచ్చే సాహసాలు చేసే టీనేజర్ల విషయంలో తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి. వ్యవస్థీకృతంగా జరిగే వాటిని పోలీసులు ఆపగలిగినా... వ్యక్తిగత అంశాల్లో తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదు చేసే వరకు జోక్యం చేసుకోవడం సాధ్యం కావట్లేదు. - వి.సత్యనారాయణ, సౌత్ జోన్ డీసీపీ తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి టీవీల్లో ప్రసారమయ్యే రియాల్టీ షోల ప్రభావం టీనేజర్లపై ఎక్కువగా ఉంటోంది. బాలలు, యువత ‘ఎడ్వెంచర్స్’ బారినపడకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వయసుకు మించిన ప్రదర్శనల్ని చూడటానికి అంగీకరించకూడదు. ఇలాంటి వాటిని పిల్లలు చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు సైతం పక్కనే ఉండాలి. ఆయా షోల్లో ఫీట్లు పిల్లల్ని ఎంత మేరకు ఆకర్షిస్తున్నాయో గమనించాలి. షో ముగిసిన తర్వాత సైతం తల్లిదండ్రులు కాసేపు పిల్లలతో మాట్లాడాలి. షోలో చూసిన అంశాల పట్ల వారి అభిప్రాయం ఏమిటి? వారూ అలాంటివి చేయాలని ఆశిస్తున్నారా? అనే అంశాలు తెలుసుకోవాలి. ఏమాత్రం ఆ ఛాయలు కనిపించినా వాస్తవాలను వారికి వివరించాలి. అలాంటి ఫీట్లు కేవలం నిపుణుల పర్యవేక్షణలోనే సాధ్యమని, అలానే జరిగాయనేది అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడే అపశృతులకు తావు లేకుండా చూసుకోగలం. - డాక్టర్ అనిత రాయిరాల, అసిస్టెంట్ ప్రొఫెసర్, సైకియాట్రిస్ట్ -
ప్రియాంకపై కార్మికుల ఆగ్రహం!
బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’తో హాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గుర్తింపు ప్రియాంకకు హాలీవుడ్ చిత్రం ‘బేవాచ్’లో నటించే అవకాశం తెచ్చిపెట్టింది. అయితే, ఉత్సాహంగా దూసుకెళుతున్న ప్రియాంక ప్రస్తుతం ఇరుకున పడ్డారు. దానికి కారణం ఆమె నిర్మాతగా మారడమే. ‘పర్పుల్ పెబల్ పిక్చర్స్’ పతాకంపై భోజ్‌పురి, పంజాబీ, మరాఠీ భాషల్లో సినిమాలు తీయనున్నట్లు ప్రియాంక ప్రకటించారు. ఈ చిత్రాలకన్నా ముందే ఓ యాడ్ ఫిలిం నిర్మించడానికి ఆమె సన్నాహాలు చేశారు. దీని కోసం గతేడాది ఆమె కొంతమంది వర్కర్స్‌ను నియమించుకున్నారు. దాదాపు ఏడాది కాలంగా ప్రియాంక బేనర్‌కి పని చేస్తున్నామనీ, తమకు చెల్లించాల్సిన పారితోషికానికి ఆమె బాకీ పడ్డారని వర్కర్స్ యూనియన్‌కి కార్మికులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు పరిశీలించిన వర్కర్స్ యూనియన్.. ప్రియాంక మొత్తం 36 లక్షల్లో 20 లక్షలు మాత్రమే ఇచ్చారని, మిగతా మొత్తం ఇవ్వలేదని నిర్ధారించింది. కానీ, మాట్లాడిన పారితోషికం మొత్తం ఆర్ట్ డైరెక్టర్స్‌కి ఇచ్చేశామనీ, అతనే వర్కర్స్‌కి ఇవ్వలేదని ప్రియాంక బేనర్‌కి సంబంధించిన కార్యకలాపాలు చూస్తున్న ఆమె అత్తయ్య, మరో ఇద్దరు వ్యక్తులు అంటున్నారు. ప్రియాంక తరఫున ‘ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ రంగంలోకి దిగింది. మొత్తం డబ్బు ఇచ్చినా, మరో ఐదు లక్షలు చెక్ కూడా ఇవ్వడానికి సంస్థ అధినేత సిద్ధపడ్డారని, ఆ చెక్ తీసుకోవడానికి ఆర్ట్ డైరెక్టరే రావడం లేదని పేర్కొంది. డబ్బులు ఇవ్వని ఆర్ట్ డైరెక్టర్ దగ్గర వర్కర్లు ఎందుకు పని చేయాలని, డబ్బులు ఇచ్చిన ‘పర్పుల్ పెబల్ పిక్చర్స్’ని ఎందుకు ఇరుకున పెట్టాలని సదరు అసోసియేషన్ ప్రశ్నించింది. మరి.. ఈ వివాదం ఎంతదాకా వెళుతుందో చూడాలి. -
నాకు రాష్ట్రపతి అవ్వాలని ఉంది- కత్రినా కైఫ్
అందంతోపాటు అభినయంతో అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.. తన మనసులో ఉన్న ఓ కోరికను బయటపెట్టి పలువురిని ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరి 12 న విడుదల కానున్న తన తాజా చిత్రం 'ఫితూర్' ప్రమోషన్లో భాగంగా ఓ టీవీ షోలో పాల్గొన్న కత్రినా సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఫితూర్ అనగా తెలుగులో మానసిక స్థితి, ఒక విధమైన పిచ్చి వంటి అర్థాలు వస్తాయి. అయితే సినిమాలు కాకుండా మీ మనసులో మెదులుతున్న మరో 'ఫితూర్' ఏంటి అని ప్రోగ్రామ్ యాంకర్ ప్రశ్నించగా.. 'నాకు దేశానికి రాష్ట్రపతిని అవ్వాలని ఉంది, అదే ప్రస్తుతానికి నా మనసులో తిరుగుతున్న విషయం' అంటూ ఠకీమని సమాధానం ఇచ్చింది కత్రినా. నేను ఏదైనా సాధించాలని మనసులో అనుకుంటే అది ఎప్పటికైనా తప్పకుండా సాధించి తీరుతాను. చూద్దాం.. ఏమౌతుందో ఎవరికి తెలుసు అంటూ నవ్వేసింది నైఫ్ లాంటి కైఫ్. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో సిద్ధార్థ రాయ్ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం సుప్రసిద్ధ రచయిత చార్లెస్ డికెన్స్ నవల 'గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్' ఆధారంగా తెరకెక్కుతుంది. కత్రినాతోపాటు ఫితూర్ సినిమాలో ఆదిత్య రాయ్ కపూర్, టబు ముఖ్య తారలుగా కనిపించనున్నారు. -
కేపీహెచ్బీలో కూరగాయలు అమ్మిన రకుల్
ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ సూపర్ ఫాంలో కనిపిస్తున్న యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంట్రస్టింగ్ ట్వీట్‌తో అభిమానులకు షాకిచ్చింది. ''కేపీహెచ్బీలో నేను కూరగాయలు అమ్ముతా, ఉదయం 10 గంటల నుంచి నా దగ్గరకు వచ్చి కూరగాయలు కొనుక్కోండి'' అంటూ రకుల్ చేసిన ట్వీట్‌కు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చెప్పినట్టుగా శనివారం ఉదయం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ లో మంజీరా మాల్ ఎదురుగా ఉన్న మార్కెట్ లో రకుల్ కూరగాయలు అమ్మింది. అసలు రకుల్‌కు కూరగాయలు అమ్ముకునేంత అవసరం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా.. సినిమాలతో పాటు టీవీ షోస్‌తో కూడా సత్తా చాటుతున్న మంచు లక్ష్మి.. 'మేము సైతం' పేరుతో మరో టివి షో ప్రారంభిస్తుంది. సమాజ సేవ నేపథ్యంతో రూపొందించిన ఈ కార్యక్రమం కోసం రకుల్ ప్రీత్‌సింగ్ ఈ రిస్క్ తీసుకుంటుంది. ఇలా రకుల్ అమ్మిన కూరగాయల ద్వారా వచ్చిన డబ్బును ఏదైనా సామాజిక సేవా కార్యక్రమం కోసం వినియోగించనున్నారు. I will b at KPHB market opp Manjeera mall sellin vegetables 4 lakshmis show #memusaitham.lts change lives come buy vegetables from me.10am — Rakul Preet (@Rakulpreet) February 5, 2016 -
'మా ఆయన కోపాన్ని దాచేశాను'
లండన్: అమెరికాలో స్వీట్ హార్ట్ కపుల్‌గా పేరొందిన హాలీవుడ్ జంట టోరీ స్పెల్లింగ్, డీన్ మెక్డెర్మాట్స్. అన్యోన్యమైన అనుబంధమున్న ఈ దంపతులు ఇటీవల ఓ టీవీ రియాల్టీ షోలో కనిపించి.. చిలుకాగోరింకల్లా అభిమానులను అలరించారు. అయితే, ఈ టీవీ రియాల్టీ షోకు సంబంధించిన ఓ వాస్తవాన్ని ఇటీవల నటి టోరీ స్పెల్లింగ్ వెల్లడించింది. తన భర్త డీన్‌కు కోపమెక్కువని, అందుకే అతని కోపం ప్రేక్షకుల కంట పడకుండా రియాల్టీ షో వీడియోలను ఎడిటింగ్ చేయించానని ఆమె వెల్లడించింది. 'మేం అమెరికాలోనే అన్యోన్యమైన దంపతులం. మా ఆయన తరచూ కోప్పడుతుంటే అభిమానులు చూడటం అంతగా బాగుండదు. అందుకే ఆయన కోపాన్ని వారి కంటపడకుండా దాచేశాను' అని టోరీ వివరణ ఇచ్చింది. డీన్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత తమ వైవాహిక జీవితం గురించి 'ట్రూ టోరీ' పేరిట ఆమె టీవీ రియాల్టీ షో చేశారు. అయితే, నిత్యం ప్రజాజీవితంలో ఉండే తమ గురించి కొన్ని వ్యక్తిగత విషయాలు ప్రజలకు తెలియడం అంత మంచిది కాదనే ఉద్దేశంతోనే తన భర్త కోపాన్ని కెమెరాకు చిక్కుకుండా జాగ్రత్తలు తీసుకున్నానని టోరీ పేర్కొంది. -
'అక్కా.. ఉరి ఎలా వేసుకుంటారో చూపించనా అంటూ..'
ముంబయి: అనుకరణ అస్తిత్వాన్నే కాదు ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తుంది. ఆ విషయాన్ని రుజువు చేస్తూ ముంబయిలో ఓ ఘటన చోటుచేసుకుంది. టీవీ సీరియల్స్‌లో ఎలా ఉరి వేసుకుంటారో తన సోదరికి చూపిస్తూ ఓ పదకొండేళ్ల బాలుడు ప్రాణాలుకోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలోగల బీద్ జిల్లాలో షేక్ సాజెద్ షేక్ వాజెద్ అనే విద్యార్థి ఓ ఉర్దూ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. స్కూల్ కు వెళ్లొచ్చి తన సోదరుడితో కలిసి భోజనం చేశాడు. అనంతరం తన సోదరితో కలిసి టీవీ ముందు కూర్చున్నారు. టీవీ చూస్తూ చూస్తూ మధ్యలో తన సోదరితో మాట్లాడుతూ టీవీ సీరియల్స్ లో ఎలా ఉరివేసుకుంటారో ప్రదర్శనగా చూపించేందుకు ప్రయత్నించాడు. ఇది జరిగే సమయంలో ఇంట్లో పెద్దవాళ్లెవరూ లేరు. అలా ఉరి వేసుకుంటున్నట్లుగా నటించిన సాజెద్ మెడకు నిజంగా తాడు బిగుసుకుపోవడంతో అతడు ప్రాణాలు కోల్పోయారు. అనుకోకుండా జరిగిన సంఘటనగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కొత్త అవతారం
అమితాబ్ బచ్చన్ గ్రేట్ యాక్టర్ అనే విషయం జగమెరిగిన సత్యం. ఆయనలో మంచి సింగర్ కూడా ఉన్నారు. ఇప్పటికే పలు సినిమాల్లో పాటలు పాడి గాయకునిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అమితాబ్ ఇటీవలే కబడ్డీ ప్రొలీగ్ ప్రమోషనల్ సాంగ్‌ను కూడా ఆలపించారు. ఈ బిగ్ బి ఇప్పుడు సంగీత దర్శకునిగా కూడా మారారు. దాదాపు పదిహేనేళ్ల గ్యాప్ తర్వాత ఆయన చేస్తున్న రియాలిటీ షో ‘ఆజ్ కీ రాత్ హై జిందగీ’. స్టార్ ప్లస్‌లో ప్రసారం కానున్న ఈ రియాలిటీ షోకు సంబంధించిన ఓ పాటను స్వరపరచడంతో పాటు దాన్ని ఆలపించారు. ‘‘సంగీతాన్ని ఆస్వాదిస్తూ దాని కోసమే బతుకుతున్న స్వరకర్తలందరూ నా దృష్టిలో ఆ దైవానికి దగ్గరగా ఉంటారని నా నమ్మకం. మొదటి సారిగా నేను స్వరకర్తగా మారాను. దేవుడి దీవెనలతో అంతా బాగానే రావాలని కోరుకుంటున్నా’’ అని అమితాబ్ తన అనుభూతులను బ్లాగ్‌లో అభిమానులతో పంచుకున్నారు. -
బుల్లితెరపై హృతిక్... షో!
హృతిక్ రోషన్ ఇప్పుడో బుల్లితెర షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. దీనిలో ప్రత్యేకత ఏముందనుకుంటున్నారా..? ఇంతకీ ఆ కాన్సెప్ట్ ఏంటంటే... జీవితంలో అత్యంత దీనమైన పరిస్థితులను దాటుకుంటూ, ఒక్కొక్క మెట్టు ఎక్కి, విజయం సాధించిన కొంతమంది వ్యక్తులను ప్రపంచానికి పరిచయం చేయడమే. 2011లో ‘జస్ట్ డ్యాన్స్’ అనే రియాల్టీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు హృతిక్. ఆ తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా రొటీన్‌గా ఉండడంతో ఒప్పుకోలేదు. కానీ డిస్కవరీ చానల్ ప్రతినిధులు చెప్పిన ‘రియల్ హీరోస్’ కాన్సెప్ట్ హృతిక్ గత జీవితాన్ని గుర్తు చేసుకునేలా చేసిందట. తన చిన్నతనంలో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడేవారట హృతిక్. నటుడు కావాలనే పట్టుదలతో క ష్టపడి స్పీచ్ థెరపీ క్లాస్‌కు వెళ్లి తనకున్న లోపాన్ని సరిదిద్దుకున్నారట. ‘రియల్ హీరోస్’ కాన్సెప్ట్ ఇంచుమించు తన నిజజీవితానికి దగ్గరగా ఉండడంతో వెంటనే పచ్చజెండా ఊపారట హృతిక్. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఈ కార్యక్రమం ప్రసారం కానుందట. -
మంటల మధ్య సాహసం...
గులాబీ బాల రాయ్ లక్ష్మి(లక్ష్మీ రాయ్ తన పేరును ఈ విధంగా మార్చుకున్నారు) గాయపడ్డారు. ఆమెను గాయాలపాలు చేసిన ఆ పాపాత్ముడు ఎవరూ అని అభిమానులు తిట్టుకునే అవకాశం ఉంది. కానీ, రాయ్ లక్ష్మిని ఎవరూ గాయపర్చలేదు. ఓ రియాల్టీ షో కోసం రియల్‌గా ఫైట్ చేయడానికి రంగంలోకి దిగారామె. ఆ వేదికపై పలువురు తారలు రిస్కీ ఫైట్స్ చేశారట. ఆమె కూడా ఏం తక్కువ తినలేదంటూ డూప్ లేకుండా రాయ్ లక్ష్మి ఫైట్ చేయడానికి రంగంలోకి దిగారు. మంటల్లోంచి తప్పించుకునే సీన్ అది. స్వతహాగా జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ తీసుకుని ఉన్నందువల్ల నదురూ బెదురూ లేకుండా మంటల్లోకి దూసుకెళ్లారామె. ఆ సమయంలో కాలు సరిగ్గా అక్కడున్న ఇనుప కడ్డీకి తగిలింది. దాంతో రాయ్ లక్ష్మి విలవిలలాడిపోయారు. ఆమెకు తగిలిన గాయం చూసి, వారాల తరబడి విరామం తీసుకుంటేనే తగ్గుతుందని చాలామంది భావించారట. కానీ, కేవలం రెండే రెండు రోజులు విశ్రాంతి తీసుకుని, ఆమె షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అయిపోయారు. ‘‘గాయం తాలూకు నొప్పి ఎక్కువగానే ఉన్నా, షూటింగ్ చేసేస్తున్నా. నా కారణంగా దర్శక, నిర్మాతలు ఇబ్బందిపడకూడదు కదా’’ అని పేర్కొన్నారు రాయ్ లక్ష్మి. -
టీవీ షోకి... ప్రియాంక పాట
ప్రియాంకా చోప్రా మంచి నటి మాత్రమే కాదు... మంచి గాయని కూడా. ఆమె రూపొందించిన ‘ఎగ్జోటికా’ ఆల్బమ్ ఆ విషయాన్ని నిరూపించింది. వీలు కుదిరినప్పుడల్లా పాటలు పాడాలని ప్రియాంక అనుకుంటున్నారు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘దిల్ ధడక్నే దో’ చిత్రం కోసం ఫర్హాన్ అఖ్తర్‌తో కలిసి ప్రియాంక పాడిన టైటిల్ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈసారి టీవీ షో కోసం పాడనున్నారు. అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’లో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో కోసం రూపొందించనున్న మ్యూజికల్ ఆల్బమ్‌కే ఆమె పాడనున్నారు. -
జబర్దస్త్ నటులపై కేసు నమోదు
తిమ్మాపూర్: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాంలో పలువురు నటీనటులతోపాటు న్యాయ నిర్ణేతలపై కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈటీవీలో అక్టోబర్ 30న రాత్రి 9.30 గంటలకు జబర్ధస్త్‌లో ప్రసారమైన కామెడీ షోలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారి మనోభావాలను అగౌరవపరిచే విధంగా మద్యం సేవించినట్లు అమర్యాదగా ప్రవర్తించినట్లు చూపించారని తిమ్మాపూర్‌కు చెందిన కేతిరెడ్డి అంజిరెడ్డి కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కోర్టు.. జబర్దస్ నటులు శేషు, సుధాకర్, యాంకర్ రష్మీ, న్యాయనిర్ణేతలు నాగేంద్రబాబు, రోజాపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది. -
ఆప్ కీ అదాలత్ నుంచి లక్ష్మీ పార్వతికి ఆహ్వానం
ఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణ లక్ష్మీ పార్వతికి ఆప్ అదాలత్ నుంచి ఆహ్వానం అందింది. ఇండియా టీవీ నిర్వహించే ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు అందాయి. తాజాగా లక్ష్మి పార్వతి ఆప్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానం అందడంతో అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేశారు. ‘ఆప్ కీ అదాలత్’ ప్రారంభించి 21 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈనెల 21న నిర్వహించే కార్యక్రమంలో వీరు పాలుపంచుకోనున్నారని ‘ఇండియా టీవీ’ తెలిపింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో సహా సీనియర్ మంత్రులు కూడా ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
మా ఇద్దరి తీరు వేరు
‘ఖూబ్సూరత్’ హీరో ఫవద్ ఖాన్ అంటే తనకు అభిమానం ఉన్నా పనితీరులో తమ ఇద్దరి మధ్య అంత సత్సంబంధాలు లేవని ‘హమ్‌సఫర్’ డెరైక్టర్ సర్మద్ ఖూసత్ అన్నాడు. 2011లో పాకిస్థాన్‌లో సూపర్‌హిట్ అయిన టీవీ షో ‘హమ్‌సఫర్’కు సర్మద్ దర్మకత్వం వహించగా, ఫవద్ హీరోగా నటించాడు. ‘ఫవద్ మంచి నటుడు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే నాకు,అతనికి పని విధానంలో చాలా తేడా ఉంది. మా ఇద్దరి మధ్య ‘కెమిస్ట్రీ’ అంతగా కుదరలేదనే చెప్పాలి. హమ్‌సఫర్ వరకు మా ఇద్దరి మధ్య సంబంధాలు బాగానేఉన్నాయి. అయితే అతడితో మళ్లీ,మళ్లీ పనిచేయాలనే ఆలోచన నాకు లేదు.. అతడు నా విష్ లిస్ట్‌లో లేడు..’ అని స్పష్టం చేశాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏమైనా ఉన్నాయా అని అడగ్గా అలాంటిదేమీ లేదన్నాడు. ‘నాకు ఫవద్ నటనంటే చాలా ఇష్టం.. అయితే మా మధ్య అంతగా విభేదాలు లేవు.. భవిష్యత్తులో అతడితో పనిచేయాల్సి వస్తే తప్పకుండా చేస్తా.. నేను, ఫవద్, మహిరా కలిసి మళ్లీ ఒక ప్రాజెక్టు చేస్తామనే అనుకుంటున్నా.. అయితే అతడితో తప్పనిసరిగా చేయాలి అనే భావన నాలో లేదు. నా అభిమాన నటుల్లో అతడు లేడు..’ అని చెప్పాడు. భారత ప్రేక్షకులు ఫవద్ను ఆదరించడం తనకు చాలా ఆనందంగా ఉందని సర్మద్ పేర్కొన్నాడు. ‘భారత ప్రేక్షకులు ప్రతిభను గుర్తిస్తారని మరోసారి రుజువైంది.. ఇటువంటి ఘటనల వల్ల రెండు దేశాల మధ్య అనుబంధం మరింత పెరుగుతుందని భావిస్తున్నా..’ అని పాకిస్థానీ డెరైక్టర్, నటుడు అయిన సర్మద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. పాకిస్థానీ రచయిత రచించిన ‘ఫర్హత్ ఇష్థియఖ్స్’ అనే నవల ఆధారంగా ఈ సీరియల్‌ను నిర్మించారు. ఇందులో భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని రచయిత చక్కగా విశదపరిచాడని, ఇటువంటి డ్రామా ఉన్న కథాంశాలను భారత ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని సర్మద్ ధీమా వ్యక్తం చేశాడు. -
7 కోట్ల జాక్‌పాట్!
కేబీసీ 8లో గెలుచుకున్న ఢిల్లీ సోదరులు ముంబై: అచిన్ నరులా, సార్థక్ నరులా.. ఢిల్లీకి చెందిన ఈ అన్నదమ్ములిద్దరూ నిన్న మొన్నటి వరకూ చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా వీరిద్దరూ సెలబ్రిటీలైపోయారు. కారణం ‘కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ)’ టీవీ షో. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కేబీసీ 8వ సీజన్ సోనీ టీవీలో ప్రసారమవుతుండడంతెలిసిందే. ఈ కార్యక్రమంలో తొలిసారి రూ. ఏడు కోట్ల ప్రైజ్ మనీని గెలుచుకుని నరూలా బ్రదర్స్ చరిత్ర సృష్టించారు. నాలుగు లైఫ్ లైన్ల సాయంలో 14 ప్రశ్నలనూ కరెక్ట్‌గా చెప్పి రికార్డు స్థాయి ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ తన బ్లాగ్, ట్విట్టర్లో వెల్లడించారు. విజేతలకు చెక్కును ఇస్తున్న ఫొటోను సైతం పోస్ట్ చేశారు. కేబీసీ ప్రారంభించిన తర్వాత ఈ స్థాయిలో ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నది వీరిద్దరే కావడం గమనార్హం. అచిన్ ఢిల్లీలో మార్కెటింగ్ మేనేజర్. సార్థక్ ఓ విద్యార్థి. అచిన్ పదేళ్లుగా కేబీసీలో పాల్గొనేందుకు ప్రయత్నించి ఇప్పటికి సఫలమయ్యాడు. ‘‘ఈ రాత్రి ప్రపంచం తల్లకిందులైంది. ఇందుకు కేబీసీనే కారణం. అద్భుతమైన క్షణాలివి. ఏం మేథస్సు. ఎంత అద్భుతంగా ఆడారు. ఇది కేబీసీ వల్లే సాధ్యమైంది. నమ్మశక్యం కాని క్షణాలివీ’’ అని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు బిగ్‌బీ. -
యూకే, యూఎస్ ల్లో బిగ్ బీ కేబీసీ షో!
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ(కేబీసీ)-8’ టీవీ షో ఇక నుంచి విదేశాల్లో కూడా వీక్షకులను అలరించనుంది. శనివారం సూరత్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా ప్రారంభమైన కేబీసీ తొలుత భారత్ లోని సూరత్ , గుజరాత్ లలో నిర్వహిస్తున్నారు. అనంతరం ఈ షోను అమెరికా, యూకేలలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అమితాబ్ సూచనప్రాయంగా తెలిపాడు. ఇప్పటివరకూ అయిన కేబీసీ షోలు ముంబైలో జరిగినా.. ఆ నగరం వెలుపల జరగడం ఇదే తొలిసారి. అమితాబ్ గుజరాత్ పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ షో అక్కడ నిర్వహించడం గమనార్హం. ఈ ప్రీమియర్ తాజా షోలో సూరత్ వ్యాపారవేత్త దీపా జగ్తియానీ రూ.6.40 లక్షల నగదు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సారి పోటీలో తుది విజేతకు అందించే బహుమతిని రూ. 7కోట్లకు పెంచారు. కేబీసీ-4లో పోటీచేసిన మనోజ్ శర్మ, కేబీసీలో రూ.ఐదు కోట్లు గెలిచిన తొలి మహిళ సున్మీత్ కౌర్ సాహ్నీ, ప్రపంచ క్విజ్ చాంపియన్ విక్రమ్ జోషీలను సలహా కోరేందుకు కొత్తగా లైఫ్‌లైన్ అవకాశాన్ని ప్రవేశపెట్టారు. కేబీసీ 8వ సీజన్ షో ఈనెల 17వ తేదీన సోనీ ఎంటర్టైన్మెంట్ చానల్లో ప్రసారం కానుంది. -
మళ్లీ బిగ్‌బీ కేబీసీ షో
17న సోనీలో ప్రసారం సూరత్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ(కేబీసీ)-8’ టీవీ షో శనివారం సూరత్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా ప్రారంభమైంది. కేబీసీ షో ముంబై వెలుపల జరగడం ఇదే తొలిసారి. అమితాబ్ గుజరాత్ పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ షో అక్కడ నిర్వహించడం గమనార్హం. ఈ ప్రీమియర్ షోలో సూరత్ వ్యాపారవేత్త దీపా జగ్తియానీ రూ.6.40 లక్షల నగదు గెలుచుకున్నారు. ఈ సారి పోటీలో తుది విజేతకు అందించే బహుమతిని రూ. 7కోట్లకు పెంచారు. కేబీసీ-4లో పోటీచేసిన మనోజ్ శర్మ, కేబీసీలో రూ.ఐదు కోట్లు గెలిచిన తొలి మహిళ సున్మీత్ కౌర్ సాహ్నీ, ప్రపంచ క్విజ్ చాంపియన్ విక్రమ్ జోషీలను సలహా కోరే ందుకు కొత్తగా లైఫ్‌లైన్ అవకాశాన్ని ప్రవేశపెట్టారు. కేబీసీ 8వ సీజన్ షో ఈనెల 17వ తేదీన సోనీ ఎంటర్టైన్మెంట్ చానల్లో ప్రసార ం కానుంది. -
7న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గ్రాండ్ ఫైనల్
చెన్నై: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా అత్యంత ప్రజాదరణ పొందిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' టీవీ షోకు త్వరలో ఫుల్స్టాప్ పడనుంది. ఈ కార్యక్రమం గ్రాండ్ ఫైనల్ ఈ నెల 7న ప్రసారం కానుంది. ఇది 40వ ఎపిసోడ్. అంతటితో ఈ కార్యక్రమం ముగియనుంది. హిందీలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా అమితాదరణ పొందిన 'కౌన్ బనేగా కరోర్‌పతి' టీవీ షోకు తెలుగులో వర్సెన్లో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమం రూపొందించారు. బుల్లితెరపై నాగ్ ఆకట్టుకున్నారు. అభిమానుల నుంచి ఈ షోకు మంచి స్పందన వచ్చింది. ఈ షో తనకు ఎంతో నచ్చిందని, ఓ మధురానుభూతిగా నిలిచిపోతుందని నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. ఈ షో లక్షలాదిమంది హృదయాలను గెలుచుకుందని, వ్యాఖ్యాతగా ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని చెప్పారు. పోటీలలో పాల్గొన్న వారి హుందాతనం, అమాయకత్వం, అంకితభావం, వారి కుటుంబ నేపథ్యం తనను ఎంతో ఆకట్టుకున్నాయని నాగార్జున అన్నారు. -
మళ్లీ బుల్లితెరపైకి షారుఖ్ ?
న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరోసారి టీవీ షోలో పాల్గొనేందుకు రెడీగా ఉన్నాడంటూ బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అంతర్జాతీయంగా ప్రాముఖ్యం పొందిన గాట్ ట్యాలెంట్ షో ఆధారంగా ఓ హిందీ చానెల్ ప్రసారం చేసే షోను షారుఖ్ నిర్వహిస్తాడట. దీని గురించి సంబంధిత చానెల్ శుక్రవారం అధికారికంగా ప్రకటన చేయనుంది. షారుఖ్ యాంకర్‌గా వ్యవహరించబోయే విషయాన్ని తెలియజేయడానికి త్వరలో నిర్వహించబోయే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మరొక ఆసక్తికర విశేషం ఏమిటంటే గ్యాట్ ట్యాలెంట్, ది ఎక్స్ ఫ్యాక్టర్ వంటి షోలతో ఎంతో పేరుతెచ్చుకున్న టీవీ ప్రముఖుడు సైమన్ కోవెల్ కూడా షారుఖ్ షో ప్రకటన కోసం నిర్వహించే ఉత్సవంలో పాల్గొనేందుకు ముంబై వస్తాడని తెలిసింది. ముంబై అంధేరీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ వేడుకలు నిర్వహిస్తారు. నిజానికి కోవెల్ మాదిరి లాంటి షో ‘ఇండియా ఈజ్ గాట్ ట్యాలెంట్’ పేరుతో ఇది వరకే ఓ కార్యక్రమం ప్రసారమవుతోంది. షారుఖ్ నిర్వహించబోయే షో వివరాలు మాత్రం ఇంత వరకు బయటకురాలేదు. హిందీ అగ్రహీరోల్లో ఒకడైన షారుఖ్ ఖాన్ తన నటనా జీవితాన్ని టీవీ షోలతోనే మొదలుపెట్టాడు. ఫౌజీ, సర్కస్ కార్యక్రమాల్లో నటించాడు. 22 ఏళ్ల క్రితం దీవానా అనే సినిమాలో తొలిసారిగా అవకాశం వచ్చింది. ఇటీవల కౌన్ బనేగా కరోడ్‌పతి, క్యా ఆప్ పాంచ్వీ పాస్ సే తేజ్ హై ?, జోర్ కా ఝట్కా షోలు నిర్వహించాడు. ఇక ఫరాఖాన్ తాజాగాతీస్తున్న హ్యాప్పీ న్యూఇయర్ మనోడి తాజా చిత్రం. ఇది ఈ ఏడాది దీపావళి పండుగకు థియేటర్లకు వస్తుంది. ఇది వరకు ఎస్ఆర్కే నటించిన చెన్నయ్ ఎక్స్‌ప్రెస్ రూ.100 వంద కోట్ల క్లబ్ సినిమాల్లో చేరింది. -
సొంత ఖర్చులకు 10 శాతమే..
సెలబ్రిటీ స్టైల్.. సినిమాలతో కావొచ్చు.. వివాదాలతో కావొచ్చు.. నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటుంటాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. ఓవైపు సూపర్ హిట్ సినిమాలు .. మరోవైపు టీవీ షోలు, ప్రకటనలతో ఓ వెలుగు వెలుగుతున్నాడు. వందల కోట్లు ఆదాయాన్ని అందుకుంటున్నాడు. మరి ఈ ఆదాయాన్ని సల్మాన్ ఏం చేస్తున్నాడు.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు.. ఏదైనా దాచిపెడుతున్నాడా లేదా? ఇలాంటి వాటికే సమాధానాలు సెలబ్రిటీ స్టయిల్లో.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సంపద విలువ దాదాపు రూ.1,200 కోట్లు ఉంటుందని అంచనా. సినిమాకు దాదాపు రూ. 25-30 కోట్లతో పాటు లాభాల్లో వాటాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్లకు రూ. 1.5 కోట్లు తీసుకుంటాడుట సల్మాన్. టీవీ షో బిగ్‌బాస్‌లో కూడా చేసిన సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ సీజన్ 6లో ఒక్కో ఎపిసోడ్‌కి రూ. 2.5 కోట్లు తీసుకున్నాడు. సీజన్ 7లో దానికి రెట్టింపు స్థాయిలో రూ. 5 కోట్లు వసూలు చేశాడు. సీజన్ మొత్తంలో 26 ఎపిసోడ్లకు గాను రూ. 130 కోట్లు దక్కించుకున్నాడు. అయితే, వందల కోట్లు ఆర్జిస్తున్నప్పటికీ.. కెరియర్ ప్రారంభంలో డబ్బుకు సంబంధించి తండ్రి సలీమ్ ఖాన్ ఇచ్చిన సలహాకు కట్టుబడి ఉంటాడట సల్మాన్. సంపాదించిన దాంట్లో కేవలం 10 శాతం మాత్రమే సొంతానికి ఖర్చు చేయాలని, మిగతాది పొదుపు చేయడమో లేదా సత్కార్యాలకు ఉపయోగించడమో చేయమని కెరియర్ తొలినాళ్లలో సలీమ్ ఖాన్ సలహా ఇచ్చారట. దాన్ని ఇప్పటికీ ఫాలో అవుతుంటాడు సల్మాన్. ఆదాయంలో కొంత భాగాన్ని.. తాను ఏర్పాటు చేసిన బీయింగ్ హ్యూమన్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకలాపాలకు వినియోగిస్తుంటాడని సన్నిహితులు అంటారు. వ్యాపార రంగంలోకి.. సల్మాన్ ఖాన్.. మెల్లగా వ్యాపార రంగంపై దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం ట్రావెల్ పోర్టల్ యాత్రాడాట్కామ్లో సల్మాన్‌కి దాదాపు అయిదు శాతం వాటాలు ఉన్నాయి. అలాగే, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ అడుగుపెడుతున్నాడు. ముంబైలోని బాంద్రాలో భారీ కమర్షియల్ కాంప్లెక్స్‌కి ప్లాన్ చేస్తున్నాడు. అటు, ముంబైలోని కార్టర్ రోడ్, వర్లి తదితర ప్రాంతాలతో పాటు దుబాయ్‌లోనూ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేశాడు. షారుఖ్‌తో పోటీగా రూ.110 కోట్ల ఫ్లాట్ తీసుకున్నాడు. మరోవైపు, షారుఖ్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్ తరహాలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ జట్లపై ఇన్వెస్ట్ చేసే యోచనలో కూడా ఉన్నాడు. ఇవి కాకుండా సొంత ప్రొడక్షన్ హౌస్‌తో సినిమాల నిర్మాణం కూడా చేపట్టాడు. -
నాణ్యత పెరిగింది
టీవీ షోలలో నాణ్యత పెరిగిందని బాలీవుడ్ నటి అమృత ప్రకాశ్ చెప్పింది. బుల్లితెరలో నటించడం కూడా తనకు ఇష్టమేనని ‘వివాహ్’ సినిమాలో అమృతారావుకు సోదరిగా నటించిన అమృత తన మనసులో మాట బయటపెట్టింది. బుల్లి తెర కథలు ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా ఉంటాయంది. ‘1990 నాటి మాదిరిగానే బుల్లితెర ప్రయోగాల దశలో నడుస్తోంది. అప్పట్లో ‘రిస్తే’, స్టార్ బెస్ట్ సెల్లర్స్’ వంటి లఘుచిత్రాలు కూడా వచ్చాయి. గంటలోనే సిరీస్ మొత్తం పూర్తయ్యేది’ అని తెలిపింది. కాగా ‘స్మృతి’, ‘సాత్ ఫేరే’, ‘యే మేరే లైఫ్ హై’ సాత్ ఫేరే’ వంటి హిట్ ధారావాహికల్లో అమృత నటించింది. ప్రస్తుతం ‘సావధాన్ ఇండియా, ‘ఏ హై ఆషిఖి’, ‘గుమ్రాహ్’ తదితర ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమాల్లో నటిస్తోంది. ‘ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమాలు బాగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. వీటికి డిమాండ్ కూడా బాగా పెరుగుతోంది. లఘుచిత్రాలు కూడా టీవీల్లో ప్రవాహం మాదిరిగా వస్తున్నాయి. వీటి స్క్రిప్టులు కూడా అద్భుతంగా ఉంటున్నాయి. కథలు గొప్పగా ఉంటున్నాయి’ అని అంది. కాగా 27 ఏళ్ల ఈ సుందరి సినిమాల్లోకి బాలనటిగా అడుగిడింది. ‘తుమ్ బిన్’, కోయీ మేరా దిల్ మే హై’ వివాహ్ వంటి హిట్ సినిమాల్లో నటించింది. 2010లో ‘వుయ్ ఆర్ ఫ్యామిలీ’ అనే సినిమాలో చివరిసారిగా కనిపించింది. అందులో అతిథి పాత్ర పోషించింది. మరి సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారంటూ మీడియా ప్రశ్నించగా ఒకే రకమైన పాత్రలున్న సినిమాల్లో నటించానంది. ఇదే పరంపర కొనసాగుతుందేమోననే భయంతో ఆ తర్వాత అనేక అవకాశాలొచ్చినా తిరస్కరించానని తెలిపింది. అయితే అది సరైన నిర్ణయమా? కాదా ?అనే విషయం తనకు తెలియదంది. -
అది నాకు ఓ పెద్ద సవాల్: నాగార్జున
చెన్నై: మాటీవీ నిర్వహించే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరించడం తనకు ఓ పెద్ద సవాల్ అని ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. కౌన్నేగా కరోర్‌పతి తరహాలో తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమం మాటీవిలో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో యాంకర్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున శైలికి మంచి స్పందన వస్తోంది. తన ఈ తొలి టివిషోకు వచ్చే ప్రజాస్పందనతో తాను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు నాగార్జున ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ గేమ్‌లో పాల్గొనేవారికి ఓ మంచి స్నేహితుడిగా ఉత్కంఠమైన క్షణాలు, తీసిజ్ఞాపకాలతోపాటు సాధ్యమైనంత డబ్బు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒక యాంకర్‌గా వారిలో ఉత్కంఠను తొలగించడం తనకు ఓ సవాల్ అన్నారు. ఈ షోని ఎక్కువ మంది చూడటం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ తను నటించిన 'బాబీ జాసూస్' చిత్రం ప్రమోటింగ్‌లో బిజీగా ఉండి కూడా ఇటీవల ఈ షోలో పాల్గొన్నారు. విద్యాబాలన్ పాల్గొన్న ఎపిసోడ్ రేపు సోమవారం ప్రసారం కానుంది. -
బుజ్జిగాడు బాంబు పేల్చాడు
ఆ బుడుగు టీవీలో వస్తున్న షోని చూశాడు. అందులో హీరో 100 నంబర్ కి ఫోను చేసి రాబోయే బాంబు ప్రమాదం గురించి చెప్పాడు. తక్షణం పోలీసులు వచ్చి బాంబును నిర్వీర్యం చేశారు. అది చూసిన ఆ పదేళ్ల కుర్రాడికి మన పోలీసులు ఎలా పనిచేస్తారో చూడాలనిపించింది. అంతే... ఫోను తీసుకుని 100 కి డయల్ చేశాడు. మా ఇంటి దగ్గర ఉప్పుఫ్యాక్టరీ పక్కన బాంబు పేలిందని సమాచారం ఇచ్చాడు. ఇంకేముంది? నిముషాల్లో పోలీసులు వచ్చేశారు. బాంబు స్క్వాడ్లు, డాగ్ టీమ్ లు వచ్చాయి. హడావిడిగా అంతా వెతికితే బాంబు ఎక్కడా కనిపించలేదు. చివరికి ఆరా తీస్తే పదేళ్ల బుడతడు ఫోన్ చేశాడని తెలిసింది. 'పోలీసులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని టెస్ట్ చేశానంతే' అన్నాడు ఆ కుర్రాడు. ఆ కుర్రాడి పేరు షమీమ్. ఈ సంఘటన కాన్పూర్ జిల్లాలోని రావత్ పూర్ లో జరిగింది. అనవసరంగా హడావిడిపడ్డందుకు కోపం వచ్చినా పోలీసులు తల్లిదండ్రులను మందలించారు. పిల్లవాడిని మాత్రం వదిలేశారు. -
కోకలు కట్టి.. కేక పెట్టించారు..
టాలీవుడ్ భామ తమన్నా చీరలో మెరిసిపోతుంటే.. తామేమీ తక్కువ తినలేదన్నట్లు తమన్నాకు పోటీగా చీర కట్టి చూపించా రు బాలీవుడ్ హీరోలు సైఫ్ అలీఖాన్, రితేశ్ దేశ్‌ముఖ్‌లు. బుధవారం ముంబైలో ఓ టీవీ షో షూటింగ్లో భాగంగా వీరిలా అల్లరి చేసి.. అందరినీ అలరించారు. -
కుటుంబంతోనే హాయిగా ఉంది
మరోసారి వెండితెరపై కనిపించే ఆలోచనేదీ ప్రస్తుతానికి లేదని బాలీవుడ్, టాలీవుడ్ నటి సోనాలీ బింద్రే పేర్కొన్నారు. ప్రస్తుతానికి అంగీకరించిన టీవీ కార్యక్రమాలతోనే సంతోషంగా ఉన్నానని, తద్వారా కుటుంబానికి అధిక సమయమివ్వగలుగుతున్నానని తెలిపారు. తన ఎనిమిదేళ్ల కొడుకు రణవీర్ ఎదుగుదలే తనకు ముఖ్యమని చెప్పారు. సినిమాల్లో నటించేందుకు అనేక అవకాశాలు వస్తున్నాయని, అయితే ప్రస్తుతానికి కుటుంబమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. జీవితంలోని ప్రతి దశతో మనమూ మార్పు చెందాలని ఈ 39 ఏళ్ల నటి వేదాంత ధోరణిలో అభిప్రాయపడ్డారు. అమ్మతనం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని చెప్పారు. కలర్స్ టీవీలో ప్రసారమవుతున్న ‘మిషన్ సప్నే’ కార్యక్రమానికి సోనాలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన పది మంది సెలబ్రిటీలు సామాన్యులుగా అవతారమెత్తి, వారి వృత్తులను చేపట్టి దినసరి వేతనాన్ని ఆర్జించడమే ఈ కార్యక్రమం ఇతివృత్తమని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఇంతకుముందెన్నడూ చేయలేదని, అందువల్ల ప్రేక్షకుల స్పందన కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. మిషన్ సప్నే కార్యక్రమం ఈ నెల 27 నుంచి ప్రసారం కానుంది. సల్మాన్‌ఖాన్, రణబీర్ కపూర్, కరణ్‌జోహార్, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి సెలబ్రిటీలు తమ నిజ జీవితంలో క్షురకునిగా, వడాపావ్ విక్రేతగా, ఫొటోగ్రాఫర్‌గా, కూరగాయల విక్రేతగా కనిపించనున్నారు. దినసరి వేతనాన్ని ఆర్జించే వారిగా సెలబ్రిటీలు ఒకరోజు కష్టపడటం ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటుందని సోనాలీ చెప్పారు. -
వైఫల్యాలు నిజమే!
న్యూఢిల్లీ: భేజా ఫ్రై, ఖోస్లా కా ఘోస్లాలో రణ్వీర్ షోరే అద్భుతంగా నటించి హాస్యం సృష్టించినా అవేవీ మనోడికి పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. హిందీ సినీపరిశ్రమలో తాను తగినన్ని విజయాలు సాధించని మాట నిజమేనని అంటున్నాడు. అందుకు బాధేమీ లేదని, కొన్నిసార్లు కాలం కలిసి రాకపోవచ్చని చెప్పాడు. తన కెరీర్లో ఎన్ని వైఫల్యాలు ఉన్నా, విజయాలతో పోలిస్తే వాటి సంఖ్య తక్కువేనని ఈ 41 ఏళ్ల నటుడు అన్నాడు. ఇక నుంచి మరిన్ని మంచి కథలు ఎంచుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పిన షోరే, ఇప్పటి వరకు ఎంచుకున్న వాటిలో హాస్యపాత్రలే ఎక్కువ. ‘హాస్యం నాకు సహజసిద్ధంగానే వచ్చిందనుకుంటా. నా హాస్యాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు కాబట్టే పాత్రలూ ఇలాంటివే దక్కుతున్నాయి. నవ్వించే పాత్రలు కొనసాగించడానికి ఇబ్బంది కూడా ఏం లేదు’ అని స్పష్టం చేశాడు. సింగ్ ఈజ్ కింగ్, చాందినీచౌక్ టు చైనా వంటి సినిమాల్లో షోరే కామెడీకి మంచి మార్కులు పడ్డాయి. ప్రముఖ నటి కొంకణాసేన్ను పెళ్లాడినా, తామిద్దరం సినిమాల గురించి మాట్లాడేది చాలా తక్కువని ఇతడు చెబుతాడు. ‘సినిమాలే కాదు మేం పట్టించుకోవాల్సిన విషయాలు ఇంకెన్నో ఉంటాయి. కొడుకు హరూమ్తో ఇంట్లో చాలా సేపు గడుపుతాం. స్నేహితుల ఇళ్లకు భోజనాలకూ వెళ్తుంటాం. స్నేహితుల సంఖ్య ఎక్కువ కాబట్టి ఎప్పుడూ బిజీగా ఉంటాను’ అని షోరే వివరించాడు. సాహసాలు, పోరాటాల నేపథ్యంగా సాగే ఖత్రోకా కే ఖిలాడీ 5 టీవీ షోలోనూ ఇతడికి అవకాశం దక్కింది. ఇది కాస్త ప్రమాదకరమైన షో కాబట్టి నిర్ణయం తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని కొంకణ హెచ్చరించిందని చెప్పాడు. రణ్వీర్ షోరే మాత్రం షోలో పాల్గొనాలనే నిర్ణయించుకున్నాడు. ఈ కార్యక్రమం కలర్స్ చానెల్లో ప్రసారమవుతుంది. -
మళ్లీ బుల్లితెరవైపు మహేశ్ భట్ చూపు
అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, అనురాగ్ కశ్యప్ వంటి బాలీవుడ్ దిగ్గజాలు బుల్లితెరపై ప్రత్యక్షమవుతూ ఇంటిల్లిపాదిని చూపుతిప్పుకోనీయకుండా చేస్తుంటే దర్శక నిర్మాత మహేశ్ భట్ చూపు కూడా మరోసారి బుల్లితెరవైపు మళ్లింది. ఇప్పటికే భట్ ‘ఎ మౌత్‌ఫుల్ ఆఫ్ స్కై’ ఇంగ్లిష్ షో ద్వారా బుల్లితెరపై తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అంతేకాక ‘స్వాభిమాన్’ వంటి సీరియల్‌ను తెరకెక్కించి కుటుంబాన్ని మొత్తం టీవీ ముందు కట్టిపడేశాడు. అనురాగ్ కశ్యప్ రాసిన ‘కభీ కభీ’కి దర్శకత్వం వహించి, బుల్లితెరపై తానెవరికీ తీసిపోనని నిరూపించుకున్నాడు. అయితే తాజాగా మరోసారి బుల్లితెర ప్రేక్షకులకు తన మాయాజాలాన్ని చూపాలనుకుంటున్నాడు మహేశ్ భట్. సరికొత్త ఆలోచనతో వచ్చే సంవత్సరం ఓ టీవీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాడు. ‘24’ షో ద్వారా ప్రముఖ నటుడు అనిల్ కపూర్ టీవీ ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. బచ్చన్ కూడా ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’తో సంచలనాలే సృష్టించాడు. అయితే వీటిని మించి ప్రేక్షకాదరణ పొందే ఓ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు ప్రకటించాడు. అయితే తన షో ఎలా ఉంటుంది? ఎవరెవరు అందులో పాత్రధారులు కానున్నారు? అసలు తన ఆలోచన ఏంటి? ఎవరిని లక్ష్యంగా చేసుకొని షోను ప్లాన్ చేస్తున్నారు? తదితర వివరాలేవీ తాను ఇప్పుడు వెల్లడించలేనని, అయితే షోను స్టార్ చానల్లో ప్రసారం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని మాత్రమే చెప్పాడు. అయితే కుటుంబాన్ని మొత్తం అలరించేలా తన షో ఉంటుందని, టీవీ మాధ్యమానికి రోజురోజుకు ఆదరణ పెరుగుతుండడంతో మరోసారి ఇటువైపు చూడాల్సి వస్తోందన్నాడు. షోకు సంబంధించి కూడా సాంకేతిక నిపుణులు, ఇతరులు కొందరితో చర్చలు జరుగుతున్నాయని, త్వరలో కొలిక్కి వచ్చే అవకాశముందని, అవి పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తానని చెప్పాడు. మొత్తానికి 2014లో ఓ కొత్త టీవీ షో మనల్ని అలరించనుందన్నామాట.