![Born Without Limbs And Inspires Millions With His Makeup Artwork - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/8/Limb.jpg.webp?itok=o5L0F2Wo)
చాలామంది అన్ని సక్రమంగా ఉన్న నేను ఆ పని చేయలేను, నా వల్ల కాదు అంటూ రకరకాలుగా చెబుతుంటారు. అంతెందుకు పరిస్థితులు అన్ని బాగున్నప్పటికీ ఏవేవో సాకులతో కాలక్షేపం చేసేస్తుంటారు. ఇక్కొడక వ్యక్తి పుట్టుకతో అవయవాలు ఏమి సరిగా లేవు అయినా చక్కగా మేకప్ వేసుకోగలడు.
(చదవండి: వ్యాక్సిన్ వేయించుకుంది ...రూ 7.4 కోట్లు గెలుచుకుంది)
అసలు విషయంలోకెళ్లితే....గేబ్ ఆడమ్స్-వీట్లీ అనే వ్యక్తి హన్ హార్ట్ సిండ్రోమ్ అనే పుట్టుకతో వచ్చే వ్యాధితో జన్మించాడు. దీంతో అతని తల్లిదండ్రులు పుట్టిన వెంటనే బ్రెజిల్ ఆసుపత్రిలోనే వదిలి వెళ్లిపోయారు. ఇది అవయవాలపై ప్రభావం చూపే అరుదైన వ్యాధి. ఈ సిండ్రోమ్ కారణంగా అతనికి దవడ, నాలుక, చేతులు, కాళ్లు పూర్తిగా ఏర్పడలేదు. అంతే కాదు తొమ్మది నెలల వయసులో ఉన్న గేబ్‌ని ఉటాకు చెందిన ఒక కుటుంబం దతత్త తీసుకుంది.
దీంతో అతని జీవితం ఊహించని మలుపు తిరిగింది. అతని దత్తత తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో తాను శిశువులా ఉండిపోకూడదని అన్ని నేర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు అతను ప్రముఖ టీవీ షో 'యుఫోరియా ప్రేరణతో తన ముఖానికి తాను చక్కగా మేకప్ వేసుకుంటాడు. అంతేకాదు అతని మేకప్ కళకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడమే కాకా కాళ్లు, చేతులు లేకపోవడంతో తాను రోజువారీ పనులు చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడో కూడా వివరిస్తుంటాడు. అయితే ప్రస్తుతం గేబ్‌కి మేకప్ కళకు సంబంధించి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పైగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి.
(చదవండి: అక్తర్‌కు పరువు నష్టం నోటీస్.. భజ్జీతో కనిపించినందుకే!)
Comments
Please login to add a commentAdd a comment