టీవీ షోలో ఛాన్స్ ఇప్పిస్తానంటూ యువతి మీద లైంగిక దాడి | Man Cheating On Woman To Give Chance In TV Show | Sakshi
Sakshi News home page

టీవీ షోలో ఛాన్స్ ఇప్పిస్తానంటూ యువతి మీద లైంగిక దాడి

Jan 11 2024 9:54 AM | Updated on Jan 11 2024 10:36 AM

Man Cheating To TV show chance woman - Sakshi

హైదరాబాద్: మేకప్‌  ఆర్టిస్ట్తో శారీరక వాంఛలు తీర్చుకొని అనంతరం అతని ప్రియురాలితో కలిసి దాడిచేసిన సంఘటన మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఏపీలోని వినుకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి మేకప్‌ ఆర్టిస్ట్  గా కొంతకాలంగా పనిచేస్తూ రహమత్‌నగర్‌లో నివాసం ఉంటుంది. గత ఏడాది తన స్వగ్రామం వినుకొండకు బస్సులో బయలుదేరింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న జొన్నలగడ్డ రాజా అనే యువకుడితో పరిచయం అయింది. 

ఓ టీవీలో వచ్చే కామెడీ ప్రోగ్రాంలో జూనియర్‌ ఆర్టిస్ట్నని చెప్పారు. తనకు ఇండస్ట్రీలో బాగా పలుకుబడి ఉందని, మేకప్‌ ఆర్టిస్ట్గా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించాడు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన ఆమెను శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. రూ. 50 వేలు కూడా తీసుకున్నాడు. కొద్దిరోజుల కిందట భాను అనే మహిళ ఆమెకు ఫోన్‌ చేసి రాజు తన భర్త అని ఎందుకు సంబంధం పెట్టుకున్నావంటూ బెదిరించింది.

ఆమెతో మాట్లాడటానికి సికింద్రాబాద్‌ రమ్మని చెప్పగా ఈ యువతి నమ్మి అక్కడు వెళ్లింది. అక్కడ యువతి ఆధార్‌ కార్డు, ఫొటోలు తీసుకుని విషయం బయటకు చెబితే చంపుతామని బెదిరించారు. దాంతో తాను మోసపోయానని తెలుసుకుని యువతి మధురానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement