విజయ్ సేతుపతి
క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి సక్సెస్‌ఫుల్ హీరోగా ఎదిగారు తమిళ నటుడు విజయ్ సేతుపతి. మధ్యలో హీరో నుంచి విలన్‌గా కూడా మారారు. ఇప్పుడు మరో కొత్త పాత్ర పోషించడానికి విజయ్ సేతుపతి రెడీ అయ్యారని కోలీవుడ్ టాక్. త్వరలోనే ఆయన ఓ టెలివిజన్ నిర్వహించే టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారట. ఆమిర్ ఖాన్ చేసిన ‘సత్యమేవ జయతే’ షో తరహాలోనే ఈ కార్యక్రమం కూడా సామాజిక స్పృహ కలిగి ఉంటుందని సమాచారం. షో కాన్సెప్ట్ నచ్చడంతో వెంటనే చేయడానికి అంగీకరించారట విజయ్ సేతుపతి. త్వరలో ప్రారంభం కానున్న ఈ షోలో సేతుపతి కొత్త లుక్‌తో దర్శనమిస్తారట.
Comments
Please login to add a commentAdd a comment