సీనియర్ నటి అన్నపూర్ణ.. ప్రస్తుత జనరేషన్ ప్రేక్షకులకు బామ్మ పాత్రలతో బాగానే పరిచయం. కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈమె.. దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ కలిసి నటించింది. ఇప్పటి యంగ్ హీరోలతో సినిమాలు, తెలుగు టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా అలా ఓ షోలో పాల్గొన్న ఈమె.. తన కూతురు చనిపోవడాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈ వీడీయో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: స్టార్ హీరో ప్రేమ వ్యవహారం.. మోసం చేసిన క్లోజ్ ఫ్రెండ్!)
అసలేం జరిగింది?
నటి అన్నపూర్ణకి పిల్లలు లేరు. దీంతో ఆమె చిన్నప్పుడే కీర్తి అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. పెంచి పెద్ద చేసింది. తెలిసిన వాళ్లకే ఇచ్చి పెళ్లి చేసింది. కీర్తికి ఓ పాప కూడా పుట్టింది. అయితే ఐదేళ్లయినా సరే ఆ పాపకు మాటలు రాకపోవడంతో థెరపీ చేయించారు. కానీ లాభం లేకుండా పోయింది. అలా పాప విషయమై బెంగ పెట్టుకున్న అన్నపూర్ణ కూతురు మానసికంగా కుంగిపోయి, ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది.
అన్నపూర్ణ ఏం చెప్పింది?
తాజాగా సుమ అడ్డా షోలో పాల్గొన్న అన్నపూర్ణ.. కూతురిని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయింది. 'నేను బజ్జీలు పట్టుకొచ్చి పిలిచాను. రెండు తిని ఇక చాలా మమ్మీ అని చెప్పింది. మా అత్తగారు ఊరెళ్తున్నారని అంటే ఇక్కడ పడుకో అమ్మా అని అన్నాను. లేదు లేదు మా ఆయన ఉంటాడు కదా నేను అక్కడే పడుకుంటాను అని చెప్పి వెళ్లిపోయింది. తాను ఉరివేసుకుంటుందనే ఆలోచనే నాకు రాలేదు' అని అన్నపూర్ణ కన్నీళ్లు పెట్టుకుంది.
(ఇదీ చదవండి: 'KCR' మూవీకి అడ్డంకులు.. 'జబర్దస్త్' కమెడియన్ ఎమోషనల్ వీడియో)
Comments
Please login to add a commentAdd a comment