Bigg Boss Telugu Season 7 Official Starting Date Confirmed By StarMaa, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu Starting Date: ఆ రోజు నుంచి బిగ్ బాస్-7 షురూ

Published Sun, Aug 20 2023 9:13 PM | Last Updated on Mon, Aug 21 2023 10:19 AM

Bigg Boss 7 Telugu Starting Date Details - Sakshi

తెలుగు రియాలిటీ షోల్లో డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే చాలామంది చెప్పే పేరు బిగ్‌బాస్. ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తవగా, మరికొన్ని రోజుల్లో ఏడో సీజన్ ప్రారంభించనున్నట్లు గత కొన్నాళ్లుగా ఊరిస్తూ వచ్చారు. ఓ టీజర్ కూడా రిలీజ్ చేశారు. మరోవైపు తేదీపై ‍అప్పుడు ఇప్పుడు అనుకుంటూ వచ్చారు. ఫైనల్ గా ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ చేశారు.

(ఇదీ చదవండి: అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!)

గత కొన్ని సీజన్ల నుంచి తెలుగు బిగ్ బాస్ షోపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో ఈసారి ఉల్టా పల్టా కాన్సెప్ట్ అని నాగ్ చెప్పారు. అందుకు సంబంధించిన టీజర్ వీడియోని ఈ మధ్య రిలీజ్ చేశారు. అయితే అది ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఓ మాదిరి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా సెప్టెంబరు 3 నుంచి కొత్త సీజన్ షురూ కానుందని ప్రకటించారు.

ఇకపోతే ఈసారి బిగ్‌బాస్ హౌసులోకి యూట్యూబర్ అనిల్, కార్తీకదీపం శోభాశెట్టి, కమెడియన్ మహేశ్, షకీలా, ఆట సందీప్ జోడీ, సింగర్ మోహన భోగరాజు, జబర్దస్త్ కమెడియన్ తేజ, యూట్యూబర్ షీతల్ గౌతమన్, సీరియల్ నటి ఐశ్వర్య, హీరోయిన్ శుభ శ్రీ తదితరులు వెళ్లబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. వీటిపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగితే సరి!

(ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీదేవి చివరి కోరిక నెరవేర్చిన భర్త)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement