మీరు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే 'బిగ్‌బాస్'లోకి వస్తే చాలు. ఓ వ్యక్తి మాటలే మీరు వినాల్సి ఉంటుంది. ఆయన చెప్పినట్లు హౌసులో నడుచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు నేను చెప్పింది హోస్ట్ నాగార్జున గురించి కాదు.. ఎక్కడ కనిపించకుండా కేవలం వినిపించే 'బిగ్‌బాస్' గొంతు గురించి. ఇంతకీ 'బిగ్‌బాస్'గా డబ్బింగ్ చెప్పేది ఎవరు? ఆయన వివరాలేంటనేది ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: యాంకర్ రష్మీ పరువు తీసిన బుల్లెట్ భాస్కర్!)
ఎవరిదా గొంతు?
హౌసులో రకరకాల వ్యక్తులు వస్తారు. వాళ్లందరినీ కంట్రోల్ చేయాలంటే వాయిస్ గంభీరంగా ఉండాలి. 'బిగ్‌బాస్' గొంతు అలానే ఉంటుంది. దాదాపు ఆరు సీజన్ల నుంచి చెబుతూ ప్రస్తుతం ఏడో సీజన్‌లోనూ తన వాయిస్‌తో ఆకట్టుకుంటున్న వ్యక్తి పేరు శంకర్. ఈయన సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఈ షో కంటే ముందు ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పి చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సీరియల్స్, అడ్వర్టైజ్‌మెంట్‌లోనూ వినిపించే గొంతు ఇతడిదే.
ఎలా సెలెక్ట్ అయ్యారు?
'బిగ్‌బాస్' షోని తెలుగు ప్రారంభిద్దామని అనుకున్నప్పుడు దాదాపు 100 మందిని నిర్వహకులు పరీక్షించారు. చివరకు శంకర్ గొంతు సరిపోతుందని నిర్ణయానికి వచ్చారు. అయితే ఆయన మాటల్లో గాంభీర్యం నచ్చే, ఛాన్స్ ఇచ్చారట. హౌసులో రోజుకి కొన్ని పదులసార్లు ఆ గొంతు వినిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ వాయిస్‌ని బయట చాలామంది ఇమిటేట్ కూడా చేస్తుంటారండోయ్.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' రెండో వారం నామినేషన్స్.. లిస్టులో తొమ్మిది మంది!)
వాటికి కూడా
ఇకపోతే శంకర్.. 'బిగ్‌బాస్'తో పాటు గతంలో తెలుగు డబ్ అయిన సీఐడీ సీరియల్‌కి కూడా గాత్రం అందించారు. అయితే తొలి మూడు-నాలుగు సీజన్లలో ఒకలా మాట్లాడిన శంకర్.. ఆ తర్వాత మాడ్యులేషన్ కాస్త మార్చారు. అప్పటి నుంచి దాదాపు ఇలానే కంటిన్యూ అయిపోతున్నారు.
'బిగ్‌బాస్ 7' పరిస్థితేంటి?
ప్రస్తుత సీజన్.. సెప్టెంబరు 3న మొదలైంది. హౌసులోకి 14 మంది అడుగుపెట్టారు. మొన్న వీకెండ్ ఎపిసోడ్‌లో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిపోయింది. అయితే తొలివారం కాస్త ఫన్‌గా షో నడిచినప్పటికీ.. రెండో వారం వచ్చేసరికి సీన్ మారిపోయింది. శివాజీ, పల్లవి ప్రశాంత్.. నామినేషన్స్ లో కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపించింది. వీళ్లతో పాటు శోభాశెట్టి, అమర్‌దీప్, షకీలా, టేస్టీ తేజ, గౌతమ్, ప్రిన్స్, రతిక.. రెండో వారం నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: చిరంజీవి హిట్ సినిమాల నిర్మాత కన్నుమూత)
Comments
Please login to add a commentAdd a comment