బిగ్ బాస్ 7వ సీజన్ ఆదివారం గ్రాండ్‌గా లాంచ్ అయిపోయింది. 14 మంది కంటెస్టెంట్స్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చారు. తలో ఏడుగురు అమ్మాయిలు, అబ్బాయిలు వీళ్లలో ఉన్నారు. హోస్ట్ నాగార్జున.. ఈ సీజన్ మొదలవడానికి ముందే ఆయన చెప్పిన దానిబట్టి ఈసారి చాలానే మార్పులు జరిగినట్లు అనిపిస్తోంది. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి? ఇప్పుడు చూసేద్దాం.
మిగతా భాషల సంగతేమో గానీ తెలుగులో 'బిగ్ బాస్' తొలి మూడు సీజన్లు బాగానే నడిచాయి. కానీ ఆ తర్వాత జనాలకు మెల్లగా షోపై ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ప్రతి సీజన్‌లోనూ అదే రొటీన్, అదే గేమ్స్ ఉండేసరికి ప్రేక్షకులకు షోకి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. గత సీజన్ అయితే మరీ దారుణంగా సాగింది. దీంతో రూల్స్ విషయంలో బిగ్ బాస్ టీమ్ పునరాలోచన చేసి మరీ ప్రిపేర్ చేసిందని, తాజా సీజన్ చూస్తే అనిపిస్తోంది.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' హౌసులోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే)
గత సీజన్‌నే తీసుకుంటే.. లాంచ్ ఎపిసోడ్‌కే ఏకంగా 20 మందిని హౌసులోకి తీసుకొచ్చారు. అంతా గందరగోళంగా ఉండేది. ఈ సారి అలా కాకుండా కేవలం 14 మందిని పట్టుకొచ్చారు. అయితే ఈ సీజన్ అంతా ఇంతమందే ఆడుతారా అంటే కాదనిపిస్తుంది. మరో 6-7 మంది కూడా ఉన్నారని, వాళ్లని మెల్లగా హౌసులోకి పంపిస్తారని తెలుస్తోంది.
ఈ సీజన్‌లో 'పవర్ అస్త్ర' అనేది చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటివరకు హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే. వాళ్లు హౌజ్‌మేట్స్‌గా మారాలంటే ఈ పవర్ అస్త్రని సంపాదించుకోవాల్సి ఉంటుంది. అది టాస్కుల్లో ఆయా కంటెస్టెంట్స్ ఫెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: నామినేషన్స్‌లో రైతు బిడ్డ.. ఇంకా ఎవరున్నారంటే?)
గత ఆరు సీజన్లలో ఎవరైనా కంటెస్టెంట్‌కి ప్రేక్షకుడు.. పది ఓట్లు వేసే అవకాశముండేది. ఈసారి అలా కాదు. ఒక్కరికి ఒక్క ఓటు మాత్రమే వేయగలడు. మిస్ట్ కాల్ లేదా హాట్ స్టార్ ఏదైనా సరే.. ఒక్క ఓటు మాత్రమే వేసే ఛాన్స్ ఇచ్చారు. తొలి ఎపిసోడ్‌లోనే హోస్ నాగార్జున ఈ విషయాన్ని క్లియర్‌గా చెప్పేశారు. దీన్నిబట్టి ఈసారి ఓట్ల గందరగోళం ముందులా ఉండకపోవచ్చనిపిస్తోంది.
గత సీజన్ 100 రోజులు నడిపించారు. ఈ సీజన్ మాత్రం కేవలం 70 రోజులే ఉండనుందనే టాక్ వినిపిస్తుంది. ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారేమో! ఇది 'ఉల్టా పుల్టా' సీజన్ కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లోనూ ట్విస్టులు ఉండొచ్చు. అంటే ఎలిమినేషన్-వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒకేసారి ఉండొచ్చేమో. ఇదంతా చూస్తుంటే.. గత సీజన్లలో తగిలిన దెబ్బలకు బిగ్ బాస్ భయపడి, ఈసారి రూల్స్ మార్పులు చేశారేమో అనే సందేహం సగటు ప్రేక్షకుడికి వస్తోంది.
(ఇదీ చదవండి: నాగబాబు ఫ్యామిలీ ఫారెన్ టూర్.. కారణం అదేనా?)
Comments
Please login to add a commentAdd a comment