
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్-7 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. దాదాపు అందరూ ఊహించినట్లుగానే కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. అయితే ఈసారి సీజన్‌లో ఓ వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించాడు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్ ఎట్టకేలకు తన కలను నేరవేర్చుకున్నాడు. కామన్ మెన్ కేటగిరీలో బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన ప్రశాంత్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా తన కల నేరవేరినందుకు ఎమోషనలయ్యారు. తనకు సపోర్ట్‌గా నిలిచిన వారందరికీ అభినందనలు తెలుపుతూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
(ఇది చదవండి: మెగాస్టార్ మూవీ రివ్యూ.. అందరికంటే ముందుగానే!)
ప్రశాంత్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా స్వప్నం సాకారమైన వేళ.... నా ఆశయం నెరవేరిన వేళ.... ఎన్నో ఏండ్లుగ ఏదురుచూసిన... బిగ్ బాస్ లోకి పోవాలని... నాగార్జున సర్‌తో మాట్లాడాలని... కలవాలని... ఆయన్ని తాకాలని... ఇన్నాళ్లకు నా కల ఫలించింది. ఆయన్ని కలిసిన క్షణం మరువలేనిది. నా కల ఫలించిందంటే కారణం నన్ను అభిమానించిన మీ అందరు. మీ అందరికీ నా పాదాభివందనం. జై జవాన్... జై కిసాన్.' అంటూ ఎమోషనల్ అయ్యారు. బిగ్‌బాస్ రాకముందు సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. బిగ్‌బాస్‌లో అడుగు పెట్టాలనేది తన కల అని చాలా సార్లు వీడియోల్లో ప్రస్తావించాడు. బిగ్‌బాస్ కోసం ఒక అడుగు ముందుకేశా.. ఒక రైతుబిడ్డగా గర్వపడుతున్నా అంటున్నాడు పల్లవి ప్రశాంత్.
(ఇది చదవండి: మోసం చేశారు, చచ్చిపోదామనుకున్నా: రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ )
Comments
Please login to add a commentAdd a comment