బిగ్‌బాస్ షోపై చాలా ఏళ్ల నుంచి వ్యతిరేకత వస్తూనే ఉంది. కానీ ఈసారి అది రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ దెబ్బకు మరింత ముదిరిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫినాలే తర్వాత గొడవ, కార్లు-బస్సుల ధ్వంసం, విజేత అరెస్ట్.. ఇప్పుడు ఏకంగా నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేసేంతవరకు పరిస్థితి వచ్చింది. దీంతో షో ఆర్గనైజర్.. అనుహ్య నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు అది అందరినీ షాకయ్యేలా చేస్తోంది.
హిందీలో చాన్నాళ్ల నుంచి ఉంది కానీ తెలుగులో మాత్రం గత ఏడేళ్లుగా బిగ్‌బాస్ ప్రసారమవుతోంది. ఎన్టీఆర్, నాని తొలి రెండు సీజన్లను హోస్ట్ చేయగా.. ఆ తర్వాత మాత్రం నాగార్జునే వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. పలువురు సెలబ్రిటీలని హౌసులో 100 రోజుల పాటు ఉంచి, పలు పోటీలు పెట్టి.. వీటన్నింటిలో గెలిచిన వాడిని విజేతగా ప్రకటించడం ఆనవాయితీ. ఈసారి అలా కామన్‌మ్యాన్, రైతుబిడ్డ ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ విజేతగా నిలిచాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే)
రైతుబిడ్డ పేరు చెప్పుకొని ప్రశాంత్ ఎలా ఆడాడు? ఏంటనే విషయం పక్కనబెడితే.. ఫినాలే జరుగుతుండగానే అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఇతడి ఫ్యాన్స్ చాలామంది గుమిగూడిపోయారు. దీంతో ర్యాలీ లాంటివి ఏం వద్దని ముందే పోలీసులు, ప్రశాంత్‌ని హెచ్చరించారు. దీన్ని లెక్కచేయకుండా అభిమానుల దగ్గరకు ప్రశాంత్ వచ్చాడు. దీంతో పలువురు కంటెస్టెంట్స్ కార్లు, పోలీసు వాహనాలు, ఆర్టీసీ బస్సు అద్దాల్ని.. వీళ్లు ధ్వంసం చేశారు.
ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్‌ని అరెస్ట్ చేసి చంచల్ గుడ జైల‍్లో పెట్టారు. ఈ మధ్య బెయిల్ మీద కూడా విడుదలయ్యాడు. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు.. షో నిర్వాహకులకు నోటీసులు కూడా పంపారు. అయితే ఈ తలనొప్పులకు తట్టుకోలేకపోతున్న ఆర్గనైజర్స్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట. ఇకపై రాబోయే సీజన్స్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ర్యాలీలు లాంటివి చేయకూడదట. దీన్నే అగ్రిమెంట్‌లోనూ పొందుపరచనున్నారట. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా రైతుబిడ్డ దెబ్బకు 'బిగ్‌బాస్' తలకు బొప్పి కట్టింది!
(ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న 'బిగ్‌బాస్' మానస్.. రేటు ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment