బిగ్‌బాస్ 7వ సీజన్ మొదలై అప్పుడే వారమైపోయింది. షో మొదలైనప్పుడు హోస్ట్ నాగార్జున.. 'ఉల్టా పల్టా' అని తెగ హడావుడి చేశాడు. కానీ తొలివారం పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించలేదు. దీంతో ఈ సీజన్ కూడా అంతా యధావిధాగానే ఉండనుందా అని అనుకున్నారు. కానీ సోమవారం వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. శివాజీ, ప్రశాంత్ ని అందరూ ఉతికే ఆరేశారు. ఇంతకీ నామినేషన్స్ ఎపిసోడ్ ఎలా సాగింది. ఏంటనేది ఇప్పుడు Day-8 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి హాస్టల్ కుర్రాళ్ల సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)
బెడ్ రూంలో గొడవ
కిరణ్ రాథోడ్.. ఏడో సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్. ఆమె వెళ్లిపోయేసరికి శుభశ్రీ కాస్త బాధపడింది. మంచిగా జోకులు వేసుకుని నవ్వుకున్నామని.. అలాంటి ఆమె వెళ్లిపోవడం కాస్త వెలితిగా ఉందని చెప్పుకొచ్చింది. కాసేపటి తర్వాత బిగ్‌బాస్ మాట్లాడుతూ.. అందరూ బెడ్ రూంలో పడుకోవాలని ఆదేశించాడు. అయితే అందరికీ పెద్ద ఇబ్బంది లేనప్పటికీ.. రతిక వచ్చి గొడవ పెట్టుకుంది. సందీప్ నువ్వు.. వీఐపీ రూంలోకి వచ్చినవాళ్లని అడగవా అని అతడిని రెచ్చగొట్టింది.
నేలపై శోభా-ప్రియాంక
వీఐపీ రూంలో రతిక.. తమని అంటుందేమో అనుకున్న ప్రియాంక-శోభాశెట్టి, అదే రూంలో నేలపై పడుకున్నారు. రతిక మాత్రం ఎంచక్కా బెడ్‌పై రాత్రంతా నిద్రపోయింది. మరోవైపు బాత్రూం కడిగే విషయంలో శోభాశెట్టికి సహాయం చేస్తున్న టేస్టీ తేజ.. ఇప్పుడే కడగమని బిగ్‌బాస్ ఏం చెప్పలేదు కదా అని ఆమెతోనే గొడవపడ్డాడు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ స్టూడియో ముందు కుక్కలా తిరిగానంటూ ఏడ్చేసిన రైతుబిడ్డ)
నామినేషన్స్ స్టార్ట్
ఈ వారం నామినేషన్‌లో భాగంగా ఓ బాక్స్ లాంటిది ఉంటుంది. బిగ్ బాస్ పిలిచినవాళ్లు అందులో వెళ్లి నిలబడాది. ఎవరెవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో.. ఎదురుగా నిలబడి కారణాలు చెప్పాలి. దీంతో పై నుంచి నామినేట్ అయిన కంటెస్టెంట్‌పై కలర్ వాటరు పడుతుంది. ఇక పవర్ అస్త్ర గెలుచుకున్న సందీప్.. ఒకరిని నేరుగా నామినేట్ చేయొచ్చని చెప్పగా.. ప్రిన్స్ పేరు చెప్పాడు. అయితే తనని కావాలని టార్గెట్ చేస్తున్నారని ప్రిన్స్ అనడంతో.. ప్రిన్స్-సందీప్ మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. ప్రిన్స్ డైరైక్ట్ నామినేషన్ అయినందున అతడిని మరెవరు నామినేట్ చేయకూడదని బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు.
శివాజీకి ఇచ్చిపడేశారు
ప్రిన్స్ తర్వాత వచ్చిన తేజని శుభశ్రీ, ప్రశాంత్, రతిక నామినేట్ చేశారు. అనంతరం దామిని వస్తే.. ఆమెని ఎవరూ నామినేట్ చేయలేదు. తర్వాత శివాజీ రాగా.. ఇతడిని అమర్‌దీప్, ప్రియాంక, షకీలా, శోభాశెట్టి, దామిని.. ఇలా ఏకంగా ఐదుగురు నామినేట్ చేశారు. ఒక్కొక్కరు వాళ్ళ రీజన్స్ చెప్పుకొచ్చారు. అమర్‌దీప్ మాట్లాడుతూ.. ప్రశాంత్ నిఅస్తమానం పొగుడుతూ తమని తక్కువ చేసేలా శివాజీ మాట్లాడుతున్నారని అన్నాడు. అలానే తాము చెప్పేది శివాజీ అస్సలు వినిపించుకోవడం లేదని ప్రియాంక, శోభాశెట్టి కారణాలు చెప్పారు. అలానే శివాజీ తీరుతో ప్రియాంక.. బయటకొచ్చిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంది.
ప్రశాంత్ బలైపోయాడు
ప్రశాంత్‌ని ఏకంగా ఆరుగురు నామినేట్ చేశారు. వీళ్లలో గౌతమ్, అమర్‌దీప్, షకీలా, తేజ, దామిని, ప్రియాంక ఉన్నారు. అయితే తొలివారం అంతా రతికతో పులిహోర కలుపుతూ బాగా బిజీ అయిపోయాడు. ఇప్పుడు అతడిని నామినేట్ చేసేసరికి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. ముఖ్యంగా ప్రియాంక, అమర్‌దీప్‌తో చాలాసేపు వాదించాడు. తమకు అసలైన ప్రశాంత్ కనిపించట్లేదని, అలానే సెంటిమెంట్ పేరు చెప్పి, కావాలనే కెమెరాల ముందు యాక్ట్ చేస్తాడని వీళ్లు కారణాలు చెప్పారు. ఇకపోతే బిగ్ బాస్ లో అవకాశం కోసం స్టూడియో చుట్టూ కుక్కలా తిరిగానని ప్రశాంత్ చెప్పగా.. మరి ఛాన్స్ వస్తే ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావ్ అని రతిక అతడికి కౌంటర్ వేసింది.
పల్లవి ప్రశాంత్‌ని నామినేట్ చేస్తున్న టైంలో అమర్‌దీప్ చెప్పిన పాయింట్స్‌కు కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. ఆడియన్స్ కూడా సపోర్ట్ చేశారు. రైతు బిడ్డ అని ఊరికే చెప్పడం కరెక్ట్ కాదని, గౌతమ్ కృష్ణ.. ప్రశాంత్‌తో వాదించారు.ఈ మొత్తం వ్యవహారంలో శివాజీ, ప్రశాంత్.. ఏదో తామే తోపు తురుము అన్నట్లు ప్రవర్తించినట్లు అనిపించింది. అలా సోమవారం ఎపిసోడ్ పూర్తయింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment