బిగ్‌బాస్ 12వ వారంలో అడుగుపెట్టేసింది. అలానే సోమవారం కాబట్టి నామినేషన్స్ మంచి ఇంట్రెస్టింగ్‌గా సాగాయి. కాకపోతే ఈసారి అందరి శివాజీ గ్యాంగ్‌ని టార్గెట్ చేశారనిపించింది. మరోవైపు ఓ లేడీ కంటెస్టెంట్ ఎలిమినేషన్ అనే కత్తిపై డైరెక్ట్‌గా పీక పెట్టేసింది. దీంతో ఈ వారం ఈ హాట్ బ్యూటీ బయటకెళ్లిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది. ఇంతకీ సోమవారం నామినేషన్స్ సందర్భంగా అసలేం జరిగిందనేది Day 78 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
రతికక చెప్పి మరీ అమర్ అలా
ఎలిమినేషన్ చేయకపోవడంతో అందరూ రిలాక్స్ అయిపోయారు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే సోమవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. అశ్విని-గౌతమ్ ఇద్దరూ దీని గురించి మాట్లాడుకున్నారు. మరోవైపు కెప్టెన్సీ ఫైనల్ గేమ్‌లో తనని టార్గెట్ చేసి కొట్టావ్ నిన్నే ఈసారి నామినేట్ చేస్తా రతిక అని అమర్ ఆమెతో చెప్పాడు. చెప్పినట్లే చేశాడు. ఇంకా ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది లిస్ట్ ఇదిగో.
ఎవరు ఎవరిని నామినేట్ చేశారు?
అమర్‌దీప్ - యావర్, రతిక
గౌతమ్ - ప్రశాంత్, శివాజీ
రతిక - అమర్‌దీప్, ప్రశాంత్
అర్జున్ - యావర్, శివాజీ
ప్రశాంత్ - గౌతమ్, రతిక
అశ్విని - సెల్ఫ్ నామినేషన్
యావర్ నో లాజిక్స్
ఇక ఫస్ట్ ఫస్ట్ అమర్ వచ్చాడు. యావర్‌ని నామినేట్ చేశాడు. ఎవిక్షన్ పాస్ గేమ్ ఆడే విషయంలో కాలు కింద పెట్టావ్, అది తప్పే కదా అని అమర్ అన్నాడు. అవును నేను కావాలని చేయలేదు, అది అనుకోకుండా జరిగిందని యావర్ అన్నాడు. అలానే సంచాలక్ గా నువ్వు కూడా ఫెయిలయ్యావ్ కదా అని యావర్ అంటే.. అవును ఫౌల్ ఆడినందుకు నిన్ను నామినేట్ చేస్తున్నా, రిటర్న్ నన్ను నామినేట్ చేస్కో అని ఇద్దరి మధ్య కాస్త లాజిక్‌లెస్ డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత రతికని నామినేట్ చేసి అమర్ మాట్లాడుతుండగా మధ్యలో యావర్ ఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్ ప్రియాంక, యావర్‌ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తుంటే.. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? అని యావర్ అతిచేశాడు.
ప్రశాంత్ vs గౌతమ్
తొలుత గౌతమ్, ప్రశాంత్‌ని నామినేట్ చేశాడు. బాల్స్ బ్యాలెన్స్ చేసే గేమ్‌లో సంచాలక్‌గా ఫెయిలయ్యావని కారణం చెప్పాడు. కానీ ప్రశాంత్ వింటేగా, అస్సలు ఒప్పుకోలేదు. ఆ టతర్వాత ప్రశాంత్ వచ్చి గౌతమ్ ని నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య చాలాసేపు వాదన నడిచింది. ఒకానొక దశలో గౌతమ్‌ని ఉద్దేశించి 'పంచె ఊసిపోకుండా చూస్కో' అని ప్రశాంత్ అన్నాడు. దీంతో పంచాయతీ మొదలైంది. కాసేపటి తర్వాత అసలు నా పంచె గురించి నువ్వెవరు అసలు.. ఎక్కువ తక్కువగా మాట్లాడకు, గుర్తుపెట్టుకో అని గౌతమ్ చాలా సీరియస్ అయ్యాడు. దీంతో గోళీలు వేస్కో అని మళ్లీ ప్రశాంత్ రెచ్చగొట్టాడు. దీంతో గౌతమ్ మాట్లాడుతూ.. ఇలాంటి వాటినే చిల్లర కథలు అంటారు, ఛీ అని సీరియస్ అయ్యాడు. పాయింట్ చెప్పు, పర్సనల్ కి రాకు అని గౌతమ్ వార్నింగ్ ఇచ్చాడు.
పంచె అనేది తెలుగోడి సంస్కృతి, దాన్ని కించపరుస్తూ నువ్వు మాట్లాడటం మంచిది కాదు. అది నార్మల్‌గా చెప్పడానికి వచ్చినా, అది తప్పు వేలో తీసుకెళ్లడానికి చేస్తే బాగోదని గౌతమ్ కామెంట్స్ చేశాడు. దీంతో రైతుబిడ్డకి తప్పు తెలిసొచ్చింది. పంచె గురించి నేను తప్పుగా ఏం అనలే, దయచేసి నన్ను క్షమించండి. నేను పంచె ఊడిపోకుండా కాపాడుకో అని అన్నాను తప్పితే మరోమాట అనలే అని చేతులెత్తి మరీ రైతుబిడ్డ ప్రశాంత్ క్షమాపణలు చెప్పాడు.
శివాజీని లాజిక్స్‌తో కొట్టారు
ప్రశాంత్ తర్వాత శివాజీని.. గౌతమ్ నామినేట్ చేశాడు. మీరు బ్యాలెన్సింగ్ గేమ్‌లో ఎక్కువ ఫౌల్స్ చేశారని గౌతమ్ అనగానే.. నువ్వెవరయ్యా చెప్పడానికి అని శివాజీ అడిగాడు. నేను సంచాలక్‌గా వచ్చి చెప్పలేదు కదా అని గౌతమ్ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. నీకు ఏమి ఉండవ్, ఏదో ఒకటి చేయాలి, నీకు గొడవ కావాలి, నాకిష్టం లేదు యాక్సెప్టెడ్.. వేస్కో అని శివాజీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలానే అర్జున్ కూడా శివాజీని నామినేట్ చేశాడు. బాల్స్ బ్యాలెన్స్ టాస్కులో ప్రశాంత్ అరుస్తున్నాడని చెప్పి.. మీరు గట్టిగట్టిగా అరుస్తూ బాల్స్ విసిరికొట్టి గేమ్ నుంచి బయటకెళ్లిపోయారు. అయితే అప్పటికే యావర్ ఆడుతున్నాడు కదా.. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీరే తప్పు చేశారు కదా అని అర్జున్ చెప్పగానే.. శివాజీ దగ్గర ఆన్సర్ లేదు. దీంతో హెల్తీగా తీసుకుంటానని నవ్వి ఊరుకున్నాడు. ఇక్కడ శివాజీ దగ్గర ఆన్సర్ లేదు అందుకే ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇక సిల్లీ కారణాలతో తాను నామినేట్ చేయదలచుకోలేదని, ఎవరిని నామినేట్ చేయడానికి రీజన్స్ కనిపించట్లేదని అశ్విని చెప్పగా.. ఒకవేళ పేర్లు చెప్పకపోతే సెల్ఫ్ నామినేట్ అయిపోతారని బిగ్ బాస్ అన్నాడు. అలాగే అని అశ్విని ఓకే చెప్పింది. బహుశా ఆమెకి ఇంట్లో ఉండటం ఇష్టం లేనట్లు ఉంది. ఈ వారం ఎలానూ డబుల్ ఎలిమినేషన్ ఉంది కదా! వెళ్లిపోదాం అని ఫిక్స్ అయ్యి ఇలా సెల్ఫ్ నామినేట్ చేసుకున్నట్లు ఉందని అనిపించింది. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment