బిగ్ బాస్ 7 షోలో ఊహించని వ్యక్తి రెండో కెప్టెన్ అయ్యాడు. అయితే తామే కెప్టెన్ అయిపోతామని ఫుల్ ధీమాతో బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ మాత్రం బరస్ట్ అయిపోయారు. వాళ్లకు ఏడుపొక్కడే తక్కువైంది. అదే టైంలో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నోరు జారాడు. పరువు అంతా పోగొట్టుకున్నాడు. ఇంతకీ బిగ్‌బాస్ శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 40 హైలైట్స్‌లో చూద్దాం.
నోరుజారిన రైతుబిడ్డ
కెప్టెన్సీ టాస్కులో భాగంగా పోటుగాళ్లతో ఆటగాళ్లు సమం కావడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. రాత్రి నిద్రపోయే టైంలో శివాజీతో పిచ్చపాటి కబుర్లు ఆడుతూ ప్రశాంత్ నోరుజారాడు. 'కెప్టెన్సీ వచ్చింది అన్నవల్లనే.. నేను చేసిందేం లేదు' అని అన్నాడు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఎంత మోటివేట్ చేసినా గేమ్స్ ఆడింది, కెప్టెన్సీ బ్యాడ్జ్ సంపాదించింది ప్రశాంత్. కానీ శివాజీకి క్రెడిట్ ఇచ్చేసి తన గాలి తనే తీసుకున్నాడు.
(ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా.. హీరోగా 'జబర్దస్త్' కమెడియన్!)
ఆటగాళ్లు గెలిచారు
ఇక కెప్టెన్సీ టాస్కులో భాగంగా చివరగా 'హూ ఈజ్ ద బెస్ట్' అని గేమ్ పెట్టాడు. ఫుట్‌బాల్ లాంటిది కానీ బంతిని చేతులతో గోల్ పోస్టులో వేయాల్సి ఉంటుంది. కిందామీద పడి ఈ ఆటలో ఎలాగైతేనేం ఆటగాళ్లు గెలిచారు. కెప్టెన్సీ టాస్కులోకి ఎంటరయ్యారు.
అశ్విని-పూజా గొడవ
అయితే కెప్టెన్సీ కోసం చివరగా జరిగిన గేమ్‌లో ఎవరు ఆడాలనే క్రమంలోనే అశ్విని, పూజాని ఉద్దేశిస్తూ.. 'చూస్తే తెలియట్లేదా ఎవరు స్ట్రాంగో?' అని వాళ్ల టీమ్ మెంబర్స్‌తో చెప్పింది. దీంతో పూజాకి ఎక్కడో కాలింది. గేమ్ అంతా అయిపోయిన తర్వాత అశ్వినికి ఇచ్చిపడేసింది. నోరు అదుపులో పెట్టుకో లేకపోతే మాములుగా ఉండదని వేలు చూపిస్తూ మరీ వార్నింగ్ ఇచ్చింది. ఇద్దరి మధ్య చాలాసేపు వాదన నడిచింది.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో అమర్‌కి అది కష్టమే.. భార్య తేజస్విని కామెంట్స్)
యవర్ రెండో కెప్టెన్
ఇక ఆటగాళ్లలో ఎవరు కెప్టెన్ కావాలనేది పోటుగాళ్లు డిసైడ్ చేశారు. ఆటగాళ్లలో అందరికీ బెలూన్స్ ఉంటాయి. పోటుగాళ్ల నుంచి ఒక్కొక్కరు.. ఆటగాళ్లలో ఒకరికి సూది ఇస్తారు. వాళ్లు మరొకరి బెలూన్‌ని పేల్చేయాలి. చివరగా మిగిలిన వాళ్లు కెప్టెన్ అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు. అలా ఇందులో యవర్ నిలిచి, గెలిచారు. హౌసుకి రెండో కెప్టెన్ అయ్యాడు.
నిజం చెప్పిన తట్టుకోని ప్రశాంత్
అయితే సందీప్, ప్రశాంత్ బెలూన్ పేల్చేసి ప్రస్తుతం కెప్టెన్ గా నువ్వే ఉన్నావ్, ఇందులో నువ్వు ఫెయిలయ్యావ్ అని బిగ్ బాస్ ఏదైతే చెప్పాడో అదే మళ్లీ చెప్పాడు. ఇది నిజమని చూస్తున్న వాళ్లందరికీ తెలుసు. ఒక్క రైతుబిడ్డకు తప్ప. అసలు కెప్టెన్‌గా తానేం తప్పు చేశానో చెప్పు అని సందీప్ చెబుతున్నది వినిపించుకోకుండా మళ్లీ మళ్లీ అదే పాట పాడాడు. ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు. ఫిజికల్ గా కష్టపడుతున్నాడు గానీ రైతుబిడ్డ ప్రశాంత్.. బుర్రపెట్టి ఒక్కసారి కూడా తిన్నగా ఆలోచించట్లేదని ఈ సీన్‌తో అర్థమైపోయింది. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా)
Comments
Please login to add a commentAdd a comment