బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ రచ్చే జరిగింది. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ అభిమానులు చేసిన ఫలితంగా అక్కడ గొడవలు జరిగాయని పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఇలా అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద గొడవే జరిగింది. ఇప్పటికే బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని పలువురు ప్రముఖులు కామెంట్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా బిగ్ బాస్ షో గురించి తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు (HRC ) హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయి. కానీ ఎక్కడ హీరో నాగార్జున పేరు లేదు. ఈ కేసులలో నాగార్జున పేరును కూడా చేర్చాలి. అయన కూడా ఈ గొడవలకు బాద్యులే. అంత గొడవ బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో 6 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టుకు లేఖ రాశాను. నాగార్జునను కూడా వెంటనే అరెస్ట్ చెయ్యాలి.' అని ఆయన కోరారు.
కేసుల విషయాలు..
బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌లో పాల్గొన్న అమర్‌దీప్, అశ్విని, అక్కడే ఉన్న మరో సెలబ్రిటీ గీతూ రాయల్ కార్ల మీద దాడి జరిగింది. వారి కార్ల అద్దాలు పగిలాయి. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టారు. ఆ తరువాత ఆరు ఆర్టీసీ బస్సులు, ఒక పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు. పోలీసులు సుమోటోగా ఈ కేసు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో 147, 148, 290, 353, 427 r/w 149 IPC, సెక్షన్ 3 PDPP AC కింద కేసులు పెట్టారు. మొత్తం రెండు కేసులు ఉండగా ఒకదానిలో పల్లవి ప్రశాంత్ పేరు ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment